రాజేశ్వరి అక్కయ్యా, ‘నామరూపాల కందని భగవంతునిది ఏ వంశమూ కాదు, అన్ని వంశాలూ అతనివే’ అంటూ మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు. మొదటి పాదానికి అన్వయం? ***** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. కౌరవ పాండవులు చంద్రవంశజులు కాని కృష్ణుడు కాదు.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. కాని కృష్ణుడు చంద్రవంశీయుడు కాడు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ధర్మరాజు ఏకపత్నీవ్రతుడు కాడు. ద్రౌపదితో పాటు దేవిక అనే భార్య ఉంది. ***** రాజేశ్వరి అక్కయ్యా, ధన్యవాదాలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
సూర్యవంశం : సూర్యవంశాన్ని ఇక్ష్వాకువు స్ఠాపించాడు. కనుక ఈ వంశాన్ని ఇక్ష్వాకు వంశమని కూడా అందురు. రామాయణంలో శ్రీరాముడు, జైనమతాన్ని స్థాపించిన వర్ధమాన మహావీరుడు ఈ వంశానికి చెందినవారు. పంజాబి క్షత్రియులైన కత్రియులు, రాజస్థానీ క్షత్రియుల్లో 10 రాజపుత్ర తెగలు, ఆంధ్ర ప్రదేశ్ లో రాజులు (ఆంధ్ర క్షత్రియులు) ఈ వంశానికి చెందినవారు. చంద్రవంశం : క్రీస్తు పూర్వం సుమారు 3000 సంవత్సరాల క్రితం జీవించిన శ్రీకృష్ణుడు చంద్రవంశంలో గొప్పవాడు. చంద్రవంశంలో వృషిణి తెగకు చెందిన శ్రీకృష్ణుడు వేద వ్యాసుడు వ్రాసిన మహాభారత గ్రంధంలో భగవంతుడిగా పేర్కొనబడ్డాడు. అగ్నివంశం : బధారియ, చౌహాన్, పరిహార్, పన్వర్ మరియు సోలంకి మొదలగు తెగలు అగ్నివంశానికి చెందినవి. ఆజ్మీరు ను పరిపాలించిన పృధ్వీరాజ్ చౌహాన్ అగ్నివంశంలో గొప్పవాడు, ఆఖరివాడు. ఆంధ్రప్రాంతమునందు వీరిని "అగ్నికులక్షత్రియులు" అందురు. నాగవంశం : నాగుపాములను పూజించే తెగ నాగవంశం. వీరు ప్రధానంగా శైవులు. వీరిలో నైర్, బంట్, సహారా, బైస్, నాగ, తక్షక, జాట్ తెగలు ఉన్నాయి.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ సవరణ బాగుంది. అభినందనలు. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, చాలా శ్రమపడి విషయ సేకరణ చేసి అందించారు. ధన్యవాదాలు. పరిశీలించి నా అభిప్రాయాన్ని తెలుపుతాను.
విష్ణు శాపవ శంబున వెలసె నరుడు
రిప్లయితొలగించండిరఘు కులంబున జనియించి రాఘ వుండు
నొక్క వంశజు డననేల నిక్క ముగను
నవత రించిన యవనిపై యాద్యు డతడు
చంద్ర వంశ్యుఁడు శ్రీరామ చంద్రుఁడు గద
ధర్మ సూక్ష్మములెరగిన ధర్మరాజు
రిప్లయితొలగించండిచంద్రవంశ్యుఁడు - శ్రీరామచంద్రుఁడు గద
భువిని భాస్వంత కులమున పుట్టినట్టి
ధర్మ రక్షకుండైనయా దైవమనగ
కంసవైరి శ్రీకృష్ణుడు కంబుధరుడు
రిప్లయితొలగించండిచంద్రవంశ్యుఁడు, శ్రీరామ చంద్రుఁడుగద
సూర్య వంశపు తిలకుడై సొంపుగూర్చె
ఘనుడు రెండు వంశములను కమలవిభుడె
నల్ల దేవర కృష్ణుడు నగధరుండు
రిప్లయితొలగించండిచంద్ర వంశ్యుఁడు, శ్రీరామచంద్రుడుగద
ధర్మ రక్షణ జేయంగ ధరణి లోన
సూర్య వంశమున జనించె సురుచిరముగ!!!
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండి‘నామరూపాల కందని భగవంతునిది ఏ వంశమూ కాదు, అన్ని వంశాలూ అతనివే’ అంటూ మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు.
మొదటి పాదానికి అన్వయం?
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
కౌరవ పాండవులు చంద్రవంశజులు కాని కృష్ణుడు కాదు.
శైలజ గారూ,
రిప్లయితొలగించండిపద్యం బాగుంది. అభినందనలు.
కాని కృష్ణుడు చంద్రవంసస్థుడు కాదు.
కృష్ణుని వంశం ఏమిటి?
తొలగించండిమిత్రులు శ్రీకంది శంకరయ్యగారికి, సుకవిపండితమిత్రబృందమునకు నమస్కారములతో...
రిప్లయితొలగించండిశ్రీరాముఁడు చంద్రవంశజుఁడని పొరపాటుగా బోధించిన తెలుఁగు పండితుఁడు, తన తప్పును సమర్థించుకొనుచుఁ బలికిన సందర్భము)
చంద్రముఖ, చంద్రసుషిమ, సుచంద్రదీప్తి,
చంద్రధవళితసత్కీర్తి, చంద్రగరిమ,
చంద్రసత్వగుణాంచితచాతురిఁ గనఁ
జంద్రవంశ్యుఁడు శ్రీరామచంద్రుఁడు గద!!
దశరథ సుతుండు నిత్య సత్య వ్రతుండు
రిప్లయితొలగించండిధరణిజా మనోహరుఁడు కోదండధరుఁడు
సకల సుగుణాభిరాముఁ 'డిక్ష్వాకు రాజ
చంద్ర ' వంశ్యుఁడు శ్రీరామచంద్రుఁడు గద.
( ఇక్ష్వాకు రాజ చంద్రుని వంశానికి చెందిన వాడు శ్రీరామ చంద్రుడని అన్వయం. )
సుకవిచంద్రులు శ్రీవిష్ణునందన్‍గారి పూరణము మిగులఁ జక్కఁగనున్నది. అభినందనలు!
రిప్లయితొలగించండిగుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
డా. విష్ణునందన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మాన్యులు శ్రీ మధుసూదన్ గారి సౌహార్ద సౌజన్యాలకు బహుధా ధన్యవాదాలు...
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిసూర్యచంద్రులు కర్మసాక్షులు గనుకను
జననమందెను శ్గీరాము డినకులమున
దనుజ తిమిరముల్ రేయి నంతమ్ము జేయ
చంద్ర వంశ్యుఁడు శ్రీరామచంద్రుఁడు గద.
కంస మర్దను డైనట్టి కన్నడు మఱి
రిప్లయితొలగించండిచంద్ర వంశ్యుడు శ్రీ రామ చంద్రుడు గద
సూర్య వంశాన బుట్టిన శూరు డా ర్య !
వంద నంబులు వారికి బహుళ ముగను
పాండవాగ్రజుండు నిజమె పలుకు వాడు
రిప్లయితొలగించండినేక పత్నీవ్రతము వీడనిష్టపడడు
ధర్మమూర్తిగ దలచెడు ధర్మజుండు!
చంద్రవంశ్యుఁడు, శ్రీరామచంద్రుడు గద!
(ధర్మ రాజు శ్రీమచంద్రునిలాంటివాడను భావం)
నమస్కారములు
రిప్లయితొలగించండిమొదటి పాదము " దేవాసుర యుద్ధము నందున బృగు మహఋషి పత్నిని విష్ణువు శిరచ్చేదము చేయగా విష్ణువును బృగువు నరుడిగా పుట్టి సతీ వియోగమును అనుభవించమని శపించాడట . అదన్నమాట
సూర్యుడేలేక చంద్రుని చూడగలమ?
రిప్లయితొలగించండిచంద్రుడేలేక వంశముల్ సాగనగున?
వంశమేదేని అంశ ప్రశంశ మైన
చంద్ర|వంశ్యుడు శ్రీరామచంద్రుడుగద?
సూర్య చంద్రులె నేత్రాలు చూడగాను|
చంద్ర వంశము సూర్యవంశంబన?మన
కేది సరిపడకన్ను నీకేది యనుట?
చంద్రవంశ్యుడు శ్రీరామచంద్రుడుగద|
రామ "చంద్రుడుపేరున రాకఏల?
వంశజుడవేగ అనగలఅంశమదియె|
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. కాని కృష్ణుడు చంద్రవంశీయుడు కాడు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధర్మరాజు ఏకపత్నీవ్రతుడు కాడు. ద్రౌపదితో పాటు దేవిక అనే భార్య ఉంది.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
ధన్యవాదాలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
రిప్లయితొలగించండిపాండవాగ్రజుండు నిజమె పలుకు వాడుఁ
దా నజాతశత్రువనంగ దనరు వాడు
ధర్మమూర్తిగ దలచెడు ధర్మజుండు!
చంద్రవంశుఁడు, శ్రీరామచంద్రుడు గద!
సూర్యవంశపు వారాసి సుధలు గురిసె
రిప్లయితొలగించండిదశరధాత్మజు డాతండ్రి త్రాత యయ్యె
రాజితుండౌచు వెలుగొందు రఘువు కులపు
చంద్రవంశ్యుడు శ్రీరామచంద్రుడు గద!
జనకుడాతడు సీతకు జనకుడొప్పె
చంద్రవంశ్యుడు-శ్రీరామచంద్రుడు గద
సూర్యవంశపు వాడగు శోభనుండు
సీతరాముని పెండ్లాడ చెలగి వెలుగు
సూర్య కులమున కాతడు సొగసు తొగయు
జనకజాతకు నాతడు చందమామ
లోకపాలన చంద్రుడు లోకులకును
చంద్రవంశ్యుడు శ్రీరామ చంద్రుడు గద!
సూర్యచంద్రులు నింగిని శోభ వెలుగ
రెండు వంశాలు నొక్కటై రేగ కాంతి
రామ,సీతల కల్యాణ రమ్యఘడియ
చంద్రవంశ్యుడు శ్రీరామ చంద్రుడు గద
సూర్యచంద్రులు కన్నులౌ సొగసు విభుడు
సూర్యవంశాన జాబిలౌ సుతుడు నౌచు
దశరధునకెప్డు ప్రాణమై తనరు సుధల
చంద్రవంశ్యుడు శ్రీరామ చంద్రుడు గద
రఘు కులాబ్ధికి చంద్రుడౌ రమణుడతడు
దానవాళికి సూర్యుడై ధరను గూల్చి
సీతమాతకు చంద్రుడై చింతదీర్చు
చంద్రవంశ్యుడు శ్రీరామ చంద్రుడు గద
సూర్యవంశపు వారాసి సుధలు గురిసె
రిప్లయితొలగించండిదశరధాత్మజు డాతండ్రి త్రాత యయ్యె
రాజితుండౌచు వెలుగొందు రఘువు కులపు
చంద్రవంశ్యుడు శ్రీరామచంద్రుడు గద!
జనకుడాతడు సీతకు జనకుడొప్పె
చంద్రవంశ్యుడు-శ్రీరామచంద్రుడు గద
సూర్యవంశపు వాడగు శోభనుండు
సీతరాముని పెండ్లాడ చెలగి వెలుగు
సూర్య కులమున కాతడు సొగసు తొగయు
జనకజాతకు నాతడు చందమామ
లోకపాలన చంద్రుడు లోకులకును
చంద్రవంశ్యుడు శ్రీరామ చంద్రుడు గద!
సూర్యచంద్రులు నింగిని శోభ వెలుగ
రెండు వంశాలు నొక్కటై రేగ కాంతి
రామ,సీతల కల్యాణ రమ్యఘడియ
చంద్రవంశ్యుడు శ్రీరామ చంద్రుడు గద
సూర్యచంద్రులు కన్నులౌ సొగసు విభుడు
సూర్యవంశాన జాబిలౌ సుతుడు నౌచు
దశరధునకెప్డు ప్రాణమై తనరు సుధల
చంద్రవంశ్యుడు శ్రీరామ చంద్రుడు గద
రఘు కులాబ్ధికి చంద్రుడౌ రమణుడతడు
దానవాళికి సూర్యుడై ధరను గూల్చి
సీతమాతకు చంద్రుడై చింతదీర్చు
చంద్రవంశ్యుడు శ్రీరామ చంద్రుడు గద
శ్రీరావిరంగారావుగారుకోరిన"బొట్టు"శీర్షికకుతేటగీతలు
రిప్లయితొలగించండి----------------------------------
చెమటబొట్టును గార్చక సంపదగున?
నూనెలేనట్టి ప్రమిదయునుండిఫలమ?
"కట్టుబొట్టులు కన్యకుపట్టునిచ్చు|.
బొట్టుకాటుక కందమేచుట్టుకొనును
నుదిటిబొట్టుకు నూరేళ్ళు నుంచు బ్రతుకు|
ఎదుటి వారికిమమతలు నెదురుపదును
నవ్వుమోముకు బొట్టు|ఓపువ్వునవ్వు
గంధ పరిమళ మందించు కనులమధ్య
పగటి బొట్టుగ సూర్యుడు సొగసు నింప?
నింగి నిశి కుంచు చంద్రుడు నిలువుబొట్టు|
తాళిబొట్లుగ ప్రకృతి తలచుతగును|
హల్లుతలకట్టులా బొట్టు అందమొసగు
బొట్టుబెట్టెడి వనితల కట్టడందు
ప్రేమ,ననురాగబంధమ్ము పెరుగుచుండు|
పసుపు,కుంకుమ సౌభాగ్యవతిని జేయు|
బెట్టుసేయక బొట్టుంచు పట్టుగాను|
బొట్టుగాడికి బొట్టున్న?పోట్టిగున్న
బట్టలూడిన దిష్టియు బట్ట దనుచు
తల్లితనవంతు బొట్టుగా తపనగుంచు
దోష రహితంబు బొట్టు సంతోష బరచు|.
---------------------------
మన హైందవ చరిత్రలో బహు శ్రేష్ఠ మైనవి సూర్య, చంద్ర వంశాలు. సూర్యవంశం అంటే శ్రీరాముడు గుర్తుకొస్తాడు. అదే చంద్ర వంశం అంటే మహాభారత దృష్టిలో పాండవులు, మహాభాగవత దృష్టిలో పరీక్షిత్తు, రెండింటి దృష్టిలోను కృష్ణుడు గుర్తుకొస్తారు. ఒక మారు శ్రీకృష్ణ పరంగా చంద్ర వంశ మహా పురుషులను తలచుకుందాం. - నవమ స్కంధము
రిప్లయితొలగించండిచంద్ర వంశం
శ్రీకృష్ణుని పితృ తరాలు
(53) జగన్నాథుడు – నాభి కమలము – (52) బ్రహ్మ – (51) అత్రి – (50) చంద్రుడు - (49) బుధుడు (బృహస్పతి భార్య తార అందు) ~ (48) ఇళాకన్య (మనువు శ్రాద్దదేవుడు ~ శ్రద్ద సంతానం) – (47) పురూరవుడు ~ ఊర్వశి – (46) 1 ఆయువు
(45) 1-1 నహుషుడు – యయాతి ~ 1 దేవయాని, 2శర్మిష్ఠ
(44) యయాతి ~ 1 దేవయాని – (43) యదువు
యదు వంశం
(42) 2 క్రోష్ణువు –(41) వృజినవంతుడు – (40) శ్వాహితుడు – (39) భేరుశేకుడు – (38) చిత్రరథుడు -(37) శశిబిందుడు – (36) పదివేల పుత్రులలో ముఖ్యుడు పృథుశ్రవుడు – (35) ధర్మజుడు – (34) ఉశనుడు – (33) రుచికుడు -
(32) 5 జ్యాముఖుడు ~ శైబ్య – (31) విదర్భుడు –
(30) 2 కృథుడు – (29) కుంతి – (28) దృష్టి – (27) నిర్వృతి – (26) దశార్హుడు – (25) వ్యోముడు –(24) జీమూతుడు – (23) వికృతి – (22) భీమరథుడు – (21) నవరథుడు – (20) దశరథుడు – (19) శకుని – (18) కుంతి – (17) దేవరాతుడు – (16) దేవక్షత్రుడు – (15) మధువు – (14) కురువశుడు – (13) అనువు – (12) పురుహోత్రుడు – (11) అంశువు – (10) సాత్వతుడు –
(9) అంధకుడు – (8) 1 భజమానుడు – (7) విడూరథుడు – (6) శిని – (5) భోజుడు – (4) హృదికుడు
(3) 1 దేవమీఢుడు (శూరుడు) ~ మారిష
(2) వసుదేవుడు ~ దేవకి - (1) కృష్ణుడు
శ్రీకృష్ణుని మాతృ వంశం
(9) అంధకుడు – 2 కకురుడు – వృష్ణి – విలోమ తనయుడు – కపోతరోముడు – అనువు (తుంబురుడు సఖుడు) – దుందుభి - దవిద్యోతుడు – ఆపునర్వసువు –
ఆహుకుడు – 1 దేవకుడు,
(2) వసుదేవుడు ~ దేవకి -
(1) కృష్ణుడు
వంశాలు[మార్చు]
రిప్లయితొలగించండిక్షత్రియులకు వంశాలు నాలుగు. అవి ఏమనగా 1. సూర్యవంశం, 2. చంద్రవంశం, 3. అగ్నివంశం, 4. నాగవంశం.
సూర్యవంశం : సూర్యవంశాన్ని ఇక్ష్వాకువు స్ఠాపించాడు. కనుక ఈ వంశాన్ని ఇక్ష్వాకు వంశమని కూడా అందురు. రామాయణంలో శ్రీరాముడు, జైనమతాన్ని స్థాపించిన వర్ధమాన మహావీరుడు ఈ వంశానికి చెందినవారు. పంజాబి క్షత్రియులైన కత్రియులు, రాజస్థానీ క్షత్రియుల్లో 10 రాజపుత్ర తెగలు, ఆంధ్ర ప్రదేశ్ లో రాజులు (ఆంధ్ర క్షత్రియులు) ఈ వంశానికి చెందినవారు.
చంద్రవంశం : క్రీస్తు పూర్వం సుమారు 3000 సంవత్సరాల క్రితం జీవించిన శ్రీకృష్ణుడు చంద్రవంశంలో గొప్పవాడు. చంద్రవంశంలో వృషిణి తెగకు చెందిన శ్రీకృష్ణుడు వేద వ్యాసుడు వ్రాసిన మహాభారత గ్రంధంలో భగవంతుడిగా పేర్కొనబడ్డాడు.
అగ్నివంశం : బధారియ, చౌహాన్, పరిహార్, పన్వర్ మరియు సోలంకి మొదలగు తెగలు అగ్నివంశానికి చెందినవి. ఆజ్మీరు ను పరిపాలించిన పృధ్వీరాజ్ చౌహాన్ అగ్నివంశంలో గొప్పవాడు, ఆఖరివాడు. ఆంధ్రప్రాంతమునందు వీరిని "అగ్నికులక్షత్రియులు" అందురు.
నాగవంశం : నాగుపాములను పూజించే తెగ నాగవంశం. వీరు ప్రధానంగా శైవులు. వీరిలో నైర్, బంట్, సహారా, బైస్, నాగ, తక్షక, జాట్ తెగలు ఉన్నాయి.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ సవరణ బాగుంది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
చాలా శ్రమపడి విషయ సేకరణ చేసి అందించారు. ధన్యవాదాలు. పరిశీలించి నా అభిప్రాయాన్ని తెలుపుతాను.