21, ఏప్రిల్ 2015, మంగళవారం

పద్య రచన - 886

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. తులసిని గొలిచిన వారికి
    యలసట లేకుండ గాచు నారోగ్య మటన్
    విలువగు నౌషధ గుణములు
    గలిగిన యాతులసి మనల కాపాడు నిలన్

    రిప్లయితొలగించండి
  2. తులసి కోట చెంత ధూపదీపములతో
    పూజ చేసి పిదప పూలు దెచ్చి
    మాలగనొనరించి మమత తో నర్చించు
    మహిళ పొందు శుభము మహని జూడ.
    బల్లూరి ఉమాదేవి.
    21/4/15

    రిప్లయితొలగించండి
  3. తులసి పూజను సలుపగ మెలుతుకొకటి
    చిన్ని కృష్ణయ్య కనుపించె చెన్ను గాను
    నల్లనయ్యను కనుగొని నారి మనసు
    స్వర్గలోకముఁజేరెనుసంతసమున

    రిప్లయితొలగించండి
  4. ఉమాదేవిగారు ఒకే పద్యం ఎందుకు అన్నిసార్లు పంపించారో బోధపడడం లేదు.

    రిప్లయితొలగించండి
  5. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘వారికి నలసట’ అనండి.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మెలుతుక+ఒకటి’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘మెలత యొకతి’ అనండి.

    రిప్లయితొలగించండి
  6. ఒకేసారి పంపానండి.కాని "తెలుగువెలుగులు"అని కాక నాపేరుతో పంపాలని ప్రయత్నించడం వల్ల అలా జరిగింది.ఐనా నాపేరు రావడంలేదు.

    రిప్లయితొలగించండి
  7. ఉమాదేవి గారూ,
    ముందుగా మీ gmail తెరవండి. కుడిపక్కన ఒక చక్రం (Settings) కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే ఒక లిస్ట్ వస్తుంది. అందులో Settings (సెట్టింగులు) క్లిక్ చేయండి. కొత్త విండో తెరుచుకుంటుంది. పైన వరుసగా ఉన్నవాటిలో Accounts and import అన్న దానిని క్లిక్ చేయండి. వచ్చిన వాటిలో Send mail as అన్నచోట edit info అన్నదానిని క్లిక్ చేయండి. ఒక చిన్న బాక్స్ తెరుచుకుంటుంది. అందులో Name అని రెండు కాలమ్స్ ఉంటాయి. మొదటిలైన్‍లో your name in google accounts అని ఉంటుంది. దానిని అలాగే ఉంచండి. దానిక్రింద ఒక ఖాళీ బాక్స్ ఉంటుంది. అక్కడ బహుశా teluguvelugu అని ఉండి ఉంటుంది. ఉంటే దానిని తొలగించి అక్కడ ఇంగ్లీషులో కాని తెలుగులో కాని మీ పేరు టైప్ చేయండి (అక్కడ తెలుగులో టైప్ చేయడం వీలు కాకపోతే లేఖినిలోనో మరెందులోనైనా తెలుగులో టైప్ చేసి దానిని కాపీ చేసి ఇక్కడ పేస్త్ చేయండి). దానిముందున్న సర్కిల్ ను క్లిక్ చేయండి. తరువాత Save changes ను క్లిక్ చేయండి. అంతే... ఇకనుండి వ్యాఖ్యలలో మీ పేరు కనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  8. తులసి యనగ నది యేమని
    తెలిసిన దైవము, అరయగ తెలివిడితో గన
    ఇల వెలసిన దివ్యౌషధి
    వెలకట్టగ తలవలేని వేదము గీమున్

    రిప్లయితొలగించండి
  9. ప్రతి దినమున వేకువనే
    నతులిడి బూజించవలయు నయముగ తులసిన్
    వ్రతముగ గొలువగ నిటులన్
    నతులిత బుణ్యంబు గలుగు నతివల కిలలో!!!

    రిప్లయితొలగించండి
  10. సంధ్య సమయమందు సాంప్రదాయకమైన
    కట్టు,బొట్టుచేతకన్యమనసు
    తిలసిపూజజేయ విలువగుసౌఖ్యంబు
    కలుగుననెడి లోక పలుకు లాయె|

    రిప్లయితొలగించండి
  11. పల్లా నరేంద్ర గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వ్రరప్ప గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘సంధ్యాసమయము’ అని సమాసం చేయవలసి ఉంటుంది. ‘సందెవేళయందు...’ అనండి.

    రిప్లయితొలగించండి
  12. సత్య వివేకమే వదలి సంపదగర్వమునందు కృష్ణునే
    నిత్యము నిందజేయుచు ననేక విధంబుల తూచ నెంచ?ఆ
    సత్యముతప్పటంచు మనసందున భక్తిగ పత్ర,పుష్పమే
    పత్యమటంచునే తులసి పత్రముకే తులతూగె కృష్ణ్డుడే|

    రిప్లయితొలగించండి
  13. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. పీల్చెడిది ప్రాణవాయువు!
    పీల్చివదలఁ బ్రాణవాయువేనట! తులసీ!
    కొల్చెదమమ్మా! గృహమున
    నిల్చవె! కృష్ణప్రియ! గొను నీరాజనముల్!

    రిప్లయితొలగించండి
  15. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘నిలువవె, నిల్వవె’ సాధురూపాలు. ‘నిల్చవె’ అనడం దోషం.

    రిప్లయితొలగించండి
  16. గురుదేవులకు ధన్యవాదములు.
    సవరించిన పద్యం:
    పీల్చెడిది ప్రాణవాయువు!
    పీల్చివదలఁ బ్రాణవాయువేనట! తులసీ!
    కొల్చెదమమ్మా! గృహమును
    మల్చవె యారోగ్యమిచ్చి మాదైవమ్మై !

    రిప్లయితొలగించండి