రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘పాండుసుతు లెల్లర్’ అన్నచోట గణభంగం. ‘పాండవులు తగన్| రక్షించగ ధర్మసుతుడు...’ అనండి. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘దండ్రి’ టైపాటు వల్ల ‘దండి’ అయింది. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** ‘తెలుగువెలుగు’ బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘ధర్మేంద్రుడనే’ అన్నదానిని ‘ధర్మతనయునే’ అనండి. ***** పి.యస్.ఆర్. మూర్తి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. మొదటిపద్యం మూడవపాదంలో గణదోషం.‘అహముతోడ ననుజు లంతరించగ తాను’ అనండి.
యక్షుని ప్రశ్నలు తెలియక
రిప్లయితొలగించండిపక్షుల వలెనేల కూలె పాండు సుతులెల్లర్
రక్షణ జేయగ ధర్మజు
యక్షుని మెప్పించె , తండ్రి యముడని దెలియన్
దప్పితో కొలనుకునేగి తమ్ములంత
రిప్లయితొలగించండితిరిగిరాకుండుటన్ యుధిష్టిరుడు తానె
చనియచటకాంచె వారల శవములన్ని
యక్షుడొక్కడు కనిపించి యడిగె కొన్ని
ప్రశ్నలను బ్రతికింపగ పాండుసుతుల
ధర్మజు జవాబుతోడను తనివినొంది
దండి తన నిజ రూపుతో దర్శనమిడి
జీవ మిచ్చెను వారికి శీఘ్రముగను
చచ్చి పడియున్న తమ్ముల శవము లనట
రిప్లయితొలగించండిధర్మ జుడుగని బ్రతికింప దలచి , యక్షు
ప్రశ్నల కుదగు రీతిగ బదులు సెప్పి
బ్రదుకు నట్లుగ జేసెను వారి నపుడు
యక్షరూపు తోడ యమధర్మరాజట
రిప్లయితొలగించండిప్రశ్న లేయ సాగె పాండుసుతుల
బదులు చెప్పలేక బాధతో గూలంగ
ధర్మజుండు జెప్పె ధైర్యముగను.
యక్షుఁడు వేయగ ప్రశ్నల
రిప్లయితొలగించండిశిక్షణ పొందిన వటువుగ చెప్పి బదుళ్ళన్
రక్షణఁ జేసెను తమ్ముల
దక్షతతో ధర్మరాజు దయగలవాడై.
యక్షుని ప్రశ్నల కెల్లను
రిప్లయితొలగించండిదక్షతతో బదులు పలుక ధర్మజుడట ప్ర
త్యక్షమగుచు యముడంతట
లక్షణముగ పాండుసుతుల ప్రాణము లొసగెన్!
వారటు-యక్షప్రశ్నలజవాబులుజెప్పక చచ్చినారు|మీ
రిప్లయితొలగించండివారనివింటి,నేనడుగు ప్రశ్నలకన్ని-విధాలకూర్పునన్
జేర,జవాబుజెప్పుచు.విజేయుడవైనపరిక్షయందు?మీ
వారికిధర్మరాజువనుభావన గల్గును జీవులైనచో|
యక్షుడు ప్రశ్నల నడుగగ
రిప్లయితొలగించండిలక్షణముగ నుత్తరమిడి ప్రాజ్ఞత తోడన్
రక్షించగ సోదరులను
దక్షిణ దిక్పతియె మెచ్చె ధర్మేంద్రుడనే!!!
శక్తి యున్న నేమి యుక్తి తెలియకున్న
రిప్లయితొలగించండిసమయ మెరిగి మెలగ చతురుడగును
అహము తోడ యనుజు లంతరించ
నిరతి తోడ నిలిచె ధర్మజుండు.
అరయ జూడ నతడు ఘనకీర్తి నొందగా
సంతసించె మిగుల సంగమనుడు
సావధానుడైన సాధించు విఖ్యాతి
బలిమి కన్న బుద్ధి బలము మిన్న.
విద్య తోడ మనిషి వినయంబు గల్గిన
వినతి వలన యతని విలువ పెరుగు
మిడిసి పాటు పడుట మేలు గాదని దెల్ప
పాండవులకు గొప్ప పాఠమాయె.
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పాండుసుతు లెల్లర్’ అన్నచోట గణభంగం. ‘పాండవులు తగన్| రక్షించగ ధర్మసుతుడు...’ అనండి.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘దండ్రి’ టైపాటు వల్ల ‘దండి’ అయింది.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
‘తెలుగువెలుగు’ బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘ధర్మేంద్రుడనే’ అన్నదానిని ‘ధర్మతనయునే’ అనండి.
*****
పి.యస్.ఆర్. మూర్తి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపద్యం మూడవపాదంలో గణదోషం.‘అహముతోడ ననుజు లంతరించగ తాను’ అనండి.
పద్యసమీక్షకై ఎదురుచూస్తూ....
రిప్లయితొలగించండియమునకు యితర పేర్లు.
రిప్లయితొలగించండిదండపాణి, దండభృత్తు, దండయాముడు, దండహస్తుడు, దండి, దక్కినంపురాయడు, దక్కినపురేడు, దక్షిణదిక్పతి
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాన్ని చదివాను. సమీక్షించడం ఎందుకో తప్పిపోయింది. మన్నించండి.
మీ పద్యం బాగుంది. అభినందనలు.
ర-ల యతిని సాధ్యమైనంత వరకు ఉపేక్షించండి.
*****
అన్నపరెడ్డి వారూ,
నేనంత లోతుగా ఆలోచించలేదు. మన్నించండి. వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.