జిగురు సత్యనారాయణ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగుంది. అభినందనలు. మొదటిపాదంలో గణదోషం. ‘భిక్షాటనమున తాతయె’ అనండి. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. ‘కలిసి+ఉన్నావా’ అన్నప్పుడు సంధి లేదు.
శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
అక్షరమది నేర్చినచో
రిప్లయితొలగించండిబిక్షము కోరెడి వెతలవి పెక్కుగ తీరున్
రక్షయగు కుక్షికి మరి వి
చక్షణను దెలుపు, చదువుకు సరి యిక గలదే!!
కుక్షిని నింపుట కొరకై
రిప్లయితొలగించండిభిక్షాటన చేయుతాత వెనుక మనుమడే
యక్షరములు దిద్దుకొనగ
దక్షతగల పౌరు డగుట తథ్యము సుమ్మా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబ్రతుకు బండిని లాగగ బండి యెక్కి
రిప్లయితొలగించండితాత మనుమడి భవితకు నూతమిచ్చె
బండి నీడనె చదువుల బడిగ మార్చి
వ్రాత నేర్చిన మనుమడె వ్రాత మార్చు!!
బిక్షాటన జేసి తాత
రిప్లయితొలగించండిరక్షణ గానీడ నిచ్చి రాతను మార్చన్
లక్షలు గడియించి పౌత్రుడు
లక్షణ మగుజీవి తమున రాజిల్ల వలెన్
ఆటల వయసున నిట భి
రిప్లయితొలగించండిక్షాటనలో తాత చెంత కలిసున్నావా
చాటుగ నీడన పఠనము
పాటవముగ జేయుచున్న పసి కుఱ్ఱాడా !
భిక్షాటన తో తాతయ
రిప్లయితొలగించండికుక్షిని నింపంగ బూనె కోరుచు బాబూ !
యక్షరములన్ని నేరిచి
శిక్షణతో పైకివచ్చి చేయందిమ్మా !
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం. ‘భిక్షాటనమున తాతయె’ అనండి.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘కలిసి+ఉన్నావా’ అన్నప్పుడు సంధి లేదు.
కుక్షిని నింపెడి తాతకు
రిప్లయితొలగించండిరక్షణ నీయంగ బాబు లక్ష్యము తోడన్
లక్షణముగ జదువుకొనుచు
తక్షణ సాయంబునీయ తనతో నుండెన్!!!
బండి మీదన తాతయ్య బండి వెనుక
రిప్లయితొలగించండినీడ యందున మనుమడు నిశ్చ లముగ
నుండె యిరువురు పటమున పండు ! చూడు
ఒకరు భిక్షాటనకు మఱి యొకరు చదువు
తోపుడుబండి తాతకు,హితోదిక-వృద్దికిసాయమవ్వగా?
రిప్లయితొలగించండిదాపునచిన్నవాడికి విధాతయుజేర్చిన మందిరమ్మె|ఆరూపముగాదుముఖ్యమట?రోజులుమార్చు
పునాదిలక్ష్యమే|
జూప?సరస్వతీ కృపయె|చోద్యముగాదుతపఃఫలంబదే|
బలపముబట్ట?బాలుడికి భాధ్యతదిద్డెను తాతగారు.ఆ
రిప్లయితొలగించండివిలువకుదారి,నీడనిడువింతగు బండియుతోడుగాగ?యే
మలినముకానరానిమహిమాన్విత విద్యకుసాధనంబుచే
ఫలితముబంచిపెట్టుగద|భావన భాగ్యమెబాల్య మెంచగా|.
కుష్టు రోగముతో తాత కష్ట పడుచు
రిప్లయితొలగించండిధనము యాచించు చుండెను, తనమనుమని
పెంచి చదివించ వలెనంచు నెంచిమదిని
చదువు చుండె కనుడు బిడ్డ సంతసముగ
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
చేతులఁజాపుచుతాతయె
రిప్లయితొలగించండినేతులఁ ద్రాపించ కున్న నేర్పగ చదువున్
రాతల మార్చవ తాతా!
చూతును పొత్తమ్మువైపు శ్రుతదేవి కృపన్!