12, ఆగస్టు 2013, సోమవారం

పద్య రచన – 431 (అద్దె యిల్లు)

కవిమిత్రులారా,
ఈరోజు పద్య రచనకు అంశము....
"అద్దె యిల్లు"

22 కామెంట్‌లు:

 1. మిత్రులారా!
  ఈ నాటి సమస్యలో "కొంప" అనే ప్రయోగము కలదు. సాధారణముగా ఆ పదమును నిందార్థకముగనే వ్యవహరింతురు. అందుచేత ఆ పదమును నేను ఇచ్చోట వాడను. అద్దె యిల్లు అనియే వ్రాయుదును. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 2. అద్దె యిల్లు చూడ నానంద నిలయమౌ
  మంచి వారలు యజమానులైన
  అదె యశాంతి నిలయమౌ కదా యక్కటా
  దానవసములు యజమానులైన

  రిప్లయితొలగించండి

 3. ఇరువది సంవత్సరములు అద్దె కొంప నున్న
  అది సొంత కొంప అని తీర్పు ఇచ్చు రాజ్యములో
  అరువది సంవత్సరములు స్వంత కొంప లో నున్నను
  అద్దె కొంప అని వీడి సొంత కొంప నాడుట ఏ పాటి మేలు ?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. శైలజ గారి పద్యము..... (సనరణ)

  అద్దె కొంపయె యగు నాత్మకుదేహంబు
  శాశ్వతంబు కాదు సంతసించ
  నాత్మ శుధ్ధి కలిగి యందున్న మేలైన
  హరిని గాంచవలయు నఖిలజనులు.

  రిప్లయితొలగించండి
 5. దేహమన్నది యాత్మకు గేహమగును
  మనది కాదది సొంతమ్ము మాధవునకు
  భక్తి నద్దెగ చెల్లించ వలయు మనము
  చిన్న కొంపలకే మార్చు చెల్లకున్న.

  రిప్లయితొలగించండి
 6. శ్రీమతి శైలజ గారి స్ఫూర్తితో:

  తనువొక అద్దె యిల్లగు గదా భువి జీవున కయ్యుపాధిలో
  దనరుచు దాను దేహమని తద్దయు భ్రాంతిని బొందుచుండి చే
  యును బహు కర్మముల్ ఫలములొప్పుగ నొందుచు, భ్రాంతి వీడి యా
  త్మను గద నేనటంచు నిజధామము చేరుట ముఖ్య లక్ష్యమౌ

  రిప్లయితొలగించండి
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 8. పూజ్య గురుదేవులు.. కందిశంకరయ్య గారికి..శ్రీ పండిత నేమాని గురువుగారికి ప్రణామములతో.. నాపద్యాన్నితొలుత పూరణలో పొరపాటున పోస్టుచేసియున్నాను..మన్నించగలరు.. పండిత నేమాని గురుదేవులకు స్ఫూర్తినిచ్చి న నాభావం ధన్యతనొందింది.

  అద్దె కొంపయె యగును నాత్మకుదేహంబు
  శాశ్వతంబు కాదు సంతసించ
  నాత్మ శుధ్ధి కలిగి నందున్న మేలవౌ
  హరిని గాంతు రందు అఖిలజనము

  రిప్లయితొలగించండి
 9. మిత్రులకు ఒక ముఖ్య సూచన:

  శుభాశీస్సులు. మన మెల్లరము నిత్యము వాగ్దేవీ వరివస్య జేయుచూ ఆ మాత యొక్క కరుణామృతమును సేవించుచున్న వారమే. వాక్కు అగ్ని యొక్క ఒక రూపము. అగ్నిర్వై వాగ్భూత్వా ముఖం ప్రావిశత్ అని ఐతరేయోపనిషత్తు తెలుపు చున్నది. అందుచేత సరియైన వాక్ప్రయోగమునే ఎల్లప్పుడునూ చేయుచుండుట శ్రేయస్కరము. ఒక భావమునకు అనేక పర్యాయ పదములుండును. అటులనే ఒక పదమునకు నానా అర్థములుండును. సందర్భోచితముగా ఉత్కృష్టమైన పదములను వాడుటయే మంచిదని నా యొక్క వినయపూర్వకమైన సలహా. ఏ పదమును ఎక్కడ వాడవలెను, ఏ అర్థమును ఎట్లు గ్రహించ వలెను అనునది అందరికీ తెలిసిన విషయములే కావున అందరూ సముచిత వాక్ప్రయోగములనే కావింతురని నా భావము. ఈ నాటి వర్ణన అంశము "అద్దె ఇల్లు" అనండి అని నేను ముందుగనే సూచించితిని. కానీ ఎవ్వరునూ గమనించిన రీతి కనుపట్టుటలేదు. దయచేసి అందరునూ "అద్దె ఇల్లు" అని మాత్రమే వాడండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. స్వంత యిల్లు లేని వారల కద్దె కొం
  ప మఱి తప్ప దార్య ! పాడు వడిన
  దైన మంచి దైన నిక మనువచట నే
  గడుప వలెను నెంత కష్ట మైన


  రిప్లయితొలగించండి
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 13. అద్దె ఇల్లు చూడ అధములకిచ్చిన
  గుత్తజేసికొనును గుట్టుగాను
  తగని వారికెపుడు తాళంబులొసగిన
  తనకు హానిగలుగు తప్పకుండ

  రిప్లయితొలగించండి
 14. ఈనాటి విషయము: అద్దె యిల్లు గురించి వచ్చిన పద్యములను తిలకించుదాము:

  శ్రీమతి శైలజ గారు: ఒకటవ పద్యములో వేదాంత పరముగా ఆత్మకు శరీరమే ఒక అద్దె యిల్లు అన్నారు.
  2వ పద్యములో అథములకు ఇల్లు అద్దెకు ఇస్తే తగవులు కష్టములు తప్పవు అన్నారు. పద్యములు బాగుగ నున్నవి.

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: ఆత్మకు దేహమే గేహము అంటూ ఆ గేహమునకు భక్తి అనే అద్దెను శ్రీహరికి కట్ట వలెనని సెలవిచ్చేరు. పద్యము చాల బాగుగ నున్నది.

  శ్రీ సుబ్బా రావు గారు: సొంత ఇల్లు లేని వారికి సుఖమైన కష్టమైన అద్దె ఇల్లు తప్పదన్నారు. పద్యము చాల బాగుగ నున్నది.

  రిప్లయితొలగించండి
 15. సొంత యిల్లు లేక చింతించు వారల
  నెంతొ యాదరాన చెంతజేర్చి
  వంత దీర్చుచుండి సంతోషమందించు
  నవనిలోన సత్య మద్దెయిల్లు.

  రిప్లయితొలగించండి
 16. Sri H.V.S.N.Murti Garu!
  శుభాశీస్సులు. మీ పద్యము చాల బాగుగనున్నది.
  అద్దె ఇంటిని గూర్చి ప్రశంస బాగుగ చేసేరు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. దుర్గ మేదైన భూతల స్వర్గ మనుచు
  మనసు కనువైన రీతిగ మార్చు కొనిన
  అద్దె యింటను నివసించ నొద్ది కౌను
  శాంతి సౌఖ్యంబు గలిగివి శ్రాంతి నొందు

  రిప్లయితొలగించండి
 18. అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము భావము చాల బాగుగ నున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. నమస్కారములు
  పూజ్య గురువులకు ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 20. అంధకూపమౌ యీ భువి అద్దెయిల్లు
  హరిని స్మరియింపుము తొలగు నఘములన్ని
  నామ మంత్రమ్ము నిను మోక్షధామమైన
  సొంతయింటిని జేర్చును చింత దీర్చు

  రిప్లయితొలగించండి
 21. శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
  వేదాంత పరమైన భావముతో మీ పద్యము చాలా బాగుగ నున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. పండిత నేమాని గారికి
  నమస్కారములు
  పూజ్య గురువులకు ధన్య వాదములు

  రిప్లయితొలగించండి