9, ఏప్రిల్ 2015, గురువారం

సమస్యా పూరణము - 1643 (తరువున వెలుగొందెఁ దార లెల్ల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
తరువున వెలుగొందెఁ దార లెల్ల.

15 కామెంట్‌లు:

 1. చెట్టు కొమ్మలందు జీకటి రాత్రినన్
  గిఱికొనె నవె చాల కీటమణులు
  దృశ్యము నదె జూడ స్థిరముగ నిలబడి
  తరువున వెలుగొందెఁ దార లెల్ల.

  రిప్లయితొలగించు
 2. మినుకు మినుకు మంచు మిలమిల మెరయుచు
  చుక్క రేని గరము జుట్టి యుండి
  నీలి గగన మందు నిలచిన రీతి జి-
  తరువున వెలుగొందె దారలెల్ల.

  రిప్లయితొలగించు
 3. గగన మందు మ్రోగె గంభీర నాదమ్ము
  మేరిమాత కనులు మెరిసి మురిసె
  క్రీస్తు జనన మొందె క్రిస్టమస్పర్వాన
  తరువున వెలుగొందెఁ దార లెల్ల.

  రిప్లయితొలగించు
 4. మినుకు మినుకు మంచు మిలమిల మెరయుచు
  చుక్క రేని గరము జుట్టి యుండి
  నీలి గగన మందు నిలచిన రీతి జి-
  త్తరువున వెలుగొందె దారలెల్ల.

  రిప్లయితొలగించు
 5. పరవశమ్ము గొలుపు పచ్చని శోభతో
  మరల వచ్చెనిపుడు మండునెలయె
  విరులు భముల వోలె వికసించి మెరియంగ
  తరువున వెలుగొందె తార లెల్ల !!!

  రిప్లయితొలగించు
 6. మేఘ మాల లందు దోగాడు మామతో
  రాస లీల లాడు రాత్రిజములు
  చిత్రముగను వేసె చిత్రకారుండు జి
  త్తరువున వెలుగొందె తారలెల్ల!!!

  రిప్లయితొలగించు
 7. చూడ ముచ్చ టయ్యె చూ త ఫ లమ్ములు
  తరువున, వెలుగొందె దార లెల్ల ,
  నాక సంబు మీద యంతట మిలమిల
  లాడు చుమఱి కాంతి తోడ నార్య !

  రిప్లయితొలగించు
 8. శిశిరమందు యున్న సిగ్గునువిడనాడి
  ఈవసంత సంత నిష్టపడగ|
  పూల పరిమళములు పుట్టినకాయలు
  తరువున వెలుగొందె|దారలెల్ల|
  నవ్వుపువ్వులన్ని-నవ్యమన్మథునండ
  జయము దెచ్చు ననుచు భయములేక
  చైత్రమాసమందు జైత్రయాత్రకు రాగ
  తరువున వెలుగొందె దారలెల్ల

  రిప్లయితొలగించు
 9. పెద్ద రైతు నింట పెండిలి జరుగగ
  వివిధ దీపములట వెలుగులీనె
  పాదపమును చూసి పలికిరి జనులంత
  తరువున వెలుగొందె తారలెన్నొ

  రిప్లయితొలగించు
 10. మిత్రులు శ్రీకంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమస్సుమాంజలులతో...

  జయము హనుమ! నీవు సంజీవనౌషధుల్
  దెచ్చునపుడు నవియు దివ్యముగను
  మెఱసిపోఁతఁ జూడ, మెండైన తచ్ఛైల
  తరువున వెలుఁగొందెఁ దార లెల్ల!!

  రిప్లయితొలగించు
 11. నేత్ర పర్వమాయె నింబ వృక్షము క్రింద
  సాయి విగ్రహమ్ము రేయి నిల్ప
  పేర్చ మినుకు మనెడు విద్యుత్తు దీపాలు
  తరువున వెలుగొందెఁ దార లెల్ల!

  రిప్లయితొలగించు
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 13. వెండి తెరను నిలచి నిండైన కీర్తితో
  మిల మిలలను వెలుగు మెరుపుతోడ
  పత్రపుష్ప రహిత చిత్రసీమ యనెడు
  తరువున వెలుగొందె తారలెల్ల

  రిప్లయితొలగించు
 14. కవిమిత్రులకు నమస్కృతులు.
  మా అబ్బాయికి శస్త్రచికిత్స నిన్న మిర్యాలగూడలో జరిగింది. ఇంతకుముందే ఇల్లు చేరాను. రెండురోజులు బ్లాగుకు అందుబాటులో లేను.
  ఈ రెండు రోజుల సమస్యలకు చక్కని పూరణలను పంపిన కవిమిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
  వీలైతే రేపు సమీక్షిస్తాను.

  రిప్లయితొలగించు