5, ఏప్రిల్ 2015, ఆదివారం

సమస్యా పూరణము - 1640 (పా లిమ్మని సుతుని భర్తపాలికిఁ బంపెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
పా లిమ్మని సుతుని భర్తపాలికిఁ బంపెన్.
(ఆకాశవాణి వారి సమస్య)

27 కామెంట్‌లు:

  1. తలిదండ్రులిడిన యాస్తిని
    పలువిధముల పాడు జేయు పతి చేష్టలతో
    తెలివైన సతీమణి తమ
    పాలిమ్మని, సుతుని భర్త పాలికిఁ బంపెన్

    రిప్లయితొలగించండి
  2. బాలుడు నేడువ సాగెను
    వీలుగ లేదనుచు పలక విరిగిన దనుచున్
    మేలగు పలకను మరి బల
    పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్ !!!

    రిప్లయితొలగించండి


  3. ఆలిని పుత్ర్రుని కాదని
    వ్రాలితివిగ వారకాంత పంచన సైచన్
    జాలమిక నాస్తిలో సగ
    పా లిమ్మని సుతుని భర్తపాలికిఁ బంపెన్.

    రిప్లయితొలగించండి
  4. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ ‘ఆస్తిలో పాలు’ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ ‘బలపాల’ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘బాలుం డేడువసాగెను’ అంటే బాగుంటుందేమో?
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ ‘గునపాల’ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ ‘సగపాలు’ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. ఆలున్న కొట్టమందునఁ
    బాలను బిదుకంగ పోయె వచ్చుటకై యీ
    యాలస్య మేల? టీకై
    పాలిమ్మని సుతుని భర్తపాలికిఁ బంపెన్.

    రిప్లయితొలగించండి
  6. అన్నపరెడ్డి వారూ,
    నిజమే! నేనూ గమనించలేదు.

    రిప్లయితొలగించండి
  7. గోలను తాళగ జాలక,
    మాలిమిగా తల్లిచేయి మరువని పుత్రున్
    మేలగు ముద్దుల చేమురి
    పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్

    రిప్లయితొలగించండి

  8. బాలుడు నేడువ సాగెను
    పాలిమ్మని , సుతుని భర్త పాలికి బంపెన్
    బాలకు సొమ్ములు దెమ్మని
    మాలతి దా జెప్పె నపుడు పరుగున రారా .

    రిప్లయితొలగించండి
  9. పాలను వీడని బిడ్డకు
    పాలీయగలేని తల్లి,బాలునిగని వే
    పాలావునిడగ గోరుచు
    పాలిమ్మని సుతుని భర్త పాలికి బంపెన్

    ఆలిని బిడ్డను వీడియు
    పాలన పోషణ వదలిన భర్తను కోరెన్
    పాలనకై యాస్తిని తమ
    పాలిమ్మని సుతుని భర్తపాలికి బంపెన్

    రిప్లయితొలగించండి
  10. కం. చాలా కాలము పెనిమిటి
    యేలా గొనువీలుచూచి యింటికి రాగా
    బాలుని ముద్దిడి నీమురి
    పాలిమ్మని సుతుని భర్తపాలికి బంపెన్

    రిప్లయితొలగించండి
  11. పాలివ్వనితల్లి|కొనెడి
    పాలిమ్మనిసుతుని భర్తపాలికిబంపెన్
    బాలింతలనిర్వాకము
    లోలోపలకుములుటాయె|లోకపుతీరే|
    పాలిచ్చితి బాలునిమురి
    పాలిమ్మని సుతునిభర్తపాలికిబంపెన్
    మేలగుసంతుకు కంతుగ
    జాలియులేకున్న జన్మచరితయునలుగున్|

    రిప్లయితొలగించండి
  12. కవితా వసంతం పేరిట మొన్న post చేసిన దానికి నా స్పందన:

    కేవలం వచనం తొ వ్రాసినదానిని కుడా కవిత్వం అనుకోవడం కడు శోచనీయము. కవిత్వం అంటే పద్యం రాయడమే మిగితావి కవిత్వాలు కావు. మీరు ఆహ్వానిచ్చే వచనం ఎవరైనా రాయొచ్చు దానికి ప్రత్యెక అర్హత ఏమి అక్కరలేదని నా ఉద్దేశం. కవితా వసంతం అని కవిత్వానికి ,కవులకి ఆదరణ లేకపోవడం మిక్కిలి హాస్యాస్పదం

    రిప్లయితొలగించండి

  13. పిరాట్ల ప్రసాదుగారు,
    పద్యకవిత్వంపై మీకు గల అభిమానం హర్షణీయం. కాని, కవిత్వం అంటే పద్యం రాయడమే మిగితావి కవిత్వాలు కావని అనుకోవటం పొరపాటు. గద్యః కవీనాం‌ నికషం వదంతి అన్న నానుడి కూడా ఉంది కదా, అందుచేత కవిత్వం గద్య రూపంలో ఉన్నా ఆమోదయోగ్యమే, అభిలషణీయమే. కవిత్వాన్ని ఒక స్వరూపంలోనో ఒక ప్రక్రియలోనే మనం మన అభిమానాలతో పెనవేసి చూడటం సరిగాదనుకుంటాను. కవితాత్మ కలవాడు ప్రక్రియతో సంబంధం లేకుండా అందమైన రసవంతమైన కవిత్వం చెప్పగలడు. వచనకవిత్వం పేరుతో చాలా రొట్ట చెలామణీ అవుతూ ఉండవచ్చుకాని అందమైన వచన కవిత్వమూ రసజ్ఞులు తప్పక గమనించవచ్చును. ఇకపోతే పద్యకవిత్వప్రక్రియకు ఆదరణ తగ్గటం పెరగటం అంతా కాలప్రభావం అంతే. కలతపడకండి. అంతా రామేఛ్ఛ.

    రిప్లయితొలగించండి
  14. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ ‘మురిపాల’ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ ‘టినోపాల్’ పూరణ బాగున్నది. అభినందనలు.
    అన్నట్టు... టినోపాల్ మార్కెట్లో ఉందా? చాలాకాలంగా కనిపిండడం లేదు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ ‘మురిపాల’ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    ‘శ్యామలీయం’ గారు చెప్పినట్లు వచనకవిత్వాన్ని చులకన చేయాల్సిన పని లేదు. అందులోను మంచి కవిత్వం ఉంది. ఎటొచ్చీ మన సంప్రదాయ పద్యకవిత్వాన్ని నిర్లక్ష్యం చేయకుంటే చాలు!
    *****
    శ్యామలీయం గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. ఆలిని పుత్రుని చూడక
    లీలావతితో తనపతి లీలలఁగనుచున్
    బేలయగు పత్ని యాస్తిన్
    పాలిమ్మని, సుతుని భర్త పాలికిఁ బంపెన్

    రిప్లయితొలగించండి
  16. నూలిగరసు వాడయ్యెను
    పోలేనుర నాన్నతోడ బోనాలకునే
    బోలెడు పెరిగిన నీ జుల
    పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్!
    (నూలిగరసు=బట్టతల)

    రిప్లయితొలగించండి
  17. నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    నా పూరణ నచ్చినందుకు ధన్యవాదాలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ ‘జులపాల’ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. గురువుగారు , నా అభిప్రాయం వచనకవిత్వం బాగుంటుంది బాగుండదు అని కాదండి.అసలు వచనం అంటే ఏమిటి పద్య రూపం లో లేనిదంతా వచనమే దానికి ఛందస్సు వుండదు నిశ్ఛందకవిత. అంటే ఒక పామరుడు వచించేది కుడా కవిత్వమే అవుతుంది.అందుకే అది ఎవరైనా రాయొచ్చని అన్నాను. వచనాన్ని కవిత్వం చేయడం అనేది ఒక ఆధునిక ప్రక్రియ.పూర్వం ప్రౌఢ కవిత్వం రాసినవారంతా పద్యం లేదా శ్లోకమో రాసి కింద సామాన్య పదజాలం లో వచనం రాసేవారు. అక్కడ వారు రాసిన వచనానికి వచనం అని పేరు పెట్టారు కాని దానిని కుడా ఒక కవిత్వం గా భావించమని ఏ గ్రంధం లో నేను చూడలేదు.మనం వచించేది వచనం. నిర్ద్వంద్వం గా చెప్పాలంటే పద్యకవిత్వం లో కొన్ని రూల్స్ regulations తొ ఒక క్రమబద్దీకరణ తొ అలంకారపూరితంగా నిర్మించబడ్డ ఛందస్సు సహితంగా ,వ్యాకరణ సహేతుకంగా వ్రాయాల్సిన పరిస్థితి వుంది .అది ఏడవలేని వారు వారిదీ ఒక కవిత్వమే అనే దౌభాగ్యపు స్థితి లో అంటే socalled modern కవిత్వదోరణి లో మనం బతుకుతున్నాం .ఇంతా తెలిసి యదార్ధం మనకి ఇంత స్పష్టం గా గోచరమౌతున్నా దీనిని ఖండించక పోవడం శోచనీయం. వచనకవిత్వం అనేది ఒకటి బయట చలామణి లో వుందని నాకు తెలియనిది కాదు.అదంతా భావ కవిత్వం అని ఒక పేరు పెట్టారు. ఎవరో మహానుభావుడు ఒక సినిమా పాటలో అన్నారు "భావకవుల వలె ఎవరికీ తెలియని యేవో పాటలు పాడాలోయ్ " అన్న ఛందం లో వుంటుంది ఆ కవిత .ఎవరినీ నొప్పించడం నా అభిమతం కాదు .ఇది స్వతంత్ర భారత దేశం కాబట్టి మీ అభిప్రాయానికి యెంత విలువవ వుందో నాకు అంతే విలువ వుంది కాబట్టి నా అభిప్రాయాన్ని మన సనాతనులు కూడా పాటించిన మూలాన్ని ఆధారం చేసుకొని నా అభిప్రాయాన్ని మీకు వెల్లడిస్తున్నాను .అన్యధా భావించవద్దు. దీనిగురించి సాహితీసేవ site లో already పెద్దలు జ.కే.మోహన్ గారు కూడా వారి కవితా వసంతం advt .against గా ప్రతిఘటిస్తూ comment చేసారు.

    ధన్యోస్మి .

    రిప్లయితొలగించండి
  19. కవిత్వం అంటే అన్నీ కవితలే అన్నప్పుడు కేవలం వచనపరులని మాత్రమె పిలవడం యెంత హాస్యాస్పదం గా వుందంటే మా మతం లోనే దేవుడు వున్నాడు అన్నట్టు వుంది. అలో చించండి.

    రిప్లయితొలగించండి
  20. నాగరాజు రవీందర్ గారు టీనోపాల్ ఇప్పుడు లేదు దానిని raanipal చేసారు.గమనించ ప్రార్ధన

    రిప్లయితొలగించండి
  21. పిరాట్లవారూ,

    భావకవిత్వమూ వచనకవిత్వమూ వేరువేరు ప్రక్రియలు. అవి పర్యాయపదాలు కావు.

    సంప్రదాయంలో కవి అన్న వ్యవహారమే కాని రచయిత అన్న వ్యవహారం లేదనుకుంటాను.

    బాణమహాకవి కాదంబరి వచన కావ్యం. అందులో ప్రారంభవాక్యమే, "ఆసీ దశేషనరపతిశిరః సమభ్యర్చిత శాసనః పాకశాశన ఇవా పరః చతురుదధివేలావలయిత భువోభర్తా కర్తామాఅశ్చర్యాణాం ఆహర్తఃక్రతూనాం ..... రాజా శూద్రకోనామః" అని ఒక రెండు మూడు పేజీలపొడుగు ఉంటుంది.ఆ కావ్యంలో‌ లేని విషయం లేదని కాబోలు బాణోఛ్ఛిష్ఠమ్‌ జగత్రయమ్‌ అన్న నానుడి యేర్పడింది. ఇలా అనేక వచన కావ్యాలూ ఉన్నాయి.

    పద్యకవిత్వం సొగసు దానిదే, మరేదీ సాటిరాదు. కాని పద్యకవులు పాదపూరణలకోసం చేసే విన్యాసాలు నవ్వుపుట్టించే సందర్భాలు కొల్లలుగా ఉంటాయి కూడా. అంతకంటే ఎంతోసులభం వచనకవిత్వం అని రాసిపారేస్తున్నవారి భాషాభావశైలీదారిద్ర్యాల మూలంగా హెచ్చు వినోదవికారాలు జనిస్తున్నాయి. ప్రతిభను బట్టి కవిత్వం కాని ప్రక్రియనౌ బట్టి కాదని స్పష్టం.

    ఖండనార్హమైన సంగతి భాషమీద పట్టులేకుండానే ప్రక్రియలపై ఆధిపత్యం సాధించకుండానే, తనదైన శైలీవిన్యాసాన్ని యేర్పరచుకోకుండానే ఏదీ వ్రాసినా కవిత్వమే ఐతీరుతుందని భావించేవాళ్ళా - వాదించేవాళ్ళా అజ్ఞానం.

    వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు. అసలు రసం అన్న పదం గురించి ఎన్నడూ వినని వాళ్ళూ నేడు కవిత్వాన్ని జనం మీదకు విసిరేస్తున్నారు. అదీ అసలు దుస్థితి.

    రిప్లయితొలగించండి
  22. పిరాట్లవారూ,
    "సాహితీసేవ site లో already పెద్దలు జ.కే.మోహన్ గారు కూడా వారి కవితా వసంతం advt .against గా ప్రతిఘటిస్తూ comment చేసారు." అన్నారు. ఆ సైట్ చిరునామా ఇవ్వగలరా?

    రిప్లయితొలగించండి
  23. ttps://www.facebook.com/groups/sahitheeseva/

    ఇది facebook లో ఒక గ్రూపు అండి సాహితీ సేవ వారిదే.

    రిప్లయితొలగించండి
  24. శ్యామలీయం గారు.
    రచయుత అంటే కేవలం రాసినవారు అనే అండి ఉదా. భారతం ఎవరు రచించారు అంటే మనం ఏ నన్నయ్య లేదా తిక్కన గారు రచించారు అంటాము .కాబట్టి కవి రచయిత వేరు కారు .ఇక కేవలం కవి అంటే కవిత్వం రాసేవాడు కవి.కవిత్వం అంటే ఒక ప్రక్రియ అది ఛందస్సు అనుకోండి లేదా గద్యరూపం అనుకోండి.కావ్యం means కేవలం ఒక book but with some స్టాండర్డ్స్.మీరు చెప్పిన కాదంబరి ఒక novel infact novels లో మొట్టమదటి novel అనొచ్చు.కావ్యానికి కొన్ని లక్షణాలు వున్నాయి .ఒక కవిని అన్నివిధాలుగా పరీక్షించేది కావ్యం .అంటే అందులో అన్ని విషయాలు చెప్పబడి ఉండాలి. వచనం అంటే literal meaning మనం వచించేది అంటే దీనికి కవిత్వ ధోరణితో సంబంధం లేదు.కేవలం ఒక కవి తను వ్రాసిన కవిత్వం గురించి గాని అక్కడ సందర్భానుసారం అతను మనకి ఏమి తెలుపాలి అనుకోని సామాన్య భాష లో చెప్పేది వచనం.ఇది కవిత్వం పోకడ వుండదు .ఇదివరకే నేను చెప్పాను నిశ్ఛందం గా వుండేది . గద్యకావ్యం కి ఒక style వుంది. కొన్ని చంపు కావ్యాలు అంటారు అంటే పద్యాలు + గద్యం తొ కూడి రెండు ఉండేవి. మన నన్నయ్య గారు వ్రాసిన ఆంధ్రమహాభారతం చెంపు కావ్యమే .అంతే కాని వచించేది కవిత్వం ఏమిటండి కేవలం దానికి ఒక పేరుపెట్టారు వచన కవిత్వం అని .ఇప్పుడు నిర్వచనోత్తర రామాయణం వుంది దాని అర్ధం ఏమిటి ఇందులో వచనం అంటే కవి ఏమి మాట్లాదాలనుకున్నారో (సామాన్య భాషలో ) అది లేకుండా అతను రాసారు.వచనం అనేది just explanatory purpose కి తీసుకునే ఒక paragraph మాత్రమె. ఈ చర్చ ఇక్కడ ఆగదు లెండి.ఎవరి అభిరుచి వారిది మీరన్నట్టు లేచినవాడు లేవనివాడు భావం వున్నా లేకున్నా వ్రాసిన ప్రతిదీ కవితై మన్నుతున్న ఈ కాలం లో నేను ఏమిచెప్పినా ఇబ్బందిగానే ఉండొచ్చు .కాని వారి ఇబ్బందిని భరిస్తే అది నాకు ఇబ్బంది. అందుకే నా భావం నావరకే పరిమితం గా ఉంచుతాను. శ్రమ తీసుకొని స్పందించినందుకు ధన్యవాదాలు.కాలచక్రం పరిభ్రమణ ప్రభావం మల్లి ఈ విపర్యాసాలు అంతరించి పద్యకవిత్వానికి పునర్వైభవం దక్కుతుందని ఆశిద్దాం .

    రిప్లయితొలగించండి
  25. పాలమ్మును తన మగడే;
    "పాలను వాషింగు పొడిని భారిగ కల్తీ!
    చాలిక హెరిటేజ్! గేదెవి
    పాలిమ్మని" సుతుని భర్తపాలికిఁ బంపెన్

    https://www.google.co.in/amp/www.thehindu.com/news/national/andhra-pradesh/assembly-adjourned-over-heritage-milk-row/article6591455.ece/amp/

    రిప్లయితొలగించండి
  26. మేలగు నాయుడు గారిది
    వీలుగ షాపందు నున్న ప్రియుడగు మగనిన్,
    చాలవు కాఫికి, హెరిటేజ్
    పాలిమ్మని సుతుని భర్తపాలికిఁ బంపెన్

    రిప్లయితొలగించండి