18, ఏప్రిల్ 2015, శనివారం

పద్య రచన - 883

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. కుంభకర్ణుని మేల్కొల్పు కోర్కెతోడ
    రావణుడు వెస నియమించె రక్కసులను
    వలయు యశన పానీయముల్ భద్ర పరచి
    తురగములు యేనుగులుఁజేరి త్రొక్కుచుండ
    కుంతములతోడ రక్కసుల్ గ్రుచ్చి లేప
    యుద్ధమునకు ననుజుని సంసిద్ధుఁజేసి
    రణమునకుఁబంపె నాతని రావణుండు

    రిప్లయితొలగించండి
  2. చిత్ర మయ్యది చూడగ జిత్ర మాయె
    నేను గులజేత ద్రొక్కించి యినుప చువ్వ
    లపొడి పించి లేప దొడగె రక్కసుడగు
    కుంభ కర్ణుని నిద్రను కుజను లచట

    రిప్లయితొలగించండి
  3. 1.ఆ.వె:మొద్దునిద్ద రోవు మొరకు రక్కసు లేపి
    కరులు,గదలతోడ గాయ పరచు
    భటుల జూచి కోప భరితుడగుచు కుంభ
    కర్ణు డడిగె లేప కారణంబు.
    2.ఆ.వె:సమర రంగమందుసాయపడెడివాడు
    కుంభకర్ణు డచట కునుకు దీయ
    గదుల కరుల తొడ గాసి పెట్టి
    యైన తెండ టంచు యసురు డనియె.
    డా.బల్లూరి ఉమా దేవి
    18/4/15.

    రిప్లయితొలగించండి
  4. కే యస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ

    రక్కసులందరున్ కలసి రావణు సోదరు కుంభకర్ణునిన్
    గ్రక్కున నిద్ర మేల్కోలుప గా జతనంబును సేిసిరిట్టులన్
    డోక్కన బల్లెముల్ పోడిచి డోలు నగారను గోట్టి యేన్గుచే
    తోక్క బడంగజేసి యిక తోచక పోసిరి కల్లు మూతిపై

    రిప్లయితొలగించండి
  5. నిద్రకుపక్రమించగ?తననెవ్వరులేపుట చేతగాదు|యే
    భద్రతలేక పోయినను భంగము జేయుట కష్ట సాధ్యమే
    భద్ర గజంబు డొక్కినను పాశవికంబున బిల్లు గుచ్చినన్
    నిద్రను వీడడాయె|గన?నిత్యముసత్యము కుంభ కర్ణుకున్

    రిప్లయితొలగించండి
  6. ఆరుమాసాలనిద్రను నాపదలచి
    కుంభకర్ణుని లేపుటకొరకు జేయు
    యత్నమందునభటులెల్ల నాశ విడువ
    కల్లుముఖమునజల్లంగ?కళ్ళుదెరిచె|

    రిప్లయితొలగించండి
  7. కుంభకర్ణుడైన కూలివాడైననూ
    లేవ లేడు నిద్ర పోవు వేళ
    చేతనారహితఁపు స్థితిలోన, కేకలు
    వాద్యఘోషలన్ని వ్యర్థమేను!

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. కుంభ కర్ణుని మేల్కొల్ప కొలువు గాళ్ళు
    పలు తెరంగుల యత్నించి భంగ పడిరి
    తుదకు భోజనమును దెచ్చి మదిర జల్ల
    బండ నిద్రను వదిలెనా గండరీడు !!!


    రిప్లయితొలగించండి
  10. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘వలయు నశన...’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమ్మాదేవి గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘మొద్దునిదుర పోవు...’ అనండి.
    రెండవ పద్యం మూడవపాదంలో గణదోషం.
    *****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారు,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. 2.ఆ.వె:సమర రంగమందుసాయపడెడివాడు
    కుంభకర్ణు డచట కునుకు దీయ
    గదుల కరుల తొడ గాసి పెట్టియు నైన
    యతని తెండ టంచు యసురు డనియె.

    డా.బల్లూరి ఉమా దేవి
    18/4/15.

    రిప్లయితొలగించండి