1, ఏప్రిల్ 2015, బుధవారం

పద్య రచన - 866

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

 1. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నాము. సమయం ఉంటే పానకాల నరసింహస్వామి దర్శనం కూడా చేసికొని ఏ రాత్రికో ఇల్లు చేరతాము. రోజంతా బ్లాగుకు అందుబాటులో ఉండను. దయచేసి ఈరోజు పూరణల, పద్యాల పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
  అన్నట్టు... విజయవాడ మిత్రు లెవరైనా ఉన్నారా మన బ్లాగులో?

  రిప్లయితొలగించండి
 2. ఎక్కడ జూచిన లెక్కకు
  మిక్కిలిగా మూగి భిక్షమెత్తుచు జనులన్
  కిక్కుర వెట్టుచు యాచకు
  లుక్కిరిబిక్కిరిగజేసి యూదరగొట్టున్

  రిప్లయితొలగించండి
 3. గుడి ముంగిట బడి ముంగిట
  పడిగాపులు బడుచు నుండు పైక మటంచున్
  పిడికెడు పొట్టను నింపగ
  నిడుముల పాలౌట యేల నిధులను నింపన్

  రిప్లయితొలగించండి
 4. యాచకవృత్తి నెందులకు?నందునకష్టములేదుగాన|మీ
  తోచినడబ్బునిచ్చిన?హితోదికమైన పురోభివృద్ధి|సం
  కోచములేనిపుణ్యము|నకుంటితభక్తికిమూలమార్గమౌ|
  నీచపుబుద్దిమానుటకు,నిత్యదరిద్రుల నూరటివ్వగా|
  తడబడకడుగక?నిడుములె
  వడివడిగానడిగినపుడె?వంతులునడచున్
  కడవరకుబ్రతుకుగడుపగ
  అడుగడుగున నడిగినపుడె యాచక మనుటౌ|  రిప్లయితొలగించండి
 5. పుట్టు బిడ్డలకయ్యుపూర్వమే తలిదండ్రి
  బడినజేర్చునపుడు బ్రతిమలాట
  బడులకంపునపుడు తడబడకడిగేటి
  సంతుయాచక వృత్తి కంతుగాద?
  యవ్వనమడుగిడ?నవ్వులునడయాడ
  కట్నమడుగుటన్న?కాదవృత్తి
  వోట్లకే నోట్లను నొకరికొక్కరు జేయు
  పనులన్నివృత్తిలో భాగమేగ?
  లంచమడిగేటివారిది లక్షణంబ?
  గుడుల,బడు లందనాధలు కూడినడుగ?
  వృత్తియాచక మనుట నీవ్రుత్తియేది?
  పుణ్యమడుగగ దైవాన్ని గణ్యుడనియ?

  రిప్లయితొలగించండి
 6. భిక్ష గాం డ్రను జూడుము , భీకరముగ
  నెంత మందియుండి రియట !యంత మంది
  లోన నిజముగ వారలు మాన నీయ !
  భిక్ష గాం డ్రయి యుందురె ?లక్ష ణ ముగ

  రిప్లయితొలగించండి
 7. సాక్షాత్తు పరమశివుడే
  బిక్షాట జేసె నంట బిడియంబేలా?
  లక్షలలో గుడిఁ జేరుచు
  దక్షిణలిడు భక్తులుండ తనకలు లేలా?

  రిప్లయితొలగించండి
 8. పనులుచేయనట్టి బద్ధకస్తులు సదా
  ముష్టికి గుడివద్ద మూగుచుండ్రు
  సొమ్ములిచ్చిజనుల సోమరిపోతులన్
  చేయవలదు బడుగు సేవయనుచు

  రిప్లయితొలగించండి
 9. చంద్రమౌళి గారు మీ పద్యం బాగుంది
  *********************
  రాజేశ్వరీ గారు మీ పూరణ బాగున్నది
  ************************
  సుబ్బారావు గారు మంచి పూరణ అందించారు
  ***********************
  గుండా వెంకట సుబ్బసహదేవుడు గారు
  మీ పూరణలో రెండవపాదం గణభంగం అయినది ముఖ్యముగా రెండవ పాదం లో రెండవ గణం జగణం వచ్చింది మరియు నాలుగు ఇదు గణాలు కుడా దెబ్బతిన్నాయి చూసి సరిచేయగలరు.

  రిప్లయితొలగించండి
 10. ప్రసాద్ గారికి ధన్యవాదాలు.టైపాటు సవరణానంతర పద్యం :
  సాక్షాత్తు పరమశివుడే
  బిక్షాటన జేసె నంట బిడియంబేలా?
  లక్షలలో గుడిఁ జేరుచు
  దక్షిణలిడు భక్తులుండ తనకలు లేలా?

  రిప్లయితొలగించండి
 11. సహదేవుడు గారు పద్యం బాగున్నది చిన్న సవరణ చివరి పాదం లో "తనకలు లేలా " రాదు తనకలు యేలా యదాగమం వస్తుంది .
  ధన్యవాదాలు

  రిప్లయితొలగించండి
 12. యాచన జేయని దెవ్వరు?
  యోచించగ జగతిలోన యోగం బిదియే!
  యాచనతో నడచు జగతి
  యాచకులే లేని తావు లవనిన్ గలవే!!! ?

  రిప్లయితొలగించండి
 13. ఇలా సవరిస్తే ఎలా వుంటుంది?

  సాక్షాత్తు పరమశివుడే
  బిక్షాటన జేసె నంట బిడియంబేలా?
  లక్షలలో గుడిఁ జేరుచు
  దక్షిణలిడు భక్తులుండ తట్టము లేలా?

  రిప్లయితొలగించండి
 14. కవిమిత్రులకు నమస్కృతులు.
  విజయవాడలో అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి సౌహార్దంతో, వారి బంధువు సహకారంతో అమ్మవారి దర్శనం దివ్యంగా జరిగింది. వారిద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా కార్యక్రమం ప్రకారం అక్కడినుండి మంగళగిరి వెళ్ళాల్సింది. కాని అక్కడినుండి అమరావతికి వచ్చి అమరేశ్వరుని దర్శనం చేసుకున్నాము. ఈ రాత్రికి ఇక్కడే. రేపు ఉదయం మంగళగిరి వెళ్ళి అక్కడినుండి తిరిగి ఇంటికి ప్రయాణం.
  ఈ నాటి సమస్యకు చక్కని పూరణల నందించిన మిత్రులకు అభినందనలు, ధన్యవాదాలు.
  ముఖ్యంగా మిత్రుల పద్యాల గుణదోషాలను ప్రస్తావించిన పిరాట్ల ప్రసాద్ గారికి ధన్యవాదాలు.
  నా సమీక్షలు వీలైతే రేపు.

  రిప్లయితొలగించండి