12, ఏప్రిల్ 2015, ఆదివారం

పద్య రచన - 877

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. ఎండకు సైతము వాడక
    మండెడి వేసవినికూడ మధురమొనర్చన్
    దండగ కట్టిన పూలట
    మెండుగ కనువిందుచేసి మిలమిలలాడెన్

    రిప్లయితొలగించండి
  2. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. పలురకముల పూదండలు
    విలసిల్లుచు మెరయు చుండ వేడుక బుట్టన్
    ఫలితము దేవుని గళమున
    కలతలు మటుమాయ మౌను కన్నుల విందౌ

    రిప్లయితొలగించండి
  4. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. పూవులమై బుట్టి భువిని
    తావిని వెదజల్లి నాము తల్లుల నీడన్
    దేవా! హారము లగుమము
    దీవించుమునీ గళమున దీపిలు నటులన్!!!

    రిప్లయితొలగించండి
  6. బల్లూరి ఉమాదేవి గారి పద్యం....

    సుమధురమగు నట్టి సుందర హారంబు
    భక్తు లొసగి నట్టి భవ్య మాల
    తులసి తోడ చేర్చి తోమాలగా చేసి
    స్వామి మెడను వేయ సంతసించె.

    రిప్లయితొలగించండి
  7. దేవీదివ్యపదారవిందములపై దీపించునో భవ్యమై
    భావావేశములన్ ప్రసంగమిడు విద్వన్మౌళినాశించునో
    చావున్ బొందినవాని కంఠమున్ తాఁ సంధిల్లునో చూడగా
    నావిశ్వేశుని యాజ్ఞరూప లిఖితంబై యుండవే జన్మముల్.

    రిప్లయితొలగించండి
  8. మల్లెలు,మంచిగంధమునమౌనముగాదరిజేర?సూదియే
    మెల్లగపట్టిగ్రుచ్చుచు-సమీపగులాబిగులాముసేయగా
    వల్లెయనంగవాటినిడి-వంతుగవచ్చెడి బంతి పూలనే
    తెల్లటిపూలతోగలిపి దీప్తినిబెంచగ?కంఠ హారమే
    మొగ్గలుసిగ్గునేవిడువ?మోజగుగంధ పరీమళమ్ములే
    దిగ్గునముక్కుజేర?నటుదిక్కులుజూడగ హారమందునన్
    మగ్గెడివెట్టి చాకిరిగ-మానవజీవనమందు విందుకై
    తగ్గు తలంపునన్నిలచు తత్వములేగద?హారబంధముల్

    రిప్లయితొలగించండి
  9. వివిధ రకముల పూలతో వెల్లి విరియు

    పూల దండలు జూడగ పుణ్య పురుష !

    కళ్ళు మిఱు మిట్లు గొలిపెను రంగు లవియ

    చూడ ముచ్చట గొలుపును జూప రులకు

    రిప్లయితొలగించండి
  10. హారములేనిపెళ్లి,మణిహారములేకను లక్ష్మీయున్|సమాహారములేనివిందు,పరిహారములేకను
    తప్పులొప్పులౌ
    "హారములందుకే-వివిధహారతులట్లుగ మల్లె,బంతులున్
    కోరినవన్ని వర్ణములుకూడియుగట్టగ?వర్ణనాంశమౌ|

    రిప్లయితొలగించండి
  11. సొమ్ముల షోకుల కంటెను
    అమ్మగ?ఈదండవిలువనధికంబనుచున్
    నమ్మిన?కళ్యాణంబగు
    డమ్మీనభ్యర్తికైన?డాంబిక మిదియే|

    రిప్లయితొలగించండి
  12. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    చాలా మంచి పద్యాన్ని రచించారు. అభినందనలు.
    ‘కంఠమున’... టైపాటు వల్ల ‘కంఠమున్’ అయింది.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యాలన్నీ బాగున్నవి. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. వనజభవుని మెడజేరునొ?
    జనార్దనుని కంఠమందు చందమ్మగునో?
    యనలాక్షుని గళమందునొ?
    మను సృష్టి స్థితిలయలందు మాలలు మహిలో!

    రిప్లయితొలగించండి
  14. పలురకముల విరులు పరిమళమ్ము గదుర
    ప్రభలుకురియుచుండె ప్రభువుఁజేర
    పూజ సలుప నిష్ట పూలదండలతోడ
    కామితములనిచ్చు కంసవైరి

    రిప్లయితొలగించండి
  15. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి