కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
రాజా! పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై.
(‘రౌడీరాజ్యం’ బ్లాగునుండి మలక్‍పేట్ రౌడీ గారికి ధన్యవాదాలతో)
నా పూరణ....
రాజిల్లంగ తనూవిలాసము, కడున్ రమ్యంబులై యొప్పు నంభోజాక్షంబులతో శకుంతలయు నా భూజాని దుష్యంతుఁ డ
వ్యాజేచ్చం గనుచుండ స్నాన మొనరింపన్ జేటి చెప్పెన్ "మహా
రాజా! పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై"
మష్టారూ! ఇంక మేమేమి వ్రాయాలి
రిప్లయితొలగించండిరాజీవా క్షుడులోక నాధుడకటా రాముండ నంగానతన్
రిప్లయితొలగించండిడేజన్మంబున బొందెనోయనగ నాలావణ్య సాధ్వీ మణిన్
రాజిల్లంగమనో వికాశమరయన్ రాగాను రాగంబు తోన్
రాజా ! పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై
-------------------------------------------
హమ్మ ......య్యా . ఎలాగో కిట్టించాను
ఇక దేముడి ......దే.....భా...........రం
రాజాహంసను రాయబార మునకున్ రంజింపగా నోపునే
రిప్లయితొలగించండియాజాబిల్లిని బోలుయందమట యారాణిన్ కలన్ గాంచుచో
తేజంబున్ వెలుగొందుచుండు దమయంతిన్ దారగానొందినన్
రాజా ! పున్నమి రాత్రిపూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై
------------------------------------------------------------------
వొకటే సరిగా లేదంటే ఇంకోటి కుడానా ?
గురువు గారూ, మీ పూరణను దినాంతంలో చూపిస్తే బాగుంటుంది. లేకుంటే దీవిటీలు వెలిగించడానికి కూడా మన కవి మిత్రులు సంకోచిస్తారు
రిప్లయితొలగించండిఅక్కయ్య గారూ
రిప్లయితొలగించండిమొదటి పద్యం రెండవపాదం యతి తప్పింది
రెండవ పద్యం రెండవ పాదంలో ఉ కారంతో యడాగమం చేయటం తప్పు(బోలు యందమట)జాబిల్లినివోలెయందమట అంటే కాస్త బాగుంటుందేమో
మాస్టరుగారూ..అద్భుతమైన ఊహ...
రిప్లయితొలగించండియుద్ధభూమిలో ముందుండి నడిపించే సేనాధిపతి లాగా గురువుగారు దారిచూపుచున్నారు.
రిప్లయితొలగించండిరాజేశ్వరి గారు మీ రెండుపద్యాలలో రెండవపాదం లో యతి తప్పిందేమో నని అనిపిస్తుంది.
రిప్లయితొలగించండిమొదటిపద్యం : ఏ కి లా నప్పుదు .
రెండవపద్యం : ఆ కి రా నప్పదు .
గురువుగారూ ! మర్రిచెట్టు నీడన చిన్న చిన్న చెట్లు మనగలవా ? మీపూరణ ముందు మా పద్యాలు వెలవెల బోవా ? చెప్పండి.
రిప్లయితొలగించండిగురువుగారూ జేటి యనగా తియ్యని కంద అని వుంది .ఇక్కడ మీ పూరణలో అర్ధం ఏమిటో వివరిస్తారా ?
రిప్లయితొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. ఆలోచించండి... దారి దొరక్కపోదు!
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ రెండవపాదంలో యతి తప్పింది. అక్కడ ‘...యనగ నయ్యింతిన్ సుసాధ్వీమణిన్’ అనండి.
రెండవ పూరణ రెండవ పాదంలోను యతి తప్పింది. అక్కడ ‘యాజాబిల్లిని బోలుయంద మనగా నామెన్ కలన్ గాంచుచో’ అనండి.
శ్రీఆదిభట్ల వారి సూచనలను గమనించండి.
*****
పిరాట్ల ప్రసాద్ గారూ,
ధన్యవాదాలు. ఇకనుండి మీరు కోరినట్లే చేస్తాను.
నా పద్యంలో ‘స్నాన మొనరింపన్ + చేటి’ ద్రుతసంధి జరిగి ‘జేటి’ అయింది. చేటి అంటే చెలికత్తె అని తెలుసు కదా!
*****
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
ధన్యవాదాలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
ధన్యవాదాలు.
ప్రణామములు గురువుగారు..కవిమిత్రుల వ్యాఖ్యలు చూస్తే నాపద్యం పెట్టడం చాలా సాహసం అన్పిస్తోంది ..అయినా సరే..ఎలాగో కిట్టించి కిట్టించి మయసభ సీన్ ని తలచి వ్రాసాను.. శార్ధూలం రెండవ ప్రయత్నమిది.. తప్పులను మన్నించి సరిదిద్ద ప్రార్ధన..
రిప్లయితొలగించండిరోజా లున్నవి ముళ్ళు లేక సభలోరూపించె మిథ్యామతై
జాజుల్మల్లెలు జంటగా నచట సంజాతంబు గానుండె నా
యాజాబిల్లిని జూచి కల్వలుగదా యాహ్లాద మున్ విచ్చు నో
రాజా !పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమరీ కిట్టించినట్లుగా కాక సహజశైలీవిన్యాసంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మిథ్యామతి+ఐ’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. అందుకని అక్కడ ‘మిథ్యాగతిన్’ అందామా?
తేజోవంతుడు సూర్యనందనుడు కుంతీపుత్రు డాకర్ణుడే
రిప్లయితొలగించండితాజేరెన్ నిజదారతోడ నొక గాంతారమ్ము వ్యాహ్యాళికై
రాజిల్లెన్ రవివోలె తోచెనట నౌరా యేమి విడ్డూరమో
రాజా పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై.
తాజా పువ్వుల నవ్వులున్విరియగా?తాజ్నందంబు లోకంబునన్
రిప్లయితొలగించండిరాజా పున్నమిరాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై|
తేజంబందున తేలియాడుచును సత్కీర్తందు ముంతాజ్సమా
దే|జీవించెగదా|ప్రపంచమున సందేహంబు లేదెచ్చటన్|
తేజోవంత ముఖారవిందలయి దేదీప్యంబుగా వెల్గుచున్
రిప్లయితొలగించండితాజాగా దివినుంచివచ్చి తమ వస్త్రమ్ముల్ ప్రకాశించగా
మోజుల్దీరగ స్నానమాడ గని సమ్మోహించి యొక్కండనెన్
రాజా! పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై!
రాజీవంబులు గాదె నేత్రములు సల్లాపక్రియన్ నెచ్చెలీ
రిప్లయితొలగించండిమోజుల్ దీర్చుచు చంద్రబింబముఖమున్ ముద్దాడుచున్ నీకున
వ్యాజప్రేమను కానుకిచ్చెదన నాహ్లాదంబులుప్పొంగె నో
రాజా! పున్నమి రాత్రిఁ బూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై?
ధన్యవాదములు గురువుగారు...
రిప్లయితొలగించండినమస్కారములు
రిప్లయితొలగించండిసవరించిన శర్మ గారికీ గురువు గారికి ధన్య వాదములు
శా.రాజారామముశిల్పొకండుశతపత్రంబెల్లకాసారముల్
రిప్లయితొలగించండితేజోవీక్షనమౌతెఱంగుఘనమందిన్చంగసంతుష్టులై
హా!జీవించెనుమాసరస్సులనువారానందమేతెల్పెనో
రాజా! పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై"
రాజారమ్మనిపిల్చ కాననమునన్, రంజిల్ల నుల్లమ్ము తోషంబుతో
రిప్లయితొలగించండిరాజీవాక్షుడు రాచబిడ్డ దృతితో ప్రాంతమ్ము వే తాఁజనెన్
కంజాక్షిన్ తనుమధ్యనొక్కతిఁగనన్ కాసార మందెంచుచున్
“రాజా! పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి"సాజంబైన కళా విలాసమదె సాక్షాత్కారమై యొప్పఁ దా
రిప్లయితొలగించండినోజన్ జిత్తరువున్ లిఖించె నొకఁడయ్యో చిన్న దోషమ్ము ! కా
నీ జేజే యనవచ్చుఁ జిత్ర కళకున్ నిక్కమ్ముగాఁ జూడు డో
రాజా ! పున్నమి రాత్రిఁ బూచె సరసిన్ రాజీవముల్ 'చిత్రమై' !"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరాభరణ కవి మండలికి సప్తమీ విభక్తిని గురించిన ఒక చిన్న సూచన -అకారాంత పదములకు సంబంధించి సప్తమీ వాడదలిస్తే "ను" కారమును, ఇకారాంత పదములకు సంబంధించి సప్తమీ వాడదలిస్తే "ని" కారమును , ఉకారాంత పదముల సప్తమీ కొరకు "న" కారమును ఉపయోగించవలసి ఉంటుంది.
రిప్లయితొలగించండితద్వ్యత్యయం బాగా ప్రాచుర్యంలో ఉంది - శంకరాభరణంలో కూడా. ఉదాహరణకు - కవి మండలి యందు అనడానికి కవి మండలిన అని కాకుండా, కవి మండలిని అనాలి; ధరణిన కాదు, ధరణిని అనాలి, అలాగే చంద్ర మండలమున , రాజలోకమున అనాలి (ఇవి రెండూ ఉకారాంత పద సప్తమీ కి ఉదాహరణలు) ... ఇత్యాది ! ఆయా పదాంతములను పోల్చుకుని తత్సంబంధి సప్తమీ ప్రత్యయం వాడితే సరిపోతుంది. ఓడ ' ను ' జరిగే ముచ్చట కనరే అందరికీ తెలిసిందే ( అకారాంత పద సప్తమీకి ఉదాహరణ ) , మాన్యులు శ్రీ శంకరయ్య గారికి ధన్యవాదాలతో - ఇతి నతయః !
సవరణతో......
రిప్లయితొలగించండితేజోవంత ముఖారవిందలయి దేదీప్యంబుగా వెల్గుచున్
తాజాగా దివినుంచివచ్చి సిత వస్త్రమ్ముల్ ప్రకాశించగా
మోజుల్దీరగ నీదువారిఁ గని సమ్మోహించి యొక్కండనెన్
రాజా! పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై !
18-4-2015 నాటి పూరణ.....
రిప్లయితొలగించండివ్యవధే తక్కువ బ్యాట్సుమేనులకు వయ్యారమ్ముగా పిచ్చు పై
నవలీలంగను బంతులన్ విసిరి వేయన్ సిక్సరుల్, ఫోర్లు కొ
ట్టు విధమ్మున్ బలు పృచ్ఛకాగ్రజుల పట్టున్ జార్చు పద్యాలతో
నవధానంబొక ట్వెంటి ట్వెంటి క్రికెటై యాహ్లాదమున్ గొల్పెడిన్!
పూజల్ సేయుచు పున్నమిన్ తగను నాపొల్పొందు పద్మాననల్
రిప్లయితొలగించండినాజూకౌ గతి దీపముల్ నిడగ,పుణ్యంబందగా గోరుచున్
రాజీవాననలెల్ల నీటగనరే రాజీవముల్ రీతిగా
రాజా!పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై
రాజీవంబుల కాకరంబగుచు, వే రాత్రంత కన్పించకన్,
ఓజన్ పున్నమి నాటిరాత్రి కొంతగడువన్,నొక్కింత యా చీకటిన్
రాజీవంబులు విచ్చె,పూర్వదిశలో రాజిల్లు రాగానికే
రాజా!పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై
రాజీవంబుల బోలు కన్నుగవతో రాజిల్లు నా నాయికన్
వే,జాబిల్లి వెలుంగునన్ గనిన,తా పెంపొందదే మోహమే
రాజిల్లా నిశ పున్నమిన్,గనగ నా రాజీవముల్ పూచెనాన్
రాజా!పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై
విష్ణునందన్ గారూ ! మీ సోదాహరణ సూచనకు ధన్యవాదములు...
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిమేజా బల్లను తెల్ల కాగితమునే మేలొందగా బర్చుచున్
నేజూచే నొక గంటలోనె త్వరగా నీటైన " పైంటింగు " నా
రోజే వేసెను నాదు మిత్రు డిడిగో రోహిత్ యనేవాడు రా
రాజా ! పున్నమి రాత్రి, పూచె సరసిన్ రాజీవముల్ " చిత్రమై ".
శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం. ‘తాజంద మీభూమిపై’ అందామా? ‘సత్కీరి+అందు’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
*****
బొడ్డు శంకరయ్య గారూ,
జగదేకవీరుని కథ చిత్రాన్ని గుర్తుకు తెచ్చారు. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘అవధానం బొక ట్వెంటి...’ సమస్యకు మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
(పై నాలుగు వ్యాఖ్యలను మధ్యాహమే పోస్ట్ చేశాను. ఎందుకో బ్లాగులో కనిపించలేదు)
*****
పిరాట్ల ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొద్దిగా అన్వయక్లేశం ఉన్నట్టుంది. ‘శిల్పి+ఒకండు’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. టైపు దోషాలున్నాయి.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం. ‘రంజిల్ల మోదంబుతో’ అనండి.
*****
డా. విష్ణునందన్ గారూ,
చిత్రకారుని దోషంగా మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
సప్తమీ విభక్తిని గురించిన మీ వివరణ కవిమిత్రులకు ఉపయుక్తంగా ఉంది. ధన్యవాదాలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నేజూచే’నన్న ప్రయోగం సాధువు కాదు. ‘నే జూడంగను గంటలోనె’ అనండి. ‘రోహిత్+అ(ను)నేవాడు’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. అక్కడ ‘రోహిత్ సుశీలుండు రా...’ అందామా?
మాష్టారు, నేను కూడా ఎలాగో కిట్టించాను. దయచేసి తప్పులు తెలపండి.
రిప్లయితొలగించండిభోజా! వెన్నెల రేయి నీ మొగమునన్ పొంగారి రాణించు యీ
తేజో పుంజపు కాంతి నంత గనగా, తిగ్మాంశు డేతెంచె ననీ
రాజీవంబులు భ్రాంతి జెందుచును విబ్రాజిల్లగన్ మిత్రమా!
రాజా! పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై
మిత్రులందరి పూరణలూ అద్భుతంగా ఉన్నాయి.
రిప్లయితొలగించండిమాస్టరుగారూ...ధన్యవాదములు...మీ సూచన తో.సవరించి.....
రిప్లయితొలగించండిమేజా బల్లను తెల్ల కాగితమునే మేలొందగా బర్చుచున్
నేజూడంగను గంటలోనె త్వరగా నీటైన " పైంటింగు " నా
రోజే వేసెను నాదు మిత్రు డిడిగో రోహిత్ సుభాష్ శర్మ రా
రాజా ! పున్నమి రాత్రి, పూచె సరసిన్ రాజీవముల్ " చిత్రమై ".
జాజుల్ వాడెను జాములన్ని గడచెన్ చాలింక సల్లాపముల్
రిప్లయితొలగించండిమోజుల్ తీరునె యుప్పెనై మనలనీ మోహమ్ము ముంచెత్తగా
నా జాబిల్లియు జేరె గూటికిని నాహా! ధన్యనైతింగదా
రాజా! పున్నమి రాత్రి, పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై.
మాజేటి సుమలత గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవపాదం చివర గణదోషం.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
విరుపుతో మీ పూరణ వైవిధ్యంగా మనోహరంగా ఉంది. అభినందనలు.
రాజా నామక వర్ణచిత్ర కలనా ప్రాజ్ఞుండు కాసారమున్
రిప్లయితొలగించండిరాజీవంబుల గూడియున్న తపనున్ రమ్యంబుగా నేర్చినన్
తేజోపుంజము గీయగామరవ ననంతేవాసి యొక్కండనెన్
రాజా! పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై
చిత్రం లో సూర్య బింబము చుట్టూ కిరణాలు లేనందున చంద్రుడనుకొని అలా ఊహించాడు
మూడవ పాదంలో 'ననంతేవాసి' అని పడ్డది,
రిప్లయితొలగించండి'నంతేవాసి' అని తీసుకోవలసిందిగా మనవి
ధన్యవాదములు మాష్టారు!
రిప్లయితొలగించండిసవరించానని అనుకుంటున్నాను...
భోజా! వెన్నెల రేయి నీ మొగమునన్ పొంగారి రాణించు యీ
తేజో పుంజపు కాంతి నంత గనగా, తిగ్మాంశుడేయంచు నా
రాజీవంబులు భ్రాంతి జెందుచును విబ్రాజిల్లగన్ మిత్రమా!
రాజా! పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై
పూజల్ గౌరికి జేతు తెమ్ము కలువల్ పుణ్యమ్ము చేకూరునో
రిప్లయితొలగించండిరాజా! పున్నమి రాత్రి పూచె సరసిన్ ; ...రాజీవముల్ చిత్రమై
రోజాలున్ కనకాంబరాలు మొగలుల్ రోషించి గాలింపగా
బాజారున్ కనిపించవాయె కొనగా బంగారు కాసుల్ వినా!
రాజా! సోనియ పుత్రుడా! తెలియుమో రాజీవుడౌ తండ్రియే
రిప్లయితొలగించండికాజేయంగహ! వోటులే విరివిగా గారాబు దాడీలవౌ
కూజాలో మొలకెత్తి భాజప మహా క్రూరంబుగా హెచ్చగా...
రాజా! పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై!