పండిత నేమాని వారూ, చరాచరమయమైన జగానికి సంకేతంగా తిరుగలిని వర్ణించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. * జిలేబీ గారూ, మిక్సీలు, గ్రైండర్లు వచ్చి తిరుగలి మూలకు చేరింది. మంచిభావాన్ని అందించారు. మీ భావానికి నా పద్యరూపం... మ్యూజియమ్ము జేరిపోయెను తిరుగలి తింగడికి పెరిగెను తీరుబడియు తిన్నదరుగనట్టి తిండిపో తయ్యెను తన బ్రతు కయె నిపుడు తారుమారు. * గుండు మధుసూదన్ గారూ, దాంపత్యాన్ని తిరుగలితో పోల్చిన మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * శైలజ గారూ మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు. మధుసూదన్ గారు చెప్పిన ‘ఆడువారి’ని గమనించారు కదా. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
శైలజ గారూ, జిలేబీ గారి భావానికి మీ పద్యం బాగుంది. నేను వ్యాఖ్య పెడుతున్న సమయంలో మీ పద్యం వచ్చింది. నేను చూడలేదు. చూస్తే నా పద్యాన్ని పెట్టేవాడను కాదు. మీ పద్యంలో 1, 3వ పాదాల్లో గణదోషం. మొదటి పాదంలో ‘తిరుగలి యిప్పుడు’ అనీ, మూడవ పాదంలో ‘తిన్న దరుగదాయె’ అని సవరిస్తే సరి!
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
గురుదేవులు నా మనసులోని మాటను జెప్పితిరి. రామ భక్తులు సుగ్రీవుని పై,తానీష పై వ్రాయాలి అనుకోంటిని.
old is gold అను సూక్తి ఆధారముగా =======*===== తిరిగె గాలి నేడు తిరుగలి పైనను తడవ తడవ రోగ తతులు దాడి జేయ,తిరిగి దరికి జేరె తిరుగలికిన్ తీర్పు జెప్ప వలయు తిమ్మ రాయ।
శ్రీ శంకరయ్యగురువుగారికి,శ్రీ నేమాని గురువుగారికి,నమస్సులు...
నేమాని గురువుగారు నిన్న సవరించిన పద్యములో కాకరమై(మేకవన్నెపులులకాకరమైనట్టి)అను పదానికి అర్ధము నాకు తెలియలేదు,నఘము అన్న పదానికి కూడా సరిగా అర్ధము తెలియలేదు, తెలుగు నిఘంటువులో నఘముకి పాపము లేనిది అని వుంది,నాకు బోధపడలేదు..అర్ధము తెలియజేయ ప్రార్ధన..
శ్రీ సుబ్బా రావు గారు: తిరగలివలె మన బ్రతుకులు తిరుగుచు నుండున్ అని చక్కగా సెలవిచ్చేరు - మంచి భావముతో పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
శ్రీ రఘురాం గారు: మీరు మంచి ప్రయోగములు చేయుచున్నారు. 1. అచ్చ తెలుగు పదాలతో "ట్ట" ప్రాసతో శబ్దాలంకార శోభితమై యున్నది.- అభినందనలు.
2వ పద్యము సర్వలఘుమయమై యున్నది - 2వ పాదములో యతి మైత్రి లేదు మరియు మూడవ పాదములో 2 మాత్రలు తక్కువగా నున్నవి. చూడండి. - అభినందనలు. యతి మైత్రి చూచునపుడు హల్లునకే కాక సంబంధించిన అచ్చుతోకూడా సరిపోవలెను. స్వస్తి.
శ్రీ నేమాని గురువర్యులకు నమస్సులు. మీ సూచనలకు ధన్యవాదములు.
నాకు యతి-ప్రాస వాడుకలో కడుయిబ్బందులు యెదురగుచున్నవి.. మళ్ళీ మళ్ళీ చదివిననూ, ప్రయోగములో తప్పులుదొరిలిపోతున్నవి.. మీ సహాయముతో తప్పక సరిచేసుకొని, నేర్చుకోగలనని నా అభిలాష. ప్రస్తుతానికి యతి-ప్రాస తీసివేసి, మీరుచేసిన దోష వివరణననుసరించి రెండవపద్యము నిటులమార్చెదను:
పిండి విసరగ నత్తకు దండి గాను పాండు రంగని జేరెను పడతి యొకతి శుభము లందున పూజించ శోభ యనుచు మీదు గట్టగ గణపతి మోద మలర నేడు నాగరి కతయంచు వీడె నిన్న
శుభ కార్యములకు ఇప్పడికీ మన ఇళ్ళల్లో తిరగలికి పసుపు కుంఖాలు పెట్టి పసుపుతాడు పసుపు కొమ్ము గట్టి 5 గురు ముత్తైదువలు బియ్యం విసిరి గణపతికి మీదు కడతారు కదా
శ్రీ రాజేశ్వరి అక్కయ్య గారికి ధన్యవాదములు, నేను కంద పద్యములలో ప్రాస యతిని జూడ లేదు,కానీ శ్రీ రఘు రామ్ గారు వేసినారు. శ్రీ నేమాని గురువర్యులు తప్పు అనలేదు.అందుకనే నా సందేహము.
స్థిరముగ నొక్కటి యుండును
రిప్లయితొలగించండితిరుగాడుచు నుండు నొకటి తిరగలి లోనన్
బరగెడు రాళ్ళు జగమ్మిది
చరాచర మయమ్మనదగు సత్యము దెలుపున్
రిప్లయితొలగించండితిరగలి మ్యూజియం చేరె
తింగడికి తీరుబడి ఎక్కువాయె
తిండిపోతాయె తిన్నదరగదాయె
తిత్తర్ బిత్తర్ ఆతని జీవితమాయె !!
చీర్స్
జిలేబి
సరవిఁ దప్పక సంసార చక్రమందుఁ
రిప్లయితొలగించండిదిరుగలికి వలె దంపతుల్ దీక్షనుంద్రు!
తిరుగుచున్ భర్త జీవికఁ దెచ్చుచుండు;
తిరముగా భార్య యింటిని దీర్చి దిద్దు!!
తిరుగక మగవాడు ధీరుడు కాలేడు
రిప్లయితొలగించండితిరిగి ఆడవారి తీరు చెడును
తిరుగులేని తీర్పు తిరగలి ఇచ్చెను
తెలిసికొన్న చాలు తెలివికలిగి
మిత్రులు శైలజగారూ! మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. కాని, ఆడవారు, తిరగలి - యనునవి సాధువులు కావు. వ్యావహారికములు! ఆడువారు, తిరుగలి - యనినచో సరిపోవును.
రిప్లయితొలగించండిగుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండితిరగలి, తిరుగలి రెండూ రూపాంతరాలుగా నిఘంటువులలో కనిపిస్తున్నాయి.
తిరుగలి మూలము నీవే
రిప్లయితొలగించండితిరుగాడుచు పిండి, నూక జేయగ నాడున్
తిరుగలి మూలన నీవే
తిరిగిన కాలమ్మె యుసురు దీసెను నీకున్.
శ్రీ జిలేభి గారి భావము ఫొటోకి తగ్గట్లుగా బాగుంది,నచ్చి నా ఈ పద్యము...తప్పిదమైన మన్నించ మనవి...
రిప్లయితొలగించండితిప్పు వారు లేక తిరుగలిపుడు
మ్యూజియమ్ము చేరి మూల నక్కె
తీరు బడియె లేక తిన్నదరగక
చిత్రమాయె మనుజ జీవితమ్ము..
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిచరాచరమయమైన జగానికి సంకేతంగా తిరుగలిని వర్ణించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
*
జిలేబీ గారూ,
మిక్సీలు, గ్రైండర్లు వచ్చి తిరుగలి మూలకు చేరింది. మంచిభావాన్ని అందించారు. మీ భావానికి నా పద్యరూపం...
మ్యూజియమ్ము జేరిపోయెను తిరుగలి
తింగడికి పెరిగెను తీరుబడియు
తిన్నదరుగనట్టి తిండిపో తయ్యెను
తన బ్రతు కయె నిపుడు తారుమారు.
*
గుండు మధుసూదన్ గారూ,
దాంపత్యాన్ని తిరుగలితో పోల్చిన మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
శైలజ గారూ
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
మధుసూదన్ గారు చెప్పిన ‘ఆడువారి’ని గమనించారు కదా.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిజిలేబీ గారి భావానికి మీ పద్యం బాగుంది. నేను వ్యాఖ్య పెడుతున్న సమయంలో మీ పద్యం వచ్చింది. నేను చూడలేదు. చూస్తే నా పద్యాన్ని పెట్టేవాడను కాదు.
మీ పద్యంలో 1, 3వ పాదాల్లో గణదోషం. మొదటి పాదంలో ‘తిరుగలి యిప్పుడు’ అనీ, మూడవ పాదంలో ‘తిన్న దరుగదాయె’ అని సవరిస్తే సరి!
కరీంనగర్‌లో ఒక పెళ్ళి, సాయంత్రం బంధువుల ఇంట్లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నాను. కనుక పునర్దర్శనం రేపు ఉదయం.
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
రిప్లయితొలగించండిశ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
గురుదేవులు నా మనసులోని మాటను జెప్పితిరి.
రామ భక్తులు సుగ్రీవుని పై,తానీష పై వ్రాయాలి అనుకోంటిని.
old is gold అను సూక్తి ఆధారముగా
=======*=====
తిరిగె గాలి నేడు తిరుగలి పైనను
తడవ తడవ రోగ తతులు దాడి
జేయ,తిరిగి దరికి జేరె తిరుగలికిన్
తీర్పు జెప్ప వలయు తిమ్మ రాయ।
శ్రీ శంకరయ్యగురువుగారికి,శ్రీ నేమాని గురువుగారికి,నమస్సులు...
రిప్లయితొలగించండినేమాని గురువుగారు నిన్న సవరించిన పద్యములో కాకరమై(మేకవన్నెపులులకాకరమైనట్టి)అను పదానికి అర్ధము నాకు తెలియలేదు,నఘము అన్న పదానికి కూడా సరిగా అర్ధము తెలియలేదు, తెలుగు నిఘంటువులో నఘముకి పాపము లేనిది అని వుంది,నాకు బోధపడలేదు..అర్ధము తెలియజేయ ప్రార్ధన..
శ్రీ మధుసూదన్ గారికి,నమస్తే,.
రిప్లయితొలగించండిసరిదిద్దినందుకు చాలా కృతజ్ఞతలు,ఏవి సాధువులో,ఏవి కావో కన్ప్యూజింగ్ గా వుంది,....
శ్రీ శంకరయ్యగురువుగారికి,శ్రీ నేమాని గురువుగారికి,నమస్సులు
రిప్లయితొలగించండితిరుగలొకనాడు బియ్యమున్ మొరుము చేయ
వంట యింట నత్యవసర పరికరమ్ము
నేడు మిక్సీల రాకతో వీడికోలు
పొంది అద్దాల బీరువా నందు చేరె .
అమ్మా! శైలజ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండికొంచెము ఓపికతో చూడండి:
పులులకు + ఆకరము = పులులకాకరము = పులుల సమూహము అని అర్థము.
వర్ధిల్లును + అఘము = వర్ధిలునఘము = వర్ధిల్లును పాపము (దుఃఖము) అని అర్థము.
స్వస్తి.
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమరికొన్ని పద్యములను చూద్దాము. ముందుగా అందరికీ శుభాభినందనలు.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: మీ పద్యము బాగుగ నున్నది. 2వ పాదములో యతి మైత్రి లేదని మీరు గమనించ లేదు.
శ్రీ వర ప్రసాద్ గారు: మీ ఓల్డు ఈజ్ గోల్డు పద్యము చాల బాగుగ నున్నది.
శ్రీ తిమ్మాజీ రావు గారు: తిరుగలి అద్దాల బీరువా యందు జేరె అందాము (బీరువా నందు అని కాదు). మీ పద్యము చాల బాగుగ నున్నది.
తిరుగలిని జూడు డా ర్యులు
రిప్లయితొలగించండిఅరమరలో నుండె నచట యందము దోపన్
తిరుగలివలె యీ బ్రతుకులు
తిరుగుచునే నుండు భువిని దినముం దినమున్
పట్టముగట్టి బిసలకు ఘ
రిప్లయితొలగించండిరట్టమొదిలిబెట్టె యెట్టికట్టములేకన్
పొట్టపెరిగి గట్టితెగులు
పుట్టెనునుట్టిగనె మానుమిట్టి అలసముల్ ||
గిరగిరమని పరుగులిడుచు
రిప్లయితొలగించండిపరుషములగు శిలలనుడుమ విరువగ గురుముల్
తిరుగలి తిరిగె మనకు
కరకరమను వడలుకుడుములరిశెలనిడగన్ ||
శ్రీ సుబ్బా రావు గారు: తిరగలివలె మన బ్రతుకులు తిరుగుచు నుండున్ అని చక్కగా సెలవిచ్చేరు - మంచి భావముతో పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిశ్రీ రఘురాం గారు: మీరు మంచి ప్రయోగములు చేయుచున్నారు. 1. అచ్చ తెలుగు
పదాలతో "ట్ట" ప్రాసతో శబ్దాలంకార శోభితమై యున్నది.- అభినందనలు.
2వ పద్యము సర్వలఘుమయమై యున్నది - 2వ పాదములో యతి మైత్రి లేదు మరియు మూడవ పాదములో 2 మాత్రలు తక్కువగా నున్నవి. చూడండి. - అభినందనలు. యతి మైత్రి చూచునపుడు హల్లునకే కాక సంబంధించిన అచ్చుతోకూడా సరిపోవలెను. స్వస్తి.
శ్రీ నేమాని గురువర్యులకు నమస్సులు.
రిప్లయితొలగించండిమీ సూచనలకు ధన్యవాదములు.
నాకు యతి-ప్రాస వాడుకలో కడుయిబ్బందులు యెదురగుచున్నవి..
మళ్ళీ మళ్ళీ చదివిననూ, ప్రయోగములో తప్పులుదొరిలిపోతున్నవి.. మీ సహాయముతో తప్పక సరిచేసుకొని, నేర్చుకోగలనని నా అభిలాష.
ప్రస్తుతానికి యతి-ప్రాస తీసివేసి, మీరుచేసిన దోష వివరణననుసరించి రెండవపద్యము నిటులమార్చెదను:
గిరగిరమని పరుగులిడుచు
పరుషుములగు శిలలనడుమ పగలఁగ గురుముల్
తిరుగలి తిరిగెను మనకిక
కరకరమను వడలుకుడుములరిశెలనిడుచున్ ||
పిండి విసరగ నత్తకు దండి గాను
రిప్లయితొలగించండిపాండు రంగని జేరెను పడతి యొకతి
శుభము లందున పూజించ శోభ యనుచు
మీదు గట్టగ గణపతి మోద మలర
నేడు నాగరి కతయంచు వీడె నిన్న
శుభ కార్యములకు ఇప్పడికీ మన ఇళ్ళల్లో తిరగలికి పసుపు కుంఖాలు పెట్టి పసుపుతాడు పసుపు కొమ్ము గట్టి 5 గురు ముత్తైదువలు బియ్యం విసిరి గణపతికి మీదు కడతారు కదా
శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిసర్వ లఘువులతో కందము వ్రాసితిని,శ్రీ రఘు రామ్ గారు నాకన్నా ముందుగా మంచి పద్యమును బ్లాగున బెట్టినారు.శ్రీ రఘురామ్ గారికి ధన్యవాదములు.
=======*=======
తరముల తనయులకు నిడెను
వరము లనుదినమునను కడు పదిలముగను నా
తిరుగలి దిరిగి దిరిగి చనె
నరగి ముదుసలి వయసునను నరమర దరికిన్!
గురుదేవులకు విన్నపము
రిప్లయితొలగించండికంద పద్యములో ప్రాస యతి వేయ వచ్చా? తెలియజేయగలరు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ రఘు రామ్ గారి పద్యములో గురుముల్ పదము గురుగుల్ అని వాడాలి, టైపాటు అనుకొంటిని.
రిప్లయితొలగించండిమరియు 4వ పాదం యతి కొరకు చిన్న సవరణ
గిరగిరమని పరుగులిడుచు
పరుషుములగు శిలలనడుమ పగలఁగ గురుగుల్ (మినుముల్ )
తిరుగలి తిరిగగ మనకిక
కడు వడలుకుడుములరిశెలు కరకరమనియెన్||
సోదరులు ప్రసాద్ గారికి
రిప్లయితొలగించండినాకు తెలిసి కందమునకు ప్రాస యతి లేదు
శ్రీ రాజేశ్వరి అక్కయ్య గారికి ధన్యవాదములు, నేను కంద పద్యములలో ప్రాస యతిని జూడ లేదు,కానీ శ్రీ రఘు రామ్ గారు వేసినారు.
రిప్లయితొలగించండిశ్రీ నేమాని గురువర్యులు తప్పు అనలేదు.అందుకనే నా సందేహము.
బహుశ గురువులు నిశితంగా పరిశీ లించి ఉండరు
రిప్లయితొలగించండిమిత్రులందరికి శుభాశీస్సులు. మరికొన్ని పద్య రచనలను చూద్దాము. ముందుగా అందరికీ అభినందనలు.
రిప్లయితొలగించండిశ్రీమతి రాజేశ్వరి గారు: శుభ కార్యములలో తిరగలియొక్క ప్రాధాన్యమును వివరిస్తూ వ్రాసిన మీ పద్యము ముదావహము.
శ్రీ వరప్రసాద్ గారు: సర్వ లఘు కందము చాల బాగుగ నున్నది. అటులనే శ్రీ రఘురాం గారి పద్యమునకు మీరు చేసిన సవరణ చాల బాగుగ నున్నది.
ప్రాస యతి గురించి: సామాన్యమైన సూత్రము ప్రాస నియమము లేని పద్యములలో ప్రాసయతిని ఉపయోగింతురు. యతి స్థానములో ప్రాసనియమమును పాటించుటే ప్రాసయతి. ఇది సీసము, తేటగీతి, ఆటవెలది పద్యములలోనే తరచుగా వాడబడుచుండును.
ప్రాసయతులే వేయవలసిన కొన్ని ఛందస్సులు కలవు: ఉదా: లయగ్రాహి, లయవిభాతి, అశ్వధాటీ, మొ.వి.
శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు
రిప్లయితొలగించండిశ్రీ రఘు రామ్ గారి స్పూర్తితో, మరొక సర్వ లఘు కందము
=====*=======
గిర గిర దిరిగిన తిరుగలి
కరకర మను పరిపరి విధ కడెములు దొరకున్
గిర గిర దిరుగక తిరుగలి
యరితిని గని నరులు జనెను నరమర దరికిన్!
( కడెములు=భక్ష్య విశేషము, అరతి =సంతోషము లేమి)
అయ్యా వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు. మీ 2వ సర్వలఘు కందము బాగుగ నున్నది. కొన్ని సూచనలు:
రిప్లయితొలగించండిపరి పరివిధ కడెములు అనే సమాసము సాధువు కాదు.
అరతింగని నరులు జనెను - జనెను అనుట సరికాదు -- జనిరి అనవలెను.
స్వస్తి.
తిరిగి తిరిగి యలసి తిరుగలి నిదురోయె
రిప్లయితొలగించండిత్రిప్పు వారు లేక తీరుబడిగ
త్రిప్ప మరచి తనను తిరుగుచు నుండె తా-
నాసుపత్రులందు నబల నేడు.
మిత్రులు వరప్రసాద్ గారూ. మీరు రఘురాం గారి పద్యము 4వ పాదమును సవరింపఁబోయి, ప్రాసమైత్రి భంగమగుటను గమనించలేదు. పరిశీలించఁగలరు.
రిప్లయితొలగించండి