20, ఏప్రిల్ 2015, సోమవారం

సమస్యా పూరణము - 1653 (సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్.
నా పూరణ....

హితమును గోరుచు గౌరీ
సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్
వెతఁ గుందు సుతుండు శుభఫ
లితముగ నుద్యోగ మంది లేమిని గెలిచెన్.

33 కామెంట్‌లు:

  1. హితమతియౌ నొక జనకుడు
    సుతుగొని రామాలయంబు జూడగ నేగన్
    రీతిగ వరుసన్ దశరథ
    సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతులొనరించెన్

    రిప్లయితొలగించండి
  2. మతిమాలిన పుత్రుని గైకొని
    సతిపతు లిరువురును గూడి సాగిరి గుడికిన్
    వెతలను బాపగ యంజన
    సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్

    రిప్లయితొలగించండి
  3. కవిమిత్రులందఱకు నమస్కారములు!

    మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారి పూరణము కవులందఱకు మార్గదర్శకముగనున్నది. అభినందనలు.

    హితముం గోరుచు, శీఘ్రమె
    సుతునకుఁ గళ్యాణమయ్యు సుఖములఁ బడయన్,
    వెతల విద్రుచు కౌసల్యా
    సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్!

    రిప్లయితొలగించండి
  4. మతి నీయమనుచు సుతునికి
    వెతలను కలిగించకెపుడు వేడుక లీయన్
    గతియే నీవని దేవకి
    సుతుపదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్!!!

    రిప్లయితొలగించండి
  5. మాస్టరు గారూ..రోజూ మీ పూరణలు చూచు అదృష్టము కలుగుచున్నది...అందరి పూరణలు బాగున్నవి..అభినందనలు.

    మిమీరి జదివియున్నను
    సుతునకు నుద్యోగమేది ? చొరబడి కొలువున్
    వెతలే దీరగ దశరథ
    సుతుపదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్

    రిప్లయితొలగించండి
  6. మతిలేని సుతుని తోడను
    సతతము బాధలనుగొనుచు సతమతమగుచున్
    గతినీవేయని దశరథ
    సుతుపదములవ్రాలి తండ్రి స్తుతులొనరించెన్

    రిప్లయితొలగించండి
  7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, గుండు మధుసూదన్ గారూ, గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవపాదం గురువుతో ప్రారంభమయింది. ‘జూడంగను బో|యి తగిన రీతిని...’ అందామా?
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం.‘మతిమాలిన సుతుఁ గైకొని’ అనండి.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ******
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ******
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
    ధన్యవాదాలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. మతివంతుడైన సుతుడే
    యతియై, వ్రతియై జగత్తుకంతకు గురువై
    హితవులు పల్కుట తా గని
    సుతుపదముల వ్రాలి తండ్రి స్తుతులొనరించెన్

    రిప్లయితొలగించండి
  9. మతి తప్పగ రారాజుకు
    క్షితివిభుడట విశ్వరూప సేవకు కనులన్
    స్మృతిఁ జేసి పొంది, దేవకి
    సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతులొనరించెన్!

    రిప్లయితొలగించండి
  10. పితృవాక్యపాలకుండై
    యతి హరుషముతోడ తండ్రి యానతి మేరన్
    సతితో రాముడు కోసల
    సుత పదముల వ్రాలితండ్రి స్తుతులొనరించెన్.
    బల్లూరి ఉమాదేవి.

    రిప్లయితొలగించండి
  11. పితృవాక్యపాలకుండై
    యతి హరుషముతోడ తండ్రి యానతి మేరన్
    సతితో రాముడు కోసల
    సుత పదముల వ్రాలితండ్రి స్తుతులొనరించెన్.
    బల్లూరి ఉమాదేవి.

    రిప్లయితొలగించండి
  12. సుతునకు మేలును జేయగ

    సతతము మఱి భక్తి తోడ శంభుని పూజ ల్

    నతులను ,మఱియును నంజని

    సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్

    రిప్లయితొలగించండి
  13. గతి యని గురువును నమ్ముచు
    సతతము ధ్యానము విడువక సల్పెడు వాడై
    యతియై వెలుగొందెడు తన
    సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతులొనరించెన్

    రిప్లయితొలగించండి
  14. గతి యని గురువును నమ్ముచు
    సతతము ధ్యానము విడువక సల్పెడు వాడై
    యతియై వెలుగొందెడు తన
    సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతులొనరించెన్

    రిప్లయితొలగించండి
  15. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ సవరణ బాగుంది. సంతోషం!
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. కం. ధృతిమతి యైనకుమారుడు
    నతివేగముతోమయూరమధిరోహింపన్
    గతియేమినాకనియుమా
    సుతు,పదములవ్రాలితండ్రి స్తుతులొనరించెన్.

    రిప్లయితొలగించండి
  17. మతిమంతుల మహిమంబుకు
    హితకారుల మతము కొరకు హీనత్వమునే
    సతతముమాన్పగ దేవకి
    సుతపదముల వ్రాలి తండ్రి స్తుతులొనరించెన్

    రిప్లయితొలగించండి
  18. దేవకి వసుదేవ సుతా
    భావనలో జేరి మాకు భగవంతుదిలా
    జీవన సారంబందగ?
    దీవింపుము కృష్ణ మమ్ము దీనుల నెపుడున్

    రిప్లయితొలగించండి
  19. పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మహిమంబునకు’ అనవలసి ఉంటుంది. అక్కడ ‘మహిమమునకు’ అనండి.

    రిప్లయితొలగించండి
  20. వయసిడు జోడు కొరకై
    మయసభలా పెళ్లిజరుగ?మంగళ ప్రదమౌ
    దయగల నల్లుడనే ఆ
    సుతుపదములవ్రాలి తండ్రి స్తుతులొనరించున్

    రిప్లయితొలగించండి
  21. సుతులును,సతితో కూడిన
    పతి,గణనాధుని గొలువగ,పత్రిని,పూలన్
    నతిగను గూర్చియు,పార్వతి
    సుతుపదముల వ్రాలి,తండ్రి,స్తుతులొనరించెన్

    సుతుడగు కృష్ణుని వలనను
    వెతలవి తొలగగ,యదుకుల పెద్దలు వానిన్
    నతులిత దైవమనెంచిరి,
    సుతుపదములవ్రాలి తండ్రి స్తుతులొనరించెన్

    అతిదీనుడు వామాక్షీ
    పతిగని,తెలుపకె సిరులిడ,బాపడు నింటన్
    సుతులల సంపదగన,యదు
    సుతుపదముల వ్రాలి తండ్రి స్తుతులొనరించెన్

    వెతలను గూర్చెడి త్రాగుడు
    కతి బానిస యయిన తండ్రి,యపుడా కొడుకే
    నుతిగను పదమంద,నపుడు
    సుతుపదముల వ్రాలి తండ్రి స్తుతులొనరించెన్

    రిప్లయితొలగించండి
  22. కె స్ గురుమూర్తి ఆచారిగారిపూరణ
    సుతునిన్ రక్షకభటునిన్
    సతమున్ సంరక్షణమ్ము సల్పుము తండ్రీ
    అతులితబల యనుచుపవన
    సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతులొనరించె

    రిప్లయితొలగించండి
  23. వామనకుమార్ గారూ ధన్యవాదములు..నిజమే...టైపాటు జరిగినది...మాస్టరు గారూ ధన్యవాదములు..

    సవరింపు తో

    మితి మీరి జదివియున్నను
    సుతునకు నుద్యోగమేది ? చొరబడి కొలువున్
    వెతలే దీరగ దశరథ
    సుతుపదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్

    రిప్లయితొలగించండి

  24. సతిదేవకిగనెను హరిని
    సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతులొనరించెన్
    అతులిత గతినది దాటుచు
    సతి యశోదనింట సుతుని చక్కగ జేర్చెన్


    రిప్లయితొలగించండి
  25. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
    *****
    కె.యస్ గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. పొతముగ తలనిడ తన రా
    సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్
    హితములు కలిగించమనగ
    వెతలిక దూరమ్ము సేయ వేలుపు అమ్మై

    రిప్లయితొలగించండి
  27. పల్లా నరేంద్ర గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. సతినిన్ సుతునిని వీడుచు
    యతియై జ్ఞానమును వొంది యాత్రలలోనన్
    పితరుని గాంచిన మాయా
    సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్

    రిప్లయితొలగించండి
  29. సతి పోవగ ముదుసలియౌ
    పతివర్యుడు వగచి వగచి భాగ్యపునగరిన్
    మతి వీడగ సరి జేసెడు
    సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతు లొనరించెన్

    రిప్లయితొలగించండి