24, ఏప్రిల్ 2015, శుక్రవారం

పద్య రచన - 889

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

 1. మాష్టారు నిన్నటి పద్యరచనలో నా పద్యం చూడలేదు మీరు

  రిప్లయితొలగించండి
 2. మీరా కీర్తన వినగను
  నేరా యైనను కరుగును నెమ్మిని మనము
  న్నారాధా కృష్ణు డనగ
  నారా ధనజేయు వారి నాదర మొప్పన్

  రిప్లయితొలగించండి
 3. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. మీరా భాయిసతమ్మును
  నోరారగ శౌరి గూర్చి నుడువుచు బ్రతికెన్
  లేరామెమించి భక్తిని
  పారాయణ చేసి నట్టి పడతులు భువిలో

  రిప్లయితొలగించండి
 5. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. ఆ.వె:మనసు నిండ నిండె మన్మోహనుని రూపు
  తనువు పులకరించె తృప్తి తోడ
  గానమందె తాను కాలమ్ము గడుపుచు
  భామ యొప్పె భక్తి భావమలర

  రిప్లయితొలగించండి
 7. ఆ.వె:మనసు నిండ నిండె మన్మోహనుని రూపు
  తనువు పులకరించె తృప్తి తోడ
  గానమందె తాను కాలమ్ము గడుపుచు
  భామ యొప్పె భక్తి భావమలర

  రిప్లయితొలగించండి
 8. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  రెండవపాదంలో యతి తప్పింది. ‘దేహము పులకించె తృప్తితోడ’ అనండి.

  రిప్లయితొలగించండి
 9. మీరాబాయిని జూడుము
  ధారగ నట పాడుచుండె ధారా ళ ముగన్
  మీరా కీర్తన వినగను
  నేరాయియు నైన కరగు నింపౌ కతనన్

  రిప్లయితొలగించండి
 10. ఆర్తిని బాపగఁ గదిలెడు
  కర్తవు నీవంచు ' మీర ' గానము జేయన్
  కీర్తనల నల్లె మది నీ
  నర్తనలే పెంపు మీర నందకుమారా!

  రిప్లయితొలగించండి
 11. మురహరియన తన మనమున
  మరిమరి మోహము కలుగను మలచె ధవునిగన్
  గిరిధారిని భజియించెను
  మురళీధరు వలచి వలచి ముక్తిన్ పొందెన్

  రిప్లయితొలగించండి
 12. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  పల్లా నరేంద్ర గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. రారా ముకుంద! మాధవ!
  రారా కృష్ణా! మనోభి రామా !యనుచున్
  మీరా గానము జేయుచు
  ద్వారక నాధుడిని జేరి తరియించెనుగా !!!

  రిప్లయితొలగించండి

 14. రాధాకృష్ణలతత్వము
  ఆరాధన కొకటి గాదు ఆనందమనే
  పారాయణపరమార్థము
  చేరంగామీర బాయిచింతించె గదా|


  రిప్లయితొలగించండి
 15. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  మొదటిపాదంలో ప్రాస తప్పింది. ‘కాదు+ఆనంద’మని విసంధిగా వ్రాయరాదు కదా.

  రిప్లయితొలగించండి