రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యమ్ బాగున్నది. అభినందనలు. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** డా. బల్లూరి రమాదేవి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మన్ను తినవలదని పలికి
రిప్లయితొలగించండివెన్నుని ముఖమందు గాంచె వేల జగంబుల్
కన్నులు మిఱుమిట్లు గొలుప
చెన్నుడు భగవంతు డనుచు సేవింప దగున్
మన్నును తిన్నావా ! మరి
రిప్లయితొలగించండివెన్నలు చాలంగ లేద వెన్నల దొంగా !
అన్నయ్య జెప్పె నిటురా
కన్నయ్యా ! యనుచు బిలిచి కరమున బట్టెన్.
నారాయణు డని తెలియక
నోరును తెరవంగ జేయు నువిద యశోడన్
తీరుగ జూపుచు విశ్వము
నోరును తెరవంగ జేసె నుగదహరి, భళా !
కం:అన్నా!యిదినిజమేనా!
రిప్లయితొలగించండివెన్నయు మీగడలకు కొదవేమిటి యింటన్/నాన్నా
మన్నెందుకు దిన్నావని
వెన్నుని యడుగన్ యశోద వింతగ నవ్వెన్.
2.కం :అన్న బలరాముఁ జెప్పగ
విన్న యశోద యు కరమును విసురగ నెత్తన్
మన్నున్ దినలేదంచా
యన్నులమిన్నకు సుపుత్రుడాస్యము జూపెన్./యన్నులమిన్నకు తనయుడు యాస్యము జూపెన్.
3.:కం :పదునాలుగు భువనములను
వదనముననె జూపినట్టి వంశీ కృష్ణా
మధురంబగు నీ సుందర
వదనమ్ము గనెడి యదృష్ట భాగ్యము నిమ్మా!
తిన్నావా మన్ననుచును
రిప్లయితొలగించండికన్నయ్యనడుగ యశోద కరమగు కినుకన్
వెన్నుడు తన వక్త్రమునం
దన్నిజగమ్ములను చూపె నాశ్చర్యముగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమన్ను తింటివా ?చూపుమో కన్న ! నోరు
రిప్లయితొలగించండినీది యనగను మఱి యా య శోద ,చూప
తనదు నోటిని కృష్ణుడు తల్లి కపుడు
చూచె లోకాలు పదునాల్గు చూడ్కు లలర
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమన్నును తిన లేదమ్మా
రిప్లయితొలగించండియన్నయె కల్లలను జెప్పె యనుచున్ నోటన్
నన్నియు జూపించిన యా
వెన్నుని గని తల్లి మనసు విస్మయ మందెన్!!!
పదునాలుగు లోకమ్ములు
విదితంబుగ నోట జూపు వెన్నుని గనుచున్
ముదముగ యశోద మ్రొక్కుచు
కదలిక గోల్పోయి దలచె కలయా! నిజమా !!!
వెన్నలు దొంగలకు మనన్
రిప్లయితొలగించండిమన్నెందుకుతింటివో సమాధానమిదా?
యన్నము గూర్చగ లోకా
లన్నింటికటంచు దెలిసె హరి బంగారూ!
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యమ్ బాగున్నది. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
డా. బల్లూరి రమాదేవి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
లోకమ్ముల పదునాలుగు
రిప్లయితొలగించండియేకమ్ముగ తనదు నోట యేపున చూపన్
తాకన్నుల తన్మయత న
నేకమ్ముల జననిక హరినే మరి కొలచెన్
పల్లా నరేంద్ర గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.