7, ఏప్రిల్ 2015, మంగళవారం

సమస్యా పూరణము - 1641 (చుట్టఱికము లెల్లరకును క్షోభను గూర్చున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
చుట్టఱికము లెల్లరకును క్షోభను గూర్చున్.

21 కామెంట్‌లు:


 1. దురహంకారము తోడన
  సుర వర్తనుడైన వాని చుట్టఱికము లె
  ల్లరకును క్షోభను గూర్చున్
  చెరసాలకు చేరవచ్చు ఛీగొట్టుడికన్

  రిప్లయితొలగించండి
 2. ముట్టీ ముట్టక దిరుగుచు
  పెట్టగవలెనేమొ యనుచు బెట్టుగ నుండే
  చుట్టును గిరిగీసుకొనెడి
  చుట్టఱికము లెల్లరకును క్షోభను గూర్చున్.

  రిప్లయితొలగించండి
 3. పట్టును విడిచినచో యా
  గట్టిదయిన ముక్తి దక్కు, కామాదులనాఁ
  కట్టఁబడు పతి సతి సుతుల
  చుట్టఱికము లెల్లరకును క్షోభను గూర్చున్.

  కామక్రోధలోభమోహమదమాత్సర్యాలను షడ్రిపులను బెంచునట్టి చుట్టరికములన్నీ ముక్తికాటంకములే యని భావము.

  రిప్లయితొలగించండి
 4. పట్టుదురు రాహువు కరణి
  గట్టిగ ధనమున్నవారి కాననమందున్
  బెట్టిదులైనట్టి జనుల
  చుట్టఱికము లెల్లరకును క్షోభను గూర్చున్

  రిప్లయితొలగించండి
 5. పట్టక పెట్టక ముట్టక
  కట్టుగ మరి నుండకెపుడు కనిపించకనే
  తట్టము లకైన కలవని
  చుట్టరికము లెల్లరకును క్షోభను గూర్చున్

  తట్టము =కష్టము

  రిప్లయితొలగించండి
 6. నేటి పూరణ:
  చుట్టినవారలపై గురి
  పెట్టుచు వింటిని శరముల వేయును,బావా!
  కొట్టగ మిత్రుల, గురువుల
  చుట్టరికములెల్లరకును క్షోభను గూర్చన్!

  నిన్నటి దత్తపది :

  పణమున నోడిన రాజ్యము
  తృణముగఁ జూతువె? కిరీటి! తేరును దిగుచున్
  రణమును జేయన్ గ్రీడీ!
  గుణమున కర్తవ్య మొదుగఁ గూడును జయమున్!

  రిప్లయితొలగించండి
 7. పట్టును నిలగలి గించును
  చుట్ట ఱి కము లెల్లరకును, క్షోభను గూర్చున్
  చుట్టాలు మోస గించిన
  రట్టుగ నిక మాఱి యిల్లు గుట్టులు తెలిసీ

  రిప్లయితొలగించండి
 8. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ముట్టీ, ఉండే’ అని వ్యావహారికాలను ప్రయోగించారు.
  *****
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ రెండు పూరణలు (నిన్నటిది, నేటిది) బాగున్నవి. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  చివరి పాదంలో గణదోషం.

  రిప్లయితొలగించండి
 9. కవిమిత్రులకు మనవి...
  రేపు మా అబ్బాయికి మిర్యాలగూడలో ఆపరేషన్ ఉంది. అందుకని ఈరోజు బయలుదేరుతున్నాము. రెండురోజుల సమస్యలు, పద్యరచన షెడ్యూల్ చేసి వెళ్తున్నాను. నేను బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. దయచేసి రెండురోజులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 10. పట్టణ మందు నివాసము
  పుట్టెడు అప్పులును మూడు మూరల గదిలో
  పట్టడు బంధుగు డొక్కడు
  చుట్టఱికము లెల్లరకును క్షోభనుగూర్చున్!!!

  రిప్లయితొలగించండి
 11. చుట్టిరికంబని పట్టుగ
  పట్టణమున పల్లెటూర్ల భావమునందే
  పట్టుగ పదిదినములకే
  చుట్టరికము లేల్లరకును క్షోభనుగుర్చేన్|
  అట్టుడుకు ఎండలుండగ
  కట్టడులకరెంటుకోత ఖర్చుల మోతా
  చుట్టు కొనంగడుగిడు
  చుట్టరికములేల్లరకును క్షోభనుగూర్చున్

  రిప్లయితొలగించండి
 12. మధ్యాక్కర
  --------
  చుట్టిరికము లేల్లరకును క్షోభనుగూర్చున్ ననుటకు?
  కట్టుబాట్లను కాలరాసి కట్నమిచ్చినతాళిగట్టి
  చట్టమన్నది లెక్కలేక సాత్వికంబునుసాకబోక
  చుట్టగాల్చుచు,గుట్కవేసి చూచువారికి రోతగున్న|

  రిప్లయితొలగించండి
 13. పట్టును నిలగలి గించును
  చుట్ట ఱి కము లెల్లరకును, క్షోభను గూర్చున్
  చుట్టాలు మోస గించిన
  రట్టుగ నిక మాఱి యిల్లు రహిచెడు నార్యా !

  రిప్లయితొలగించండి
 14. లొట్టగు సంసారమ్మును
  బట్టక వైరాగ్యదీప్త భావంబులతో
  బట్టుము సన్న్యాసంబును
  చుట్టఱికము లెల్లరకును క్షోభను గూర్చున్

  రిప్లయితొలగించండి
 15. చుట్టము జగతికి దైవము
  నట్టాతడు కాచుకొరకు నందడె బాధల్
  గట్టిగ గనమే గాధల
  చుట్టరికము లెల్లరకును క్షోభను గూర్చున్

  చుట్టము,పక్కము లంచును
  గట్టగు బంధము సహజము,కష్టము వడమే
  చుట్టము బాధల పడగను
  చుట్టరికము లెల్లరకును క్షోభను గూర్చున్

  నెట్టును సన్యాసి కటము
  చుట్టము లేకుంట నతడు,చొక్కపునాత్మే
  గుట్టని నమ్ము,నితరులకు
  చుట్టరికము లెల్లరకును క్షోభను గూర్చున్

  చుట్టము లంచును భార్యను,
  పొట్టను బుట్టిన నిసుగుల,పొందమె మాయన్
  గుట్టిది-యెవరికి వారే
  చుట్టరికము లెల్లరకును క్షోభను గూర్చున్

  చుట్టరి కంబది గూడదు
  నట్టిటు లాడెడి వనితల నంతిపురమునన్
  గుట్టది వెల్లడి యగునా
  చుట్టరికము లెల్లరకును క్షోభను గూర్చున్

  రిప్లయితొలగించండి
 16. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రులందఱకును శతసహస్ర వందనములు.

  పుట్టిన యింటనుఁ జెడుగయి,
  మెట్ఘ్టిన యింటను జగడము మిన్నంటంగన్
  ముట్టించునట్టి కుమతుల
  చుట్టఱికము లెల్లరకును క్షోభనుఁ గూర్చున్!

  రిప్లయితొలగించండి
 17. శ్రీతిమ్మాజీరావుగారిపూరణం
  -----------------
  చుట్టరికము మనసిరులకు
  "పట్టుగ పది లక్షలిచ్చు పార్టీకొరకున్
  "గుట్టుగపనిజేయమనెడి
  "చుట్టరికములె ల్లరకును క్షోభనుగూర్చున్"

  రిప్లయితొలగించండి
 18. గుట్టుగ సంసారమ్మును
  నెట్టుకు వచ్చెడు మనుజుల నెపమున నేదో
  పుట్టెడు బాధలు బెట్టెడు
  చుట్టఱికము లెల్లరకును క్షోభను గూర్చున్!

  రిప్లయితొలగించండి
 19. చుట్టలు గాల్చెడివారిది
  చుట్టరికమె|నందుజుడ?చుట్టకునిప్పే
  బెట్టెడి వారటు లేకను
  చుట్టరికము లెల్లరకును క్షోభను గేర్చున్|

  రిప్లయితొలగించండి
 20. పెట్టిన బ్రేవని తినుచును
  పొట్టలు పగులగ; విపత్తు పుట్టగ, కాళ్ళన్
  పట్టిన పదిరాళ్ళివ్వని
  చుట్టఱికము లెల్లరకును క్షోభను గూర్చున్

  రిప్లయితొలగించండి
 21. వట్టివి బొచ్చెలు తెచ్చుచు
  గుట్టుగ చేరుచును మెండు కూరిమితోడన్
  పట్టపు రాణిన్ తరఫున
  చుట్టఱికము లెల్లరకును క్షోభను గూర్చున్

  రిప్లయితొలగించండి