యాత్రమనసుకు?సంతోషమాత్రయగును| ప్రకృతందించు పరమార్థభాగ్యమగును| సహజ గుణవంతు లెంచెడి భహుమతగును| నెంతవారికిముఖ్యంబు చింతమాన్ప| భక్తి భావన స్నానాలు శక్తిగూర్చు| దైవదర్శన భాగ్యమే దరికి జేర్చు| సర్వ మానవ ప్రేమనే సాక నేర్పు| అట్టియాత్రలు మనిషికి?పట్టుగాదె|
కవిమిత్రులకు నమస్కృతులు... అమరావతినుండి ఉండవల్లి గుహలు, అక్కడినుండి మంగళగిరి వెళ్ళి పానకాల నరసింహస్వామిని దర్శించుకొని విజయవాడ మీదుగా ఇప్పుడే ఇల్లు చేరాను. ప్రయాణపు బడలిక వల్ల ఈనాటి పద్యాల గుణదోష విచారణ చేయలేకపోతున్నాను. మన్నించండి. చక్కని పద్యాలను వ్రాసిన మిత్రు లందరికీ పేరుపేరునా అభినందనలు, ధన్యవాదాలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించుఅందరి పూరణలూ అలరింప నున్నవి !
తీర్థయాత్రలు :
01)
______________________________
తీరి కూర్చుని కుక్షికై - తినుట కన్న
తిరుగుచుండుట మేల్గాదె - దేహమునకు !
దేశదిమ్మరి వలెగాక - స్థిరము గాను
తీర్థయాత్రల దిరిగిన - దివ్యమగును !
______________________________
వయసు మళ్ళిన పిమ్మట బలము లేక
రిప్లయితొలగించుతీర్ధ యాత్రలు జేయంగ తీర దనక
కాలు జేతులు పనిజేయు కాల మందు
పుణ్య క్షేత్రము దిరిగిన మోక్ష మలరు
రిప్లయితొలగించుఅయ్యవారు వెళ్ళిరి అమరావతి కి
మొదలు పెట్టెను ఆంధ్ర లోకం
అమరావతి సాక్షాత్కార సాధనకు
తీర్థ యాత్రలు 'ట్రీట్'యాత్రలు ఇక !!
శుభోదయం
జిలేబి
సెలవుదినములందు చిన్న పిల్లలతోడ
రిప్లయితొలగించుతీర్థయాత్రలుచన తీరుగాను
మనసు చల్లబడును మమతలు పెరుగును
మారినట్టి స్థితుల కారణమున
తీర్ధ యాత్రలు జేయగ సార్ధ కమగు
రిప్లయితొలగించువారి జీవిత మ నుటను బాడి యగును
పుణ్య ముపురుషా ర్ధమ్ములు భూరి కలుగు
కాన యాత్రలు నా వశ్య కములు సుమ్ము
నది గల తీరమందునయినన్, మఱి పుష్కరిణుండు చోటులో
రిప్లయితొలగించుకుదురుగ నున్న కోవెలనుఁ గొల్వగఁ జేరుట తీర్థయాత్రగున్,
సదమల ధర్మమోక్షముల సాధనఁ జేయగ భక్తితో సదా
మదినొక స్వామి రూపునిడి మంగళమెంచుచు నేగుటొప్పగున్.
యాత్రమనసుకు?సంతోషమాత్రయగును|
రిప్లయితొలగించుప్రకృతందించు పరమార్థభాగ్యమగును|
సహజ గుణవంతు లెంచెడి భహుమతగును|
నెంతవారికిముఖ్యంబు చింతమాన్ప|
భక్తి భావన స్నానాలు శక్తిగూర్చు|
దైవదర్శన భాగ్యమే దరికి జేర్చు|
సర్వ మానవ ప్రేమనే సాక నేర్పు|
అట్టియాత్రలు మనిషికి?పట్టుగాదె|
పురముచరితకు ఆధార పుస్తకాలు
రిప్లయితొలగించునాటిపౌరాణికాంశాల చాటగలుగు
మేటి రాజులభక్తికి చాటువులుగ
తీర్థయాత్రలు బ్రతుకున దిగులుమాన్పు
భక్తినిపెంపుజేయుటకుభాధ్యతనింపగ తీర్తయాత్ర?నా
సక్తిని దెచ్చిపెట్టిమనసందున నూహలలూగ జేయుచున్
రక్తి,వివేకమున్నిడి|విరక్తినిదూరమునుంచునట్లుగా?
శక్తికి,ముక్తికిన్నడుమ శాంతముబంచెడియాత్రముఖ్యమే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఅవనిలోన తీర్ధయాత్రలు జేయంగ
రిప్లయితొలగించుచిత్త శాంతి గలిగి చింత దీరు
దైవదర్శ నమ్ము ధర్మమ్ము నెలగొల్పి
సేద దీర్చి ప్రజకు మోదమిడును !!!
తీర్థ యాత్రలన్న తీర్థాల మునుగుచు
రిప్లయితొలగించుమూర్తు లందరకును మ్రొక్క నాడు!
కడుపు నిండ దినుచు గాంచంగ ఠీవిగా
దూరదర్శనమున దొరలు నేడు!
కవిమిత్రులకు నమస్కృతులు...
రిప్లయితొలగించుఅమరావతినుండి ఉండవల్లి గుహలు, అక్కడినుండి మంగళగిరి వెళ్ళి పానకాల నరసింహస్వామిని దర్శించుకొని విజయవాడ మీదుగా ఇప్పుడే ఇల్లు చేరాను. ప్రయాణపు బడలిక వల్ల ఈనాటి పద్యాల గుణదోష విచారణ చేయలేకపోతున్నాను. మన్నించండి.
చక్కని పద్యాలను వ్రాసిన మిత్రు లందరికీ పేరుపేరునా అభినందనలు, ధన్యవాదాలు.