గురువులు శ్రీ కందిశంకరయ్య గారికి, పండితులు శ్రీ నేమానివారికి మరియునితర కవిమిత్ర బృందానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఏతావాతా చూచిన నేతలకే జెల్లు గాదె నిజముదలపగా ఘాతుకమంత్రాంగమునన్స్వాతంత్ర్యఫలమ్ము దక్కు స్వార్థపరులకే. a
నీతులు వల్లించుటకేచేతుల కందినవి యెల్ల జేబుల లోకేనేతలు భోక్తల మూకే స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు స్వార్థపరులకే
స్వాతంత్ర్యదినోత్సవమ్మునవాతలు వచ్చుగానిమనుజులవ్రాతల్ మారునానేతల రాతలె వేరుగస్వాతంత్త్యఫలమ్ము దక్కుస్వార్ధపరలకే.
నేతల మోసపు మాటలుప్రీ తిగనే నుండుగాని ప్రేమలు గరువౌస్వాతంత్ర్యము మనకు గలుగస్వాతంత్ర్య ఫలము దక్కు స్వార్ధ పరులకే
పూజ్యులు నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సాహితీ మిత్రులందఱికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో...నీతి గల నాయకులకేస్వాతంత్ర్య ఫలమ్ము దక్కు! స్వార్థపరుల కేరీతిని దక్కును? "వందేమాతర"మన, భరతమాత మన్నించు మనన్!!
నీతుల జెప్పుచు వెనుకనుగోతుల త్రవ్వంగ జూచు కుటిలురు వ్రాయన్బ్రీతిగ మనతల వ్రాతలుస్వాతంత్ర్యఫలమ్ము దక్కు స్వార్థపరులకే
సాహితీ మిత్రులు శైలజగారికి...మీ పద్యములోఁ గొన్ని గణభంగములున్నవి. చిన్న చిన్న సవరణములతో మీ పద్య మిటుల మార్చవచ్చును...పోల్చుకొనఁగలరు...స్వాతంత్ర్య దినోత్సవమునవాతలు వచ్చును! మనుజుల వ్రాఁత తొలఁగునే?నేతల వ్రాఁతలె వేఱగు;స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు స్వార్థపరులకే!
శ్రీ మధుసూదన్ గారికి నమస్సులు... నా పద్యము సవరించి , నన్ను ప్రోత్సహిస్తున్నందుకు, చాలా చాలా కృతజ్ఞతలు..
భారతీయులైన సోదరీ సోదరులారా. 67 వ శ్రీమద్భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.మీ చింతా రామ కృష్ణా రావు
పూజ్యులు నేమాని గురుదేవులకు, కంది శంకరయ్యగురుదేవులకు, సాహితీ మిత్రులందఱికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో.... గురుదేవులు క్షమించాలి,నేను యంటెక్ ప్రాజెక్ట్ పై ఈ రోజు రిపోర్ట్ ఇవ్వాలి.
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతోశ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు. ======*=======1. గీతలు గీయని సతికిన్ స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు,స్వార్థపరులకేగోతులు జాలవు పూడ్చగ భూతలమున సంపదలను పుష్పసమయమున్( అధికారములో నుండగ )======*=======2. గీతలు గీయని పతికిన్ స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు,స్వార్థపరులకేనీతులు నడ్డము గాదుగ భూతలమున సంపదలను పూనిక బట్టన్ (పట్టు దలతో ) ======*======3. చేతులు గలుపుచు ఖలులను ఖ్యాతిగ నేతలను జేసి గలిమిని పొందన్ నీతిని జంపగ జనులనె స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు, స్వార్థపరులకే. ======*======= 4.భూతలమున భూతములై నేతలతి బలమ్ము తోడ నేరము జేయన్ యాతన జెందుచు జనులనెస్వాతంత్ర్య ఫలమ్ము దక్కు,స్వార్థపరులకే. =======*======5.కోతలు బెట్టుచు నాతికి నేతలు భూతముల వలెను నిర్భయులై నీ భూతలమున గని జనులనెస్వాతంత్ర్య ఫలమ్ము దక్కు,స్వార్థపరులకే.=======*======6. నీతినిఖ్యాతిగ విడచిన నేతలు వారి సహచరులు నేరము జేయన్త్రాతల జాక్షిగ,జనులనెస్వాతంత్ర్య ఫలమ్ము దక్కు,స్వార్థపరులకే.
కవిమిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలిపిన మిత్రులకు ధన్యవాదాలు. *సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘నిజము దలపగా’ అన్నదానిని ‘నిజము దలపగన్’ అనండి. *పండిత నేమాని వారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు.*శైలజ గారూ,మీ పూరణ బాగుంది. అభినందనలు. మధుసూదన్ గారి సవరణలను గమనించారు కదా!*సుబ్బారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘ప్రీతిగనే యుండుగాని’ అనండి. *గుండు మధుసూదన్ గారూ, విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. శైలజ గారి పద్యంలోని దోషాలను సవరించినందుకు ధన్యవాదాలు. *వరప్రసాద్ గారూ, ఉద్యోగధర్మం ముఖ్యం. మిగతావన్నీ తరువాతే. శుభం!
వరప్రసాద్ గారూ, వ్యస్తుడ నంటూనే ఆరు పూరణ లిచ్చారు. సంతోషం. అన్నీ బాగున్నవి. అభినందనలు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
తాతలు స్వేచ్ఛను తెచ్చిర గస్త్యభ్రాతలు పరిపాలనమున బంధుప్రీతి న్ నీతిని తప్పెను వోటరు స్వాతంత్ర్యఫలమ్ము దక్కు స్వార్థపరులకే
కెంబాయి తిమ్మాజీరావు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. మొదటి పాదంలో ‘అగస్త్య’ అన్నది అదనంగా ఉంది గణదోషానికి కారణమవుతున్నది.
మిత్రులందరికీ స్వాతంత్ర్యోత్సవ దిన శుభాకాంక్షలు: మన శంకరాభరణ వే దిని గల మిత్రులకు నేడు తెలుపుదు శుభ కామనలను స్వాతంత్ర్య దినమ్మని యానందమ్ము పొంగి యాత్మ చెలంగన్
సోదర సోదరీ మణు లందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభా కాంక్షలు తాతలు నేతులు త్రాగిరి మూతులు వాసనలు జూడ మోజు పడంగన్ నేతలు దోచుకు దినుటకు స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు స్వార్ధ పరులకే !
కేతనము నెగుర వేయుచు భూతలమున స్వేచ్చ నొంది భూరి ఫలంబుల్ నేతలు దోచగ నిధులను స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు స్వార్ధ పరులకే
శంకరయ్య గురుదేవులకు నమస్కారమునా దోషమును మన్నించండి,(జన)గణముకు సమ్మతి కానిఅగస్త్య పదమును తీసివేయుటయే ఉచితము,క్షంతవ్యుణ్ణి
గురువులు శ్రీ కందిశంకరయ్య గారికి, పండితులు శ్రీ నేమానివారికి మరియునితర కవిమిత్ర బృందానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఏతావాతా చూచిన
నేతలకే జెల్లు గాదె నిజముదలపగా
ఘాతుకమంత్రాంగమునన్
స్వాతంత్ర్యఫలమ్ము దక్కు స్వార్థపరులకే. a
నీతులు వల్లించుటకే
రిప్లయితొలగించండిచేతుల కందినవి యెల్ల జేబుల లోకే
నేతలు భోక్తల మూకే
స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు స్వార్థపరులకే
స్వాతంత్ర్యదినోత్సవమ్మున
రిప్లయితొలగించండివాతలు వచ్చుగానిమనుజులవ్రాతల్ మారునా
నేతల రాతలె వేరుగ
స్వాతంత్త్యఫలమ్ము దక్కుస్వార్ధపరలకే.
నేతల మోసపు మాటలు
రిప్లయితొలగించండిప్రీ తిగనే నుండుగాని ప్రేమలు గరువౌ
స్వాతంత్ర్యము మనకు గలుగ
స్వాతంత్ర్య ఫలము దక్కు స్వార్ధ పరులకే
పూజ్యులు నేమానివారికి, మిత్రులు కంది శంకరయ్యగారికి, సాహితీ మిత్రులందఱికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో...
రిప్లయితొలగించండినీతి గల నాయకులకే
స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు! స్వార్థపరుల కే
రీతిని దక్కును? "వందే
మాతర"మన, భరతమాత మన్నించు మనన్!!
నీతుల జెప్పుచు వెనుకను
రిప్లయితొలగించండిగోతుల త్రవ్వంగ జూచు కుటిలురు వ్రాయన్
బ్రీతిగ మనతల వ్రాతలు
స్వాతంత్ర్యఫలమ్ము దక్కు స్వార్థపరులకే
సాహితీ మిత్రులు శైలజగారికి...మీ పద్యములోఁ గొన్ని గణభంగములున్నవి. చిన్న చిన్న సవరణములతో మీ పద్య మిటుల మార్చవచ్చును...పోల్చుకొనఁగలరు...
రిప్లయితొలగించండిస్వాతంత్ర్య దినోత్సవమున
వాతలు వచ్చును! మనుజుల వ్రాఁత తొలఁగునే?
నేతల వ్రాఁతలె వేఱగు;
స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు స్వార్థపరులకే!
శ్రీ మధుసూదన్ గారికి నమస్సులు...
రిప్లయితొలగించండినా పద్యము సవరించి , నన్ను ప్రోత్సహిస్తున్నందుకు, చాలా చాలా కృతజ్ఞతలు..
భారతీయులైన సోదరీ సోదరులారా. 67 వ శ్రీమద్భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.మీ చింతా రామ కృష్ణా రావు
రిప్లయితొలగించండిపూజ్యులు నేమాని గురుదేవులకు, కంది శంకరయ్యగురుదేవులకు, సాహితీ మిత్రులందఱికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో....
రిప్లయితొలగించండిగురుదేవులు క్షమించాలి,నేను యంటెక్ ప్రాజెక్ట్ పై ఈ రోజు రిపోర్ట్ ఇవ్వాలి.
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
======*=======
1. గీతలు గీయని సతికిన్
స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు,స్వార్థపరులకే
గోతులు జాలవు పూడ్చగ
భూతలమున సంపదలను పుష్పసమయమున్( అధికారములో నుండగ )
======*=======
2. గీతలు గీయని పతికిన్
స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు,స్వార్థపరులకే
నీతులు నడ్డము గాదుగ
భూతలమున సంపదలను పూనిక బట్టన్ (పట్టు దలతో )
======*======
3. చేతులు గలుపుచు ఖలులను
ఖ్యాతిగ నేతలను జేసి గలిమిని పొందన్
నీతిని జంపగ జనులనె
స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు, స్వార్థపరులకే.
======*=======
4.భూతలమున భూతములై
నేతలతి బలమ్ము తోడ నేరము జేయన్
యాతన జెందుచు జనులనె
స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు,స్వార్థపరులకే.
=======*======
5.కోతలు బెట్టుచు నాతికి
నేతలు భూతముల వలెను నిర్భయులై నీ
భూతలమున గని జనులనె
స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు,స్వార్థపరులకే.
=======*======
6. నీతినిఖ్యాతిగ విడచిన
నేతలు వారి సహచరులు నేరము జేయన్
త్రాతల జాక్షిగ,జనులనె
స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు,స్వార్థపరులకే.
కవిమిత్రులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిశుభాకాంక్షలు తెలిపిన మిత్రులకు ధన్యవాదాలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘నిజము దలపగా’ అన్నదానిని ‘నిజము దలపగన్’ అనండి.
*
పండిత నేమాని వారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మధుసూదన్ గారి సవరణలను గమనించారు కదా!
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘ప్రీతిగనే యుండుగాని’ అనండి.
*
గుండు మధుసూదన్ గారూ,
విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
శైలజ గారి పద్యంలోని దోషాలను సవరించినందుకు ధన్యవాదాలు.
*
వరప్రసాద్ గారూ,
ఉద్యోగధర్మం ముఖ్యం. మిగతావన్నీ తరువాతే. శుభం!
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండివ్యస్తుడ నంటూనే ఆరు పూరణ లిచ్చారు. సంతోషం. అన్నీ బాగున్నవి. అభినందనలు.
శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండితాతలు స్వేచ్ఛను తెచ్చిర గస్త్య
రిప్లయితొలగించండిభ్రాతలు పరిపాలనమున బంధుప్రీతి న్
నీతిని తప్పెను వోటరు
స్వాతంత్ర్యఫలమ్ము దక్కు స్వార్థపరులకే
కెంబాయి తిమ్మాజీరావు గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
మొదటి పాదంలో ‘అగస్త్య’ అన్నది అదనంగా ఉంది గణదోషానికి కారణమవుతున్నది.
మిత్రులందరికీ స్వాతంత్ర్యోత్సవ దిన శుభాకాంక్షలు:
రిప్లయితొలగించండిమన శంకరాభరణ వే
దిని గల మిత్రులకు నేడు తెలుపుదు శుభ కా
మనలను స్వాతంత్ర్య దిన
మ్మని యానందమ్ము పొంగి యాత్మ చెలంగన్
సోదర సోదరీ మణు లందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభా కాంక్షలు
రిప్లయితొలగించండితాతలు నేతులు త్రాగిరి
మూతులు వాసనలు జూడ మోజు పడంగన్
నేతలు దోచుకు దినుటకు
స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు స్వార్ధ పరులకే !
కేతనము నెగుర వేయుచు
రిప్లయితొలగించండిభూతలమున స్వేచ్చ నొంది భూరి ఫలంబుల్
నేతలు దోచగ నిధులను
స్వాతంత్ర్య ఫలమ్ము దక్కు స్వార్ధ పరులకే
శంకరయ్య గురుదేవులకు నమస్కారము
రిప్లయితొలగించండినా దోషమును మన్నించండి,
(జన)గణముకు సమ్మతి కాని
అగస్త్య పదమును తీసివేయుటయే ఉచితము,
క్షంతవ్యుణ్ణి