2, ఏప్రిల్ 2015, గురువారం

నిషిద్ధాక్షరి - 33

కవిమిత్రులారా,
అంశం- శ్రీకృష్ణుని రాయబారము.
నిషిద్ధాక్షరములు - క. చ, ట, త, ప.
ఛందస్సు - మీ ఇష్టము.
(అమరావతిలోని నెత్ సెంటర్ నుండి పోస్ట్ చేయబడింది)

38 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    శ్రీకృష్ణరాయబారము - పర్యవసానము :

    01)
    ______________________________

    అర్థ రాజ్యము నీకున్న - నధమముగను
    యన్నదమ్ముల కిమ్మనె - నైదు నాళ్ళు !
    యదుకులేశుని గాదని - యంతరించె
    ననుజు లందరి తోడ నా - యవని భర్త !
    ______________________________
    నాడు = ఊరు
    అవనిభర్త =రాజు(రారాజు)

    రిప్లయితొలగించండి
  2. కిశోర్జీ ! బహుకాల దర్శనం....కుశలమే కదా........తొందరపాటు లో నిషిద్ధాక్షరములను చూసినట్లు లేదు...

    రిప్లయితొలగించండి
  3. అర్ధ రాజ్య మీయ నసలు వలదనిన
    నైదు నూళ్ళ డుగగ నధమముగను
    నీల మణిని దూరి మేలును విడనాడి
    సమసె రాజరాజు సంగరమున !!!

    రిప్లయితొలగించండి
  4. రాయ బారిని ,.వెన్నుని రాజ రాజ !
    రాజ్య భాగము వారిది రయము గాను
    నిమ్ము లేని యెడల సమ రమ్ము నందు
    మరణ మయ్యది జరుగును మామ ! వినుము

    రిప్లయితొలగించండి
  5. రణమది యేలొ, మందుడవె? రాజ్యము నందున భాగమున్న నీ
    క్షణమునె యాగదే? వినుము క్ష్మావర, బీరము లేల? నయ్యహో,
    మిణుగురులౌ వెలుంగులను మేలని నమ్మిన వాడ! భూమినిన్
    మణిగణమై వెలుంగు యశమయ్యరొ బిడ్డలదౌను, మాయునే?

    రిప్లయితొలగించండి
  6. వినుము సుయోధనా! రణము వేదన మూలముగాదె వైరముల్
    గొనకొన వంశనాశనము ఘోరవిషాదములన్ మిగుల్చు గా
    వున నిదె సంధిజేసుకొని భూరియశంబుల వెల్గుమయ్య లే
    దన మరి సంగరంబున మహామహ వీరులె నిల్వఁజాలరే.

    రిప్లయితొలగించండి
  7. సాగరంబుకు మామగా సాగువాడు
    రాయబారిగ దెలిపిన?రాజరాజు
    విననివాడుగ మారగ?విజ్ఞు డగున?
    మూర్ఖులొనగూడు మార్గాన?మొండినెగడి|
    అన్నదమ్ముల భాగంబులరుగ వయ్య
    వినుము-ఐదూళ్లునొసగిన విందురయ్య
    ధర్మ మార్గంబె నియమంబు మర్మమెరిగి
    మామ|నామాటవినుమనె మామ మామ


    రిప్లయితొలగించండి
  8. శౌరి స్వయముగా వెడలెను శద్రి నగరి
    సోదరుని సూనుల వినయ శూరగుణము
    లెఱిగి బిడ్డల సంగ్రామ మేదు నటుల
    నంధ రాజుతో నుడువగ సంధి త్రోవ

    రిప్లయితొలగించండి
  9. రాజరాజ!నీవు రాజ్య భాగమిడమి
    నైదునూళ్ళనిడిన నదియె మేలు
    నవియు నీయవేని యనిని మడిసెదీవు
    భావిగనుము ననియె వాసవుండు

    నీదుబలము గనియు నిండైన గర్వాన
    నుండరాదు-నర్జునుండు నీదు
    బలము నణగజేయు-వాసిగా సంధిని
    గూర్పమేలునగును గులము నిలుప

    దామమదియ గొనియు దామోదరునివెస
    బంది చేయగనిన వాసవుడును
    విశ్వ వేద్యమైన విగ్రహానవెలిగె,
    నందరయెడ మోహమందగాను

    రిప్లయితొలగించండి
  10. శ్రీకృష్ణుడు సుయోధనునితో...

    దాయాదులు సగభాగము
    నీయమనిరి! లేదనిన నేవురు నేలన్
    న్యాయమ్మగు నైదూల్లిడ!
    నీయది ధర్మము! వలదన నెసలున్ బొసగున్!

    రిప్లయితొలగించండి
  11. సవరించిన పద్యము. (వివాదాస్పద క్ష లేకుండా)

    రణమది యేలొ, మందుడవొ? రాజ్యము నందొక భాగమైన స
    ద్గుణము నొసంగుమా! విడుము దుండగముల్, భ్రమలోన నుండు నీ
    మిణుగురులౌ వెలుంగులను మేలని నమ్మిన వాడ! భూమినిన్
    మణిగణమై వెలుంగు యశమయ్యది, యా విభవమ్ము మాయునే?

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులకు నమస్కృతులు...
    అమరావతినుండి ఉండవల్లి గుహలు, అక్కడినుండి మంగళగిరి వెళ్ళి పానకాల నరసింహస్వామిని దర్శించుకొని విజయవాడ మీదుగా ఇప్పుడే ఇల్లు చేరాను. ప్రయాణపు బడలిక వల్ల ఈనాటి పూరణల గుణదోష విచారణ చేయలేకపోతున్నాను. మన్నించండి.
    చక్కని పూరణలు చేసిన మిత్రు లందరికీ పేరుపేరునా అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. వసంత కిశోర్ గారూ,
    మీ పునరాగమనం చాలా సంతోషాన్ని కలిగించింది. హైదరాబాదులో మిమ్మల్ని కలుస్తానని చెప్పి మాట తప్పినందుకు మీకు నామీద వచ్చిన కోపం తగ్గిందనుకుంటున్నాను. అప్పటి పరిస్థితులు అలాంటివి. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  14. మామా! యన్నలు దమ్ములున్ నిజ మసామాన్యుల్ సురాంశుల్ గనన్
    భీమంబౌను రణంబు ధర్మ విజయంబే దాని గమ్యంబుగా
    నీ మోహంబును వీడవో గనియలౌ నిశ్శేషమై భాండజుల్ !
    ఏమౌనో మరి మీ భవిష్యములు వహ్నిజ్వాల రేగెన్ సభన్ !

    రిప్లయితొలగించండి
  15. శాస్త్రీజీ ! కుశలమే !
    మిస్సన్న మహాశయా ! కుశలమే !
    అమ్మాయి శాంతి కూడా కుశలమే !

    శంకరార్యా ! మీ మీద కోపమా ?
    అలాంటిదేమీ లేదు !
    శారీరక అనారోగ్యమునకు తోడు మానసిక ప్రశాంతత కరవై
    బ్లాగుకు కొద్దికాలం దూరమయ్యాను ! అంతే !

    రెండు అడుగులేస్తే కాళ్ళ నొప్పులు !
    కదిల్తే నడుము నొప్పి !

    అండమాను జైల్లో సింగిల్ సెల్ లో పెట్టి నట్టుంది- నా యిల్లు నాకే !

    మిత్రులందరికీ ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  16. ఉ. ముందుగరాయభారమునముఖ్యులవందనజేసిపైనవా
    రందరి మార్గమేమనది యందువసంధిని బూనిరమ్ములే
    దందువ నిన్నుగాచురణదక్షులుయెవ్వరులేరిటన్నయా
    నందుని ఖైదొనర్పసమనాధుడు యెవ్వడుయిజ్జగమ్మునన్
    (దుర్యోధనునికి హితవు చెప్పిన కృష్ణుని చుట్టి మట్టుబెట్టడం ఎవరితరము అన్న ధోరణి లో వ్రాసాను.)

    రిప్లయితొలగించండి
  17. శంకరార్యా !
    నిషిద్ధము" క చ ట త ప "లే గాని
    ఆ యా గుణింతములు కాదు గదా !
    కాదనే నా భావన !

    గోలివారికి ధన్యవాదములతో

    శ్రీకృష్ణరాయబారము - పర్యవసానము :

    01అ)
    ______________________________

    అర్థ రాజ్యము నీకున్న - నధమముగను
    యన్నదమ్ముల కిమ్మనె - నైదు నాళ్ళు !
    యదుకులేశుని గాదని - యడగె నాజి
    ననుజు లందరి తోడ, సం - యద్వరుండు !
    ______________________________
    నాడు = ఊరు
    అడగు = నశించు
    సంయద్వరుడు =రాజు(రారాజు)

    రిప్లయితొలగించండి
  18. నేను ఆ మీమాంస తోనే ఆయా గుణింతాలు కుడా పరిగణలోకి తీసుకొని వ్రాసినాను

    రిప్లయితొలగించండి
  19. గుణింతము గూడ నిషిద్ధమైనచో

    గోలివారికి ధన్యవాదములతో

    శ్రీకృష్ణరాయబారము - పర్యవసానము :

    01ఆ)
    ______________________________

    అర్థ రాజ్యము నిడవేని - యధమముగను
    నైదు యూళ్ళైన నిడరాదె - హాయి నిలువ !
    యవనవైరిని గాదని - యడగె నాజి
    ననుజు లందరి సరస, సం - యద్వరుండు !
    ______________________________
    యవనవైరి = శ్రీకృష్ణుడు
    అడగు = నశించు

    రిప్లయితొలగించండి
  20. నల్లనయ్య రయమ్మున నాగ నగరి
    వెడలె మాన్యులైన సఖుల వేదనలను
    నిండుసభ నందున నుడివి, నేరుగాను
    సంధి యొనగూడు మార్గమ్ము సాగదీయ

    రిప్లయితొలగించండి
  21. శంకరార్యా !
    చూస్తే, వ్రాయకుండా ఉండలేనని
    ఈ మధ్య బ్లాగు చూడడం కూడా మానేయడం వలన

    కాకరకాయ-కీకరకాయ అయినట్టుంది నా పరిస్థితి !

    దయచేసి నిషిద్ధాక్షరి నియమముల నొక్కసారి ఉటంకించిన
    నా వంటి అఙ్ఞులకు మేలు కలుగ గలదు !

    రిప్లయితొలగించండి
  22. సంధి జేయగ సభ జేరి శౌరి నుడివె
    సగము నీయుడు రాజ్యమ్ము సాగదనిన
    నూళ్ళనైదుగ నీయుమా యుద్ధమేల
    మామ వినుమిది మనసున మాయ వదలి.

    రిప్లయితొలగించండి
  23. నాకు తెలిసి నిషిద్దాక్షరి అంటే ఏవైతే అక్షరాలూ నిషిద్ధం అని ఇచ్చారో వాటి గునిన్తాలతో సహా నిషిద్దం అని నా ఉద్దేశం.

    రిప్లయితొలగించండి
  24. హనుమత్ శాస్త్రి గారు నుడివె పదప్రయోగం వున్నదా ? లేక నుడివెను correct ఆ అని ? తెలిసిన వారు clarify చేయగలరు.

    రిప్లయితొలగించండి