17, ఏప్రిల్ 2015, శుక్రవారం

సమస్యా పూరణము - 1650 (భర్త యల్లుఁడయ్యె భామ కపుడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
భర్త యల్లుఁడయ్యె భామ కపుడు.
(‘రౌడీరాజ్యం’ బ్లాగునుండి మలక్‍పేట్ రౌడీ గారికి ధన్యవాదాలతో)

18 కామెంట్‌లు:

 1. రాక్షసాధముఁడు హిరణ్యాక్షుఁ జంపుచో
  నవనికి పతి యయ్యె నా ముకుందుఁ
  డతఁడె రాముఁడయ్యు నవనిజఁ జేపట్ట
  భర్త యల్లుఁ డయ్యె భామ కపుడు.

  రిప్లయితొలగించండి
 2. పెద్దలు తిమ్మాజిరావు కేంబాయి గారికి జన్మదిన శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 3. హరుని విల్లు విరచి పరిణయమాడెనా
  జనకసుతను రామచంద్రుడపుడు
  భూమిజ పతియయ్యె భూదేవి పతితాను
  భర్త యల్లు డయ్యె భామ కపుడు

  రిప్లయితొలగించండి
 4. భూమి భర్త రాజు భూపతి యగునంట
  సూన పెండ్లి యాడె సూర్య వంశి
  ఇతర దేశ మునకు నెంతేని యువరాజు
  భర్త యల్లు డయ్యె భామ కపుడు

  రిప్లయితొలగించండి
 5. కృతయుగమున తాను క్షితిని చేబట్టెను
  పిదపజన్మలోన పృథివిసుతను
  కొనెను చక్రధారి కోసలాధిపతియై
  భర్తయల్లుఁడయ్యె భామ కపుడు

  రిప్లయితొలగించండి
 6. ధరను దాచినట్టి దనుజుని పరిమార్చి
  వసుధకుపతి యయ్యె పావనుండు
  రాఘవునిగ తాను రససుతను వరించ
  భర్త యల్లు డయ్యె భామ కపుడు !!!

  రిప్లయితొలగించండి
 7. నమస్తే అండీ.
  అసురు సంహరించి అవనిని కాపాడి
  ధరణి దేవికి హరి ధవుడు నయ్యె
  శివధనువును విరిచి సీతను పెండ్లాడి
  భర్త యల్లుడయ్యె భామ కపుడు.
  బల్లూరి.ఉమాదేవి

  రిప్లయితొలగించండి
 8. తాను మరణ మొంద తనదు సోదరునకు
  భర్త యల్లు డయ్యె ,భామ కపుడు
  భర్త యగును సుతుడు, బంధ మిట్లు గలుగు
  నిట్లు గాను నుండె నెక్క డైన

  రిప్లయితొలగించండి
 9. పిల్ల నచ్చె ననిరి పెండ్లి జేయు డనిరి
  మాఘ మందు శుభము మంచి దనిరి
  పెండ్లి జరిగి పోయె వేడ్కగా, కూతురు
  భర్త యల్లుఁడయ్యె భామ కపుడు.

  రిప్లయితొలగించండి
 10. వసుధభర్తయల్లుడయ్యె-భామకపుడు జూడగా
  పసుపుబట్టలందుసీత పరిణయంబునందునన్
  పసిడియంచు చీర నందు పారవశ్య దృశ్యమై
  గుసగుసందు గాక పెళ్లి గుట్టువీడరాముతో|.

  రిప్లయితొలగించండి
 11. kavimitrulaku namaskRtulu.
  prayaaNamlO unnaanu. mI pUraNalanu samIkShimcalEka pOtunnaanu. mannimcamDi. veelaite ee raatriki pariSeelistaanu.
  pUraNalu, padyaalu vraasina mitrulaku abhinamdanalu, dhanyavaadaalu.

  రిప్లయితొలగించండి
 12. శ్రీతిమ్మాజీరావుగారి-పుట్టినరోజుశుభాకాంక్షలు
  -------------------------------
  పూరణ లెన్నొ తిమ్మా
  జీరావు సలుప గలిగెను చింతించకనే
  ఆరావుగారి పుట్టిన
  ఈరోజుశుభా శయములు నెంచెద?మదిలో

  రిప్లయితొలగించండి
 13. కార్తి, కావ్య లేమొ కవలలై పుట్టిరి
  కమల నక్క కూతుఁ కార్తి నచ్చె
  ప్రియ సహోదరుండు పెద్దక్క కూతురి
  భర్త యల్లుఁడయ్యె, భామ కపుడు!

  రిప్లయితొలగించండి
 14. విష్ణుపత్నిగాను వెలుగును భూదేవి
  సీత తాను భూమి చెలువుబిడ్డ
  రాము భార్య యయ్యె రాజిల్లు రీతిగా
  భర్తయల్లుడయ్యె భామకపుడు

  కూతు తానునిడగ కూర్మితో దానంబు
  తాళిగట్టె నొకడు ధర్మ గతిని
  అపుడు నగును గాదె అమ్మాయి చేకొన్న
  భర్త,యల్లుడయ్యె భామకపుడు

  రాధ బృందమందు రమణీయమౌ రీతి
  కృష్ణు భార్య యయ్యె,కృష్ణునకును
  నత్త వరుసదౌట నయ్యెడ వింతగా
  భర్తయల్లుడయ్యె భామకపుడు

  మేనమామ భార్య మేదిని వరుసకు
  చెల్లెలయ్యె నామె చేకొనంగ
  నత్త యైన నామె యాలిగా మారగా
  భర్తయల్లుడయ్యె భామకపుడు

  రిప్లయితొలగించండి
 15. అన్న కొడుకుతోడ కన్నకూతురునకు
  పెండ్లిజేయనెంచ ప్రేమ పేర
  పెండ్లియాడ బాయి ఫ్రెండుతో తన సుత
  భర్త యల్లుఁడయ్యె భామ కపుడు.

  రిప్లయితొలగించండి
 16. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ అర్థం కాలేదు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మీ శుభాకాంక్షల పద్యం బాగున్నది.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ******
  గొలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. ప్రియ కృతులని వ్రాసి ప్రియునకు అర్పించ
  వలచి నతని తనదు వరుని చేయ
  తనువు హాయి దేలె తన జననికి కృతి
  భర్త యల్లుఁడయ్యె భామ కపుడు

  రిప్లయితొలగించండి