8, ఏప్రిల్ 2015, బుధవారం

పద్య రచన - 873

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

  1. కం. భారత వీరుడు తీరెను
    భారమునాయంపశయ్య పార్ధుడు పరచన్
    ధీరులు యాతని పొగిడిరి
    కారిన ధారగ వగచిరి కన్నీరొలుకన్.

    రిప్లయితొలగించండి
  2. శరతల్ప మందు భీష్ముడు
    వరమొందిన ఫలిత మనగ ప్రాణము నిల్పన్
    మరణము కొఱకని వేచెను
    తరియించి మిగుల యశమున తానై జగతిన్

    రిప్లయితొలగించండి
  3. భాణ హతితోడ రయమున పడుట గాంచి
    తాత దేహము నేలను తాక కుండ
    నంపశయ్యను సృజియించె నర్జునుండు
    ధర్మబోధసలిపె తాత ధర్మజునకు

    రిప్లయితొలగించండి
  4. తే!గీ! తండ్రి కిచ్చిన మాటను తలను దాల్చి
    బతుకు గడపిన రాజర్షి భారతాన!
    ధర్మ పక్షాన బోరిన ధార్మికుండు
    నేల కొరగెను కదనాన నేడు చూడు!

    రిప్లయితొలగించండి
  5. పవ్వ ళిం చెను భీష్ముడు పాన్పు మీద
    యంప శయ్యది పార్ధుని నంప గముల
    చేత నిర్మింప బడియెను జిత్ర ముగను
    ధర్మ రాజాదు లచ్చట దరిని యుండి
    ధర్మ సందేహ ములువిని తనియు చుండ్రి

    రిప్లయితొలగించండి
  6. తనను గెల్వ నెవరి తరముగాదని తెల్సి
    తనను జంపు రీతి తాను తెలిపె
    ధర్మ మెరుక జేసె ధర్మనందనునికి
    ధన్య జీవి యతడు ధరణి లోన

    విష్ణు నామములను విశ్వమంతట చాటి
    పుణ్య మబ్బు విధము బోధ జేసె.
    శోక మణగ జనుల సుఖము నొందగ గోరు
    శాంతనవుని కీర్తి శాశ్వతంబు.

    రిప్లయితొలగించండి
  7. గంగ సుతుడు గూలె కదనరంగమునందు
    యంపశయ్యగట్టె నర్జునుండు
    నుత్త రాయణమ్ము నుదయించు వరకును
    నుర్వి నుందు ననుచు నూరడించె!!!

    రిప్లయితొలగించండి
  8. విజయుడుభీష్మ శయ్యనిడ?వేదనజెందకనుత్తరాయణం
    రుజువున జీవమున్నిలిపి రోదనలేకనుకృష్ణుడండతో
    విజయము-వీరస్వర్గమని-వీరులనానుడినెంచినట్లుగా
    ద్విజులును మెచ్చు నీతిదెలిపే|తనజీవమువీడె-భీష్ముడే

    రిప్లయితొలగించండి
  9. నారాయణ నామంబును
    పారాయణ జేసినట్టి వరమహిమేమో
    ధీరుని, భీష్ముని బ్రోవగ
    నారాయణు డేగుదెంచె నంత్యమునందున్!

    రిప్లయితొలగించండి