చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘అహో| యొరిగెను’ అనండి. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘కతన’... టైపాటు వల్ల ‘కథన’ అయింది. ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, కరుణరసాత్మకమైన మీ ఖండిక చాలా బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘సంకటం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
కైకవరమ్ములడుగనా
రిప్లయితొలగించుతాకిడికిన్ గుప్పకూలె దశరధుడిలపై
కైకకు వందన మిడియా
కాకుత్స్ధుండడవికేగ కన్నీరొలకున్
వరమిచ్చిన పొరబాటుకు
రిప్లయితొలగించుకరుణించని కైక యెంత కాఠిన్య మహో
నొరిగెను నేలకు దశరధు
శరణంచును రాము డంత చాగిలి వెడలెన్
రిప్లయితొలగించుదా శరధి యట పినదల్లి దరికి జేరి
నీదు పంపున నేగుదు నేన డవికి
నమ్మ !పిన్నమ్మ ! యాశిసు లిమ్ము మికను
ననుచు జోడించి చేతులు వినతి జేసె
కైక వరముల కథన తా మైకమొంది
రిప్లయితొలగించుధరణి పైబడియె విభుడౌ దశరథుండు
తండ్రి గతి గన్న రామయ్య తరలి పోయె
నడవిలోనికి రయమున నాలితోడ
సతి కైకకు వరములనిడి
రిప్లయితొలగించుపతి గూలెను భూమి పైన పరితాపముతో
హితవు నెరింగిన రఘుపతి
నతులిడి మాతాపితలకు నరిగెను వనికిన్!!!
వరముల గోరితి రామా!
రిప్లయితొలగించుభరతుని జేయంగ చక్రవర్తిని, నిను స-
త్వరమే వనముల కంపగ
దురపిల్లెడి నీదు తండ్రి తోపక పల్కుల్.
-------
భరతున కీయ రాజ్యమును భావ్యమె కోరుట కాని యేలనో
వరమును కోరె కైక నిను వారిజ నేత్రుని నాదు ప్రాణమున్
వరసుగుణాభిరాము వనవాసము బంపగ పెక్కు వత్సరాల్
కరుణలు వీడి డెందమున కర్కశవాక్కుల కల్మషాత్మయై!
రామా! నిను వీడిన నే
నేమాత్రము బ్రదుక జాల నిక నీ భువిపై
ప్రేమామృత సాగర! యీ
రామను నను జంపి గొనవె రాజ్యము తనయా!
-------
అన్నా యిపుడే కైకను,
నన్నాపకు, చంపు వాడ నా ఖడ్గమునన్
నిన్నభిషిక్తుని జేయగ
మిన్నంటెడు సంబరముల మేలుగ పౌరుల్.
ముదుసలి రాజును భ్రాతా!
యిదె బందీ జేయువాడ నిప్పుడె నిన్నున్
ముదమార రాజు జేయగ
పద భరతుడు రాక మున్నె పావన నామా!
-------
లక్ష్మణా! నీకు కోపమ్ము లావు, తగదు
దూరుటల్ తల్లిదండ్రుల దోస మగును
మాతృహంతకుడను వాదు ప్రీతి యగునె?
తండ్రి బంధింప మేలొకో? తలప వలదె?
-------
నాయన శోక భారమున నాగల ప్రేముడి నిట్లుకుందులే
ఆయన బాగు జూచుకొను మమ్మ! వడిన్ వని కేగు వాడ నే
శ్రేయము గల్గు తమ్మునకు చేయుము రాజును వేడ్క నిమ్ము నా
కోయమ! యానతిన్ చనెద నూరడిలున్ తరువాత తండ్రియున్.
కైకవరమ్ము"రామునకుకష్టమటంచును తండ్రియూహ|లో
రిప్లయితొలగించుకైక.గుణాభిరాఘవుడు కానలకేగగ?లోకనింద|మా
కై కనుపించకున్న?నిల కామితసిద్ధికిలోటుగాద?మూ
కై|కలలోననిల్చితిని|కర్మయటంచు నయోద్యరాజనెన్"|
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుదశరథ|ధర్మబంధమిది|దాచినదాగనిధర్మసంకటం|
రిప్లయితొలగించువశమునుగాని కైక,వరపంతమునందు-నయోధ్యరాజుకే
దశదిశ మార్చగా?విధివిధానములెంతటి క్రూరమైన దు
ర్దశ?పరిహారముంచెగద?రాముని రాజుగ జేయనీయకన్|.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించుమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘అహో| యొరిగెను’ అనండి.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘కతన’... టైపాటు వల్ల ‘కథన’ అయింది.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
కరుణరసాత్మకమైన మీ ఖండిక చాలా బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘సంకటం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
Guruvugaaroo dhanyavaadaalu.
రిప్లయితొలగించు