13, ఏప్రిల్ 2015, సోమవారం

సమస్యా పూరణము - 1646 (వ్యసనము వేయిరీతుల శుభప్రదమై యశ మందఁజేయురా)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
వ్యసనము వేయిరీతుల శుభప్రదమై యశ మందఁజేయురా.

25 కామెంట్‌లు:

  1. పసగల పద్యమల్లుటది బాగుగ నేర్చి కవిత్వమందునన్
    పొసగగపట్టు చేసెదవు పూరణ లెట్టి సమస్య కేనియున్
    రసధుని పాఱినట్లునిక వ్రాయుచు నందు నిమగ్నమౌదువీ
    వ్యసనమువేయిరీతుల శుభప్రదమై యశమందఁజేయురా

    రిప్లయితొలగించండి
  2. రసధుని వంటి బ్లాగు మన లాక్షణి కుండగు శంకరార్యులున్
    విసుగను మాట లేకను గవేషణ జేయుచు పద్య కావ్యముల్
    రసమయ వీధు లందునను రాగము చిందుచు సంచరించగా
    వ్యసనము వేయి రీతుల శుభప్రద మైయశ మందఁ జేయురా

    రిప్లయితొలగించండి
  3. భసితము గావె పాపములు భాగవతంబు పఠించినంత సం
    తసమును బొందదే మనసు తత్త్వ విచారము జేసినంత రా
    క్షస గుణమంత నాశమగు గావున దీనిని వీడనందువీ
    వ్యసనము వేయిరీతుల శుభప్రదమై యశమందజేయురా

    రిప్లయితొలగించండి
  4. కసమసలేక నిష్టగను కవ్వడిమిత్రు సదా తలంచుచున్
    విషమయమైన మార్గమును వీడి వసించుచునున్న వాని ని
    ర్వ్యసనము వేయురీతుల శుభ ప్రధమై యశమందఁజేయురా!
    మసురలతోడ నిత్యమును మానమువీడి చరించ కీడగున్

    రిప్లయితొలగించండి
  5. వ్యసనములన్న నెన్నడును పట్టును పట్టిన వీడకున్నదౌ
    పసగల యర్థమున్న పలు భాగ్యములిచ్చెడు గ్రంథమొక్కటిన్
    రసనముఁ గల్గు పద్ధతిని వ్రాయగనెంచెద, దీవనమ్మదై
    వ్యసనము వేయిరీతుల శుభప్రదమై యశ మందఁజేయురా.

    రిప్లయితొలగించండి
  6. వ్యసనము రామనామ మది వార్నిధి దాటగ జేసె మారుతిన్
    వెస గన జేసె జానకిని భీకర కీలల లంక నంతయున్
    మసినుసి జేసి దానవుల మర్దన జేయగ జేసె నెన్న స-
    ద్వ్యసనము వేయిరీతుల శుభప్రదమై యశ మందఁజేయురా.

    రిప్లయితొలగించండి
  7. వ్యసనము-రెండు.రూపములు భక్తికి,భుక్తికి-యుక్తిమార్గమే
    మసలగజేసి-మంచిగను-మానవతత్వము నిల్పునట్లుగా
    రసమయభావనాపటిమరాగ?సజావుగ ధర్మరక్షతా
    వ్యసనమువేయిరీతులశుభ ప్రధమై యశమందజేయురా
    పసితనమందువిద్యపరిపాటిగజాతికిమేలుగూర్చుటే|
    పసజెడు సంస్కృతుల్నిలుపుపద్ధతులందునవెళ్లుమార్గముల్
    కసియనుమాటకర్థమును గానక|జేసెడిమంచికార్యపున్
    వ్యసనమువేయి రీతుల శుభప్రధమై యశమందజేయురా|

    రిప్లయితొలగించండి
  8. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    వైవిధ్యమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. దశతిరుగ! ధ్యాన మనెడు క
    లశ వ్యసనము వేయి రీతుల శుభప్రదమై
    యశమంద జేయురా! పర
    వశమందెడు యోగవిద్య పాల్గొన రండీ!

    రిప్లయితొలగించండి
  10. గురువు గారూ నాపూరణ కూడా పరిశీలించండి.

    రిప్లయితొలగించండి
  11. వ్యసనము రెండురీతులగు,బాగుగ మంచివి,చెడ్డవౌను దు
    ర్వ్యసనము కీడు గూర్చుచును పాయగ జేయును కీర్తి,లక్ష్మి స
    ద్వ్యసనము కీర్తి దెచ్చు,నది భాసిల జేయును సంఘమందు,నా
    వ్యసనము వేయి రీతుల శుభప్రదమై యశమంద జేయురా!

    వ్యసనము విద్యలందునను భాసిల,నయ్యది కీర్తి దెచ్చుగా
    వసనము,కూడు,వాసముల బాగుగ గూర్చును,సంఘమందునన్,
    నసమపు గౌరవంబిడును,నంతటి గొప్పది తానుపొంద,నా
    వ్యసనము వేయి రీతుల శుభప్రదమై యశమంద జేయురా!

    వ్యసనము జూదమున్,మదిర పానము,వేటయు నాది మెల్గ నా
    వ్యసనము లందగా నిలను,పాడగు దేహము,సంపదల్ తగన్
    వ్యసనము సత్యశౌచములపాలన జేయగనుండువాని కా
    వ్యసనము వేయిరీతుల శుభప్రదమై యశమంద జేయురా!

    వ్యసనము కైతలల్లుటది పాండితితోడ,యశంబు గూర్చు,తా
    నసమపు కావ్య రాజముల నందును కీర్తిని శాశ్వతంబుగా
    దొసగును పారద్రోలునది,దొడ్డది యౌనుగ నల్ల కైత,నా
    వ్యసనము వేయిరీతుల శుభప్రదమై యశమంద జేయురా!

    రిప్లయితొలగించండి
  12. కుసుమములందు తేనియను గ్రోలుచు తుమ్మెద లుండునట్లు నీ
    రసమును బొందకుండ రసరమ్యత నిచ్చెడు బుద్ధిఁ గోరుచున్
    వెసగను నేర్పమంచుఁ బలు విజ్ఞుల వద్దకుఁ బోవు నట్టి స
    ద్వ్యసనము వేయిరీతుల శుభప్రదమై యశమందజేయురా!

    రిప్లయితొలగించండి
  13. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    (ఎందుకో మీ పద్యం నా దృష్టిలో పడలేదు. మన్నించండి).
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    ఛందస్సుతో ఆడుకొనే స్థాయికి ఎదిగారు. చాలా సంతోషం.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కలశ వ్యసనము’ అన్నప్పుడు శ గురువై గణదోషం.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  14. ముసిముసి. నవ్వులున్ విరియ ముగ్దమనోహర గోపబాలికల్
    వ్యసనము జెందినారు కద యాదవ కృష్ణుని గానమందునన్
    నిసి యమునాతటిన్ సరస కృత్యము రాసను జేయ నేడు స
    ద్ వ్యసనము వేయిరీతుల శుభప్రదమై యశమందఁ జేయురా

    రిప్లయితొలగించండి
  15. దశరధ సుతునిగొలుచు లా
    లస వ్యసనము వేయిరీతుల శుభప్రదమై
    యశమందజేయురా నిల
    మసిజేయగ దోషములను మార్గంబదియే!!!

    రిప్లయితొలగించండి
  16. శైలజ గారూ - "స" కు "శ" కు ప్రాసమైత్రి లేదని నా అభిప్రాయము."స" కు "ష" కు మాత్రమే ప్రాసమైత్రి ఉన్నది.

    రిప్లయితొలగించండి
  17. కె.యస్.గురుమూర్తి ఆచారిగారిపూగణ
    రసమయమైన శంకరయ బ్లాగుకు పద్యము లంపునట్టి సద్
    వ్యసనమువేయిరీతుల శుభప్రదమై యశమందఁజేయు రా
    త్రి సమయమందు మేల్కోని నిరీక్షణ జేసి సమస్యబూరణం
    బు సలుపు సత్కవీంద్రులకు మ్రోక్కుట మేలగువేయిజేతులన్

    రిప్లయితొలగించండి
  18. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    కందంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    అన్నపరెడ్డి వారు చెప్పినట్లు స,శలకు ప్రాసలేదు.
    ‘జేయరా యిల’ అనండి.
    *****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. సహదేవుడు గారూ,
    సవరణకోసం అప్పుడే ఆలోచించాను కాని తోచలేదు. అందుకే వదలివేశాను.

    రిప్లయితొలగించండి
  20. పసితనమందు ధూమమును పానము జేయుట తీర్చిదిద్దగా
    ముసిముసి నవ్వులందునను ముద్దుల నీయక దార మొత్తగా
    తసదియ పీకలన్నిటిని దబ్బున కాల్వల త్రోయ, త్యక్తమౌ
    వ్యసనము, వేయిరీతుల శుభప్రదమై యశ మందఁజేయురా!

    రిప్లయితొలగించండి
  21. వసతికి నాల్గు సౌధములు బంజర హిల్సున కట్టుటందునన్
    కసిగొని నాల్గు భామలను కాపుర ముంచగ వాటిలోననున్
    తసదియ వోట్లు లాగుటకు దండుల దండుల డబ్బు కూర్చెడిన్
    వ్యసనము వేయిరీతుల శుభప్రదమై యశ మందఁజేయురా

    రిప్లయితొలగించండి