27, ఆగస్టు 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1156 (ఉల్లిగడ్డలఁ దినువారలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
ఉల్లిగడ్డలఁ దినువార లెల్ల ఖలులు.

17 కామెంట్‌లు:


 1. ఉల్లి లేని కూర ఊనంబు రుచులకు
  ఉల్లి ధర అల్లిబిల్లి ఆకాశాన కెగిరిన
  ఉల్లి గడ్డల దినవల దెల్ల జనులు
  అనంగ మీకు తగునా కంది వారు !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. "తామ సాహారముం గొనఁ దగదు; వెల్లి
  యుల్లిగడ్డలఁ దినువార లెల్ల ఖలులు
  గాను మారుదు" రంచుఁ బల్కంగ వింటి
  నాదు బాల్యమ్మునందు మా నాయనమ్మ! (1)

  ఉల్లిగడ్డల ధరలు విహాయసమున
  విహరణము సేయుచుండంగఁ బేద లిపుడు
  "నుల్లిగడ్డలఁ దినువార లెల్ల ఖలులు!
  వలదు తినఁగా" నటంచును బల్కుచుండ్రి!! (2)

  రిప్లయితొలగించండి
 3. జిలేబీ గారూ,
  మీ భావానికి నా పద్యరూపం....
  ఉల్లి లేని కూర రుచుల కూనము గద
  యుల్లి ధర యాకసమ్మున కొనర నెగిరె
  యుల్లిగడ్డల దినువార లెల్ల ఖలు ల
  టం చనఁగఁ దగునే కంది యయ్యవారు?
  *
  గుండు మధుసూదన్ గారూ,
  పెద్దలమాట చద్దిమూట అన్న మొదటి పూరణ, ఉల్లి ధరలను ప్రస్తావించిన రెండవ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నాయి. అభినందనలు.
  రెండవ పూరణ మొదటి పాదంలో యతి తప్పింది.
  “ఉల్లిగడ్డల ధర జూడ నుప్పరమున” అంటే ఎలా ఉంటుంది?

  రిప్లయితొలగించండి
 4. ఉల్లమందున విడలేక నుల్లి దినగ
  పిల్లలందరు నేడ్వగా తల్లి జెప్పె
  నుల్లి ధరనేమొ తలచుక మెల్లగాను
  " ఉల్లిగడ్డలఁ దినువార లెల్ల ఖలులు"

  రిప్లయితొలగించండి
 5. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి ధన్యవాదములు. మొదట "అధిక ధరలచే నుల్లి విహాయసమున" ననియే వ్రాసికొంటిని. మూఁడవపాదమున నుల్లిగడ్డల ప్రస్తావన వచ్చుటచే, మొదటి పాదమున "నుల్లిగడ్డల ధరలు..."నని మార్చితిని...యతిదోషమును గమనించకపోయితిని. తాము తెలిపినందులకు ధన్యవాదములు. తమరి సవరణము బాగున్నది.

  ఉల్లిగడ్డల ధరఁ జూడ నుప్పరమున
  విహరణము సేయుచుండంగఁ బేద లిపుడు
  "నుల్లిగడ్డలఁ దినువార లెల్ల ఖలులు!
  వలదు తినఁగా" నటంచును బల్కుచుండ్రి!! (2)

  రిప్లయితొలగించండి
 6. ఉల్లి గడ్డల దినువార లెల్ల ఖలుల
  టంచు బల్కెడి వారలే యచట నచట
  చాటు మాటుగ దినుదురు సంతసమున
  తల్లి కంటెను మేల్గూర్చు నుల్లి గాదె

  రిప్లయితొలగించండి
 7. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
  శ్రీ పండితనేమాని గురుదేవులకు,శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
  ఉల్లిని సామాన్య జనులకు జేరనివ్వని వారిపై మాత్రమే
  ===========*==========
  కల్ల బొల్లి కబురు లాడి కనక మయము జేయు చుండ
  తెల్ల బోయి జనులు నేడు తెల్ల గడ్డలు దిను చుండ
  ఉల్లి గడ్డలు దిను వార లెల్ల ఖలులు, లోక మందు
  తల్ల డిల్లుచు నాడు వారు తలలు బట్టి దిరుగు చుండ.

  రిప్లయితొలగించండి
 8. ఉల్లి నందురు కద సామి ! తల్లి వంటి
  దనుచు మఱి యేల మీ రె య ట్లంటి రిపుడు ?
  ఉల్లి గ డ్డల దిను వార లె ల్ల ఖలులు
  గాదని సెల వీ యుడు మఱి కంది సామి !

  రిప్లయితొలగించండి
 9. ఉల్లిపాయధరలు హెచ్చనోడెనెన్ని
  కలనొకడు అశ్రుధారలుగారుచుండ
  నుల్లిగడ్డలదినువారలెల్ల ఖలులు
  జూడమనెనుల్లి సాంబారు జుర్రుకొనుచు ॥

  రిప్లయితొలగించండి
 10. నా మూఁడవ పూరణము:

  ఉల్లి చేసిన మేలును తల్లియైనఁ
  జేయ దందురు పెద్దలు! శ్రేష్ఠత నిడు
  నుల్లిగడ్డలఁ దినువార లెల్ల ఖలులు
  కారు కారయ్య శంకరా! కంది వంశ్య!! (3)

  రిప్లయితొలగించండి
 11. ఉల్లి జేసిన మేలంత తలి యైన
  చేయ దందురు విబుధులు సేద దీర
  కల్ల యైనది తెలుపగ నుల్లి నిపుడు
  ఉల్లి గడ్డలు దినువార లెల్ల ఖలులు

  రిప్లయితొలగించండి
 12. ఉల్లి జేసిన మేలంత తల్లి యైన
  చేయ దందురు విబుధులు సేద దీర
  కల్ల యైనది తెలుపగ నుల్లి నిపుడు
  ఉల్లి గడ్డలు దినువార లెల్ల ఖలులు

  రిప్లయితొలగించండి
 13. పండిత నేమాని గారికి శంకరయ్య గురుదేవులకు నమస్కారములు

  ఉల్లిగడ్డలు దాచంగ కుళ్ళిపోవు
  కల్ల కాదది వినుడహో ఉల్లిగడ్డ
  లుతినువార లెల్ల ఖలులు లోభులగుచు
  ఉల్లిధరలను పెంచిరి లోల్లిచేసి

  రిప్లయితొలగించండి
 14. నాల్గుమాసాలవ్రతమునునెరపువారు
  కార్తీకమాసానపుణ్యకార్యాలలో
  ఉల్లిగడ్డలుతినువారలెల్లఖలులు
  యనుచుపెద్దలండ్రది అవునొ!కాదొ!

  రిప్లయితొలగించండి
 15. పండిత నేమాని వారూ,
  పాత సామెతను గుర్తు చేసిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  నాల్గవ పాదంలో ‘తల్లడిలుచు’ అని ఉండాలనుకుంటాను.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గూడ రఘురామ్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ మూడవ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  సమస్య పాదాన్ని పద్యం మధ్య ఇమిడ్చిన మీ నేర్పు ప్రశంసనీయం. బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసింపదగినదే.
  మొదటి పాదంలో యతి తప్పింది. 2.4 పాదాలలో గణదోషం. సవరించండి.

  రిప్లయితొలగించండి
 16. ఆయు రారోగ్యములనిచ్చు నట్టి గడ్డ
  లుల్లి గడ్డలు, మనుజుల కెల్ల ప్రీతి
  పాత్రమైన పాకము లందు వాడ నెట్టు
  లుల్లి గడ్డలఁ దినువార లెల్ల ఖలులు?

  రిప్లయితొలగించండి