1, ఆగస్టు 2013, గురువారం

సమస్యాపూరణం – 1130 (కౌఁగిలి మరణమ్ము నొసఁగు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
కౌఁగిలి మరణమ్ము నొసఁగు గద సరసులకున్.

26 కామెంట్‌లు:

  1. రాగమ్ముఁ గలిగి రంభనుఁ
    గౌఁగిలిలోఁ జేర్చి, పంక్తికంఠుఁడు శప్తుం
    డై గతియించెఁ! బరుని చెలి
    కౌఁగిలి మరణమ్ము నొసఁగుఁ గద సరసులకున్!!

    రిప్లయితొలగించండి
  2. భోగేఛ్ఛా పరవశులై
    రోగమ్ముల నొందియును కురూపులరై తా
    మాగని యెడ కడు వెచ్చని
    కౌగిలి మరణమ్ము నొసగు కద సరసులకున్

    రిప్లయితొలగించండి
  3. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
    శ్రీ పండిత నేమానిగురుదేవులకు ధన్యవాదములు
    ========*======
    మీగడ ప్రాయము గోరిన
    కౌఁగిలి,మరణమ్ము నొసఁగుఁ గద సరసులకున్,
    రోగము జీవన మందున
    భాగము భోగులకు భువిని భామల జతలో.

    (మీగడ ప్రాయము=చిరు ప్రాయము)

    రిప్లయితొలగించండి
  4. భోగములదేలియాడుచు
    రోగములను దెచ్చుకొనుచు రోగిగ మారీ
    ఆగని యె డలన మఱి చెలి
    కౌగిలి మరణమ్ము నొసగు గద సరసులకున్

    రిప్లయితొలగించండి
  5. ఏ గత్యంతరమెంచక
    భోగమునన్ దేలి మిగుల మోదమునొందన్
    రోగములవారకాంతా
    కౌఁగిలి మరణమ్ము నొసఁగు గద సరసులకున్.

    రిప్లయితొలగించండి
  6. మిత్రులారా! అందరికీ శుభాశీస్సులు.
    ఈ నాటి అంశమునకు వేరొక తావులేక చాలామంది పరకాంతా సంగమము గురించి వ్రాసేరు. అందరికీ అభినందనలు.

    శ్రీ మధుసూదన్ గారు:
    మీరు విశేషముగా రావణుని కథ ఎన్నుకొన్నారు. చాలా మంచి పద్యము.

    శ్రీ వరప్రసాద్ గారు:
    మీ పద్యము చాలా బాగుగనున్నది.

    శ్రీ సుబ్బా రావు గారు:
    మీ పద్యము బాగుగ నున్నది.
    2వ పాదములో "రోగిగ మారీ" అని వాడుక భాషను వ్రాసేరు. రోగిగ నగుచున్ అంటే సరి.
    3వ పాదములో: ఆగక చనునెడ మరి చెలి అంటే బాగుంటుంది.

    శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు:
    మీ పద్యము చాల బాగుగ నున్నది.

    రిప్లయితొలగించండి
  7. కౌగిలిలో పూబోడుల
    భోగమునకు బానిసైన ముప్పగు, తుదకా
    కౌగిలి యగు ధృతరాష్ట్రుని
    కౌఁగిలి, మరణమ్ము నొసఁగు గద సరసులకున్.

    రిప్లయితొలగించండి
  8. పగతుర కొఱకని రాజులు
    సొగసగు విష కన్నియలను సై రంద్రు లనన్
    నగవులు చిలికెడి చుంబిత
    కౌగిలి మరణమ్ము నొస్ఁ గు గద సరసులకున్ !

    రిప్లయితొలగించండి
  9. భోగాలకుబానిసలై
    చేగూడని పనులుజేయ చేదౌ బ్రతుకే
    రాగూడని రోగపుదృఢ
    కౌగిలిమరణమ్మునొసగుగదసరసులకున్!!!

    రిప్లయితొలగించండి
  10. వేగిరపడి సానుల కడ
    కేగియు కాముకుడు వాంఛ నీడేర్చు కొనున్
    రోగాన్విత వేశ్యాంగన
    కౌగిలి మరణమ్ము నొసగు గద సరసులకున్.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ పండిత నేమానిగురుదేవులకు ధన్యవాదములు

    పాత సినిమా కథకు పద్యరూపము(దుష్టుల స్నేహము మంచిది కాదని)
    =======*======
    రోగము గానక తూగుచు,
    ద్రాగుచు,నింటను దిరుగుచు,దనయుని వలెనే
    భాగము గోరిన,దుష్టుల
    కౌఁగిలి మరణమ్ము నొసఁగుఁ గద సరసులకున్.

    రిప్లయితొలగించండి
  12. మిత్రులారా! శుభాశీస్సులు. అందరి పూరణలు అలరించుచున్నవి. అందరికీ అభినందనలు.

    1. శ్రీ మిస్సన్న గారు: మీ ప్రయోగము "ధృతరాష్ట్రుని కౌగిలి" చాల బాగుగనున్నది.

    2. అమ్మా! రాజేశ్వరి గారూ: మీరు 1,2,3, పాదములలో తొలి అక్షరమును దీర్ఘమును వేయాలి - లేకపోతే ప్రాస భంగము.
    2వ పాదములో యతి మైత్రి లేదు.

    3. శ్రీ పీతాంబర్ గారు: మీ పూరణ బాగుగ నున్నది.

    4. శ్రీ లక్ష్మీనారయణ గారు: మీ పూరణ బాగుగ నున్నది.

    5. శ్రీ వరప్రసాద్ గారు: మీరేదో పాత సినీ కథను ప్రస్తావించేరు. పద్యము బాగుగ నున్నది.

    రిప్లయితొలగించండి
  13. రోగ నివారకమగు సతి
    కౌఁగిలి, మరణమ్మొసగు గద! సరసులకున్
    భోగపు వారిండ్ల కరిగి
    రోగములంటించుకొనిన రోదన తోడన్!

    రిప్లయితొలగించండి
  14. రోగపు కాంతలు గలరను
    జాగృతి లేకుండ సుఖము చవిచూచుటకై
    సాగించిన సంభోగపు
    కౌగిలి మరణమ్మునొసగు గద సరసులకున్!

    రిప్లయితొలగించండి
  15. భోగములనుఁ బోగొట్టును
    జాగరతనుఁదప్పువేళ శాపము వలనన్
    రోగమ్మేమియు లేకయు
    గౌఁగిలి మరణమ్ము నొసఁగు గద సరసులకున్.

    (పాండురాజు మృతి సందర్భములో చెప్పదగు పద్యము)

    రిప్లయితొలగించండి
  16. భోగములనుఁ బోగొట్టును
    జాగరతనుఁదప్పువేళ శాపము వలనన్
    రోగమ్మేమియు లేకయు
    గౌఁగిలి మరణమ్ము నొసఁగు గద సరసులకున్.

    (పాండురాజు మృతి సందర్భములో చెప్పదగు పద్యము)

    రిప్లయితొలగించండి
  17. జాగరత లేక మిక్కిలి
    భోగములన్ దేలియాడ బుద్ధిని విడువన్
    రోగము నిండిన కాంతల
    కౌగిలి మరణమ్మునొసగు గద సరసులకున్!

    రిప్లయితొలగించండి
  18. నాగినివలె విష కన్నెలు
    సాగెద రంత: పురమందు సైరంద్రి యనన్
    రాగము గలిగిన పగతుర
    కౌగిలి మరణమ్ము నొసగు గద సరసునకున్ !

    గురువులు క్షమించాలి నేనసలు కౌ గురువన్న సంగతి మర్చి పోయాను

    రిప్లయితొలగించండి
  19. మిత్రులారా! శుభాశీస్సులు. మీ అందరి పూరణలు ప్రశస్తముగా నున్నవి. చాల సంతోషము. అందరికి అభినందనలు.

    1. శ్రీ సహదేవుడు గారూ: మీ పద్యము చాల బాగుగ నున్నది.

    2. శ్రీ బొడ్డు శంకరయ్య గారు: మీ పద్యము చాల బాగుగ నున్నది.

    3. శ్రీమతి లక్ష్మీదేవి గారు: పాండురాజ కథను ఉట్టంకించిన మీ పద్యము చాలా బాగుగ నున్నది.

    4. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: మీ పద్యము చాల బాగుగ నున్నది.

    5. శ్రీమతి రాజేశ్వరి గారు: మీరు తిరిగి రాసిన పద్యము - సైరంధ్రి కీచకుల కథ - చాల బాగుగ నున్నది.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. బోగము చానల గూడిన
    జాగిలముల బోలు విటులు జచ్చిరి ఏడ్స(Aids)న్
    రోగము పాలయి, గణికల
    కౌగిలి మరణమ్ము నొసగు గద సరసులకున్

    రిప్లయితొలగించండి
  21. శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. విటులు పొందే రోగము గురించి ప్రస్తావించేరు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. యోగాభ్యాసమ్మనుచున్
    దాగుడు మూతలన నాడు ధనికుల సరసన్
    త్రాగెడి పీల్చెడి మందుల
    కౌఁగిలి మరణమ్ము నొసఁగు గద సరసులకున్

    రిప్లయితొలగించండి
  23. దేవదాసు ఉవాచ:

    వేగమె దుఃఖము వీడన్
    రాగముతో కూడి నిన్ను రంభా! యంటిన్!
    త్రాగుడు! విషకన్యా! నీ
    కౌఁగిలి మరణమ్ము నొసఁగు గద సరసులకున్!

    రిప్లయితొలగించండి