30, ఆగస్టు 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1159 (సతి సతి గవయంగ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
సతి సతి గవయంగ సంతు గలిగె.

15 కామెంట్‌లు:


 1. పతి జగపతి మారాజు
  తీరికయై ఇంట నున్న వేళన
  పరిష్వంగ విరహ బేల అవ
  సతి సతి గవయంగ సంతు గలిగె !!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. యౌవనోత్సాహ సంశోభితాత్ము లొక్క
  సరస నూతన మిథునమ్ము జగము నెల్ల
  మరచు శోభన వేళ నంబరపథాన
  స్మర వసతి సతి గవయంగ సంతు గలిగె

  రిప్లయితొలగించండి
 3. "కళాపూర్ణోదయము"నందలి కథ ననుసరించి నా పూరణము...

  పేర్మిఁ గథల రాజు "పింగళి" కావ్యాన
  భార్య భర్త గాను, భర్త భార్య
  గాఁగఁ, కాంక్ష హెచ్చఁ గాంతుఁడై వఱలెడు
  సతి, సతిఁ గవయంగ సంతు గలిగె!

  రిప్లయితొలగించండి
 4. జిలేబీ గారి భావానికి పద్య రూపం....

  పతి జగపతి రాజు బాగైన తీరిక
  నింటనున్నవేళ నిష్టమైన
  వనిత కౌగిలింత కనుకూలమైన వ
  సతి సతిఁ గవయంగ సంతు గలిగె.
  *
  పండిత నేమాని వారూ,
  ‘స్మర వసతి’తో ఛందఃపరివర్తనతో మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  పూరణకు మంచి విషయాన్ని అందుకున్నారు. చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. క్రొత్త వరుని మామకోరి పంపగ ' నూటి ' (ఊటీ )
  ' ప్రేమయాత్ర ' కేగె పేర్మి తోడ
  హెచ్చు ముదము నంది మెచ్చుచునవ్య వ
  సతి, సతిఁ గవయంగ సంతు గలిగె.

  రిప్లయితొలగించండి
 6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ హనీమూన్ వసతి పూరణ మనోరంజకంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. కందములో నిమిడ్చుచూ:

  కుసుమాస్త్రసముని "సరదా
  తిసురుని" సతి యందు రచట తిరుమాలిని వా
  నిసతిట, సతి సతి గవయం
  గసంతు గలిగెను ముదాన, కంది కులమణీ!

  రిప్లయితొలగించండి
 8. కలుసుకొనిరి విందు గలుగు చోటన మఱి
  సతి సతి గవయంగ సంతు గలిగె
  భార్య మరియు భర్త బహు దినంబులు నట
  సహజ మీయది యిక జగము నందు


  రిప్లయితొలగించండి
 9. సభ్యతాదులగని సంస్కారములఁజూసి
  దైవభక్తి యున్న తరుణిఁ జూసి
  పెద్దలేర్చి కూర్చి పెండ్లిఁజేసిన, యవ
  సతి సతి గవయంగ సంతు గలిగె

  అవసతి = రాత్రి

  రిప్లయితొలగించండి
 10. సకల సుఖము లున్న సంతాన భాగ్యమ్ము
  దంపతులకు లేక తపన పడిరి
  వైద్యులిడు చికిత్స వలన కలిగెడు వ
  సతిఁ, సతి గవయంగ సంతు గలిగె.

  రిప్లయితొలగించండి
 11. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో

  ఆట వెలది/సీసపు గణములతో సరదాగా కిట్టింన పద్యము.
  దంపతులు సుతుని కొరకు జూచు చుండ
  =========*=========
  పతితపావనునికి భక్తి తోడను మ్రొక్కి
  ---- సుతుని కొరకు వారు జూచు చుండ,
  అతిధి రూపమునను హరి వారికి దెలిపె
  ---- సుతుని బొందు విధము సొగసు గాను!
  హిత బలుకుల నెంచి యితరులకును జెప్పి
  ---- గతులు మార్చు వ్రతము కడు ముదమున
  క్షితిపతికిని సల్పె క్షిరాభిషేకమ్ము,
  ---- పతన మెల్ల కరగి వరము నొందె,
  తతము బట్టి దిరిగె తదనంతరమ్మున
  ---- వితరణులయి వారు విభవమునను
  లతల వలతి యందు,లాహిరి యందు,వ
  సతి, సతి గవయంగ సంతు గలిగె.
  ( పతనము= పాపము, తతము= వీణ )

  రిప్లయితొలగించండి

 12. పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారిక్ నమస్కారములు
  సతియు పతియు గవయ సంతతి లేకను
  వ్రతములెన్నొ జేయ ఫలములేదు
  వింత వార్త నేడు వినిపించినావయా
  సతి సతి గవయంగ సంతు కలిగె.

  కన్యయౌ శిఖండి కన్యను పెండ్లాడ
  మగటిమిచ్చె తాను మగువయగుచు
  శాపదష్టుడైన సరస గంధర్వుడు
  సతి సతి గవయంగ సంతు కలిగె

  యక్షశాపదష్టు డతివయై దత్తుడు
  చేరె రాజపుత్రి చెలిగ నచట
  శాపమంతమవగ సఖియ సఖుడవంగ
  సతి సతి గలియంగ సంతు కలిగె
  (మూలము: జామాతైవ స్నుషా భవత్)

  రిప్లయితొలగించండి
 13. పండిత నేమాని వారూ,
  మీ రెండవ పూరణ కందంలో ఇమిడి అందంగా ఉండి ఆనందాన్నిచ్చింది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పద్యాలను చూస్తుంటే, మీరు గురువుగారూ అని సంబోధింస్తుంటే కించిత్తు గర్వంగా ఉంది. మీ కృషి సర్వదా ప్రశంసనీయం. చాలా సంతోషంగా ఉంది ఛందస్సులో మీ ప్రయోగాలను చూస్తుంటే. శుభమస్తు!
  *
  కెంబాయి తిమ్మాజీరావు గారూ,
  మీ పూరణ ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.
  ‘మగటిమిచ్చె’ను ‘మగటిమి యిడె’ అంటే బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 14. ఎల్ల దేవతలకు నుల్లముల్ పొంగెను
  తారకుండు మడియు తరుణ మాయె,
  ప్రజల గన్న తండ్రి పరమేశ్వరుడు, విను
  సతి! సతి గవయంగ సంతు గలిగె.

  రిప్లయితొలగించండి
 15. మిస్సన్న గారూ,
  ఒక సతిని సంబోధనగా చేసి చేసిన పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి