చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** డా. బల్లూరి ఉమాదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. గూగుల్ సెట్టింగుల గురించి నిన్న నేనిచ్చిన వివరాలు చూశారా? ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ మొదటి ప్రయత్నంగా ఉత్సాహ పద్యం బాగున్నది. అభినందనలు. కాని ప్రాస నియమాన్ని మరిచిపోయారు.
పిల్లి పిల్ల పారికోయె వెదకు చున్న దొరకదే లల్లి బెంచె ప్రేమ మీర రస్కు లేసి దానికీ చిల్లి గారె లివ్వ గానె చిందు లేసి యాడునే కళ్ళ బడితె మీకు తాను కాస్త నాకు జెప్పరే !!!
కె. ఈశ్వరప్ప గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** ఉమాదేవి గారూ, అక్కడ 'teluguvelugulu' అని లేనప్పుడు ఆ బాక్సులో నేను చెప్పినట్లు మీ పేరు పెట్టి ప్రయత్నించండి. లేదా మీ పేరుతో కొత్త జిమెయిల్ అకౌంట్ తెరవండి. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పల్లా నరేంద్ర గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. మొదటిపాదంలో గణదోషం. ‘లోకులు+అన’ అన్నప్పుడు యడాగమం రాదు. నా సవరణ... కళ్ళు మూసి పిల్లి కనగ పాలను త్రాగ లోకము తెలియదని లోకు లనగ. ***** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మణిప్రవాళంలో అంత్యానుప్రాసతో మీ పద్యం బాగుంది. అభినందనలు.
చక్రములవంటి కళ్ళతో చక్కనైన
రిప్లయితొలగించండిబూడిద, తెలుపు రంగుల బొమ్మవోలె
నిక్కబొడిచిన చెవులతో నక్కియున్న
పిల్లి పిల్లను జూచుట వేడుకగద
పిల్లి కాదది పులివోలె భీతి గొలుపు
రిప్లయితొలగించండినిలచి యుండని మీసముల్ నిక్క బొడిఛె
వేట దొరకని నెపమున బీటు వీసి
కన్ను లందున క్రోధము మిన్ను లంటె
అల్లరి కృష్ణునితో రే
రిప్లయితొలగించండిపల్లెలొ నిను పోల్చెదరట పడతులు కినుకన్
గొల్లల తోడను నీవలె
చల్లయు,పాలును పెరుగును చాటుగ తినగన్
బల్లూరి ఉమాదేవి
తెలుపు నలుపు కలగలిసిన తేనె కళ్ళ పిల్లిరా
రిప్లయితొలగించండితలుపు వెనక మాటు వేసి తపన తోడ నుండెరా
యెలుక కొరకు వేచి యుండె నింత లేసి కళ్ళతో
పలుక రించ పారి పోవు ప్రాణ మన్న తీపిరా !!!
పెంచుచుంద్రు పల్లెలందు ప్రేమతోడ గృహములన్
రిప్లయితొలగించండిచిన్నిపాపతోడ చేరి చెంగలించి యాడురా
మూషికములబట్టి సతము మోదమిచ్చు చుండురా
యింటిలోన బెట్టి కొట్ట నెగిరి రక్కి వేయురా
శైలజ గారి స్ఫూర్తితో "ఉత్సాహ" జాతి పద్యం మొదటి సారిగా వ్రాశాను.
రిప్లయితొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గూగుల్ సెట్టింగుల గురించి నిన్న నేనిచ్చిన వివరాలు చూశారా?
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ మొదటి ప్రయత్నంగా ఉత్సాహ పద్యం బాగున్నది. అభినందనలు.
కాని ప్రాస నియమాన్ని మరిచిపోయారు.
పిల్లి పిల్ల పారికోయె వెదకు చున్న దొరకదే
రిప్లయితొలగించండిలల్లి బెంచె ప్రేమ మీర రస్కు లేసి దానికీ
చిల్లి గారె లివ్వ గానె చిందు లేసి యాడునే
కళ్ళ బడితె మీకు తాను కాస్త నాకు జెప్పరే !!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పద్యం కూడా బాగున్నది. అభినందనసలు.
‘దానికీ’ అన్నదాన్ని ‘దానికిన్’ అనండి.
ఇంటిలోని మూషికముల నిట్టె పట్టివేయురా
రిప్లయితొలగించండివంటయింటి తలుపు తెరువ పాలుత్రాగి పోవురా
కంటి చూపుతోడ సతము కరము భీతిఁగొల్పురా
చంటి వారి తోడ చేరి సంతసముగ నాడురా
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ తాజా పద్యం సలక్షణంగా ఉంది అలరించింది. అభినందనలు.
సోయగమొప్పు నీసొగసు సుందర శోభిత బంధయుగ్మమై|
రిప్లయితొలగించండిధ్యేయము రైతు రక్షగ|విధేయత యందునమూషికాలనే
మాయముజేయు నట్టి పరమావధిగా,విధి నెంచు పిల్లివై
శ్రేయము నింపు చూపు గల చిన్నదినున్నదిజంతు జాలమై|
సాకుడు జంతువై మెలగి సర్వుల ప్రేమను పొంది యింటిలో
రిప్లయితొలగించండిమూకుడు మూయకున్నను?సమూలముగాతినగల్గినట్టి.దా
దూకుడు నెంచకే ఎగిరి దూరముగున్నను మూషికాలనే
తాకుచుచంపి మేలొసగు తత్వముగల్గిన నల్ల పిల్లివా?
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
చూడగ కన్నులా?విషయ సూచిక కుంచిన గిన్నెలేన?వెం
రిప్లయితొలగించండిటాడెడి మీసముల్ దెలుప?టక్కునబట్టెడి పిల్లివా?గనన్
తోడుగ వంట యింట పరితోషకమంటగ వెంటనుండు|ఓ
నీడ గ మూషికంబుగననీయకజేసెడి బొమ్మరూపువా|
చూశానండి.కాని అక్కడ "తెలుగువెలుగులు" అనేది కనిపించలేదండి
రిప్లయితొలగించండివంటింట్లో పాల తెరవొ?
రిప్లయితొలగించండికంటఁ బడిన చుంచుకమును గతికెడు తలపో?
కంటికి రెప్పల మూయదు
నింట తిరుగు పిల్లి పిల్ల లింతేనయ్యా!
కళ్ళు మూసి పిల్లి కనగ పాలుత్రాగ
రిప్లయితొలగించండిలోకము తెలియదని లోకులు యన
గదిని మూసి వేసి గదిమి చూడ తలవ
పిల్లి కాదుగ పులి పిల్ల యపుడు
శకునమందు పిల్లి సరిజూడ గా తిట్లు
రిప్లయితొలగించండిపాలు పెరుగు దాచ పడును పాట్లు
భామ నడక లంద్రు వయ్యారి క్యాట్ వాక్లు
ఎలుక దిన్న పిల్లి పొందు లైక్లు.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
ఉమాదేవి గారూ,
అక్కడ 'teluguvelugulu' అని లేనప్పుడు ఆ బాక్సులో నేను చెప్పినట్లు మీ పేరు పెట్టి ప్రయత్నించండి. లేదా మీ పేరుతో కొత్త జిమెయిల్ అకౌంట్ తెరవండి.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పల్లా నరేంద్ర గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం. ‘లోకులు+అన’ అన్నప్పుడు యడాగమం రాదు. నా సవరణ...
కళ్ళు మూసి పిల్లి కనగ పాలను త్రాగ
లోకము తెలియదని లోకు లనగ.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మణిప్రవాళంలో అంత్యానుప్రాసతో మీ పద్యం బాగుంది. అభినందనలు.
కనుడు పిల్లి మెడను గంట యొకటి కల
రిప్లయితొలగించండిదెఱుక చేయు నది చరించు చోటు,
పెంచుకున్నవారు ప్రేమతో కట్టిరి
యెలుక లన్ని పొ౦ద హెచ్చరికను.