25, ఏప్రిల్ 2015, శనివారం

సమస్యా పూరణము - 1657 (మీసమ్ములు లేని వనిత మేదినిఁ గలదే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
మీసమ్ములు లేని వనిత మేదినిఁ గలదే.

24 కామెంట్‌లు:

  1. రోసమ్ముగ బుసలు గొడుచు
    మీసమ్ములు లేనివనిత మేధినిఁ గలదే
    బాసను నిలబెట్టు టకని
    మీసమ్ముల మెలివేయు చుండు మేధావు లిలన్

    రిప్లయితొలగించండి
  2. వేసెను ప్రశ్నను - మగనికి
    మీసమ్ములు లేనివనిత - మేదిని గలదే
    మీసములను మొలిపించగ
    పూసుకొనెడి తైల?మని విబుధులందరినిన్

    రిప్లయితొలగించండి
  3. రాసక్రీడా సమయము
    బాసయె నిశ్వాసమైన పట్టున కనులన్
    మూసిన, మెడపైన మగని
    మీసమ్ములు లేని వనిత మేదినిఁ గలదే!!

    రిప్లయితొలగించండి
  4. మీసమ్ములు మగవారికి
    మాసొమ్మే నున్నముదని మగువకు భావ
    మ్మేసుమ గలదుగ, వలదను
    మీసమ్ములు - లేని వనిత మేదినిఁ గలదే ?

    రిప్లయితొలగించండి
  5. ఇక్కడ చక్కని పద్యాలు అందచేస్తున్న పెద్దలందరికీ , బ్లాగుని నిరాటంకంగా నడుపుతున్న శంకరయ్యగారికి ధన్యవాదములు ... అభినందనలు

    రిప్లయితొలగించండి
  6. మా సాఫ్టువేరు వనితల
    వేసముఁ జూచిన తెలియును విషయము లౌరా!
    మోసపు మేకప్ చాటున
    మీసమ్ములు లేనివనిత మేధినిఁ గలదే!

    రిప్లయితొలగించండి
  7. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    రోసమె మీస సమానము
    రోసమునన్ ఝాన్సి లక్ష్మి రుసరుస లాడన్
    బాసిరి మ్లేచ్ఛులు ప్రాణము
    మీసమ్ములు లేనివనిత మేధినిఁ గలదే!

    రిప్లయితొలగించండి
  8. మా సము లెవరని బలికెను
    మీసమ్ములు లేని వనిత , మేదిని గలదే !
    మీసము బెంచిన తొయ్యలి
    భాసిలు వాల్జడ యె బెంచు భామకు చెలువున్!!!

    రిప్లయితొలగించండి
  9. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్కారములు.

    (తన మిత్రునితో నొక కవి సరస సంభాషణము)

    "వే’సమ్మ’ను, రో’సమ్మ’ను
    నీ ’సమ్ము’లె సొమ్ములుగను నెసఁగు ముదితలోఁ
    గాసంత ’సమ్ము’నుం గను
    మీ ’సమ్ము’లు లేని వనిత మేదినిఁ గలదే?"

    రిప్లయితొలగించండి
  10. దోషపు హార్మోల్నకతన
    ద్యాసంతా సతము సొంత వ్యాపారముపై
    రోషములు పెరిగి నూగుడు
    మీసమ్ములు లేని వనిత మేదినిఁగలదే?
    వ్యాపారముః ఉద్యోగము

    రిప్లయితొలగించండి
  11. రోసము నకు గుఱు తులు గద
    మీ సమ్ములు, లేని వనిత మేదిని గలదే
    మీసము లుండవు వనితకు
    మీ సములే యున్న యెడల మీరును హద్దుల్

    రిప్లయితొలగించండి
  12. భాసిలు పురుషులనుమిగిలి
    మీసములు లేని వనిత, మేదిని కలదే
    రోషమునరాణి రుద్రమ
    తో సరిజగడము సలిపిన తొయ్యలి, వెదుకన్

    రిప్లయితొలగించండి
  13. వేసము మగనిది దాల్చుచు
    రోసము జూపుచు నటునిటు రొప్పుచుఁదిరుగన్
    వేసమున కతుకు' పెట్టుడు '
    మీసములు లేని వనిత మేదిని గలదే.

    రిప్లయితొలగించండి
  14. వేసము మగనిది దాల్చుచు
    రోసము జూపుచు నటునిటు రొప్పుచుఁదిరుగన్
    వేసమున కతుకు' పెట్టుడు '
    మీసములు లేని వనిత మేదిని గలదే.

    రిప్లయితొలగించండి
  15. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కాకుంటే కొద్దిగా అన్వయక్లేశం ఉంది. ‘బుసకొట్టుచు’ అనండి. నాల్గవపాదంలో గణదోషం. ‘మీసము మెలివేయుచుండు...’ అనండి.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    పాపం! ఆవిడకు భర్తను మీసాలతో చూడాలని ఎంత కోరికో? చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *****
    జిగురు సత్యనారాయణ గారూ,
    ఇంతకీ మగడు ఆమె మెడమీద ముద్దు పెట్టుకుంటున్నాడన్న మాట! బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీసాలు వద్దని అనలేని మగువ ఉండదంటారు. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    అన్వయం కొంత గందరగోళంగా ఉన్నట్టు అనుమానం!
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    విరుపుతో మీ పూరణ చాలా బాగున్నది అభినందనలు.
    *****
    చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ఉత్తరార్ధం కొంత అయోమయంలో పడవేస్తున్నది.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ, (మీ శ్రీ మీ ఇంటిపేరులో భాగమా? లేక సత్యనారాయణ మూర్తి గారు గౌరవసూచకంగా శ్రీ అన్నారా?)
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మీససమానము’ అన్న సమాసం సందేహాస్పదం. ‘రోసము మీసమునకు సరి’ అంటే?
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    సమ్ము(Some)లతో చమత్కరిస్తూ ‘కనుము + ఈ ‘సమ్ము’లు అంటూ మీరు చెప్పిన పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    హార్మోన్ల లోపంతో మీసాలు పెరిగే ఆడవాళ్లను కొందరిని నేను చూశాను. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీ రెండవ పూరణ కూడ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి రమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. కం. చేసిన బాసలు మరవకు
    మోసము చేయకు వనితను మోజులు తీరన్
    భాసిం చదుజీవితముసు
    మీ'సమ్ము' లు లేని వనిత మేదినిఁ గలదే.
    *************************************
    గమనిక : ఇది సంస్కృతమునందలి స అను నుపసర్గమునకు హల్లు పరమగుచో మకారమునకు అనుస్వారము వచ్చిన రూపము. ఇది సంస్కృత విశేష్య విశేషణములకు ముందున్నప్పుడు చక్కని, మిక్కిలి అనియు, క్రియలకు ముందున్నప్పుడు చక్కగా ననియు అర్థముగలది యగుచున్నది. కాబట్టి నేను ఇక్కడ చక్కదనాలు లేని స్త్రీ ఉంటుందా అన్న అర్ధం తొ వ్రాసాను. సం అనుదానికి విశేషమైన అర్ధాలు వున్నాయి.

    రిప్లయితొలగించండి
  17. భాసించగ కేశములతొ
    శాసించగ దివ్య గురువు సారథి నానక్
    యాసిక్కు మతమున పతికి
    మీసమ్ములు లేని వనిత మేదినిఁ గలదే

    రిప్లయితొలగించండి
  18. పైసా చేయడు పతియన
    కూసిన వానెవ్వనైన గూల్చగ కసితో
    రోసమ్మను కనిపించని
    మీసమ్ములు లేని వనిత మేధిని గలదే!

    రిప్లయితొలగించండి
  19. ఓసతిగా మెదలుచు
    ఆసరగా నాదుకొనుచు నన్యోన్యత చే
    వాసముజేసెడి దై|యే
    మీసమ్ములు లేని వనిత మేదిని గలదే?

    రిప్లయితొలగించండి


  20. మీసమ్ములు మగవారికె
    మాసొమ్ము నునుపుదనమని మగువకు భావ
    మ్మేసుమ ! గలదుగ - వలదను
    మీసమ్ములు - లేని వనిత మేదినిఁ గలదే ?

    మగువకు భావ
    మ్మేసుమ గలదుగ, --- లేని వనిత మేదినిఁ గలదే ?

    మాస్టరు గారూ ధన్యవాదములు.....మీసాలు వద్దను ఆ భావమ్మే లేని ..వనిత..అని నాభావం...ఇప్పుడు సరిపోతుందా....


    రిప్లయితొలగించండి
  21. గుండా వెంకటసుబ్బా గారు "పైసా చేయడు పతియను ఉండాలేమో నేవ్వనైనను "రోషమ్మును " బహుశా కర్రెక్టేమో. గురువుగారి అభిప్రాయం మంచిది.

    రిప్లయితొలగించండి
  22. రోసముగా ప్రశ్నించిన:
    "మీసమ్ములు లేని వనిత మేదినిఁ గలదే?"...
    బాసను జేయుచు చెప్పెద:
    "మీసమ్ములు లేని వనిత మిలియను నొకటోయ్!"

    రిప్లయితొలగించండి
  23. వాసిగ నమ్మను పొగడుచు
    దోసమ్మును తెలిపినంత దొండల వేపున్
    రోసమున పతిని మించెడి
    మీసమ్ములు లేని వనిత మేదినిఁ గలదే

    రిప్లయితొలగించండి