26, ఏప్రిల్ 2015, ఆదివారం

పద్య రచన - 891

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. సొగసులు విరియు శకుంతల
    గగనము పైదృష్టి నిలిపి కలమును బట్టెన్
    మగనికి లేఖను వ్రాయగ
    సుగమంబగు పదము లేరి సోయగ మొందన్

    రిప్లయితొలగించండి
  2. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. కం:వదనమున సిగ్గు దొంతర
    లొదవన్ నాథుని సురూపు నూహింపంగన్
    మదిలో దాచిన ప్రేమన్
    పదిలముగా కూర్చె పడతి పత్రము పైనన్

    రిప్లయితొలగించండి
  4. విరహ వేదన కతనాన వేస డిల్లి
    యాశ కుంతల యట తామ రాకు మీద
    వ్రాయ దొడగెను జూడుడు ప్రభువు కొఱకు
    తోడు కత్తెలి రుదెసల తోడు కలుగ

    రిప్లయితొలగించండి
  5. తనపతిఁదలచి శకుంతల
    వినిపించగ తన విరహము విభునకు ధృతితో
    ననుగుణమగునొక లేఖను
    తన చెలికత్తెలను గూడి తనరుచు వ్రాసెన్

    రిప్లయితొలగించండి
  6. నిద్దుర రాదుకన్నులకు నిండితివీ హృదయంబునందునన్
    బుద్ధిగ నిల్వదీమనసు పున్నమి వెన్నెల మత్తుగొల్పనే
    సద్దును విన్ననీవెనని చక్షువులాత్రము తోడ జూచు నీ
    ముద్దుల మోముజూపుమిక మ్రొక్కుచు లేఖను వ్రాయుచుంటిరా

    రిప్లయితొలగించండి
  7. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘నీవె యని’ అనండి.

    రిప్లయితొలగించండి
  8. అన్నులమిన్న నీసొగసు టందము చిందగ చంద్ర కాంతియున్
    తిన్నగనిన్నుజేరి తగుతీరికయందున చల్లగాలితో
    కన్నమువేయ?మానసము కామితదీక్షలు కానుపించగా
    పున్నమి వేడివాడి కిట పూర్తిగవాలితివేలనే సఖీ?

    రిప్లయితొలగించండి
  9. వింతగ మదిలో మెదిలే
    మంతనముల నేరి కూర్చి మగనికి దెలుపన్
    సంతసముగ నొక లేఖ శ
    కుంతల లిఖియించు చుండె కూరిమి తోడన్!!!

    రిప్లయితొలగించండి
  10. వలచితివో రాజా! నను
    వలపించితివో! నెరుంగ? వరమో? జ్వరమో?
    తలపుల కాల్చగ నేలా?
    కలగాదిది నిజమటంచుఁ గానగ రావా?

    రిప్లయితొలగించండి
  11. ఏమిది శకుంతలా! నీ
    ప్రేమమ్మా రాజుపైన శ్రేయమొ దొసగో
    నీమము దప్పి చరించిన
    క్షేమమె నీ భావి కిట్టి చేష్టలు సఖియా!

    నీ తండ్రికి దెలియకనే
    చేతము నర్పించితంచు చింతలు సబబే?
    యాతం డెవడో యేమో
    భూతలమున నిన్ను కన్న పొందే లేదో?

    ........

    ఏమో సఖులారా! నే
    నేమాత్రము తాళజాల నీ విరహాగ్నిన్
    నామది దోచిన మన్మధు
    డీమాత్రమె యెరుక నాకు నింకేమందున్?

    వడివడి వచ్చెద ననియెను
    తడబడకని మరలమరల ధైర్యము చెప్పెన్
    పడతీ నీ తండ్రిని గని
    నడచెద నేడడుగులంచు నమ్మం బలికెన్.

    ఎపుడా దిన మేతెంచునొ
    యెపుడా వలరాజు మరల యింపుగ నాకై
    తపియించు చుంటినని తన
    యపురూపపు కౌగిలినిడి హాయి నొసగునో.

    రిప్లయితొలగించండి
  12. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘మెదిలెడి’ అనండి.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘వలపించితివో యెఱుంగ’ అనండి.
    *****
    మిస్సన్న గారూ,
    మీ ఖండకృతి చాలా బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  13. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:

    వలచితివో రాజా! నను
    వలపించితివో! యెఱుంగ? వరమో? జ్వరమో?
    తలపుల కాల్చగ నేలా?
    కలగాదిది నిజమటంచుఁ గానగ రావా?

    రిప్లయితొలగించండి

  14. ప్రియుని సందేశమునకు తా వేచె సతి శ
    కుంత లరసి లిఖించె వ్యాకులముజెంది
    తామరాకున విరహ వేదన తెలుపుచు, ఆశ్రమమ్మున సఖులు నూరార్చిరపుడు

    రిప్లయితొలగించండి
  15. పలుకనిపద్మరాగమణి పంచెడివెల్గులనుంచ?నొక్కతే
    విలువగు చంద్రకాంతివలె వేదన బంచె నొకర్తే వింతగా
    అలిగిన అర్ధనారివలె హాయియుగానక నొక్కతుండగా
    పలుకని చెట్టు,గాలినటపక్కుననవ్వెను పక్కజేరుచున్

    రిప్లయితొలగించండి
  16. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. అశ్వత్థ నారాయణ మూర్తి గారి పద్యం....

    నినుజే బట్టెదఁ దప్పక
    యనుచున్ బాసాడి వెడలి యాభూనాథుం
    డునను మనువాడ నేలొకొ!
    తనవారిని బంపడయ్యె, తరుణి యదేలా?

    రిప్లయితొలగించండి
  18. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి