కవిమిత్రులకు నమస్కృతులు. మా అబ్బాయికి శస్త్రచికిత్స నిన్న మిర్యాలగూడలో జరిగింది. ఇంతకుముందే ఇల్లు చేరాను. రెండురోజులు బ్లాగుకు అందుబాటులో లేను. ఈ రెండు రోజుల పద్యరచన శీర్షికకు చక్కని పద్యాలు రచించిన కవిమిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు. వీలైతే రేపు సమీక్షిస్తాను.
కట్లను ద్రెంచి గాత్రమును గబ్బున పెద్దది జేసి యుగ్రుడై
రిప్లయితొలగించండిపట్లను బట్టి రాక్షసుల ప్రాణములన్ హరియించి గెంతుచున్
గట్లను ద్రెంచు క్రోధమున గమ్మున మేడల నిండ్ల గాల్చి యి-
క్కట్లను జేసె దైత్యులకు నీశ్వర సూతి సువర్ణ లంకలో.
ఫలమ యనుకొని సూర్యుని బట్ట బోవ
రిప్లయితొలగించండికాలి నీ మూతి యెఱ్ఱ గ గంది పోయె
నంత సాహసం బది యే ల హనుమ ! నీకు ?
వంద నంబులు సేతును వనచ రాగ్ర !
చిట్టి వానరమని యెంచి చెలగి పోయి
రిప్లయితొలగించండిహనుమ తోకకు నసురులు నగ్గి నిడిరి
లంక దహన మవగ మిగుల విలపించి
వారు తీసిన గోతిలో వారు పడిరి.
దుష్ట చింతన యున్నచో దురిత మగును
పరుల భాధింప నొకనాడు ఫలిత మొందు
పరుల పడతిని మోహింప పతితు డగును
రామ చరిత బోధించు సారంబు నిదియె.
ఆంజనేయుని జూడగ నార్య ! తోచె
రిప్లయితొలగించండిలంక దహియించి రావణు బింక మణ చ
నుగ్ర రూపాన లంకకు నేగు నటుల
నెటుల దోచెను మఱి మీకు నిటుల యేన ?
కొలువునన్ దశకంఠుడు కోరగానె
రిప్లయితొలగించండిఆగ్రహముతోడ తోకకు నగ్గి పెట్టి
వదలి పెట్టరి రక్కసుల్ పవన తనయు
లంక నంతయు కాల్చె నా రామ భంటు
చిన్ని కోతి వనుచు చెన్నుగా నసురులు
రిప్లయితొలగించండినీదు వాలమునకు నిప్పు బెట్ట
వావిరిగను బెంచి వాలమ్ము నంతలో
గాల్చి నావె లంక గాలిచూలి !!!
వానరోత్తమ !శ్రీరామ! భక్త హనుమ!
వజ్రకంఠ !లంకాదహి! వాయుజాత!
జానకీ శోకనాశక! జయము లిడుచు
కరుణతో మమ్ము గావుమ శరణు శరణు!!!
తోకకునిప్పుబెట్టగనె?తొందరయందున-వాయుపుత్రుడే
రిప్లయితొలగించండిమూకలు మట్టుబెట్టుచును,మూర్ఖులగొట్టుచు,మిద్దె,మేడలన్
షోకునుగాల్చివేయుచును,సుందర-హర్మ్యములన్నిగూల్చుచున్
భీకరమైన రూపమునభీతినిబంచెను లంకనంతటన్|.
శ్రీ మిస్సన్న గారికి వందనములు.
రిప్లయితొలగించండినాలుగవ పాదములో గల యతి దోషాన్ని ఈ క్రిందివిధంగ సవరిస్తే బాగుంతుదనుకుంటాను.
క్కట్లను జేసె దైత్యులకు గర్వము భంగమొనర్చె లంకలోఁ.
అయ్యశోకవనిన నవనిజన్ గాంచగన్
రిప్లయితొలగించండిపవన సుతు మనమ్ము భగ్గు మనియె!
భగ్గు మన్న హనుమ వాలమ్ముఁ గాల్చగన్
లంక మొత్త మంత రాజుకొనియె!
సంపత్కుమార్ శాస్త్రిగారూ! ధన్యవాదములు. నేను గమనించలేదు. మీ సవరణ చాలా బాగుంది.
రిప్లయితొలగించండికవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిమా అబ్బాయికి శస్త్రచికిత్స నిన్న మిర్యాలగూడలో జరిగింది. ఇంతకుముందే ఇల్లు చేరాను. రెండురోజులు బ్లాగుకు అందుబాటులో లేను.
ఈ రెండు రోజుల పద్యరచన శీర్షికకు చక్కని పద్యాలు రచించిన కవిమిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
వీలైతే రేపు సమీక్షిస్తాను.