18, ఏప్రిల్ 2015, శనివారం

సమస్యా పూరణము - 1651 (అవధానం బొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
అవధానం బొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్.
("నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం" నుండి డా. ఆచార్య ఫణీంద్ర గారికి ధన్యవాదాలతో)
నా పూరణ....
స్తవనీయంబగు బౌండరీ లవె సమస్యాపూరణంబుల్ గదా
వ్యవధానం బిడకుండు బౌన్సరు లసాధ్యంబౌ నిషిద్ధాక్షరుల్
నవ లావణ్యఁపు బ్యాటు దత్తపదులన్ నర్తింపఁ జేయన్ భళీ
యవధానం బొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్.

32 కామెంట్‌లు:

 1. నమస్కారములు
  గురువు గారి పద్యం అద్భుతంగా ఉంది .ఇంక రాయడానికేం మిగిలింది ? అసలె క్రికెట్టు తెలియదు

  రిప్లయితొలగించండి
 2. యువరాజే తనుబ్యాటుఁబట్టి నిజమౌనుత్సాహమున్ జూపినన్
  వివశమ్మున్ గొని పొంగరే జనములా విధ్వంసమున్ గాంచుచున్
  కవనంబందున మేటి, పండితుడు చక్కంగన్ విజృంబించిన
  న్నవధానంబొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్

  రిప్లయితొలగించండి
 3. గురుతుల్యులు మిస్సన్న గారికి ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 4. గురువు గారి పద్యం అనన్యం. మరో పద్యం వ్రాయ కూడదు. అయినా కవిత్వం వృత్తీ, ప్రవృత్తీ కానీ నేను ఈ బ్లాగ్ చాలా మిస్ అవుతున్నందున ఈ పద్యం వ్రాస్తున్నాను. గురువు గారు క్షమించాలి.

  స్తవమౌ పూర్ణ శతావధాన రచనా సంసిద్ధి కై పట్టెగా
  నవురా నాలుగు నిండు రోజులిక నీ యష్టావధానమ్ము కై
  కవికం జాలెను నాల్గు గంటలని సాకల్యంబుగా నంటి నీ
  యవధానంబొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్

  రిప్లయితొలగించండి
 5. అవధానంబొక---|ట్వెంటి-ట్వెంటిక్రికెటై---|యహ్లాదమున్గొల్పెడిన్|
  శ్రవణానందము--|ఆటభూషణము------|నాశ్వాదించగాబుద్దికిన్
  భవితవ్యంబుకు--|సంతసంబొసగు------|లోపంబేమి లేకున్నచో|
  కవితాదర్పము---|సర్వసమ్మతము-----|సంకల్పంబు సంసిద్దతే|

  రిప్లయితొలగించండి
 6. భాగ్యనగరంలో జూన్ 2009లో 8,9,10,11 తారీఖులలో జరిగిన శతావధానంలో డా. ఆచార్య ఫణీంద్ర గారు గరికి పాటి నరసింహా రావు గారికిచ్చిన సమస్య యిది.

  రిప్లయితొలగించండి
 7. అవధానిన్ గురిజేసి వేయగను పృఛ్చాకందుకాల్ స్వల్పమౌ
  వ్యవధానంబను బ్యాటు జేగొనుచు పద్యాల్ బౌండరీల్ సిక్సరుల్
  సవరించుంగద నష్టదిక్కులకు స్వేఛ్చాయుద్ధతిన్ సత్కవీ!
  యవధానం బొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్.

  రిప్లయితొలగించండి
 8. అవధానంబున అంశ సంశయము లాద్యంతంబు లాట్లాడుటే
  కవనాధారల పర్వు లుంచుట సదా గాత్రంబనే సూత్రంబనన్
  “వివరంబెంచనిదై క్రికెట్టు నిల భావించంగ?లోకంబునన్
  అవధానంబొక ట్వెంటి ట్వేంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్|

  రిప్లయితొలగించండి
 9. కవనంబందున వేరువేరు నగుగా కైతల్ వెలుంగొందుటల్
  జవముం జూపెడు నాశుకైతలును,తాచక్కంగ వే పూరణల్
  నవధానంబున చెప్పుటన్నదియునౌ,నా క్రీడయే నొప్పెగా
  యవధానంబొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్

  అవధానంబున నప్పటప్పటికి వే యల్లంగ పద్యాలు నౌ
  జవమున్,పాండితి గల్గియుండవలె నాసద్విద్య లోనన్ తగన్
  చివరన్ వానిని ధారణన్ పలుకుటే సేవ్యంబునౌ,నట్టి యా
  యవధానంబొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్

  అవధానంబున"ఫైటు"చేయునది యౌ నాతండు తానొక్కడే
  కవితన్ పద్యములల్లు వాడునగుగా,కమ్రంపు"ఫీల్డర్లు"తా
  కవిసే పృచ్ఛకులింపునై వెలుగుగా,కవ్వించునా ప్రశ్నలే
  యవధానంబొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్

  రిప్లయితొలగించండి
 10. అవలోకించ క్రికెట్టు పందెమున నాబ్యాటున్ కరమ్మందు చి
  త్ర విచిత్రమ్ముగ బంతి గోట్టుచును ప్లే గ్రౌండందు
  సిక్సర్లు ఫో
  ర్లు విహారమ్ము క్రికెట్టు రంగమువ వీరుల్ జేయు విఖ్యాతమౌ
  యవధానంబొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్

  రిప్లయితొలగించండి
 11. అవకాశంబును వీడియుం టినిగ దానావల్ల సాధ్యం బట
  న్నవనీనాధులు వ్రాసియుండినమ హాకావ్యంబులందున్ గనన్
  కవినే నంచును నెంతదానగద నాకాయోగమున్ లేకనీ
  అవధానంబొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్
  -------------------------------------
  క్షమించాలి సోదరుల ప్రోత్సాహంతో
  ఎన్ని తప్పులు ఉన్నా భరించాల్సిందే మరి

  రిప్లయితొలగించండి
 12. రాజేశ్వరి అక్కయ్య గారికి, మిస్సన్న గారికి, చంద్రమౌళి సూర్యనారాయణ గారికి, కుమార్ గారికి, అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కుమార్ గారూ,
  సహస్రావధానం టేస్ట్‌మ్యాచ్, శతావధానం వన్‍డే మ్యాచ్, అష్టావధానం ట్వెంటి ట్వెంటి మ్యాచ్ అన్న అర్థంలో మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటిపూరణలో ‘భవితవ్యంబుకు’ అనరాదు, ‘భవితవ్యంబునకు’ అనాలి. అక్కడ ‘భవితవ్యంబునకున్ ముదం బొసగు’ అందామా?
  రెండవ పూరణ రెండవపాదం చివర గణదోషం. ‘గాత్రంబనే సూత్రమై/మౌ’ అనండి.
  *****
  మిస్సన్న గారూ,
  చక్కని పూరణ చేశారు. అభినందనలు.
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అక్కయ్యా,
  హమ్మయ్య! కిట్టించారు. బాగుంది మీ పద్యం. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. మాస్టరుగారూ..పద్యాన్నిబౌండరీ దాటించారు.....కవిమిత్రులందరూ ఫోర్లు కొట్టారు...అందరికీ అభినందనలు..

  అవరుల్ మూడుగ టైముబెట్ట సభయం దష్టావధానమ్ములో
  యువబౌలర్లుగ ప్రశ్నలెన్నొ కవులే యోవర్లుగా వేయగా
  యవధానక్కడ పాదపాదములతో నబ్బ్యాటు షాట్లివ్వగా
  నవధానంబొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్

  రిప్లయితొలగించండి
 14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ధన్యవాదాలు.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘అవధాని+అక్కడ’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

  రిప్లయితొలగించండి
 15. కవనంబంతయు బ్యాటుగా మలచి ప్రజ్ఞాపాటవాలందగన్
  జవమున్ పృచ్ఛక కందుకాల్బడసి సిక్సర్లై సమస్యాదులా
  యవధుల్ దాటెడు పూరణల్గొనఁగ నాటౌటంచు కీర్తించగా
  నవధానం బొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్!

  రిప్లయితొలగించండి
 16. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  ఆలస్యంగా బ్యాటింగుకు వచ్చి నాటౌట్‍గా నిలిచి మ్యాచ్ గెలిపించుకున్నారు. పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. అశ్వత్థనారాయణ మూర్తి గారి పూరణ....

  అవలీలన్దగ పృచ్ఛకాష్టకము నాసాంతంబు సంధించు నా
  కవనాధార సమస్యలన్ మిగుల నేకాగ్రుండుగా నయ్యెడన్
  అవధానీశుడు పద్యకందుకములన్ హ్లాదంబు గా మోదగన్
  అవధానంబొక ట్వెంటిట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్.

  రిప్లయితొలగించండి
 18. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. మాస్టరుగారూ..ధన్యవాదములు....మీ సూచనతో...సవరించిన పద్యము....


  అవరుల్ మూడుగ టైముబెట్ట సభయం దష్టావధానమ్ములో
  యువబౌలర్లుగ ప్రశ్నలెన్నొ కవులే యోవర్లుగా వేయగా
  యవధానే ఘన పద్య పాదములతో నబ్బ్యాటు షాట్లివ్వగా
  నవధానంబొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్

  రిప్లయితొలగించండి
 20. వ్యవధే తక్కువ బ్యాట్సుమేనులకు వయ్యారమ్ముగా పిచ్చు పై
  నవలీలంగను బంతులన్ విసిరి వేయన్ సిక్సరుల్, ఫోర్లు కొ
  ట్టు విధమ్మున్ బలు పృచ్ఛకాగ్రజుల పట్టున్ జార్చు పద్యాలతో
  నవధానంబొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్

  రిప్లయితొలగించండి
 21. కవులున్ పృచ్ఛక చక్రవర్తులహహో గాఢంబుగా పోరగా
  లవలేశమ్మును మర్మమే యెరుగనిన్ రారాజులున్ బంటులున్
  చవటల్ చేరుచు కాఫికోసమచటన్ జాప్యమ్మునున్ కుందగా
  నవధానం బొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్

  రిప్లయితొలగించండి