16, ఏప్రిల్ 2015, గురువారం

పద్య రచన - 881

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25 కామెంట్‌లు:

  1. రాముని సతియగు సీతను
    ప్రేముడి గొనిపోవ నెంచి భీభత్సముగన్
    నీమము వీడుచు మదమున
    కామితు డగురావ ణుండు ఖండించె ఖగమున్

    రిప్లయితొలగించండి
  2. జానకిఁగొని యసురుడు తాఁజనుచు నుండ
    నాజటాయివెదుర్కొనె నార్తితోడ
    రావణుడు త్రుంపరెక్కలన్ రయముగాను
    పక్షి రాజము కూలెను వసుధపైన

    రిప్లయితొలగించండి
  3. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    చివరిపాదంలో గణదోషం. ‘కామితుడగు రావణుండు ఖగమును ద్రుంచెన్’ అనండి.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. అటు గొనిపోయెడు సీతను
    జటాయువు వటు నిలువరించ జగడము రేగన్
    కటకట మని పళ్ళు కొరికి
    తృటిలోలకేశుడంత తెంచెను రెక్కల్!

    రిప్లయితొలగించండి
  5. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    టైపాట్లున్నాయి. ‘జటాయు వటుల నిలువరించ..’ అనండి. ‘లంకేశుడు’లో సున్నా మిస్సయింది.

    రిప్లయితొలగించండి
  6. అటు గొనిపోయెడు సీతను
    జటాయు వటు నిలువరించ జగడము రేగన్
    కటకట మని పళ్ళు కొరికి
    తృటిలోలంకేశుడంత తెంచెను రెక్కల్!

    రిప్లయితొలగించండి
  7. దిక్కులు పిక్కటిల్ల యతి దీనత నేడ్చు ధరాత్మ రక్షకై
    రెక్కలు కట్టుగొంచు నెదిరించెను రావణు భీకరంబుగా
    రక్కుచు గ్రుచ్చుచున్ సెగలు గ్రక్కుచు పోరెడి వాని జూచినన్
    నిక్కబొడంగు రోమములు స్నేహితుడన్న జటాయువే సుమా!

    రిప్లయితొలగించండి
  8. నమస్కారములు
    అవునూ " జటాయు " జగణం కాదా ? మరి కందమున మొదటి గణముగా వ్రాయ వచ్చునా ? దయ చేసి తెలుప గలరు

    రిప్లయితొలగించండి
  9. కామ మదమున సీతను గాంక్ష తోడ
    నెత్తు కొని బోవ పక్షిరా జత్త ఱి నట
    రావ ణు నెది రిం చ నతడు రయము గాను
    రెండు రె క్కలు ఖండించ ఖండ మాయె

    రిప్లయితొలగించండి
  10. ఆ.వె: రావణాసురుండు రమణిని గొంపోవ
    నాప దానవేంద్రు నడ్డు పడిన
    పక్షిరాజు జంపె పంక్తి కంథు డపుడు
    శోక భరిత యయ్యె సుదతి సీత.
    డా . బల్లూరి ఉమాదేవి
    16 4 15

    రిప్లయితొలగించండి
  11. కంఠుడు బదులుగా కంథుడు అని వ్రాశాను. గమనించగలరు.

    రిప్లయితొలగించండి
  12. దశముఖుడైన-రావణుడుదైన్యపుసీతయు మూర్ఛనొందగా
    విశదముగానివైనమునవిస్తుగ జూసిజటాయువుండు-వై
    వశమున వెంటనంట ననివార్యమునందున-దృంచరెక్కలున్
    దశదిశలంతటన్ యరుపు-దానవచేష్టకు?నావరించగా.

    రిప్లయితొలగించండి
  13. రావణాసురుడు కుజను లంకవైపు
    తీసుకొని బోవు చుండగ తేరు మీద
    నడ్డగించె జటాయువు నతివ గావ
    పంక్తి గ్రీవుడు ఖండించె పక్షములను!!!

    రిప్లయితొలగించండి
  14. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యానికి నా సవరణలోను గణదోషం. దానిని పరిహరించి చక్కని సవరణ చేశారు. సంతోషం.
    *****
    ఆదిత్య గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘పిక్కటిల్ల నతి...’ అనండి. ‘ధరాత్మ’ అంటే సీత కాదు. ‘ధరాత్మజ’ అనాలి. అక్కడ ‘ధరాజ రక్షకై’ అనండి.
    *****
    రాజేశ్వరి అక్కయా,
    కందంలో రెండవ, నాల్గవ పాదాలలో సరిగణంగా జగణం ఉండరాదు. ఒకటవ, మూడవ పాదాలలో బేసిగణంగా జగణం ఉండరాదు. నిజానికి లాక్షణికులు కందాన్ని రెండు ఎనిమిది గణాల పాదాలుగా గణించి బేసిగణంగా జగణం ఉండరాదన్నారు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. సహదేవుడు గారూ , క్షణకాలం అనే అర్థంలో త్రుటి అని ఇకారాంత స్త్రీలింగం వాడవలసి ఉంటుంది. తృటి అనే అపభ్రంశ పదం వాడుక భాషలోకి ఎప్పుడు వచ్చి చేరిందో ఇదమిత్థంగా తెలియదు కాని ప్రమాణ నిఘంటువులు ఆ పదాన్ని గుర్తించవు ( చలమచెర్ల వేంకట శేషాచార్యులు , బ.సీతారామాచార్యులు ఇత్యాదులు )
    పదాన్ని గుర్తించకపోవడమంటే అది ఇకారాంతమో , ఈకారాంతమో స్త్రీ
    / పుం/నపుంసక లింగమో ఏమీ తెలియనట్టే . అంటే భాషలో ఆ పదానికి స్థానం లేనట్టే. తెలుగు భాషలో చోటు చేసుకున్న అపభ్రంశ పదాలు చాలానే ఉన్నాయి వాటిలో ఇదొకటి.
    కనుక చివరి పాదాన్ని "త్రుటిలో లంకేశుఁడంతఁ ద్రుంచెన్ రెక్కల్" అంటే నిర్దోషంగా ఉంటుందని సూచన.

    రిప్లయితొలగించండి
  16. డా.విష్ణునందన్ గారికి ధన్యవాదములు. భాషపై పట్టున్న మీ అమూల్యమైన సూచనలు మాకవశ్యము.
    సవరించిన పద్యం :
    అటు గొనిపోయెడు సీతను
    జటాయు వటు నిలువరించ జగడము రేగన్
    కటకట మని పళ్ళు కొరికి
    త్రుటిలో లంకేశుడంత ద్రుంచెన్ రెక్కల్!

    రిప్లయితొలగించండి
  17. పూని, మహారణమున్ స్వ బుద్ధితో, ధర్మపరతను
    మానక, నెంతటి వాని మార్గనిరోధముఁ జేసి
    జానకి మాతనుఁ గావ సంపాతి సోదరుండయిన
    జ్ఞాని జటాయువు పోరె; సాధించె నాముక్తి పదము.

    రిప్లయితొలగించండి
  18. సీతను రావణుండు తనసీమకు నెత్తుకు వెళ్ళుచుండగా
    నాతని నడ్డగించి ఖగ మచ్చట భీకర పోరు సల్పుచున్
    సీతమ తల్లి రక్ష కయి చేసిన పోరున రక్త సిక్తమై
    వాతములోన ప్రాణములు బాయుచు కీర్తికెక్కెగా!

    రిప్లయితొలగించండి
  19. డా. విష్ణునందన్ గారూ,
    ధన్యవాదాలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ మధ్యాక్కర బాగున్నది. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. తల్లి సీతను కొనిపోవు దనుజు నొడ్డి
    పాప కర్మంబు వలదంచు పలుక పక్షి
    రాజు రెక్కల త్రుంచె నా రావణుండు,
    నిలువ లేక జటాయువు నేల కొరిగె!

    రిప్లయితొలగించండి
  21. శ్రీధర రావు గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. దుష్ట బుద్ధి కలుగు దుర్మార్గు నెదిరింప
    తనదు శాయ శక్తి తపన తోను
    అసువు లొదిలి పక్షి ఆత్మ మోక్షము నొంద
    తెలియ త్యాగ మనగ తేల్చి చెప్పె

    రిప్లయితొలగించండి