8, ఏప్రిల్ 2015, బుధవారం

సమస్యా పూరణము - 1642 (కాకికి సతి రాజహంస కాఁదగు నెపుడున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కాకికి సతి రాజహంస కాఁదగు నెపుడున్.

18 కామెంట్‌లు:

 1. ప్రాకటముగ పదిమందిని
  నేకతముగ వెదకి జూచి నెవరిని మెచ్చన్
  సాకులు జెప్పుచు మురియగ
  కాకికి సతి రాజహంస కాఁదగు నెపుడున్

  రిప్లయితొలగించండి
 2. కం. చీకాకీసంసారము
  నాకేలాదీనిగోలనన్నొదులనుచున్
  మైకముతూలేనేకా
  కాకికి సతిరాజహంస కాదగు నెపుడున్.

  రిప్లయితొలగించండి
 3. కోకిల గాకికి జుట్టమ?
  సాకదె పిల్లల జెలిమిన చక్కగ పేర్మిన్!
  పోకిరి మాటలు మానుడు
  కాకికి సతి రాజహంస కాఁదగు నెపుడున్!

  రిప్లయితొలగించండి
 4. సాకక పత్నిని సరిగా
  భీకర మానసముతోడ వీగుచు సతమున్
  చాకిరి చేసి బ్రతుకు నే
  కాకికి సతి రాజహంస కాదగు నెపుడున్

  రిప్లయితొలగించండి
 5. ఏ కాల మందు నైనను
  మీకేలా శంక? యమికి మేలగు సతిగా
  కాకియ? కూడదు, కాకియె
  కాకికి సతి, రాజ! హంస కాఁదగు నెపుడున్.

  రిప్లయితొలగించండి
 6. కేకెపుడును కాజాలదు
  కాకికి సతి:రాజహంస కాదగునెపుడున్
  రాకొమరుని హంసకు జత
  లోకేశుని నియమములివె లోకము లోనన్ !!!

  ( కేకి = మయూరము )

  రిప్లయితొలగించండి
 7. కాకికి కాకియె సతి యగు
  కాకికి సతి రాజహంస కాద గు నెపుడున్
  కాకుల జాతికి బంధము
  కోకిలకే యుండి భువిని కూనల బెంచున్

  రిప్లయితొలగించండి
 8. పోకిరి వెధవకు రంగే
  కాకినిమితిమీరియుండ?కల్మషమతిగా
  తాకగవచ్చిన-నాయే
  కాకికిసతి రాజహంస కదగు నెపుడున్
  -------
  రాజహంస=పేరు
  -----------
  కాకికి గలఇఖ్యత-యే
  కాకికిగలిగియున్న?"కల్మషమెచటన్
  కాకికిగనుపించనిచో?
  కాకికిసతి రాజహంసకాదగు నెపుడున్

  రిప్లయితొలగించండి
 9. శ్రీకే*యస్*గురుమూర్తిగారిపూరణం
  -----------------
  ఒకవియిదియును తెలియదె
  కాకికిసతిరాజహంసకాద డగునెపుడున్
  కాకికిసతికాకియె|నీక
  ఆకలహంసకు సతి కలహంసయే|సృష్టిన్|

  రిప్లయితొలగించండి
 10. లోకము నందున నున్నది
  పోకడ,నందంపు సతికి,పూర్తి వికారే
  వే కల్గు పతి,వికారౌ
  కాకికి సతి రాజహంస కాదగు నెపుడున్

  లోకుల పుణ్యము వల్లను
  చేకురునందంబు,సిరియు,చేకుర దేరిన్
  భీకర పాప ఫలంబుగ
  కాకికి సతి రాజహంస కాదగు నెపుడున్

  భీకర వీరుని పిరికియు
  తా,కను,ప్రాజ్ఞుని వెడగును,తలపగ వింతౌ
  లోకము నందున,విధియగు
  కాకికి సతి రాజహంస కాదగు నెపుడున్

  రిప్లయితొలగించండి
 11. లోకమున జూడ కాకియె
  కాకికి సతి, రాజహంస కాదగు నెపుడున్
  నేకాక్షమునకు జతగా
  ప్రాకృతము గనిదియె జరుగు పరికించంగా !!!

  రిప్లయితొలగించండి
 12. మీకేలా? సందేహము
  కాకికి సతి రాజహంస కాదగు(కాదు+అగు)నెపుడున్
  కాకికి కాకమ్మయు మరి
  చేకొనుగా హంసి యెపుడు చిరతము హంసన్

  రిప్లయితొలగించండి
 13. కాకిని బొలెడు వర్ణము
  సోకిన మేనికి మనసది సొన్నంబైనన్
  సోకుల రమణికి తగడే?
  కాకికి సతి రాజహంసకాఁ దగు నెపుడున్!

  రిప్లయితొలగించండి
 14. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రులందఱకును నమస్కారములు:

  (రాజహంసతో కోకిలలు సంభాషించు సందర్భము)

  "కాకుల గూళులఁ గోకిల
  లేకముగా గ్రుడ్లుపెట్ట, నెట్టుల సతియౌఁ
  గాకికి కోకిల? కాకియె
  కాకికి సతి, రాజహంస! కాఁదగు నెపుడున్"

  రిప్లయితొలగించండి
 15. కాకికి కాకియె ముద్దగు
  కాకుల గృహమందు కొంత కాలంబున్నన్
  కోకిల నొప్ప వెటుల నా
  కాకికి సతి రాజహంస కాదగునెపుడున్?

  రిప్లయితొలగించండి
 16. ఆకలి నిద్రయును మరచి
  యేకాకిగ తపము జేయు నీశ్వరు నొందెన్
  చీకాకులతో పార్వతి...
  కాకికి సతి రాజహంస కాఁదగు నెపుడున్

  రిప్లయితొలగించండి
 17. వాకబు జేయగ పక్షులు
  చీకటిలోనన్ని నలుపు చెన్నుగనవగా
  ప్రాకటముగనో బావా!
  కాకికి సతి రాజహంస కాఁదగు నెపుడున్

  రిప్లయితొలగించండి