7, ఏప్రిల్ 2015, మంగళవారం

పద్య రచన - 872

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. అంబాయంబాయనుచును
    సంబరముగ నాలమంద సాగుచు నుండెన్
    కంబమున గట్టి యుండెడి
    యంబాయను దూడల కడు పాకలిదీర్చన్.

    రిప్లయితొలగించండి
  2. గోవృషభమ్ములీ ధరనుఁ గొప్పవదాన్యులు నెంచి చూడగా
    కావలి కాచి, శ్రీహరియె గౌరవమందెను గోపబాలుగా;
    దీవనఁ గోరి యెల్లరును దేవతగా గని పూజ సల్పు వా
    రీ వసుధన్ సుకర్మభువి నెక్కుడు భక్తి సదా విధేయులై.

    రిప్లయితొలగించండి
  3. ఆలమందలున్న నైశ్వర్య వంతులై
    వెలిగినారు గతపు విశ్వమందు
    గోవు జాతులిపుడు కోల్పోవ విభవమ్ము
    రైతు బ్రతుకు నేడు రచ్చ కెక్కె

    రిప్లయితొలగించండి
  4. వహ్..లక్ష్మీ దేవిగారు....వృత్తాలు వ్రాయడంలో మీకు మీరేసాటి

    రిప్లయితొలగించండి
  5. సత్యనారాయణరెడ్డి గారు రైతుబిడ్డ అనిపించుకున్నారు

    రిప్లయితొలగించండి
  6. ఎండకు తాళక నావులు
    దండుగ నా తరువు దరికి తరలుచు నుండెన్
    మెండగు దాహము తీర్చుకు
    నిండారగ సాగిపోవు నెలవుల కవియే!!!

    రిప్లయితొలగించండి
  7. గోవుని మాతగా పిలచి కొల్చును హైందవ జాతి యంతయున్
    తావిక లేదు చంపుటకు దైవము మాకది- కామధేనువున్
    కావగ నే ప్రభుత్వమును గట్టిగ చట్టము చేయదేలనో
    గోవధ నాపు నేతలకె గ్రుద్దెదనోటని దీక్షపూనెదన్

    రిప్లయితొలగించండి
  8. ఆల మందలు జూడుమ ! యాతృ తగను
    బోవు చుండెను నింటికి బుడత లకును
    బాలు గుడుపుట కొఱ కుగా పార్ధ ! యవియ
    వంద నంబులు గోమాత బృంద మునకు

    రిప్లయితొలగించండి
  9. గోవుల మందలతోడను
    గోవిందుండాడి పాడె గోకులమందున్
    గోవులఁ దినుచున్నకతన
    భావిన్ మహిలోననుమహి బాధలపాలౌ

    రిప్లయితొలగించండి
  10. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘తాళక యావులు’ అనండి. ‘తాళక’ అనేది ద్రుతాంతశబ్దం కాదు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. కవిమిత్రులకు మనవి...
    రేపు మా అబ్బాయికి మిర్యాలగూడలో ఆపరేషన్ ఉంది. అందుకని ఈరోజు బయలుదేరుతున్నాము. రెండురోజుల సమస్యలు, పద్యరచన షెడ్యూల్ చేసి వెళ్తున్నాను. నేను బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. దయచేసి రెండురోజులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  12. ఆవులు శుభదాయకమై
    జీవులలో శ్రేష్టమనుచు శ్రీ కృష్ణుండే
    గోవులగాచెను|జూడగ?
    ఏయూరందావులున్న?నెగడును పల్లే|
    పాలివ్వగ?అమ్మకు మురి
    పాలిచ్చెడి గోవులన్న వందనమిడు-గో
    పాలునికది ముఖ్యము తన
    పాలుగ నభిమాన ముంచ?పాలును బంచున్|

    రిప్లయితొలగించండి
  13. గోవులనేగాచి-గోపాల కృష్ణుడు
    --------గోటితో కొండెత్తు నాటిచరత
    ఆవులనే మేపి-ఆవీర-బ్రహ్మేంద్ర|
    కాలగతులు దెల్పె తేలికందు
    ఆవులమందలు నధికంబుచేతనే
    ---------విరాటునిరాజ్యమ్ము విర్రవీగె
    పల్నాడుసీమలుపచ్చగా గలవన్న?
    ---------సాకెడిగోవులేసాక్షిగాగ
    అట్టివాటినినడవుల కంప బోక
    గడ్డివేసినపాలిచ్చి కడుపునింపు
    ఆవుమందలె ఐశ్వర్య మందజేయు
    పాలు,పెరుగు,మజ్జిగ,నేయి-పంచగలవు|

    రిప్లయితొలగించండి
  14. నిన్నటి పద్య రచన :
    చేతులఁజాపుచుతాతయె
    నేతులఁ ద్రాపించ కున్న నేర్పగ చదువున్
    రాతల మార్చవ తాతా!
    చూతును పొత్తమ్మువైపు శ్రుతదేవి కృపన్!
    నేటి పద్యరచన :
    చిత్తరువున గన్పించెడు
    గిత్తలు నావులు పొలమున కేరింతలతో
    చిత్తము రంజిల జేయగ,
    నుత్తర గోగ్రహణవిజిత యుత్సాహమిదా?

    రిప్లయితొలగించండి