11, ఏప్రిల్ 2015, శనివారం

దత్తపది - 73 (అన్నము-కూర-పప్పు-చారు)

కవిమిత్రులారా!
అన్నము - కూర - పప్పు - చారు
పైపదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

28 కామెంట్‌లు:

  1. ధర్మరాజుతో అర్జునుఁడు.....

    అన్న! మురవైరి సంధివాక్యములు వినియు
    సమరమున కూరకే రేగి చచ్చునపుడు
    సంధి తలఁ పప్పు డైనను సమకొనునొకొ
    కౌరవుల చారుదేహముల్ సమయు నింక.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరయ్యగారు. మీ పద్యం నాల్గవ పాదంలో యతి అంతు పట్టటలేదు. దయచేసి వివరించ ప్రార్థన

      తొలగించండి
    2. శంకరయ్యగారు. మీ పద్యం నాల్గవ పాదంలో యతి అంతు పట్టటలేదు. దయచేసి వివరించ ప్రార్థన

      తొలగించండి
  2. మాయ క్రీడను చేకూర మతిని వీడి
    పణము సతినేల యనుతల పప్పు డైన
    సభను పరాభవ మందె చారు శీలి
    అన్న మురారి మొరవిని యాద రించె

    రిప్లయితొలగించండి
  3. అన్న! ముడివేయని కురుల తెన్ను జూడు
    వలదు నాకూరడించెడి వాక్యములిక
    కలిగె వగపప్పురమునందె తొలిగె పరువు
    గడిచె గహన సంచారులై కాలమిచట!!

    రిప్లయితొలగించండి
  4. అన్న మురారిని c గోరగ
    చెన్నుగ వస్త్రములు c గూర చెల్లియు సభలో ,
    కన్నని లీలలు c వప్పుగ
    మన్నన యా చారు శీలి మాన్యత నొందెన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  5. మిత్రులు శ్రీకంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమస్సుమాంజలులతో...

    (దుర్యోధనునకుఁ దమ్ముఁడైన వికర్ణుఁడు హితము బోధించు సందర్భము)

    అన్న! ముకుందుని మాటలు
    విన్నను సమకూరఁజేయుఁ బేరును సిరులున్!
    బన్నపు తలఁ పప్పు డెపుడొ
    యున్నను, విడి, చారుమతికి నున్నతి నిడుమా!!

    రిప్లయితొలగించండి
  6. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    చివరి రెండు పాదాలలో గణదోషం. నా సవరణ...
    సభను కడు పరాభవ మందె చారుశీలి
    అన్న మురవైరి మొరవిని యాదరించె.
    *****
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘లీలలుఁ వప్పుగ’... అన్నచోట అర్థం కాలేదు. అక్కడ గసడదవాదేశం జరిగినప్పుడు అరసున్నతో అవసరం లేదు. దత్తపదిలో ‘పప్పు’ను అలాగే ప్రయోగించాలి.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. అన్న మురళీధరుండు నీకండయుండు
    సంధి చేకూర నిత్తురే మందమతులు
    నీతలంపప్పుడు ఫలించు నిశ్చయముగ
    శత్రు నిర్మూలనముగల్గు చారుశీల !!!

    రిప్లయితొలగించండి
  8. అర్జునుడు భీమునితో
    అన్న! ముగిసెను సంధిప్రయత్నమిపుడు
    తప్పదింక నాచార్యులు తాత తోడ
    కలను చేకూర రాజ్య భాగమ్ముమనకు
    పప్పు చేసెద వైరులన్ భాణ హతిని
    పప్పుచేయుః నుఱుముః చంపు

    రిప్లయితొలగించండి
  9. చారు శీలురు గుణవంతు లార్య ! వారు
    పప్పు సేతురు మమ్ముల పాండవు లని
    అన్న ! మురహరి !కాపాడు చెన్ను మీర
    జయము సమకూర జేసియు శాశ్వ తముగ

    రిప్లయితొలగించండి
  10. నీదు"పప్పు"డక దనిని,నీకు కలుగు
    శాస్తి చే"కూర"పజయాలు,"చారు" పాండు
    సుతులు "నన్నము"కై సంధి చొక్కముగను
    చెప్పవచ్చు కృష్ణునిమాట చెలువు వినడు

    గొప్పగా చేయు చెడు "కూర"కుండి
    సుతులు "నన్నము" కొరకునై శుద్ధ గతిని
    సంధికంపిరి,చేయుచో "చారు"తరము
    యనిని మీ"పప్పు"లుడకవు ననెను హరియు

    రిప్లయితొలగించండి
  11. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. అన్న మునిమంత్రమే కన్యనమ్మజేయ
    రాత్రి కూరబయలుజేరి రయమున విడ
    డోలను, రవిరూపప్పులఁ దేలి దొరకె
    చారుమతికి, కర్ణుండను పేర వరల

    అన్న - పలికిన
    ఊరబయలు - ఊరికి బయలు
    రవిరూపు + అప్పుల
    చారు మతి

    రిప్లయితొలగించండి
  13. అన్న! మును జనించి మిన్నయౌ వంశాన
    .........భరతాన్వయమ్మున పాద మిడితి
    పొంది నీ ప్రా పప్పు డొందితి యశమును
    .........కుంతికి మెచ్చిన కోడలినయి
    చారు పరాక్రమ సంపన్ను లైనట్టి
    .........పాండవ పతులను బడసినాను
    చేకూర పుణ్యమ్ము చింతల దీర్చెడు
    .........పుత్ర పంచకమును పొందినాను

    యెన్న నీబోటి సోదరు డున్న నన్ను
    పట్టి నాజుట్టు సభ నీడ్చె పాపి! యిద్ది
    సంధి జేసెడి వేళను సరకుగొనవె
    యనెను మాధవు నొద్దను యాజ్ఞసేని.

    రిప్లయితొలగించండి
  14. అన్న|ముదంబుగూర్చె-మనఆశనిరాసకుధర్మమార్గమై
    విన్నదిసత్యమయ్యెగద|విజ్ఞుడుచారువువంటికృష్ణ్డుడే
    తిన్నగపాండుపక్షమునదేలగ|వండినకూర బంధమై
    కన్నడుసారధేనిలువ?కౌరవచేష్టలు-పప్పులుడ్కునా?


    రిప్లయితొలగించండి
  15. ద్రౌపది మదిలో...
    అన్న ముకుందుడి దయతో
    బన్నము లెన్నియొ గతించె! వగపప్పుడుఁదా
    నన్నిట సమకూర నతడె,
    మన్ననలిడె చారుశీలి మరువన్ దరమే?

    రిప్లయితొలగించండి
  16. మిస్సన్న గారి పద్యము
    తస్సాదియ్యా పఠించు తఱి నాతని మే
    దస్సారమ్మును దెల్పి మ
    నస్సీమన్ నిల్చుఁ బల్కు నవనీతంబై !

    మిస్సన్న గారి పద్యం చాలా అందంగా వచ్చింది. ఈ పద్యంలో "పుత్ర పంచకమును పొందినాను" కు మారుగా "పుత్ర పంచకమును పొందితిఁ గద " అనే ఒక చిన్న సవరణ - తరువాత వచ్చే ఎత్తుగీతిలోని "యెన్న" తో అనుస్యూతముగా కొనసాగడం కోసం ! వారికి నా అభినందనలు !

    రిప్లయితొలగించండి
  17. Sreedhara rao gaaroo in case u have google account you can post direct into the comment box. Otherwise you may send the poem to any of the members by mail requesting to put it here. You may also send it to Sanakarayya gaaru by mail.

    రిప్లయితొలగించండి
  18. విష్ణునందనులకు ధన్యవాదములు. బహు కాలమునకు వారి మెప్పు నొందిన నా పద్యం పులకించింది. వారి సూచనకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  19. డా.విష్ణునందన్ గారి సూచన మేరకు సవరణతో:

    అన్న! మును జనించి మిన్నయౌ వంశాన
    .........భరతాన్వయమ్మున పాద మిడితి
    పొంది నీ ప్రా పప్పు డొందితి యశమును
    .........కుంతికి మెచ్చిన కోడలినయి
    చారు పరాక్రమ సంపన్ను లైనట్టి
    .........పాండవ పతులను బడసినాను
    చేకూర పుణ్యమ్ము చింతల దీర్చెడు
    .........పుత్ర పంచకమును పొందితి గద

    యెన్న నీబోటి సోదరు డున్న నన్ను
    పట్టి నాజుట్టు సభ నీడ్చె పాపి! యిద్ది
    సంధి జేసెడి వేళను సరకుగొనవె
    యనెను మాధవు నొద్దను యాజ్ఞసేని.

    రిప్లయితొలగించండి
  20. విరాట రాజు కొలువులోకి పాండవులు మరియు ద్రౌపది ప్రవేశించడం
    అన్న మున్నె నుడివినటు లనుజలు నిజ
    రూపములు వీడినడిచారు రూప్యమాన
    విరటు సభలోకి జయము చేకూరగ సతియు
    ను పతులంపప్పురంబు చేరె భర్త లటులె!

    రిప్లయితొలగించండి
  21. ఊకదంపుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    డా. విష్ణునందన్ గారి ప్రశంసకు పాత్రమైన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కూర, పప్పు’లను స్వార్థంలో వినియోగించారు.
    *****
    డా. విష్ణునందన్ గారూ,
    ధన్యవాదాలు.
    *****
    శ్రీధర రావు గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నడిచారు, సభలోకి’అని వ్యావహారికాలను ప్రయోగించారు. ‘నడిచిరి, సభలోనికి’ సరైన రూపాలు. మూడవ పాదంలో ప్రాసయతి (విర-కూర) తప్పింది. ప్రాసపూర్వాక్షరం రెండుచోట్ల గురువుకాని లఘువు కాని అయి ఉండాలి. నాల్గవపాదంలో గణం, యతి రెండూ తప్పాయి. ఆరంభంలో ఇలాంటి దోషాలు సర్వసామాన్యం. నిరుత్సాహపడకుండా కొనసాగించండి. చక్కని పద్యాలు వ్రాయగలుగుతారు. స్వస్తి!

    రిప్లయితొలగించండి
  22. రవికాంత్ మల్లప్ప గారూ,
    నిజమే... అక్కడ యతిదోషం. ధన్యవాదాలు.
    ముందుగా ‘శాత్రవుల చారుదేహముల్ సమయు నింక’ అనుకొన్నది టైపు చేసే సమయంలో ‘కౌరవుల’ అని వచ్చింది. పొరపాటుకు క్షంతవ్యుడను.

    రిప్లయితొలగించండి
  23. యనమండ్ర అశ్వత్థనారాయణ మూర్తి గారి పూరణ...

    సీ. అన్న ముందరి కేగుకన్న ముందర నేడు
    విజయంబు చేకూరఁ విడవ నంచు
    తప్పప్పుడొనరించ ధృతరాష్ట్రు దాపప్పు
    డటమిమ్ము దప్పించి యరుగనిచ్చె
    ఎవ్వడనుచునెంచ నీశ్వరుండెదురైన
    రౌద్ర రసము జూపి రగడ సేతు
    కోదండ పాండిత్య కోలాహలోజ్వల
    చారులసత్ప్రౌఢి సంహరింతు
    ఆ.వె. ననుచు పెరుగుచున్న ఆగ్రహజ్వలితుడై
    అర్జునుడనలార్కు లైక్యమైన
    తేజమావహింపఁ తేరున హరి తోడ
    కదనరంగమేలె కాలుఁ రీతి.

    (దయచేసి ఇవి గమనించండి
    అన్నము రెండు మార్లు,పప్పు రెండుసార్లు
    చారు, కూరలతో పాటు, రసము, వడ, పెరుగు
    కూడా వడ్డించాను).

    రిప్లయితొలగించండి
  24. యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    నమస్కారం.
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీ పద్యం ఉత్తరార్ధం అద్భుతంగా ఉంది. పూర్వార్ధంలో మొదటి పాదం అర్థం కాలేదు. ‘తప్పప్పుడొనరించ ధృతరాష్ట్రు దాపప్పు’ అన్నచోట యతి తప్పింది.

    రిప్లయితొలగించండి
  25. రవికాంత్ మల్లప్ప గారూ,
    మీ సందేహానికి పైన వివరణ ఇచ్చాను. మీరు చూడలేదనుకుంటాను. ఆ పాదంలో యతిదోషం ఉంది. నేను గమనించకుండా తొందరలో పోస్ట్ చేశాను.

    రిప్లయితొలగించండి