6, ఏప్రిల్ 2015, సోమవారం

దత్తపది - 72 (గుణము-తృణము-పణము-రణము)

కవిమిత్రులారా!
గుణము - తృణము - పణము - రణము
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

26 కామెంట్‌లు:

 1. గుణము బిగియ గాండీవము కోరజాపు
  తృణము కాదె నీ సేనలు గణనమందు
  పణమున గొనుట కాదిక పార్థుడచట
  రణము కోరగనేల మరణము వచ్చు!!

  రిప్లయితొలగించండి
 2. చ.గుణమదిధర్మరాజునకుగొప్పగనెవ్వరుజూదమాడినన్
  పణమునయేదియైననురవంతయుపెట్టుచుయాటసల్పగన్
  తృణముగరాజ్యమోడుగనకృత్యముతానునుభార్యసోదరుల్
  రణమనివార్యమయ్యెనుపరాక్రమమార్గమునెంచవారికిన్.

  రిప్లయితొలగించండి
 3. కూడియుండ మీశక్తి ద్విగుణము కాదె
  స్థిరముగ మరి యైదూళ్లన తృణము కాదె
  రాజ! సంధి వలదన కారణము కలదె!
  కాక తర్పణము మిగులు కయ్యమైన!!

  రిప్లయితొలగించండి
 4. గుణములు శకునికి మాయలు
  తృణములు గావని తెలియక తొందర పాటున్
  పణముగ బెట్టెను సకలము
  రణమున గెలువంగ వేరు రక్షణ కలదే ?

  రిప్లయితొలగించండి
 5. రణము వచ్చె నేడు రారాజు తో, మంచి
  గుణములుండి గూడ గొడవలొదవె
  తృణము వోలె సిరుల తెలిసి తెలిసి సతి
  పణము బెట్టి యాడు ఫలితమిదియె

  రిప్లయితొలగించండి

 6. తృణమగు నెంత బుద్ధియుసు తిన్నగ దానిని వాడలేనిచో
  గుణముస ధర్మరాజు కడు గొప్పయె గాని ఫలమ్ముశూన్యమే
  పణమున పెట్టి యోడె తన పత్నిని తమ్ముల రాజ్యమంతయున్
  రణమున భూమిపై గల రాజుల చావుకు కారణమ్మయెన్

  రిప్లయితొలగించండి
 7. జిగురు సత్యనారాయణ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  పిరాట్ల ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘పెట్టుచు నాటసల్పగన్’ అనండి. అక్కడ యడాగమం రాదు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  రెండుచోట్ల ‘న’ టైపాటువల్ల ‘స’ అయింది. చివరిపాదంలో ‘భూమిపైన గల...’ అంటే గణదోషం తొలగుతుంది.

  రిప్లయితొలగించండి
 8. ధన్యవాదాలు మాష్టారు...సవరించాను
  తృణమగు నెంత బుద్ధియును తిన్నగ దానిని వాడలేనిచో
  గుణమున ధర్మరాజు కడు గొప్పయె గాని ఫలమ్ముశూన్యమే
  పణమున పెట్టి యోడె తన పత్నిని తమ్ముల రాజ్యమంతయున్
  రణమున భూమిపైన గల రాజుల చావుకు కారణమ్మయెన్

  రిప్లయితొలగించండి
 9. గురువుగారు సూచనకి ధన్యవాదాలు : సవరించిన పిదప

  చ.గుణమదిధర్మరాజునకుగొప్పగనెవ్వరుజూదమాడినన్
  పణమునయేదియైననురవంతయుపెట్టుచునాటసల్పగన్
  తృణముగరాజ్యమోడుగనకృత్యముతానునుభార్యసోదరుల్
  రణమనివార్యమయ్యెనుపరాక్రమమార్గమునెంచవారికిన్

  రిప్లయితొలగించండి
 10. సద్గుణముల రాశి యతడు సత్పు రుషుడు
  జీవి తంబును దృ ణ ముగా భావుకుండు
  ద్యూత మందున పణముగా ద్రో వది నట
  పెట్టు కతనన రణమును బిట్టు జేసె

  రిప్లయితొలగించండి
 11. గుణముల మిన్న నీ కొడుకు లంతటివారు
  .........గుర్తించవే నీవె కురు నృపాల!
  తృణమగు నీకవి తెలియ నైదూళ్ళన
  .........నిచ్చి పంపిన నీకు నిహము పరము
  పణము నందాశల పరిమిత మైనచో
  .........సుఖము లుండునె నీకు శోభ యగునె?
  రణము నాపెడు శక్తి రాజరాజుకు చెప్పి
  .........నీకెగా కలదింక నిజము దెలియ

  పాండవులు యుద్ధమన్నచో పారిపోరు
  శాంతి కోరుట ప్రజలకు శాంతి కొరకె
  సంధి జేయగ వచ్చితి సరకు గొనుము
  యాదవేంద్రుడు పలికె నిట్లాదరమున.

  రిప్లయితొలగించండి
 12. పణమునరాజ్యమున్వదలి-పాండవులంత అరణ్యమేగగా
  తృణముగ స్వార్థచింతనలదీక్షగ కౌరవులాడునాటలో
  గుణమును గూల్చెగాశకునిగూడగ లాభమ?తీసివేతయే
  రణమునభాగహారముసరైనది కాదని హెచ్చవేసెనా?

  రిప్లయితొలగించండి
 13. (శ్రీకృష్ణుఁడు కురుసభలో తన దౌత్యము యుద్ధమునకు దారితీయఁగా, లోన సంతసించుచుఁ దనలోఁ దాననుకొను సందర్భము)

  దుర్గుణముచేతఁ గౌరవుల్ దురము సేఁతఁ
  గోరుచుండిరి తృణమంత కూర్మి లేక!
  యిదియుఁ బాండవులకు జయ హేతువ యగుఁ!
  బ్రబల శత్రుల నాశ కారణము నైన
  బవరముం జేసి, సిరిగొంట పణము కాదె?

  రిప్లయితొలగించండి
 14. గుణము లందు ఘనులు కుంతికుమారులు
  పణము బెట్ట కిపుడు ప్రాణములను
  తృణము లగును మీకు దెలియగ నైదూళ్ళు
  రణము నాపి యిమ్ము రాజ రాజ !!!

  రిప్లయితొలగించండి
 15. గుణమునిండిన?దృతరాష్ట్రు గుడ్డివాడు|
  పణమునందున పాండవుల్పట్టుదప్పి
  తృణము గానేంచినడవులు తిరిగిరాగ
  రణముదప్పెన?లేదు|కారణములేదు|

  రిప్లయితొలగించండి
 16. జూద క్రీడ చెఱచ ధర్ము సూను గుణము
  పణముగా బెట్టి తమ్ములన్ భార్య నోడె
  సంధి పొసగెడు మార్గము సాగకుండె
  తృణముగా నెంచి ప్రాణముల్ రణమునందు
  సమసి రెందరో రాజులు సమరమందు

  రిప్లయితొలగించండి
 17. గుణము చేతను హీనుడై ఘోరగతిని
  తృణముగా నెంచి ధర్మజు ధీరగుణము
  పణము నొడ్డిన ద్రోవది వలువ లూడ్చి
  రణము నాశంబు నయ్యెను రాజరాజు

  గుణమున ఘనుడౌ ధర్మజు
  తృణమును లేకుండ గొనియు,ధీరౌ వనితన్
  పణముగ నెంచియు బాధిడి
  రణమున నూరువులు విరుగ రారాజు చెడెన్

  రణమున నూరువులు విరుగ రారాజు చెడెన్

  రిప్లయితొలగించండి
 18. పెద్దలు గుండు మధుసూదన్ గారికి ఆరొగ్యం కుదుటపడిందా? మీ పూరణలు చూసే భాగ్యం దొరకటం లేదు

  రిప్లయితొలగించండి
 19. మిత్రులు శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణగారికి నమస్కారములు. అనారోగ్యకారణముననే నేను మన బ్లాగునందు పూరణములు పెట్టలేకపోతున్నాను. ఓపిక యున్నప్పుడు ఈ నాఁటివలెనే పూరణములు పెట్టుచుండఁగలను. పరామర్శించినందులకు ధన్యవాదములు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 20. గుణమున గొప్ప ధర్మజుడు గుడ్డిగ నాలిని రాజ్యలక్ష్మినిన్
  పణముగ తమ్ములందరిని పాపపు జూదము నందు నొడ్డగా
  తృణముగ; నోడిపోయె దురదృష్టము గల్గగ బాధలోర్చుచున్
  రణమును సల్పి కౌరవుల రాక్షస చేష్టల రూపుమాపెగా!

  రిప్లయితొలగించండి
 21. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘ధృతరాష్ట్రు’ అనడం అసంపూర్ణంగా ఉంది. దానిని సంబోధనగా ‘ధృతరాష్ట్ర!’ అని మార్చితే బాగుంటుంది. ‘తృణముగా నెంచి యడవులు...’ అనండి.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘జూదక్రీడ’ అని సమాసం చేయరాదు. అక్కడ ‘జూద మాడ...’ అందామా? ‘రణమునందు, సమరమందు’ అని పునరుక్తి అయింది.
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. గురువుగారికి నమస్సులు. ఒక్కొక రోజు మనసు లగ్నం గాక పద్యం నడక సరిగా సాగటంలేదు. మార్చి మరల పంపుచున్నాను. పరిశీలించి సవరించ ప్రార్థన.
  జూదమందు చిక్కగ ధర్ము సూను గుణము
  పణముగా బెట్టి తమ్ములన్ భార్య నోడె
  యోధులంత సమసిరి సయోధ్యలేక
  తృణముగా నెంచి ప్రాణముల్ రణమునందు

  రిప్లయితొలగించండి
 23. పణమున నోడిన రాజ్యము
  తృణముగఁ జూతువె? కిరీటి! తేరును దిగుచున్
  రణమును జేయన్ గ్రీడీ!
  గుణమున కర్తవ్య మొదుగఁ గూడును జయమున్!

  రిప్లయితొలగించండి
 24. రణమున పోరుకు బెదరకు
  తృణముగ వైరుల దలచకు ధృతి తోడన్
  పణముగ ప్రాణం బెట్టెడు
  గుణమును విడువక రిపులను గూల్చుము పార్థా.

  రిప్లయితొలగించండి