23, ఏప్రిల్ 2015, గురువారం

సమస్యా పూరణము - 1656 (దనుజుల యిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
దనుజుల యిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ.

42 కామెంట్‌లు:

 1. కం.పాండిత్య ప్రకర్షగలిగి
  పండితుఁ డెందులకు పనికివచ్చు ధరిత్రిన్.
  మెండగు కవిత్వ ముజతగ
  యుండిన కవిపండితునిగ పొసగును మహిలో
  *********************************************
  గమనిక : పండితుని కంటే కవిపండితుడు మేలను అర్ధము లో .

  రిప్లయితొలగించండి
 2. కం.వనజభవుడొసగువరముచె
  ఘనముగ శక్తులనిగుడుచు కర్కశమతులై
  జనువారికిమోక్షమొసగ
  దనుజులయిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ

  రిప్లయితొలగించండి
 3. మనుజుల భక్తిని మెచ్చగ
  మనసిడి దీవించు నంట మాధవు డెపుడున్
  వనమున తపమొన రించెడి
  దనుజుల యిలవేల్పు చక్ర ధరుఁడగు హరియౌ

  రిప్లయితొలగించండి
 4. వినుమని పలికిన వినకయె
  మనమున హరియని తెలిసియు మాటయె నెలవై
  కొనుమని మూడడుగులిడెడి
  దనుజుల యిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ!!

  రిప్లయితొలగించండి
 5. కం. అనితర సాధ్యంబగుహరి
  యునికిని పోనాడగతమయున్మాదమునన్
  మనలేకశరణువేడిరి
  దనుజులయిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ.

  రిప్లయితొలగించండి
 6. కం. మునిజన సురగణ మానవ
  మనుగడ శ్రీహరి చరణము మహిలో యనగా
  మనమున గాఢము వేడిరి
  దనుజులయిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ

  రిప్లయితొలగించండి
 7. పిరాట్ల ప్రసాద్ గారూ,
  నిన్నటి సమస్యకు నేటి మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘జతగ నుండిన’ అనండి.
  ఈనాటి సమస్యకు మీ మూడు పూరణలు బాగున్నది. అభినందనలు.
  మొదటి పూరణలో ‘వరముచె’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ‘వరమున’ అంటే తృతీయార్థంలో సప్తమి బాగానే ఉంటుంది.
  మూడవ పూరణలో ‘మహిలో ననగా’ అనండి.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. తపమొనర్చే దనుజులకు హరి ఇలవేల్పు ఎలా అయ్యాడు?
  *****
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****

  రిప్లయితొలగించండి
 8. సనక సనందాదులు యా
  వనమాలిని జూడ నేగ వారింపంగన్
  మునులచె నసురులు కాగా
  దనుజుల యిలవేల్పు చక్రధరుడగు హరియౌ.
  డా.బల్లూరి ఉమాదేవి.
  23/4/15

  రిప్లయితొలగించండి
 9. మును " హరి " యించెను శ్రుతులను
  ఘనుడొక్కడు మానవతిని గద "హరి " యించెన్
  మనరు " హరి " యనక నిముసము
  దనుజుల యిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ.

  రిప్లయితొలగించండి
 10. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సనందాదులు+ఆ’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ ‘సనందాదులు నా’ అనండి. (సనందాదులున్+ఆ).
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. అనిశముపూజలు చేయుచు
  ననంతుని కరుణను పొందె నసురసుతుండే
  తనను నియతితో కొలిచెడు
  దనుజుల యిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ

  రిప్లయితొలగించండి
 13. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  అనిశము హరి యరి యనెగద
  దనుజుల యిలవేల్పు : చక్రధరుడగు హరి యౌ
  మనుజుల సురలకు దైవము
  కనుపించని యాతడె గద గాచు నిరతమున్

  తే 19/04/15 దీ నాటి సమస్య ( 1652 ) కు పూరణ
  1) కోడలి కిడకనే యత్త కొంటెగా ప
  కోడిని కరకర నమిలె ; కోడలమ్మ ,
  కార మెక్కువ గలదని కమ్మనైన
  తేనె నత్త కొసగి రుచి తెలియ జేసె
  2) అత్త కిడకనె యపరాత్రి నటుపయి ప
  కోడిని కరకర నమిలె కోడలమ్మ ;
  మెత్త నైనట్టి మనసున నత్త జూచి
  కార మెక్కువ యని పానకమ్ము నిచ్చె

  తే 22/04/15 దీ నాటి సమస్య ( 1655 ) కు పూరణ

  1) దండన చేయక శత్రుల
  మెండుగ సేమంబొనర్చి మెచ్చెడి జనులం
  దుండక మెలిగెడి భండన
  పందితు డెందులకు పనికి వచ్చు ధరిత్రిన్
  2) నిండగు విగ్రహ పుష్టిని
  కుండలముల దాల్చి నుదుట కుంకుమనిడు పా
  షాండుడు గర్విష్టి కుపిత
  పందితు డెందులకు పనికి వచ్చు ధరిత్రిన్


  రిప్లయితొలగించండి
 14. మనుజుల కలియుగమందున
  తన అభయమొసగె తిరుపతి తన కోవెలగను
  అనగ నఘము నల్లధనపు
  దనుజుల యిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ

  రిప్లయితొలగించండి
 15. అనునిత్యము హరి సేవలొ
  తనరెడు జయ విజయులు ప్రభు దయతో వరమున్
  గొని వైర భక్తి నెంచగ
  దనుజుల యిలవేల్పు చక్రధరుడగు హరియౌ!

  రిప్లయితొలగించండి
 16. కనియగ నఖిలమ్మునకున్
  మనికిని గల్గించు నతడె మాధవుడనుచున్
  మనుపును గోరుచు వేడెడి
  దనుజుల యిల వేల్పు చక్రధరుడగు హరియౌ!!!

  రిప్లయితొలగించండి


 17. అనువుగ వరముల నొసగును
  దనుజుల యిలవేల్పు.చక్రధరుఁడగు హరి,యౌ
  వనమద వరగర్విితులగు
  దనుజుల పరిమార్చు చుండు ధర్మము నిలుపన్

  రిప్లయితొలగించండి
 18. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీ పూరణలన్నీ నిర్దోషంగా, చక్కని ధారతో చాలా బాగున్నవి. అభినందనలు.
  మీ పద్యాలను పోస్ట్ చేసిన బి. సత్యనారాయణ మూర్తి గారికి ధన్యవాదాలు.
  *****
  పల్లా నరేంద్ర గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కందపద్యంలో రెండవ, నాలుగవ పాదాల చివరి అక్షరాలు తప్పనిసరిగా గురువులై ఉండాలన్న నియమాన్ని గుర్తుంచుకొనండి.
  రెండవపాదం చివర ‘కోవెలగన్’ అనండి.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘సేవలొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. అక్కడ ‘సేవను’ అనండి (తృతీయార్థంలో ద్వితీయ)
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘కనియగ, మనుపగ’ అన్నవాటిని ‘కనగా, మనగా’ అనండి.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. ప్రహ్లాదుడి తండ్రి స్వగతము:
  అనురాగము తోడ జెప్పిన
  వినడేలకొ, మానడెట్లొ విష్ణుని భజనన్
  దునుమనిచో శీఘ్రగతిన్
  దనుజుల యిలువేల్పు చక్రధరుఁడగు హరియౌ

  రిప్లయితొలగించండి
 20. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :

  అనునిత్యము హరి సేవను
  తనరెడు జయ విజయులు ప్రభు దయతో వరమున్
  గొని వైర భక్తి నెంచిన
  దనుజుల యిలవేల్పు చక్రధరుడగు హరియౌ!

  రిప్లయితొలగించండి
 21. ఊకదంపుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. టైపాటు కావచ్చు. ‘అనురాగముతోఁ జెప్పిన’ అని మీ ఉద్దేశం అనుకుంటాను.

  రిప్లయితొలగించండి
 22. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ
  పూరణ బాగున్నది.
  పూరణలో
  "గ నిక విచార మేలని"
  అన్నపుడు గణభంగమైనట్లుంది. మన్నించండి


  రిప్లయితొలగించండి
 23. గురువుగారూ మన్నించండి
  మీసూచన మేరకు సవరిస్తున్నాను.

  అనురాగముతోఁ జెప్పిన
  వినడేలకొ, మానడెట్లొ విష్ణుని భజనన్
  దునుమనిచో శీఘ్రగతిన్
  దనుజుల యిలువేల్పు చక్రధరుఁడగు హరియౌ

  మత్+అనుజుల అనికూడ పూరింప వీలుందాండీ

  భవదీయుడు
  ఊకదంపుడు

  రిప్లయితొలగించండి
 24. ఊకదంపుడు గారూ,
  ‘మదనుజుల...’ అని నిరభ్యంతరంగా పూరించవచ్చు. మంచి ఆలోచన.. దీనిని నేను వినియోగించుకోవచ్చా? (అక్కడ అఖండియతి అవుతుంది. అఖండయతిని ఎవరు ప్రయోగించినా నేను అభ్యంతరం చెప్పను. కాని నేను ఉపయోగించలేదు. ఈసారికి కానిద్దామని!)

  రిప్లయితొలగించండి
 25. గురువుగారికి ప్రణామములు , సరిగ్గా మీరు సూచిన్చినవే నేను ముందు అలానే వ్రాసానండి కాని ఎందుకో మరచినాను.మీరు చెప్పినవన్నీ మార్పు తొ నాదగ్గర వున్నా copy లో మార్చినాను .మీరు చెప్పిన మత్ +అనుజులు కూడా ఊహించాను కాని సాహసం చేయలేదు. clarification ఇచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు.

  ధన్యోస్మి

  రిప్లయితొలగించండి
 26. guruvu gArU,
  nirabhyaMtaraM gA upagOyiMcukOvaccu.
  adagavalasina avasaramE lEdu.
  BavadIyuDu
  UkadaMpuDu

  రిప్లయితొలగించండి
 27. వినవే ప్రహ్లాదా! నీ
  వనయము మన బద్ధవైరి హరి నెన్నుదువే
  నిను జంపించెద నెవ్విధి
  దనుజుల యిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ?

  రిప్లయితొలగించండి
 28. దనుజుడు ప్రహ్లాదుడు మఱి
  యనయము గీ ర్తించు చుండె నామహి తాత్మున్
  మనమున నాలో చించగ
  దనుజుల యిలవేల్పు చక్ర ధరుడగు హరియౌ

  రిప్లయితొలగించండి
 29. సంజయునితో ధర్మరాజు....

  వనవాసమ్మున క్షేమ
  మ్మును మఱి యజ్ఞాతవాసమున రక్షణ ని
  చ్చెను సదయుండై నాకు మ
  దనుజుల యిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ.

  (ఊకదంపుడు గారికి ధన్యవాదాలతో)

  రిప్లయితొలగించండి
 30. ఊకదంపుడు గారూ,
  ఏమిటో మతిమరుపు ఎక్కువైపోతున్నది. ‘భవదనుజుల’ అని అశ్వత్థనారాయణ మూర్తి గారి పూరణ ప్రొద్దున్నే వచ్చింది. మరిచిపోయాను.
  వారి పూరణ మూడవ పాదాన్ని ‘గ నిక విచార మ్మేలని’ అనవచ్చు. కాని ‘ఏల+అని’ అన్నప్పుడు యడాగమం రావాలి.

  రిప్లయితొలగించండి
 31. మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 32. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 33. నమస్కారములు
  బలి చక్రవర్తికి వామనుడిగాను , ప్రహల్లాదుడుకి నరసిం హుడు గాను ఇలా దనుజులకైనా మనుషుల కైనా మోక్షమిచ్చేది హరియె కదా ! హరిహరులిద్దరు ఒక్కటే కదా ! అదన్నమాట నా ఉద్దేశ్యం .పొరబడితే ఏముంది మన్నించడమే మరి

  రిప్లయితొలగించండి
 34. ఊకదంపుడు గారూ అవునండీ, నావద్ద సరి చేశాను కానీ ఇందులో మరచాను
  హరియౌ గనిక న్విచార మేలని
  ఇప్పుడు సరిపోయింది కదండీ.
  కృతజ్ఞతలు

  రిప్లయితొలగించండి
 35. అనుమానమేల? హరుడే
  దనుజుల యిలవేల్పు - చక్రధరుడగు హరియౌ
  ను నిశాచరులకు శత్రువ
  వనిని యవతరించె వారి పని పట్టుటకై

  రిప్లయితొలగించండి
 36. విను ధర్మజ నీకును భవ
  దనుజులకు ఇలవేల్పు చక్రధరుఁడగు హరియౌ
  గ నికన్ ఊరట గొనుమని
  యనుచు ధౌమ్యుడు పృథాసుతాగ్రజుఁ వినిచెన్

  రిప్లయితొలగించండి
 37. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  ‘దనుజుల యిలవేల్పు’ అని ఉండాలి. ‘ఇకన్+ఊరట= ఇక నూరట’ అవుతుంది. పద్యం మధ్య అచ్చు వ్రాయరాదు.

  రిప్లయితొలగించండి
 38. జనులు తమోగుణములచే
  జననం బొందగ నిట కలిజగతిన కారే
  మనుజాధములసురుల్? యీ
  దనుజుల యిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ

  మనుజులు దనుజులైననూ, మానవకులదేవత మాత్రం హరియే కదా అని.

  రిప్లయితొలగించండి
 39. మనుజుల మనముల సతతము
  తినుచును శాంతియు సుఖమును తిరుగెడి యరులన్
  కనుగొని జయమొందగ నీ
  దనుజుల, యిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ

  రిప్లయితొలగించండి
 40. కనుగొని వ్యర్థపు వైరము
  ఘనమౌ భాజపను జేరి కమలము నందున్
  మనముల గూర్చెడు కాంగ్రెసు
  దనుజుల యిలవేల్పు చక్రధరుఁడగు హరియౌ

  చక్రధరుడు = నరేంద్ర దామోదర్ (మోడి)

  రిప్లయితొలగించండి