మిత్రులారా! శుభాశీస్సులు. ఈనాటి కొన్ని పూరణలను చూచెదము: ముందుగా అందరికీ అభినందనలు.
1. శ్రీ పీతాంబర్ గారు: శంకరాభరణము బ్లాగు నందు ప్రేమతో చక్కగా పూరణ చేసేరు; బుద్ధి శుద్ధి చేయు బుధుని మందుగా ప్రశంసించుచు, రామజోగి మందు ప్రాణ మాన హరము కాదని వక్కాణించేరు. చాల చక్కగా నున్నది పద్యము.
2. శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారు: మందు సేవించుట మంచి పద్ధతి కాదని రామజోగికి చేసిన బోధ చాల బాగుగ నున్నది పద్యరూపములో.
3. తమ్ముడు డా. నరసింహ మూర్తి పూరణలో రావణునికి మారీచుడు చేయు హితబోధను ఉట్టంకించెను - చాల బాగుగ నున్నది పద్యము.
4. శ్రీమతి జిలేబి గారు: వారి భావమునకు నింకా ఎవరో పద్య రూపము నీయవలెను.
5. శ్రీ మధుసూదన్ గారు: కవి భిషగ్వరునిగా రామజోగిని ప్రశంసించేరు - సంతోషము. చాల బాగుగ నున్నది పద్యము.
మిత్రులారా! శుభాశీస్సులు. ఈనాటి మరికొన్ని పూరణలను పరిశీలించుదాము. ముందుగా అందరికీ అభినందనలు.
శ్రీ మధుసూదన్ గారు: మీ పద్యములు రసరమ్యములు మరియును కర్ణపేయములుగా అలరారుచున్నవి.
శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: మీ పద్యము నేటి కాలానుగుణమైన అర్థముతో నున్నది. పెద్దల మాటలలో : ఒక పదమునకు అనేక అర్థములు ఉన్నప్పుడు అందులో ఉత్కృష్టమైన అర్థమునే గ్రహించ వలెను - హంస వలె. గ్రహించగలరు.
శ్రీమతి శైలజ గారు: మీరు 2 పద్యములు వ్రాసేరు. ఒకటి: శ్రీమతి జిలేబి గారి భావము ననుసరించి: పద్యముల్లు బాగుగ నున్నవి. 1. "మనుజ మేధకు గన మార్పులే మందులౌ" అని ఒక పాదమును మార్చుదాము. 2వ పద్యములో సమస్యకు చివరన అగునే? అని చేర్చేరు. అలా చేర్చరాదు.
శ్రీ వరప్రసాద్ గారు: చక్కగా 6 పద్యములతో ఒక ఖండికను చేసేరు. చాలా బాగుగ నున్నవి. 3వ పద్యము - 3వ పాదములో "భక్త జన కోరికలను - కి బదులుగా - భక్తుల గోరికలను అనండి : గణభంగమును సరిచేయుటకు. 4వ పద్యము: 1వ పాదములో "భుజింపగ" అనుట బాగులేదు - ప్రేమతో గొనుచో మీరు అని మొదలిడినచో బాగుంటుంది.
తమ్ముడు చి. డా. నరసింహమూర్తి తేటగీతి పద్యములోనికి మార్చి చక్కని పూరణ చేసెను. చాల బాగుగనున్నది.
మిస్సన్న గారి పద్యములో వెదుకుదామనినా ఏ దోషమునూ కనుపించదు. మంచి భావము మంచి ధార - పద్యములు 2 చాల బాగుగ నున్నవి.
శ్రీ తిమ్మాజీ రావు గారు: మీ పద్యము బాగుగ నున్నది. 1వ పాదములో యతి మైత్రి లేదు. సరిచేయండి.
శ్రీ సుబ్బా రావు గారు: మందు ప్రాణ హరము కాదని చక్కని పద్యములో సెలవిచ్చేరు.
శ్రీ రామచంద్రుని సేవ భాగ్యంబుగా ......జేసిన యీ కృతి చెవుల విందు! శ్రీ రామచంద్రుని శ్రీ వైభవము దెల్పి ......భవజాడ్యముల నిది బాపు మందు! శ్రీ రామచంద్రుని శ్రీ పాదయుగ్మము ......కనుపింప జేసెడి కనుల ముందు! శ్రీ రామచంద్రుని శ్రీ తత్త్వ మెరిగించి ......మోక్షమ్ము నిడునిది ముక్తి మందు!
రామజోగి సన్న్యాసిచే వ్రాయబడిన యమృత మధ్యాత్మ రామాయ ణాఖ్య మైన రమ్యకావ్యము రుచిగల రామజోగి మందు! ప్రాణహరము కాదు మంచి విందు.
మిత్రులారా! శుభాశీస్సులు. ఈనాటి మరికొన్ని పూరణలను చూద్దాము. ముందుగా అందరికీ అభినందనలు.
శ్రీ వరప్రసాద్ గారు మరియు శ్రీ మిస్సన్న గారు ఈనాడు చాల విజృంభించేరు. వారికి మా ప్రశంసలు.
శ్రి వరప్రసాద్ గారు మరొక 6 పద్యములలో రామజోగి మందు యొక్క ప్రాశస్త్యమును వర్ణించేరు -- అది మధురమైనది, నీరసములను పోగొట్టును, పాతకములను నశింప జేయును, ముక్తి మార్గములో నడిపించు మంత్ర రాజము, సంకట హరము, సర్వ సంప్రత్ ప్రదాయిని, రామ పాదములను చేర్చు గురువు అని అభివర్ణించేరు. ఉత్కృష్టములైన భావములతో అద్భుతముగా అలరారుచున్నవి ఈ పద్యములు.
శ్రీ లక్ష్మీ నారాయణ గారు పద్య కవులకు పర మాదర్శక మైనదనిసెలవిచ్చేరు. చాల సంతోషము.
శ్రీమతి రాజేశ్వరి గారు మా గ్రంథము గురించి అభివర్ణించేరు. సంతోషము.
శ్రీ తిమ్మాజీ రావు గారు రామజోగి మందు పాప హరణమైనదని మంచి పద్యములో వాక్రుచ్చేరు.
శ్రీ మిస్సన్న గారి తీరు అత్యంత ప్రశంసమైనది. మంచి భావములతో చక్కని సీసమును అందించేరు. అద్భుతముగా మా గ్రంథమును గూర్చి వివరించేరు. సంతోషము.
మీరు శ్రీ మదధ్యాత్మ రామాయణము వ్రాసినపుడు రోజుకు ముప్పది పద్యములు వ్రాసినారట,మీస్పూర్తి తో మరికొన్ని పద్యములు వ్రాసితిని. కష్ట పెడుతున్నందులకు మన్నింప ప్రార్థన. ========*======= 13. మేటి రాక్షస కోటికి తాట దీసి భావజ జనకుని పరమ పాద దరికి రాజ మార్గమునను జూపు రామ జోగి మందు,ప్రాణ హరము గాని మల్లకమ్ము(దీపపు ప్రమిద)
14. శ్రీ రామదాసు గారు భార్యను పుష్పక విమానము నెక్కుటకు పిలుచుట ========*======= భాగవతులు బిలచె భార్యను బలుమార్లు రామ జోగిమందు,ప్రాణ హరము గాదు,జేయుచున్న కార్యము లెల్లను నీడ నీయవు మరి నేర మగును. 15. శ్రీ రామదాసు గారు వెడలిన తరువాత ఆమె ========*======= వాసన గన నైతి వాసిగ భువిలోని రామ జోగిమందు,ప్రాణ హరము గాదని దెలియంగ గలతజెందితి నేడు ముందుగా దెలియక మోస పోతి.
16. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టు వారు ========*======= బార్లు గట్టి జనులు భజన జేసిరి నాడు రామ జోగిమందు,ప్రాణ హరము గాదని విన నైతి ఖలుల జెంతను జేరి మోహ పాశ మందు మునిగి యుంటి. ========*======= 17. మోక్ష పదవి నొంద భిక్షుకు డనయితి రామ జోగిమందు,ప్రాణ హరము గాదని దెలియకను గాసిల్లు చుంటిని రోగములకు జిక్కి రోగి నైతి. ========*======= 18. బహు దినముల నుండి భాగవతుల మధ్య సొగసుగ దిన రామ జోగిమందు, ప్రాణ హరము జేసె రాక్షస జాతిని సిరుల నిచ్చు చుండె శ్రిత జనులకు. ========*======= 19. అమృత రసము ద్రాగె హనుమ సుగ్రీవులు వానరులకు భూరి వరము లొసగె రామ జోగిమందు,రాక్షస తతికయ్యె రామ జోగిమందు ప్రాణ హరము. ========*======= 20. సాధు జనుల నెల్ల సంకట బెట్టిన ముని జనులని దెలిసి మోస పుచ్చి భక్త జనుల నెల్ల బాధించు వారికి రామ జోగిమందు ప్రాణ హరము.
శ్యామల రావు గారూ, నమస్కారం. తీవ్రమైన జ్వరంతో ఉన్నా మీ లేఖను ఆమూలాగ్రం పరిశీలించాను. బాసర జ్ఞానసరస్వతీ ఆలయ ప్రాంగణంలో కూర్చుని క్రొత్త సమస్యలను తయారు చేస్తూ, ఆటవిడుపుగా నా సెల్ ఫోన్ లోని రామదాసు కీర్తనలను వింటుండగా ‘రామజోగి మందు గొనరే’ అన్న కీర్తన గుర్తొచ్చింది. దాంతో ఈ సమస్య సిద్ధమైంది. అప్పుడే అనుకున్నా ఈ సమస్యను వినగానే ఎవరికైనా మనస్సు చివుక్కు మంటుందేమోనని. మిమ్మల్ని బాధ పెట్టినందుకు మన్నించండి. మీరు వ్రాసిన గేయం బాగుంది. మీ ‘శ్యామలీయం’ బ్లాగును చూడడం లేదనుకోకండి. అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను. కాకుంటే వ్యాఖ్యానించడానికి వీలు చిక్కడం లేదు. పనుల ఒత్తిడి, అనారోగ్యం... ధన్యవాదాలు.
అయ్యా! శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు. మీ పద్యముల వరుసలో 13 నుండి 20 వరకు చూచితిని. చాలా బాగుగ నున్నవి. కొన్ని సూచనలు:
13వ పద్యము: 2వ పాదము: పరమ పాద దరికి అనే సమాసము సరికాదు - పాద సీమ అని మార్చండి. 18వ పద్యము: సొగసుగ దిన - కి బదులుగా సొగసుగ గొన అనండి. 19వ పద్యము: ద్రాగె కిబదులుగా గొనిరి అనండి. 20వ పద్యము అన్వయములో కొంచెము లోపము ఉన్నది. సరిచేయండి. స్వస్తి.
కవిమిత్రులకు నమస్కృతులు. జ్వరం తగ్గలేదు. తగ్గకుంటే ఏవో టెస్టులు చేయాలి రమ్మన్నారు కదా అని డాక్టర్ గారి క్లినిక్‌కు ఫోన్ చేస్తే వారు ఈరోజు రావడం లేదట. రేపు ప్రొద్దున రమ్మన్నారు. గురువర్యులు పండిత నేమాని వారి పర్యవేక్షణలో బ్లాగు నిరాటంకంగా కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఉత్సాహంగా పూరణలు, పద్యాలను వ్రాస్తున్న మిత్రులకు అభినందనలు.
శ్రీ శ్యామల రావు గారు! శుభాశీస్సులు. మీ పద్యము చాల బాగుగ నున్నది. నిరత సురా ఆరామమున విహరించే వారికి రామజోగి మందు పని చెయ్యదు లెండి - హాలహలము నైనా హాయిగా సేవించ గలుగుతారు కదా!. స్వస్తి.
రామజోగి మందు ప్రాణప్రదంబగు
రిప్లయితొలగించండిచిత్తమందు భక్తి చెలగు నెడల
రామజోగి మందు ప్రాణహరమ్మగు
ధరణి దైత్య దనుజ తతుల యెడల
శంకరా భరణపు సంజీవినై యొప్పు
రిప్లయితొలగించండిరామ జోగి మందు: ప్రాణ హరము
గాని, మాన హాని గాని లేనట్టిదౌ
బుద్ధి శుద్ధి జేయు బుధుని మందు!!!
మానలేక పోవ మానమే పోవును
రిప్లయితొలగించండిమానలేవ ! వినవ ! మ్రాను నీవు
గోడనీవు నాదు గోడు వినగ లేవ !
రామజోగి! మందు ప్రాణ హరము.
రావణునితో మారీచుడు;
రిప్లయితొలగించండి( అన్నగారి స్ఫూర్తియే )
సీత నపహరింప సేతువు నిర్మించి
లంక జేర వచ్చు రామ విభుడు
చేటు కాల మయినొ ! చెప్పితి, వినవేల !
రామజోగి మందు ప్రాణ హరము
రావణునికి రామభద్రుండు
రిప్లయితొలగించండిభోగి కి కాలగతిన జోగి
మనుజుని మేధకు మందు
రామ,జోగి, మందు, ప్రాణ హరము !
జిలేబి
మాన్య రామజోగి సవ్యాసి రాయలు
రిప్లయితొలగించండికవి భిషగ్వరుండు! ఘనయశుండు!
రామజోగి మందు ప్రాణహరము గాదు;
రామజోగి మందు ప్రాణదమ్ము!!
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాటి కొన్ని పూరణలను చూచెదము:
ముందుగా అందరికీ అభినందనలు.
1. శ్రీ పీతాంబర్ గారు: శంకరాభరణము బ్లాగు నందు ప్రేమతో చక్కగా పూరణ చేసేరు; బుద్ధి శుద్ధి చేయు బుధుని మందుగా ప్రశంసించుచు, రామజోగి మందు ప్రాణ మాన హరము కాదని వక్కాణించేరు. చాల చక్కగా నున్నది పద్యము.
2. శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారు: మందు సేవించుట మంచి పద్ధతి కాదని రామజోగికి చేసిన బోధ చాల బాగుగ నున్నది పద్యరూపములో.
3. తమ్ముడు డా. నరసింహ మూర్తి పూరణలో రావణునికి మారీచుడు చేయు హితబోధను ఉట్టంకించెను - చాల బాగుగ నున్నది పద్యము.
4. శ్రీమతి జిలేబి గారు: వారి భావమునకు నింకా ఎవరో పద్య రూపము నీయవలెను.
5. శ్రీ మధుసూదన్ గారు: కవి భిషగ్వరునిగా రామజోగిని ప్రశంసించేరు - సంతోషము. చాల బాగుగ నున్నది పద్యము.
రామజోగి మందు రసరమ్య గీతమ్ము;
రిప్లయితొలగించండిరామదాస వినుత రాగ యశము!
రామజోగి మందు ప్రాణహరము గాదు;
ప్రాణములను నిలుపు బ్రహ్మరసము!!(2)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినిజము తెలియబోదు, నిజబంధువులు రారు,
రిప్లయితొలగించండిలేమి కలుగు బలము లేకపోవు
దురితవర్తనమున దుర్గతినొందరే
రామ జోగి! "మందు" ప్రాణ హరము.
శ్రీ జిలేబిగారి భావమ్మునకు నా పద్యము..తప్పలున్న మన్నించ ప్రార్దన..
రిప్లయితొలగించండిరావణునికి మందు రామచంద్రుండేను
కాల గతిన భోగి కర్మ యోగి
మనుజ మేధ కునెపుడు మార్పుయెమందవ్వు
రామజోగి మందు ప్రాణ హరము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు జ్వరము నుండి స్వస్థత చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ
శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.నా అజ్ఞానమునకు క్షమించగలరు
=====*=======
1.రామజోగి మందు ప్రాణ హరము గాదు,
కామము నెడ బాపి గాచు మందు.
ఖలులకు గుది గొన్న కాటుక కొండల
వంటి కర్మము లెడ బాపు మందు .
=====*=======
2.రమ్య మైనది జిహ్వకు రామజోగి
మందు,ప్రాణ హరము గాదు,విందు జేసి
భవహరము జేయు మందిది, భక్తజనుల
భయము ద్రుంచెడి పరమ పావన మయినది.
=====*=======
3.యోగ భోగులకును రామజోగి మందు,
ప్రాణ హరము గానిది ఘోర రాక్షసులను
గూల్చు నట్టిది,భక్తజన గోరికలను
దీర్చు చుండు,దీనులకిది దీపశిఖము.
=====*=======
4.ప్రేమతో భుజింపగ మీరు రామ జోగి
మందు,ప్రాణ హరముగాదు,ముందు వెనుక
జూడకను ముక్తి నిచ్చెడి జున్ను, భాగ
వతులు స్మరణ జేయు పరమ హితమయినది.
=====*=======
5.అంతులేని సంసారపు బంతములను
ద్రుంచి,పార దోలును భవ రోగములను
రామ జోగులు సేవించురామజోగి
మందు,ప్రాణ హరమగు కామాందులకును.
=====*=======
6.మోహ పాశములను గోసి ముక్తి నిచ్చు
రామ జోగి స్మరించెడి రమ్యమైన
రామ నామము,భద్రాద్రి రామజోగి
మందు,ప్రాణ హరమగు కామాందులకును.
రామజోగి మందు బ్రహ్మేంద్రదివిజుల
రిప్లయితొలగించండికర్ణపేయకార కామృతమ్ము!
రావణాది దుష్ట రాక్షసాధములకు
రామజోగి మందు ప్రాణహరము!!(3)
శ్రీ గుండు మధుసూదన్ గారు అన్నయ్య గారిని ఉద్దేశించి చెప్పిన పద్యము చాలా బాగుంది. ,నా మరో పద్యము;
రిప్లయితొలగించండిరామజోగి మందు రసన కింపై యుండు
రుచియు వలన నడగు రుజము లన్ని
రామజోగి మందు ప్రాణహరము నటె ?
ఆయు వొసగు హనుమ యధిక మైన !
రిప్లయితొలగించండియోగి వచ్చినాడ రోగము మాపెద
ననగ తొందరపడి గొనిరి మందు
మందు మ్రింగి నంత మైకమాయెను రామ-
రామ! జోగి మందు ప్రాణ హరము.
పూజ్యులు పండిత నేమానివారికి మఱియు మిత్రులు గన్నవరపు నరసింహ మూర్తిగారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండివాలిని తెగటార్చి వాని తమ్ముని గాచె
రిప్లయితొలగించండి...........చూడుడు శ్రీరామ జోగి మందు!
లంకేశు నిర్జించి రాజుఁ జేసె ననుజు
...........చూడుడు శ్రీరామ జోగి మందు!
ఎంగిలి గ్రహియించి యింతిని కరుణించె
...........చూడుడు శ్రీరామ జోగి మందు!
కాటు వేసిన కాకిఁ గాచి రక్షించెను
...........చూడుడు శ్రీరామ జోగి మందు!
చూడఁ శరణు గోర సుధయగు నేరికిన్
రామ జోగి మందు ప్రాణ హితము!
ధర్మ నిర్జితులను తప్పక శిక్షించు
రామ జోగి మందు ప్రాణ హరము!
శంకరయ్య గురుదేవులకు నమస్కారములు,
రిప్లయితొలగించండిరామజోగిమందు త్రాగి త్వరలో రోగవిముక్తులు కాగలరు
కామక్రోధ లోభమదమత్సరములకు
రామజోగిమందు ప్రాణహరము
రామజోగిమందుప్రేమతోగ్రోలిన
పాపసంచయమ్ముపారద్రోలు
నమ్ము నేది మనసు నాశంబు కోరదు
రిప్లయితొలగించండిఅమ్ముకున్న వాడు అధముడయిన
పంపునీరు అయిన ప్రాణప్రదంబగు
రామజోగి మందు ప్రాణహరమగునె
రామజోగి మందు ప్రాణ హరము కాదు
రిప్లయితొలగించండిప్రాణము నిల బెట్టు ప్రతియొ కరికి
మందు వాడ కంబు మనుగడ కొఱకు నౌ
కోరి ప్రాణ హరము కొఱకు కాదు
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాటి మరికొన్ని పూరణలను పరిశీలించుదాము. ముందుగా అందరికీ అభినందనలు.
శ్రీ మధుసూదన్ గారు: మీ పద్యములు రసరమ్యములు మరియును కర్ణపేయములుగా అలరారుచున్నవి.
శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: మీ పద్యము నేటి కాలానుగుణమైన అర్థముతో నున్నది. పెద్దల మాటలలో : ఒక పదమునకు అనేక అర్థములు ఉన్నప్పుడు అందులో ఉత్కృష్టమైన అర్థమునే గ్రహించ వలెను - హంస వలె. గ్రహించగలరు.
శ్రీమతి శైలజ గారు: మీరు 2 పద్యములు వ్రాసేరు. ఒకటి: శ్రీమతి జిలేబి గారి భావము ననుసరించి: పద్యముల్లు బాగుగ నున్నవి.
1. "మనుజ మేధకు గన మార్పులే మందులౌ" అని ఒక పాదమును మార్చుదాము.
2వ పద్యములో సమస్యకు చివరన అగునే? అని చేర్చేరు. అలా చేర్చరాదు.
శ్రీ వరప్రసాద్ గారు: చక్కగా 6 పద్యములతో ఒక ఖండికను చేసేరు. చాలా బాగుగ నున్నవి.
3వ పద్యము - 3వ పాదములో "భక్త జన కోరికలను - కి బదులుగా - భక్తుల గోరికలను అనండి : గణభంగమును సరిచేయుటకు.
4వ పద్యము: 1వ పాదములో "భుజింపగ" అనుట బాగులేదు - ప్రేమతో గొనుచో మీరు అని మొదలిడినచో బాగుంటుంది.
తమ్ముడు చి. డా. నరసింహమూర్తి తేటగీతి పద్యములోనికి మార్చి చక్కని పూరణ చేసెను. చాల బాగుగనున్నది.
మిస్సన్న గారి పద్యములో వెదుకుదామనినా ఏ దోషమునూ కనుపించదు. మంచి భావము మంచి ధార - పద్యములు 2 చాల బాగుగ నున్నవి.
శ్రీ తిమ్మాజీ రావు గారు: మీ పద్యము బాగుగ నున్నది. 1వ పాదములో యతి మైత్రి లేదు. సరిచేయండి.
శ్రీ సుబ్బా రావు గారు: మందు ప్రాణ హరము కాదని చక్కని పద్యములో సెలవిచ్చేరు.
స్వస్తి.
ఆది దంపతు లనబడు నయ్యు మా మ
రిప్లయితొలగించండిహేశు లీ శంక రార్యుల కా శి సులను
నిచ్చు గావుత ! రుగ్మము చచ్చు వడగ,
వడి గ కోలుకొన రోగపు బారి నుండి
శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు
రిప్లయితొలగించండి=======*=======
7.పాల కన్నను భువి పైన మేలి మైన
రామజోగి మందు పరమ సోమరస సు
ధా మధురము,బ్రహ్మానంద రామ జోగి
మందు,ప్రాణ హరము గాని మంథరమ్ము
=======*=======
8. నీరస నివారకమ్ము సుధా రసమ్ము
పాయసమ్ము పరమ భాగవతుల కిమ్ము
లాహిరి నిడు,జిహ్వ కెపుడు రామ జోగి
మందు,ప్రాణ హరము గాని మధుర రసము.
=======*=======
9. ఘోర పాతకములు బడ గొట్టుచున్న
రామ నామము జిహ్వకు కోమలము సు
ధా మధురము భద్రాచల రామ జోగి
మందు,ప్రాణ హరము గాని మండితమ్ము.
=======*=======
10. పాప బంధములను బట్టి పార దోలి,
ముక్తి మార్గమందు నడపు మూల మంత్ర
రాజమది మర్మము దెలుపు రామ జోగి
మందు,ప్రాణ హరము గాని మణిమ యమ్ము.
=======*=======
11. భూరి సంకట హరణమ్ము కోరిన,బుధ
జనులకిమ్ముగ నిడు సర్వ సంపదలను
రామ తీర్థ సారసముల రామ జోగి
మందు,ప్రాణ హరము గాని మధుప మగును
=======*=======
12. పక్ష పాతము జుపని పరుసవేది
పెనబడు వెతలు దీర్చెడి బిరుదులుగల
రామ పాదము జేర్చెడి రామ జోగి
మందు,ప్రాణ హరము గాని మరుల నిచ్చు.
రామ జోగి మందు ప్రాణ హరమ్మను
రిప్లయితొలగించండిమాట కల్ల సుమ్మి, మహిత తెలుగు
పద్య రచన కవుల పరమౌషధంబది
గణ సమాస సంది గతుల దిద్దు .
రామ భక్తి మీర రచియించె గ్రంధమ్ము
రిప్లయితొలగించండిచదివి నంత గలుగు ముదము మదికి
రామ జోగి మందు ప్రాణ హరము గాదు
ముక్తి పొందు ననగ మూఢు డైన
కామక్రోధ లోభ గర్వాంధులకు నెల్ల
రిప్లయితొలగించండిరామజోగిమందు ప్రాణహరము
రామనామ గానరసమునుగ్రోలిన
పాప హరణ మగును భక్తులార
శ్రీ రామచంద్రుని సేవ భాగ్యంబుగా
రిప్లయితొలగించండి......జేసిన యీ కృతి చెవుల విందు!
శ్రీ రామచంద్రుని శ్రీ వైభవము దెల్పి
......భవజాడ్యముల నిది బాపు మందు!
శ్రీ రామచంద్రుని శ్రీ పాదయుగ్మము
......కనుపింప జేసెడి కనుల ముందు!
శ్రీ రామచంద్రుని శ్రీ తత్త్వ మెరిగించి
......మోక్షమ్ము నిడునిది ముక్తి మందు!
రామజోగి సన్న్యాసిచే వ్రాయబడిన
యమృత మధ్యాత్మ రామాయ ణాఖ్య మైన
రమ్యకావ్యము రుచిగల రామజోగి
మందు! ప్రాణహరము కాదు మంచి విందు.
రామ జోగి రచన రంజిల్లు సుధ లందు
రిప్లయితొలగించండిసురలు మెచ్చి పొగడె పరమ ప్రీతి
రామ జోగి మందు ప్రాణ హరము గాదు
భక్తి కొలిచి నంత ముక్తి నొసగు !
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాటి మరికొన్ని పూరణలను చూద్దాము. ముందుగా అందరికీ అభినందనలు.
శ్రీ వరప్రసాద్ గారు మరియు శ్రీ మిస్సన్న గారు ఈనాడు చాల విజృంభించేరు. వారికి మా ప్రశంసలు.
శ్రి వరప్రసాద్ గారు మరొక 6 పద్యములలో రామజోగి మందు యొక్క ప్రాశస్త్యమును వర్ణించేరు -- అది మధురమైనది, నీరసములను పోగొట్టును, పాతకములను నశింప జేయును, ముక్తి మార్గములో నడిపించు మంత్ర రాజము, సంకట హరము, సర్వ సంప్రత్ ప్రదాయిని, రామ పాదములను చేర్చు గురువు అని అభివర్ణించేరు. ఉత్కృష్టములైన భావములతో అద్భుతముగా అలరారుచున్నవి ఈ పద్యములు.
శ్రీ లక్ష్మీ నారాయణ గారు పద్య కవులకు పర మాదర్శక మైనదనిసెలవిచ్చేరు. చాల సంతోషము.
శ్రీమతి రాజేశ్వరి గారు మా గ్రంథము గురించి అభివర్ణించేరు. సంతోషము.
శ్రీ తిమ్మాజీ రావు గారు రామజోగి మందు పాప హరణమైనదని మంచి పద్యములో వాక్రుచ్చేరు.
శ్రీ మిస్సన్న గారి తీరు అత్యంత ప్రశంసమైనది. మంచి భావములతో చక్కని సీసమును అందించేరు. అద్భుతముగా మా గ్రంథమును గూర్చి వివరించేరు. సంతోషము.
స్వస్తి.
అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు. మీ 2వ పద్యము కూడా చాల బాగుగ నున్నది. సంతోషము - అభినందనలు, స్వస్తి.
రిప్లయితొలగించండిమిత్రులారా!
రిప్లయితొలగించండిసరసులు, సత్కవీశ్వరులు, సద్ధృదయుల్, ముదమారగా సమా
దరమున గూర్చి రెన్నియొ విధాల ప్రశంసలు రామజోగి సుం
దర తర కావ్య వైభవము జ్ఞాన నిధాన ప్రశస్తి నెంచి సో
దరులగు వారి కెల్లరకు తథ్యము రాముడొసంగు యోగముల్
సత్కవీశ్వరులు శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు
రిప్లయితొలగించండిమీరు శ్రీ మదధ్యాత్మ రామాయణము వ్రాసినపుడు రోజుకు ముప్పది పద్యములు వ్రాసినారట,మీస్పూర్తి తో మరికొన్ని పద్యములు వ్రాసితిని. కష్ట పెడుతున్నందులకు మన్నింప ప్రార్థన.
========*=======
13. మేటి రాక్షస కోటికి తాట దీసి
భావజ జనకుని పరమ పాద దరికి
రాజ మార్గమునను జూపు రామ జోగి
మందు,ప్రాణ హరము గాని మల్లకమ్ము(దీపపు ప్రమిద)
14. శ్రీ రామదాసు గారు భార్యను పుష్పక విమానము నెక్కుటకు పిలుచుట
========*=======
భాగవతులు బిలచె భార్యను బలుమార్లు
రామ జోగిమందు,ప్రాణ హరము
గాదు,జేయుచున్న కార్యము లెల్లను
నీడ నీయవు మరి నేర మగును.
15. శ్రీ రామదాసు గారు వెడలిన తరువాత ఆమె
========*=======
వాసన గన నైతి వాసిగ భువిలోని
రామ జోగిమందు,ప్రాణ హరము
గాదని దెలియంగ గలతజెందితి నేడు
ముందుగా దెలియక మోస పోతి.
16. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టు వారు
========*=======
బార్లు గట్టి జనులు భజన జేసిరి నాడు
రామ జోగిమందు,ప్రాణ హరము
గాదని విన నైతి ఖలుల జెంతను జేరి
మోహ పాశ మందు మునిగి యుంటి.
========*=======
17. మోక్ష పదవి నొంద భిక్షుకు డనయితి
రామ జోగిమందు,ప్రాణ హరము
గాదని దెలియకను గాసిల్లు చుంటిని
రోగములకు జిక్కి రోగి నైతి.
========*=======
18. బహు దినముల నుండి భాగవతుల మధ్య
సొగసుగ దిన రామ జోగిమందు,
ప్రాణ హరము జేసె రాక్షస జాతిని
సిరుల నిచ్చు చుండె శ్రిత జనులకు.
========*=======
19. అమృత రసము ద్రాగె హనుమ సుగ్రీవులు
వానరులకు భూరి వరము లొసగె
రామ జోగిమందు,రాక్షస తతికయ్యె
రామ జోగిమందు ప్రాణ హరము.
========*=======
20. సాధు జనుల నెల్ల సంకట బెట్టిన
ముని జనులని దెలిసి మోస పుచ్చి
భక్త జనుల నెల్ల బాధించు వారికి
రామ జోగిమందు ప్రాణ హరము.
శ్యామల రావు గారూ,
రిప్లయితొలగించండినమస్కారం.
తీవ్రమైన జ్వరంతో ఉన్నా మీ లేఖను ఆమూలాగ్రం పరిశీలించాను.
బాసర జ్ఞానసరస్వతీ ఆలయ ప్రాంగణంలో కూర్చుని క్రొత్త సమస్యలను తయారు చేస్తూ, ఆటవిడుపుగా నా సెల్ ఫోన్ లోని రామదాసు కీర్తనలను వింటుండగా ‘రామజోగి మందు గొనరే’ అన్న కీర్తన గుర్తొచ్చింది. దాంతో ఈ సమస్య సిద్ధమైంది. అప్పుడే అనుకున్నా ఈ సమస్యను వినగానే ఎవరికైనా మనస్సు చివుక్కు మంటుందేమోనని. మిమ్మల్ని బాధ పెట్టినందుకు మన్నించండి.
మీరు వ్రాసిన గేయం బాగుంది.
మీ ‘శ్యామలీయం’ బ్లాగును చూడడం లేదనుకోకండి. అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను. కాకుంటే వ్యాఖ్యానించడానికి వీలు చిక్కడం లేదు. పనుల ఒత్తిడి, అనారోగ్యం...
ధన్యవాదాలు.
తాడిగడప శ్యామలరావు గారి గేయం......
రిప్లయితొలగించండిమందు వేసి మాన్ప లేని
మాయదారి జబ్బండీ
అందరికీ పుట్టగానే
అంటుకునే జబ్బండీ
జబ్బుపడ్డ వాడె మనిషని
జనము నమ్మే జబ్బండీ
జబ్బు తగ్గితే పిచ్చివాడని
జనము నమ్మే జబ్బండీ ॥మందు॥
అబ్బురముగా వయసుతోటి
అతిశయించే జబ్బండీ
డబ్బు గాలి తగలగానే
ఉబ్బరించే జబ్బండీ ॥మందు ॥
కళ్ళు తెరిచిన రోజు నుండే
కాటు వేసే జబ్బండీ
పిల్ల నిచ్చీ పెళ్ళి చేస్తే
పెరిగి పోయే జబ్బండీ ॥ మందు ॥
క్షణము లోన పోవు దానిని
సత్య మనుకొను జబ్బండీ
తనకు సత్య మైన దానిని
తాను నమ్మని జబ్బండీ ॥మందు ॥
భూమి మీద వైద్యు డెవడూ
మూల మెరుగని జబ్బండీ
రామజోగి మంత్ర మేస్తే
రాలి పోయే జబ్బండీ ॥మందు ॥
"శ్యామలీయం" బ్లాగునుండి...
http://syamaliyam.blogspot.in/2013/08/blog-post_9.html
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిరంజాన్ సెలవు దినాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సంతోషం.
సహృదయులు,సత్కవీశ్వరులు శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఅయ్యా! శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యముల వరుసలో 13 నుండి 20 వరకు చూచితిని. చాలా బాగుగ నున్నవి.
కొన్ని సూచనలు:
13వ పద్యము: 2వ పాదము: పరమ పాద దరికి అనే సమాసము సరికాదు - పాద సీమ అని మార్చండి.
18వ పద్యము: సొగసుగ దిన - కి బదులుగా సొగసుగ గొన అనండి.
19వ పద్యము: ద్రాగె కిబదులుగా గొనిరి అనండి.
20వ పద్యము అన్వయములో కొంచెము లోపము ఉన్నది. సరిచేయండి. స్వస్తి.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిజ్వరం తగ్గలేదు. తగ్గకుంటే ఏవో టెస్టులు చేయాలి రమ్మన్నారు కదా అని డాక్టర్ గారి క్లినిక్‌కు ఫోన్ చేస్తే వారు ఈరోజు రావడం లేదట. రేపు ప్రొద్దున రమ్మన్నారు.
గురువర్యులు పండిత నేమాని వారి పర్యవేక్షణలో బ్లాగు నిరాటంకంగా కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉంది.
ఉత్సాహంగా పూరణలు, పద్యాలను వ్రాస్తున్న మిత్రులకు అభినందనలు.
తాడిగడప శ్యామలరావు గారి రెండవ గేయం....
రిప్లయితొలగించండిఏ మయ్యా ఓ రామజోగీ
ఏ ఊరయ్యా నీదీ
ఏమో నిన్ను ఎరిగిన వారు
ఎవరూ లేరనిపిస్తోందీ
బైరాగి వలే వేషం కట్టీ
భేషుగ్గానే ఉన్నావూ
దూరం నుండీ వచ్చావేమో
ఊరి కోవెలలొ విడిసేవా ॥ఏ మయ్యా॥
దిక్కుమాలిన సంసారమనే
టక్కరి జబ్బు తగులుకుని
ఇక్కడి ప్రజలు వైద్యం లేక
చిక్కులు పడుతున్నారయ్యా ॥ఏ మయ్యా॥
ఘన వైద్యులు బైరాగుల్లోనే
కనబడతారని అంటారే
మనకేమైనా వైద్యపు గీద్యపు
పనితనముందా చెప్పండీ ॥ఏ మయ్యా॥
ఎవరికి అంతు చిక్కని జబ్బు
ఇక్కడ ఎంతో ముదిరింది
భవవైద్యానికి మందులు నీకు
బాగా తెలుసా చెప్పు మరి ॥ఏ మయ్యా॥
నేమాని పండితార్యా! వందనములు.
రిప్లయితొలగించండిశ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండిసకల జీవులకును సర్వ పాప హరము
రామ జోగి మందు; ప్రాణ హరము
దర్మ విముఖు లగుచు దారి తప్పి
వర్త నంబు సల్పు వారి యెడల
నమస్కారములు
రిప్లయితొలగించండిసోదరులు శంకరయ్య గారు త్వరగా కోలుకోవాలని దీవిస్తూ శుభా కాంక్షలతో అక్క
రామజోగి మందు ప్రాణ వాయువు వలె
రిప్లయితొలగించండిభక్త జనుల గాచి బాగు పరచు
భక్తి మరచి నట్టి వార లందరకును
రామ జోగి మందు ప్రాణ హరణము
రామజోగి మందు ప్రాణహరము కాదు
రిప్లయితొలగించండిభోగి కైన పరమ యోగి కైన
నమ్మకమ్ము లేని నాస్తికుల కగును
రామజోగి మందు ప్రాణహరము
రిప్లయితొలగించండిశ్రీ శ్యామల రావు గారి గేయాలు అలతి అలతి పదాలతో రాణించుచున్నవి - మంచి భావమును నింపుకొనినవి. వారికి అభినందనలు.
Sri T.B.S.Sarma garu!
మీ పద్యము చాలా బాగుగ నున్నది. అభినందనలు.
శ్రీ బొడ్డు శకరయ్య గారూ!
మీ 2 పద్యములు చాలా బాగుగ నున్నవి - (1) భక్తి మరచిన వారికి అనియు (2) నాస్తికులకు అనియు ఆ సమస్యను చక్కగా పూరించేరు. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినిన్న మిత్రులు శంకరయ్యగారికి శ్రమ కలిగినందుకు క్షంతవ్యుణ్ణి.
రిప్లయితొలగించండిరామజోగిమందు సమస్యకు నా పూరణకూడా ఒకటి జమవేసుకోగలరు.
చదివిచదివి వైద్యశాస్త్రంబు కడముట్ట
పేరుమోసి తుదకు వెఱ్ఱిపుట్టి
పేరుమాయ సిగ్గువిడచు నిరతసురా
రామజోగి మందు ప్రాణహరము
శ్రీ శ్యామల రావు గారు! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము చాల బాగుగ నున్నది. నిరత సురా ఆరామమున విహరించే వారికి రామజోగి మందు పని చెయ్యదు లెండి - హాలహలము నైనా హాయిగా సేవించ గలుగుతారు కదా!. స్వస్తి.
రామజోగి / రామజోగులు అంటే ఎవరో తెలుసుకోవాలని ఉంది.
రిప్లయితొలగించండి