14, ఏప్రిల్ 2015, మంగళవారం

పద్య రచన - 879

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
ఈ చిత్రాన్ని అందించిన చంద్రమౌళి సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు.

19 కామెంట్‌లు:

  1. అందమ్ముగ వ్రేలాడుచు
    సుందర మైనట్టి చెవికి సొంపును పెంచెన్
    కుందనపుటాభరణమే
    యిందువదన దాల్చెనొకద యిష్టముతోడన్

    రిప్లయితొలగించండి
  2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. మేలగు మాటీలు జతగ
    లోలాకులు దాల్చె నదివొ రుచిరాంగి యటన్
    గాలికి యూగుచు లీలగ
    వేలాడుచు కర్ణములకు విభవము దెచ్చెన్!!!

    రిప్లయితొలగించండి
  4. మాటీ లోలాకులనే
    ధాటిగనే చెవికి పడుచు దరియించె నహా !
    పోటీ బడుచును కమ్మలు
    బోటికి మేవన్నె తోడ, బుద్ధిగ నూగెన్.

    రిప్లయితొలగించండి
  5. శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. చిత్ర మందున చిత్రాంగి చెవికి నచట
    యాభ రణ ముగా మాటీ ని హత్తు కొనెను
    చూడ ముచ్చట గానుండె చూడు నీవు
    నీకు కూడను గొందును నీర జాక్షి !

    రిప్లయితొలగించండి
  7. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. శైలజ గారు మూడవ పాదంలో గాలికి నూగుచు అనాలేమో.

    రిప్లయితొలగించండి
  9. కమ్మను-కొమ్మకుగాసిన?
    సోమ్ములవలె కానుపించు|"సోయగములతో
    దిమ్మెల దివిటి మాటిల్
    అమ్మాయికి చెవికి పంటలందినవిధమే|"
    అందపునంతరంగమున యన్నులమిన్నసువర్ణకాంతులున్
    చిందగ?కర్ణశోభితవిచిత్రము జూడగ?కమ్మ కండగా
    విందున విస్తరందు గనుపించెడి వడ్డనలట్లు|దృశ్యమా
    కుందరసుందరాంగులట?కుత్చితమౌ-చెవికందమేయగా|

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్న గారూ,
    ధన్యవాదాలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘విస్తరి+అందున’ అన్నప్పుడు సంధి లేదు.

    రిప్లయితొలగించండి
  11. సంపంగి నాసిక కొసన
    సొంపుగ ముక్కెర ధరించి సోయగమున దా
    నింపుగ చెవిదిద్దులతో
    చెంపసరాలను సొగసరి చేర్చుచు జూపెన్

    రిప్లయితొలగించండి
  12. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. గురుదేవులకు ధన్యవాదములు.
    టైపాటు సవరణతో:

    సంపంగి నాసిక కొసన
    సొంపుగ ముక్కెర ధరించి సోయగమున దా
    నింపుగ చెవిదుద్దులతో
    చెంపసరాలను సొగసరి చేర్చియు జూపెన్!

    రిప్లయితొలగించండి
  14. అమ్మ! నీ చెవి తమ్మ లనంగ ధనువు!
    మెరయు తాటంకముల జంట స్మరుని రథపు
    చక్రయుగ్మము! సరము లశ్వముల త్రాళ్ళు!
    కమ్మలధ్వని ప్రణవంపు ఘన రవమ్ము!

    (సౌందర్యలహరీ శ్లోకాల ఆధారంగా)

    రిప్లయితొలగించండి
  15. బల్లూరి ఉమాదేవి గారి పద్యం....

    పసిమి చాయ తోడ పడతి మెరయుచుండ
    చెంప సరము లదిరె చెవుల నిండి
    అందమైన చెక్కి లందము చిందించ
    ముద్దు చేసె నపుడె మగడు సతిని

    రిప్లయితొలగించండి
  16. మిస్సన్న గారూ,
    మీ పద్యం అత్యద్భుతంగా ఉంది. అభినందనలు.
    *****
    బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘చెక్కిలి+అందము’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

    రిప్లయితొలగించండి
  17. అందమైన బుగ్గ లందము చిందించ అంటే సరిపోతుందా అండీ

    రిప్లయితొలగించండి