19, ఏప్రిల్ 2015, ఆదివారం

పద్య రచన - 884

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25 కామెంట్‌లు:

 1. పెంట కుప్పల మీదను పిచ్చి మొక్క
  పచ్చ దనమందు విరిసిన మెచ్చ రెవరు
  నీదు దరిజేర రెవ్వరు నిన్ను కోరి
  చావు పుట్టుక నీకేల సంత సమ్ము

  రిప్లయితొలగించండి
 2. పుడమి గర్భము జీల్చుకు
  వడివడినరుదెంచె మొలక వసుధాస్థలిలో
  నడవుల కొరతను తీర్చచు
  నెడబాపగ మానవాళి యిడుముల నింపున్

  రిప్లయితొలగించండి
 3. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. ‘పుడమి కడుపునే చీల్చుకు’ అందామా?

  రిప్లయితొలగించండి
 4. ఎంత యేపుగ బెరిగెనో నింతి ! జూడు
  పెంట కుప్పమ ధ్యన నట పిచ్చి మొక్క
  సార వంతము గలయట్టి నేల కనుక
  మొక్క బెరిగెను నేపుగ ముద్దు గాను

  రిప్లయితొలగించండి
 5. మట్టి లోన వొదిగి మట్టసముగ లేచి
  విత్తు రూపు దొడిగె విశ్వ మంత
  తరువు తెరువు చూపి తరియింప చేయగా
  మనిషి నేర్వ తలువ మంచి పథము

  రిప్లయితొలగించండి
 6. పుడమి కడుపు నుండి పుట్టె నొకమొలక
  పరవశించి జూచె పాప దాని
  ప్రేమతోడ తాకి ప్రియమార ముద్దిడు
  తనయ జూచి తల్లి తాను మురిసె.
  బల్లూరి.ఉమాదేవి.
  19/4/15

  రిప్లయితొలగించండి
 7. సుకరమ్ముగవిత్తు మొలచి
  సకలాత్ముని, శిరసు వంచి సన్నుతి జేయన్
  ముకుళిత హస్తము లుంచగ
  నకుంఠితఁపు నంకురంపు నార్తిని గనరే!

  రిప్లయితొలగించండి
 8. పుడమి కడుపు నుండి పుట్టె నొకమొలక
  పరవశించి జూచె పాప దాని
  ప్రేమతోడ తాకి ప్రియమార ముద్దిడు
  తనయ జూచి తల్లి తాను మురిసె.
  బల్లూరి.ఉమాదేవి.
  19/4/15

  రిప్లయితొలగించండి
 9. పుడమి కడుపు నుండి పుట్టె నొకమొలక
  పరవశించి జూచె పాప దాని
  ప్రేమతోడ తాకి ప్రియమార ముద్దిడు
  తనయ జూచి తల్లి తాను మురిసె.
  బల్లూరి.ఉమాదేవి.
  19/4/15

  రిప్లయితొలగించండి
 10. పదునునవిత్తు సత్తువకు?ఫైకెగ బ్రాకుచు నూత్నతేజమున్
  వదలక కాండ మెత్తుకొన?వాంచితపుత్ర దళంబులిద్దరిన్
  కదిలెడి గాలి నూపులకు గర్వమునందున సాకు పంతమున్
  బెదరని సూర్య రశ్మి వలె-పెద్దగ మారును ఆకు షోకునన్|

  రిప్లయితొలగించండి
 11. అవని జీల్చుకొచ్చు అంకురంబొక నాడు
  అవధి లేని యెత్తు కరుగు చూడు
  పవన వీచికలను పట్టి నిలిపి యుంచి
  అవని కెంతొ వర్ష హర్ష మచ్చు
  .......అశ్వత్థనారాయణ మూర్తి

  రిప్లయితొలగించండి
 12. మట్టిపానియమే త్రాగి మత్తుగాను
  విత్తుసత్తువచే లేచి కొత్తగాను
  పుడమిఫై బుట్టి సంతోష గడపదాటు
  పచ్చి బాలింత రాలుగా ఫైకిమొలచె.

  రిప్లయితొలగించండి
 13. అవని జీల్చుకొచ్చు అంకురంబొకనాడు
  అవధి లేని యెత్తు కరుగు చూడు
  పవన వీచికలను పట్టి నిలిపి యుంచి
  అవని కెంతొ వర్ష హర్ష మిచ్చు

  రిప్లయితొలగించండి
 14. పుడమి పులకరించి పొటమరించిన యంత
  తలను పైకిలేపె తరువు శిశువు
  దాని పసిమి దనపు ధగధగల గనుచు
  ప్రకృతి కాంత పార వశ్య మొందె

  రిప్లయితొలగించండి
 15. మన్నులోన దాగి మరిమరి తపియించి
  జలకణమ్ము కొరకు మొలకనెత్తు
  విత్తు గనిన కఠిన చిత్తసాధనమున
  నాత్మ బొల్చెడి పరమాత్మ దోచు.

  రిప్లయితొలగించండి
 16. సేంద్రియపు టెరువునఁబుట్టి చిన్ని మొక్క
  యెదుగుచున్నది కాంచుడు యేపుగాను
  చీడపీడ లేవియుదరి చేరకుండ
  పెరుగునదికడు దృఢముగా ప్రీతినివ్వ

  రిప్లయితొలగించండి
 17. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  పల్లా నరేంద్ర గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘వొదిగి’ అనడం గ్రామ్యం. ‘మట్టిలోన నొదిగి’ అనండి.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘కాంచుడు+ఏపుగాను’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కనుగొను డేపుగాను’ అనండి.
  *****
  బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. గురువు గారూ, 1.1.2012 న వార గణనం గురించి శ్రీమాన్ శ్యామల రావు గారు ఏ శతాబ్దానికైనా ఉపయోగపడేలా చాలా నిర్దుష్టమైన గణితాన్ని తెలియజేశారు. అందుకు సంబంధించిన శాస్త్రీయ వివరణ కూడా క్లుప్తంగా విశదీకరించారు. అయితే ఆసక్తి గల వారి కోసం పూర్తి వివరణతో నేనో వ్యాసాన్ని వ్రాసాను. వ్యాసం కొంచెం పెద్దది కాబట్టి దాన్ని ఈ బ్లాగ్ లో ఎలా ప్రచురింప వచ్చో తెలియ జేయ గలరు.

  రిప్లయితొలగించండి
 19. శ్వాస నీయంగ రేపటి యాశలకును
  భూమి చీల్చుకు వచ్చెను బుజ్జి మొలక!
  రక్కసుల నోట చిక్కక రమ్యముగను
  జీవ మందిచుమా నీవు చిట్టి తల్లి!!!

  రిప్లయితొలగించండి
 20. కుమార్ గారూ,
  వారగణనాన్ని గురించిన సమగ్ర చర్చ మన బ్లాగులోనే 1-1-2012 నాడు జరిగింది. ఆ చర్చలో తాడిగడప శ్యామలరావు (శ్యామలీయం) గారే ఎక్కువ పాల్గొన్నారు. మీరు ఆ విషయాన్నే ప్రస్తావిస్తున్నారా? ఈ లింకును క్లిక్ చేయండి.
  వారగణనం

  రిప్లయితొలగించండి
 21. కుమార్ గారూ,
  మీరు తయారుచేసిన ఆ వ్యాసాన్ని నాకు మెయిల్ చేయండి. పరిశీలించి ప్రకటిస్తాను. మీరు బ్లాగులో వ్యాఖ్యలు మాత్రమే ప్రకటించగలరు. పోస్టును ప్రకటించలేరు.
  shankarkandi@gmail.com

  రిప్లయితొలగించండి
 22. శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. గురువు గారూ, వార గణనం అని మీరు చూపించిన చర్చలో వార గణనం గురించిన వివరణ సమగ్రం గా లేదు. అందుకని ఈ ఉదయం నేనో వ్యాసం వ్రాసాను. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లో దాదాపు 7 పేజీలు వచ్చింది. ఇందులో వార గణితం నోటితో శాస్త్రీయంగా స్టెప్స్ ప్రకారం ఎలా చెప్పవచ్చో చూపించాను. మీరు ముందు చెక్ చేస్తామంటే ఆ ఫైల్ ని మీకు ఈ మైల్ చేస్తాను. (మీరు మైల్ ఐ.డి. ఇవ్వ గలిగితే). లేదా నేరుగా ఇక్కడే ప్రచురింపమంటే ఇక్కడే పోస్ట్ చేస్తాను. ఇదంతా మీ అనుమతి కోసం.

  రిప్లయితొలగించండి