అయ్యా! హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. ఆఖరి పాదములో అరవిందాసన ధవుడగు అన్నారు కదా -- ఇంకా స్పష్టముగా అన్వయము కావాలంటే అరవిందాలయ ధవుడగు అంటే బాగుంటుంది. అరవిందాసనుడు అంటే ఎవరికైన బ్రహ్మ అనే అర్థమే స్ఫురించును కదా. స్వస్తి.
భుజంగప్రయాతము:
రిప్లయితొలగించండిప్రభూ నారసింహా! ప్రపన్నార్తిహారా!
విభూ! దైత్య సంహార! విశ్వైకరక్షా!
ప్రభాకీర్ణ దివ్యాంగ! ప్రహ్లాదవంద్యా!
శుభాకార లక్ష్మీశ! స్తోత్రంబొనర్తున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅరబిందెడు నువుద్రావుచు
రిప్లయితొలగించండినరబిందెడు పానకమ్ము నట తీర్థముగా
నరులకు విందును గూర్తువు
అరవిందాసన ధవుడగు హరిముఖ ! జే జే !
శ్రీలక్ష్మ్యాది సురేంద్రనాథ గణసంసేవ్యుండు, దుష్టక్రియా
రిప్లయితొలగించండిలీలాపార విరోధిరాక్షసుల నిర్జింపంగ నుద్యుక్తుడై
హేలారీతి పరాక్రమోన్నతముచే నిఛ్ఛాప్రవృత్తుండు, నే
కాలంబైనను భక్త రక్షణ కళా కాంతుండు శ్రీవత్సుడే.
బిందుల కొలది పానకం బ్రియము తోడ
రిప్లయితొలగించండిఇత్తు నెప్పుడు కాపాడు మిప్పుడీ శ !
దుష్ట సంహార !నరసింహ ! దురిత దూర !
నిన్ను నమ్మితి న నమ్ముము నిజము గాను
నముచి నణచగవచ్చెనృసింహస్వామియై
రిప్లయితొలగించండిమంగళ గిరినందు మేలుగ వెలసె
పానకాలస్వామి నామమంది
బిందెలతో నీరు బ్రియముగ త్రాగును.
అయ్యా! హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
ఆఖరి పాదములో అరవిందాసన ధవుడగు అన్నారు కదా -- ఇంకా స్పష్టముగా అన్వయము కావాలంటే అరవిందాలయ ధవుడగు అంటే బాగుంటుంది. అరవిందాసనుడు అంటే ఎవరికైన బ్రహ్మ అనే అర్థమే స్ఫురించును కదా. స్వస్తి.
శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు
=====*=======
మంగళ గిరిపై వెలసిన
మంగళ రూపుని మహిమలు మరులు గొలుపగన్
మంగళ కరమగు పానక
గంగను బోయుచు మనుజులు కదలిరి మహిలో ।
పానకము ద్రాగి జనులకు
కానుక లిచ్చెడి వరదుడు కలియుగ మందున్
దానవ జాతిని ద్రుంచగ
నీ నరసింహు డయి వెలసె నీ గిరుల పయిన్
స్వామీ! నరసింహా! విను
రిప్లయితొలగించండినీమంబున పానకంబు నీకర్పించన్
క్షేమంబు కలుగజేయుచు
నీమానవకోటి గాతు వెప్పుడు కరుణన్.
బిందెల కొలదిగ పానక
మందించెడి భక్తగణపుటఘములబాపన్
సుందరరూపం బందితి
వందును మము గావుమయ్య! యతివత్సలతన్.
మంగళగిరిపై చిత్రపు
భంగిమతో వెలసినావు పానకములు గొనన్
మంగళము లొసగు మింపల
రంగ న్నరసింహరూప! రయమున మాకున్.
పానకమెంత యొసంగిన
దానన్ సగభాగమీవు తాదాత్మ్యతతో
పానము చేయుచునుండెద
వానందము జగతివారి కందించుటకై.
నీవుండగ మాకండగ
భావనలోనైన రాదు భయమించుకయున్
దేవా! శ్రీనరసింహా!
మావందన మందుకొనుచు మము గావదగున్.
నర సిం హుని యవతారము
రిప్లయితొలగించండిపరిమార్చ గయసుర తతిని ప్రాణాంతకులన్ !
నరలోకము నందు వెలసి
పరి రక్షణ జేయ గోరి పరి పరి విధముల్ !
గిరినుండి ద్రొబ్బి ధరపై
రిప్లయితొలగించండికరి పదముల త్రొక్కజేసి కాకొలముచే
కఱపించి గదల మొత్తె న
సురుడు హిరణ్యకశిపుoడు సుతునిన్ జంపన్
వరదుడు విష్ణువు జ్వాలా
నరహరియై అసురసంధ్య నసురుని తొడపై
పఱచుచు ద్వారము నడిమిని
ఉరమును నఖములను జీల్చి ఉసురులు దీసెన్
శరణము వేడిన భక్తుని
సరగున కరుణిoచెను హరి శాంతుoడగుచున్
సురలెల్ల మెచ్చ మంగళ
గిరి పానక రాయుడగుచు కీర్తింప జనుల్
స్వామిని దర్శన భాగ్యం
రిప్లయితొలగించండిబీమనుచును వేడుకొనగ నెప్పటికైనన్
మోమునుఁ జూపగఁ బిలుచున్
నా మొఱ వినకుండ నిలువ న్యాయంబౌనే?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ నేమాని గారికి నమస్కారములు.
రిప్లయితొలగించండిమొదట అరవిందాసన జనకుడ అని వ్రాసి తరువాత మార్చాను.
మీరు చేసిన సవరణ కు ధన్యవాదములు.
అరబిందెడు సరి ద్రావుచు
నరబిందెడు పానకమ్ము నటు తీర్థముగా
నరులకు విందును గూర్తువు
అరవిందాలయ ధవుడగు హరిముఖ ! జే జే !