శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ, అన్ని పాదాలు గురువుతో ప్రారంభమవుతున్నాయి. ప్రథమాక్షరం హ్రస్వమా, దీర్ఘమా అనేది సమస్యకాదు. గురువైతే చాలు. బహుశా మీరు పండిత, పాండిత్య శబ్దాలను చూసి వ్యాఖ్యానించి ఉండవచ్చు... క్రింది ఉదాహరణ చూడండి... ఇంతలు కన్నులుండఁ దెరు వెవ్వరి వేడెదు భూసురేంద్ర యే కాంతమునందు నున్న జవరాండ్ర....
1. కంద పద్యంలో "గగ"(UU), "భ" (U I I), "జ" (I U I), "స"(I I U), "నల" (I I I I) అనే గణాలు వస్తాయి . గమనిస్తే అన్ని 4 మాత్రలు కల గణాలే! 2. కందంలో 1,3 పాదాలలో 3 గణాలు, 2,4 పాదాలలో 5 గణాలు వుంటాయి 3. బేసి గణం "జ" గణం కారాదు. అంటే 1,3 పాదాలలో 1,3 గణాలు, 2,4 పాదాలలో 2,4 గణాలు "జ" గణం కాకూడదు 4. 2,4 పాదాల అంతంలో "గురువు" ఉండాలి అంటే ఈ పాదాలలో 5 వ గణం "గగ" లేదా "స" అయి ఉండాలి 5. ప్రాస నియమం పాటించాలి. ప్రాసయతి పనికి రాదు 6. యతి మైత్రి 2,4 పాదాలలో మొదటి అక్షరానికి , నాలుగో గణం మొదటి అక్షరంతో కుదరాలి 7. అన్ని పాదాలలో మొదటి అక్షరాలు అన్ని హ్రస్వాలు గాని , అన్ని దీర్ఘాలు గాని అయి ఉండాలి 8. 2,4 పాదాలలో 3 వ గణం "జ" కానీ "నల" కానీ అయి ఉండాలి
పైన ఉన్న నియమాల పట్టికలో ఏడవ నియమం గమనించడి. హ్రస్వమూ దీర్ఘమూ అనే ఉంది కానీ లఘువూ, గురువూ అని లేదు.
నాగరాజు రవీందర్ గారు శంకరులవారు చెప్పింది ఒక మూర్ఖుడు చావుకు సిద్ధమయ్యే వయసులో వ్యాకరణం నేర్చుకునే సందర్భం .ఇప్పుడు వ్యాకరణం ఎందుకు భజగోవిందం అనుకో అని . ఎందుకో ఆ సందర్భం సమస్య ఇచ్చినతీరుకి అన్వయ మౌవడంలేదనిపిస్తుంది.ఒకసారి మరల పరికించగలరు. మీరు చూపిన చండాలుని సందర్భం కుడా అంతుపట్టడం లేదు .ఎందుకంటె అది కేవలం ఆత్మజ్ఞానం పరీక్షించడానికి చేసిన పరీక్ష.ఒకవేళ మీరన్నది నిజమైతే ఏమాత్రం పాండిత్య ప్రకర్ష లేకుండా శంకరులవారు ఆ ప్రశ్న అర్ధం చేసుకునేవారా .అంతటి మహామహిమాన్విత వ్యక్తీ కాబట్టే అందులోని అంతర్యం అర్ధం చేసుకున్నారు.
కామేశ్వర శర్మ గారూ – యిది నరసింహ కవి వ్రాసిన కృష్ణ శతకము లోని పద్యం. రెండవ పాదం గమనించండి. అండజ వాహన విను బ్ర హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీవా కొండల నెత్తితి వందురు కొండిక పని గాక దొడ్డ కొండా! కృష్ణా!
note: గురువుగారు రాజుగారి తోటలో కొలనులో కళ్ళు మిరుమిట్లు గొలిపే రంగులతో కొందరు శిల్పులు పద్మములకు మంచి రంగులు పులమగా ప్రజలు కీర్తించి ఓ రాజా సరసులో పూలు పూసినవి అన్న విధంగా నా భావన తెలిపుచున్నాను. నేను మునుపు పెట్టిన పద్యములో అన్వయక్లేశము వుందని అన్నందుకు మార్పును చేసి మీముందు ఉంచుతున్నాను .
చౌడప్ప శతకం ౧.ఉండగనిచ్చును నీపై పాండవ మద్యముని మీద పక్షము గోపా లుండగు ౨.మంతుడవై మన లక్ష్మీ కాంతుని ౩. అంభోజాక్షుల లోపల రంభేకడు చక్కదనము, రాగంబులలో గాంభీర్యమైన రాగము కాంభోజే కుంద వరపు కవి చౌడప్పా!
కామేశ్వర శర్మ గారూ – తిక్కన గారి విరాట పర్వం నుండి (ద్రౌపది మాటలు). గొంతికి నంత వెరువ, మీ కంత వెరువ, దైవమునకు నంత వెరువ, న త్యంత కలుషాత్మ విరటుని కాంతకు నే వెఱతుఁ బనులు గావించు నెడన్
కామేశ్వర శర్మ గారూ, మీరిచ్చిన నియమాలలో ఏడవది నిజానికి ఇలా ఉండాలి. ‘ అన్ని పాదాలలో మొదటి అక్షరాలు అన్ని లఘువులు గాని , అన్ని గురువులు గాని అయి ఉండాలి’. పోతన భాగవతం నుండి కొన్ని ఉదాహరణలు.....
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘దళములు+ఉండన్’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘దళములు గలుగన్’ అనండి. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, శ్రమపడి కొన్ని ఉదాహరణలు సేకరించారు. ధన్యవాదాలు.
కవి పండితుల మధ్య జరిగిన వాగ్వివాదంలో “పాణ్డిత్య హీనాః కవయో భవన్తి” అనే వాక్యానికి శ్రీ గాడేపల్లి వీర రాఘవ శతావధాని గారు ఆశువుగా చెప్పిన మహా పద్య మాలిక జ్ఞాపకం వచ్చి ఈ పూరణ చేశాను. సవరణకు కృతజ్ఞతలు.
కుమార్ సోదరా అర్ధం తెలుపడానికేముంది ? " అసలు తెలుగే దండుగ అనుకుంటున్న ఈ ఆంగ్ల యుగంలో " అని నాఉద్దేశ్యము అదన్నమాట . అడిగినందులకు శ్రీ కుమార్ గారికీ , సవరణ జేసిన గురువులకు ధన్య వాదములు
కుమార్ గారూ, సవరించిన పద్యంలోను అదే తప్పు చేశారు. ‘వెదకెడు, ఎన్నెడు’ సాధురూపాలు. ‘ఎన్నే’ అనడం దోషమే. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘నీచుడు+ఔటన్’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘నీచుం డగుటన్’ అనండి. ***** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** బొడ్డు శంకరయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘తిండి+ఏ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘తిండియె’ అనండి. ***** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నాకు తెలిసినంతలో, నిజానికి 7వ సూత్రము అక్కరలేదు (redundant). ఎందుకంటే, ప్రాస నియమాల ప్రకారం ప్రాస పూర్వాక్షరం అన్నింటా లఘువుగాని గురువుగానీ అయిఉండాలి. కందానికి ప్రాస నియమం ఉంది కాబట్టి (rule-5), అన్ని పాదాలు గురువుతో గాని లఘువుతో గాని ప్రారంభమవాలి. ఇది ఒక్క కందానికే కాదు, ప్రాసనియమం ఉన్న అన్ని పద్యాలకు వర్తిస్తుంది. వృత్తలలో నిర్ధిష్టమైన గణాలు ఉంటాయి గాబట్టి ఈ నియమం విడిగా చెప్పనక్కలేదు. ఆసక్తి కరమైన విషమేమిటంటే, ఈ నియమాన్ని (rule-7)ని ఒక్క కందపద్య సూత్రాలలోనే ఎక్కువగా చూసాను. మిగిలిన జాతి పద్యాల విషయంలో ఎందుకో దీనిని విడిగా చెప్పరు. ప్రాస నియమంలో భాగంగా పరిగణిస్తారు.
దండుగ తెలుగను భాషట
రిప్లయితొలగించండిబండను బాదిన తెఱగున బాధించు టకున్
దండిగ కవనము లల్లెడి
పండితుఁ డెందులకు పనికివచ్చుధరిత్రిన్
రిప్లయితొలగించండిమొండిగ వాదనజేసెడి
పండితుఁ డెందులకు? పనికివచ్చు ధరిత్రిన్
చండాలుండును జనులకు
దండుగ కొరగానివిద్య ధరణినెవరికిన్
నిండుగ పుత్తడి పొదిగొను
రిప్లయితొలగించండిపెండియముల పెక్కు దాల్చి బింకము తోడన్
మండిపడెడి నిర్దయుడగు
పండితుఁ డెందులకు పనికివచ్చు ధరిత్రిన్
నాగరాజు గారూ, "డుకృఞ్" వ-గణం (లగ) అవుతుంది. "డూకృఞ్" అంటే సరి పోతుంది కానీ ధాతు పాఠం ఒప్పు కోదనుకొంటాను.
రిప్లయితొలగించండిరాజేశ్వరి అక్క గారూ, మీ పద్యం కమ్మగా వుంది. మొదటి పాదం అర్థం కాలేదు. వివరిస్తారా?
రిప్లయితొలగించండిపాండిత్య హీనులేకద
రిప్లయితొలగించండిదండుగ మారి కవులనుచు తప్పులు వెతికే
మెండగు గుణముల నెఱుగని
పండితుఁ డెందులకు పనికివచ్చు ధరిత్రిన్.
పండితభావము దెలియని
రిప్లయితొలగించండిపండితు డెందులకు, పనికివచ్చు ధరిత్రిన్
పెండెరములు లేకున్నను
నిండుగ జనహితము గోరు నిజమగు పఠియే!!!
ఉండగ భవర్ణ మనుజుల
రిప్లయితొలగించండికుండుట నా రాభణునకు నుచితం బనియెన్
గండరగండడె మరియొక
పండితుఁ డెందులకు పనికివచ్చు ధరిత్రిన్!
కం : మెండుగ సంపద లున్నను
రిప్లయితొలగించండిదండిగ వాగ్ధాటి శక్తి దన్నుగ యున్నన్
మొండిగ వాదన చేయు కు
పండితుడెందులకు పనికి వచ్చు ధరిత్ర
దండిగ నీతుల జెప్పుచు
రిప్లయితొలగించండినుండియు నాచరణమందు న్యూనత జూపే
దండగ మారులు కుహనా
పండితుడెందులకు పనికి వచ్చు ధరిత్రిన్.
పాండిత్యము గలవాడని
రిప్లయితొలగించండిమెండుగఁ బిలువగ విదేశ మేధిని యందున్
చంఢాలపు పని జేయగ
పండితు డెందులకు పనికివచ్చు ధరిత్రిన్!
రాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటిపాదాన్ని ‘దండుగ తెలుగని పలుకుచు’ అనండి.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణకు మీ సవరణ బాగున్నది.
*****
మాజేటి సుమలత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వెతికే’ అనడం సాధువుకాదు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పూరణ చమత్కారభరితమై అలరించింది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘దన్నుగ నున్నన్’ అనండి.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘చూపే’ అనడం వ్యావహారికం.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పండగ తల, అనుభవమున
రిప్లయితొలగించండిపండించగ తన పొలమున పంటలు రైతుగ
పండుగ సంక్రాంతి తెలియ
పండితుఁ డెందులకు పనికివచ్చు ధరిత్రిన్
పల్లా నరేంద్ర గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘రైతుగ’ అన్నచోట గణదోషం. ‘రైతే’ అనండి.
దండిగ ధనమును పొందగ
రిప్లయితొలగించండిమొండిగ కవితలనువ్రాసి మూర్ఖులకొరకై
బండడు రీతిని బ్రతికెడు
పండితుఁడెందులకు పనికివచ్చు ధరిత్రిన్
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అండగకండయు లేకను
రిప్లయితొలగించండిగుండెకు బలమేది?చూడ గుబులేమిగులున్
బండగునాదరణంబున
పందితుడెందులకు పనికివచ్చు ధరిత్రిన్
నిండగు నవినీతందున
పండిన పండితుని మాట పలుకులువినుటే?
ఎండినఫైరుకు నీరిడు
పందితు డెందులకు పనికి వచ్చు ధరిత్రిన్|
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మీ పద్యాలలో టైప్ దోషాలుండడం సహజమై పోయింది.
శ్రీ శంకరయ్యగారూ
రిప్లయితొలగించండిరెండు మూడు పద్యాలలో గమనించినదేమిటంటే
ఒక పాదం దీర్ఘంతోనూ, మిగతా పాదాలు హ్రస్వంతోనూ మొదలవుతునాయి. అది తప్పుకదా?? కాస్త వివరం చెపుతారా??
శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
రిప్లయితొలగించండిఅన్ని పాదాలు గురువుతో ప్రారంభమవుతున్నాయి. ప్రథమాక్షరం హ్రస్వమా, దీర్ఘమా అనేది సమస్యకాదు. గురువైతే చాలు. బహుశా మీరు పండిత, పాండిత్య శబ్దాలను చూసి వ్యాఖ్యానించి ఉండవచ్చు... క్రింది ఉదాహరణ చూడండి...
ఇంతలు కన్నులుండఁ దెరు వెవ్వరి వేడెదు భూసురేంద్ర యే
కాంతమునందు నున్న జవరాండ్ర....
రిప్లయితొలగించండిగూండాలను దండించగ
పండితుఁ డెందులకు పనికివచ్చుధరిత్రిన్
గుండెబలము నధికారము
దండిగ కల్గిన సిపాహి దళములుయుండన్
వివరణకు సంతోషం, ధన్యవాదం. కానీ మీరుదహరించినది కంద పద్యం కాదుకదా. పరికించండి
రిప్లయితొలగించండినేను చెప్పినది ఒక్క కందపద్యం విషయంలో మాత్రమే.
కందంలో అలా హ్రస్వముతోనూ దీర్ఘముతోనూ ప్రారంభమైన, నలుగురికీ తెలిసిన, లేదా పెద్దలెవరైనా వ్రాసిన పద్యం ఉంటే ఉదహరించండి దయచేసి
రిప్లయితొలగించండి1. కంద పద్యంలో
రిప్లయితొలగించండి"గగ"(UU), "భ" (U I I), "జ" (I U I), "స"(I I U), "నల" (I I I I)
అనే గణాలు వస్తాయి . గమనిస్తే అన్ని 4 మాత్రలు కల గణాలే!
2. కందంలో 1,3 పాదాలలో 3 గణాలు, 2,4 పాదాలలో 5 గణాలు వుంటాయి
3. బేసి గణం "జ" గణం కారాదు.
అంటే 1,3 పాదాలలో 1,3 గణాలు, 2,4 పాదాలలో 2,4 గణాలు "జ" గణం కాకూడదు
4. 2,4 పాదాల అంతంలో "గురువు" ఉండాలి
అంటే ఈ పాదాలలో 5 వ గణం "గగ" లేదా "స" అయి ఉండాలి
5. ప్రాస నియమం పాటించాలి. ప్రాసయతి పనికి రాదు
6. యతి మైత్రి 2,4 పాదాలలో మొదటి అక్షరానికి , నాలుగో గణం మొదటి అక్షరంతో కుదరాలి
7. అన్ని పాదాలలో మొదటి అక్షరాలు అన్ని హ్రస్వాలు గాని , అన్ని దీర్ఘాలు గాని అయి ఉండాలి
8. 2,4 పాదాలలో 3 వ గణం "జ" కానీ "నల" కానీ అయి ఉండాలి
పైన ఉన్న నియమాల పట్టికలో ఏడవ నియమం గమనించడి. హ్రస్వమూ దీర్ఘమూ అనే ఉంది కానీ లఘువూ, గురువూ అని లేదు.
http://kavitavika.blogspot.ae/2013/11/i-i-i-i-i-i-i-u-i-i-u-i-u-i-i-u-i-u-u-u.html
రిప్లయితొలగించండిముందు చూపిన నియమాలు నేను వ్రాసినవి కావు, మీదన్ ఇచ్చిన లింకునుండి గ్రహించినవి.
నాగరాజు రవీందర్ గారు శంకరులవారు చెప్పింది ఒక మూర్ఖుడు చావుకు సిద్ధమయ్యే వయసులో వ్యాకరణం నేర్చుకునే సందర్భం .ఇప్పుడు వ్యాకరణం ఎందుకు భజగోవిందం అనుకో అని . ఎందుకో ఆ సందర్భం సమస్య ఇచ్చినతీరుకి అన్వయ మౌవడంలేదనిపిస్తుంది.ఒకసారి మరల పరికించగలరు. మీరు చూపిన చండాలుని సందర్భం కుడా అంతుపట్టడం లేదు .ఎందుకంటె అది కేవలం ఆత్మజ్ఞానం పరీక్షించడానికి చేసిన పరీక్ష.ఒకవేళ మీరన్నది నిజమైతే ఏమాత్రం పాండిత్య ప్రకర్ష లేకుండా శంకరులవారు ఆ ప్రశ్న అర్ధం చేసుకునేవారా .అంతటి మహామహిమాన్విత వ్యక్తీ కాబట్టే అందులోని అంతర్యం అర్ధం చేసుకున్నారు.
రిప్లయితొలగించండిధన్యోస్మి
కామేశ్వర శర్మ గారూ – యిది నరసింహ కవి వ్రాసిన కృష్ణ శతకము లోని పద్యం. రెండవ పాదం గమనించండి.
రిప్లయితొలగించండిఅండజ వాహన విను బ్ర
హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీవా
కొండల నెత్తితి వందురు
కొండిక పని గాక దొడ్డ కొండా! కృష్ణా!
శా.రాజారామముశిల్పులందుశతపత్రంబెల్లకాసారముల్
రిప్లయితొలగించండితేజోవీక్షణజేయుఱంగులనురుద్దించ్చంగసంతుష్టులై
వాజంబున్ నడయాడుపుష్పమనిసంభావించికీర్తించిరో
రాజా! పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై"
note: గురువుగారు రాజుగారి తోటలో కొలనులో కళ్ళు మిరుమిట్లు గొలిపే రంగులతో కొందరు శిల్పులు పద్మములకు మంచి రంగులు పులమగా ప్రజలు కీర్తించి ఓ రాజా సరసులో పూలు పూసినవి అన్న విధంగా నా భావన తెలిపుచున్నాను. నేను మునుపు పెట్టిన పద్యములో అన్వయక్లేశము వుందని అన్నందుకు మార్పును చేసి మీముందు ఉంచుతున్నాను .
ధన్యోస్మి .
చౌడప్ప శతకం
రిప్లయితొలగించండి౧.ఉండగనిచ్చును నీపై
పాండవ మద్యముని మీద పక్షము గోపా
లుండగు
౨.మంతుడవై మన లక్ష్మీ
కాంతుని
౩. అంభోజాక్షుల లోపల
రంభేకడు చక్కదనము, రాగంబులలో
గాంభీర్యమైన రాగము
కాంభోజే కుంద వరపు కవి చౌడప్పా!
కామేశ్వర శర్మ గారూ – తిక్కన గారి విరాట పర్వం నుండి (ద్రౌపది మాటలు).
రిప్లయితొలగించండిగొంతికి నంత వెరువ, మీ
కంత వెరువ, దైవమునకు నంత వెరువ, న
త్యంత కలుషాత్మ విరటుని
కాంతకు నే వెఱతుఁ బనులు గావించు నెడన్
కామేశ్వర శర్మ గారూ,
రిప్లయితొలగించండిమీరిచ్చిన నియమాలలో ఏడవది నిజానికి ఇలా ఉండాలి. ‘ అన్ని పాదాలలో మొదటి అక్షరాలు అన్ని లఘువులు గాని , అన్ని గురువులు గాని అయి ఉండాలి’.
పోతన భాగవతం నుండి కొన్ని ఉదాహరణలు.....
బంధుఁడు వచ్చె నటంచును
గాంధారీవిభుఁడు మొదలుగా నందఱు సం
బంధములు నెఱపి ప్రీతి న
మంథరగతిఁ జేసి రపుడు మన్నన లనఘా! 1 స్కం-13 అ-297
అంతట వారల మరణము
వింతయగుచుఁ జూడఁబడిన విదురుఁడు చింతా
సంతాప మొదవఁ బ్రీత
స్వాంతుండై తీర్థములకుఁ జనియెడు నధిపా! 1స్కం-13అ-328
దండి ననేకులతో నా
ఖండలుఁ డెదురైన గెలిచి ఖాండవ వనముం
జండార్చికి నర్పించిన
గాండీవము నిచ్చెఁ జక్రి గలుగుటఁ గాదే? 1స్కం-15అ-358
పాండవ కృష్ణుల యానము
పాండురమతి నెవ్వఁడైనఁ బలికిన విన్నన్
ఖండిత భవుఁడై హరిదా
సుండై కైవల్యపదము సొచ్చు నరేంద్రా! 1స్కం-15అ-387
గాండీవియుఁ జక్రియు భూ
మండలి నెడఁబాసి చనిన మదమత్తుఁడవై
దండింపఁ దగనివారల
దండించెదు నీవ తగుదు దండనమునకున్. 1స్కం-17అ-413
సర్వాత్ము వాసుదేవుని
సర్వజ్ఞుఁడవైన నీవు సంస్తుతిసేయన్
సర్వభ్రాంతులు వదలె మ
హోర్వీసురవర్య! మానసోత్సవ మగుచున్. 2స్కం-4అ-55
మండలములోన భాస్కరుఁ
డుండుచు జగములకు దీప్తి నొసగెడి క్రియ బ్ర
హ్మాండములోపల నచ్యుతుఁ
డుండుచు బహిరంతరముల నొగి వెలిఁగించున్. 2స్కం-6అ-92
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘దళములు+ఉండన్’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘దళములు గలుగన్’ అనండి.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
శ్రమపడి కొన్ని ఉదాహరణలు సేకరించారు. ధన్యవాదాలు.
శ్రీ శంకరయ్యగారూ,
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి వారూ
ధన్యవాదం.
గురువు గారూ, సవరించిన పద్యం:
రిప్లయితొలగించండిపాండిత్య హీనులేకద
దండుగయౌ కవులటంచు తప్పుల నెన్నే
మెండగు గుణముల నెఱుగని
పండితుఁ డెందులకు పనికివచ్చు ధరిత్రిన్.
కవి పండితుల మధ్య జరిగిన వాగ్వివాదంలో “పాణ్డిత్య హీనాః కవయో భవన్తి” అనే వాక్యానికి శ్రీ గాడేపల్లి వీర రాఘవ శతావధాని గారు ఆశువుగా చెప్పిన మహా పద్య మాలిక జ్ఞాపకం వచ్చి ఈ పూరణ చేశాను. సవరణకు కృతజ్ఞతలు.
భండన మందున శాత్రవ
రిప్లయితొలగించండిఖండన సేయగ నభీక కదన సువిద్యా
పండితుడు కావలెను, కవి
పండితు డెందులకు పనికివచ్చు ధరిత్రిన్
భండన మందున శాత్రవ
రిప్లయితొలగించండిఖండన సేయగ నభీక కదన సువిద్యా
పండితుడు కావలెను, కవి
పండితు డెందులకు పనికివచ్చు ధరిత్రిన్
రిప్లయితొలగించండికొండెయు, వివేకహీనుడు
పండితుఁ డెందులకు పనికివచ్చుధరిత్రిన్
మెండుగ మానవ శ్రేయము
నిండారగ జేయ,లేని నీచుడు యౌటన్
|“దండుగ పద్యమ్మనుచును
రిప్లయితొలగించండిపండితు డెందులకుపనికి వచ్చు ధరిత్రిన్
బండగ నొక డన్న ఫలమ?”
పండితభావాలపంట?పరమార్థంబే|
కుమార్ సోదరా
రిప్లయితొలగించండిఅర్ధం తెలుపడానికేముంది ? " అసలు తెలుగే దండుగ అనుకుంటున్న ఈ ఆంగ్ల యుగంలో " అని నాఉద్దేశ్యము అదన్నమాట .
అడిగినందులకు శ్రీ కుమార్ గారికీ , సవరణ జేసిన గురువులకు ధన్య వాదములు
మెండుగ తిండే పెట్టని
రిప్లయితొలగించండిపండిత పోషణము లేని ప్రభువుల చెంతన్
దండిగ కవితలు జెప్పెడు
పండితు డెందులకు పనికి వచ్చు ధరిత్రిన్!
నిండుగ నీ కలికాలము
రిప్లయితొలగించండిపండితుడైనట్టి వాని వాక్కులు వెగటౌ
నిండెను లోకము తప్పుల
పండితుడెందులకు పనికివచ్చు ధరిత్రిన్?
మండిత కీర్తిని గనినను
పండితుడెందున బ్రతుకగ పనియేలేకన్
మెండుగ నిరాశ నందడె
పండితు డెందులకు పనికివచ్చు ధరిత్రిన్
నిండగు నేటిని దాటగ
మండిత పాండిత్య మదియ మనుగడనీదే!
మెండుగ నీతయు కావలె
పండితుడెందులకు పనికివచ్చు ధరిత్రిన్
కుండలు చేసెడి కుమ్మరి
నిండుగ భారాలు మ్రోయు నేర్పరి యతడున్
పండితు కంటెను ఘనులిల
పండితు డెందులకు పనికివచ్చు ధరిత్రిన్
కుమార్ గారూ,
రిప్లయితొలగించండిసవరించిన పద్యంలోను అదే తప్పు చేశారు. ‘వెదకెడు, ఎన్నెడు’ సాధురూపాలు. ‘ఎన్నే’ అనడం దోషమే.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నీచుడు+ఔటన్’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘నీచుం డగుటన్’ అనండి.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తిండి+ఏ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘తిండియె’ అనండి.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నా పూరణ.....
రిప్లయితొలగించండినిండుమనము లేకుండిన
పండితుఁ డెందులకు? పనికి వచ్చు ధరిత్రిన్
కొండొక విద్యాహీనుఁడు
మెండగు సౌహార్దముండి మేలొనఁగూర్చన్.
-----------
రిప్లయితొలగించండి"దండము, గురువా! దెల్పుము
పండితుడెందులకు?" - "పనికి వచ్చు ధరిత్రిన్,
మెండుగ శాస్త్రంబులనం
దుండెడి సారంబు దెల్ప నెరుగర శిష్యా!"
పుష్యం గారూ,
రిప్లయితొలగించండిఈనాటి పూరణలలో మీది నిస్సందేహంగా ఉత్తమంగా ఉన్నది. అభినందనలు, ధన్యవాదాలు.
ధన్యవాదాలు, శంకరయ్యగారు!
రిప్లయితొలగించండిమంచి పద్యం వ్రాసిన పుష్యం గారికి హార్దిక అభినందనలు
రిప్లయితొలగించండినాకు తెలిసినంతలో, నిజానికి 7వ సూత్రము అక్కరలేదు (redundant). ఎందుకంటే, ప్రాస నియమాల ప్రకారం ప్రాస పూర్వాక్షరం అన్నింటా లఘువుగాని గురువుగానీ అయిఉండాలి. కందానికి ప్రాస నియమం ఉంది కాబట్టి (rule-5), అన్ని పాదాలు గురువుతో గాని లఘువుతో గాని ప్రారంభమవాలి. ఇది ఒక్క కందానికే కాదు, ప్రాసనియమం ఉన్న అన్ని పద్యాలకు వర్తిస్తుంది. వృత్తలలో నిర్ధిష్టమైన గణాలు ఉంటాయి గాబట్టి ఈ నియమం విడిగా చెప్పనక్కలేదు. ఆసక్తి కరమైన విషమేమిటంటే, ఈ నియమాన్ని (rule-7)ని ఒక్క కందపద్య సూత్రాలలోనే ఎక్కువగా చూసాను. మిగిలిన జాతి పద్యాల విషయంలో ఎందుకో దీనిని విడిగా చెప్పరు. ప్రాస నియమంలో భాగంగా పరిగణిస్తారు.
రిప్లయితొలగించండిపద్యము నచ్చినందుకు ధన్యవాదాలు, మూర్తి గారు!
రిప్లయితొలగించండికం.పాండిత్య ప్రకర్షగలిగి
రిప్లయితొలగించండిపండితుఁ డెందులకు పనికివచ్చు ధరిత్రిన్.
మెండగు కవిత్వ ముజతగ
యుండిన కవిపండితునిగ పొసగును మహిలో
************************************
గమనిక : పండితుని కంటే కవిపండితుడు మేలను అర్ధము లో .
తిండియు తిప్పలు గలిగిన
రిప్లయితొలగించండిపండితుఁ డెందులకు పనికివచ్చు ధరిత్రిన్?
కొండొక దండుగ సభలో
మొండిగ వాగ్వాదములను ముద్దుగ జేయన్ :)
కొండాడుచు తన కవితల్
రిప్లయితొలగించండిచెండాడుచు పరులవెల్ల ఛీఛీయనుచున్
దండుగ కూతలు కూసెడి
పండితుఁ డెందులకు పనికివచ్చు ధరిత్రిన్?