మన భాగ్యనగరం - హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో ఏప్రిల్ 12వ తేదీ 2015 ఆదివారం నాడు ఉదయం 10-00 గంటల నుండి రాత్రి వరకు పన్నెండు గంటల పాటు నిరవధిక "కవితా వసంతం" పేరిట 'కవి సమ్మేళనం' జరుపుతోంది!. మునుపెన్నడూ జరగని విధంగా ఈ 'కవితా వసంతోత్సవం' జరపాలని 'సాహితీసేవ' సంకల్పించింది. ఎంతోమంది కవులు ఒకే సభా వేదికపై కవితా గానం చేయడం....వారి కవితలను విశ్లేషించడం జరుగుతుంది!. కవితా ప్రియులంతా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగోరుతున్నాము. ఈ 'కవి సమ్మేళనం - కవితా వసంతం' కార్యక్రమంలో పాల్గొనే కవులు, కవయిత్రులు, ఔత్సాహికులు ఆ వేదికపై కవితా గానం చేసే తమ కవితలను sahitheeseva@yahoo.com మెయిల్ ఐడీకి పంపవలసినదిగా కోరుతున్నాము. * మీ కవితలు వచనమై ... కవితా వస్తువు సాంఘీకమై, మనకు స్పూర్తిదాయకంగా, సామాజకంగా, హృదయ స్పందనగా, ఆలోచన రేకెత్తించేలా కవితాత్మకతకు పట్టం కట్టేలా వుండేలా ఏ అంశానికి చెందినా పర్వాలేదు. * గరిష్టంగా 30 -35 వరుసలకు మించకుండా ఉండాలి. * మీ కవితలు ఇంతవరకు ఎక్కడా ప్రచురించబడి ఉండరాదు. smile emoticon మీ కవితతో పాటు మీ ఫొటోస్ రెండు రకాలు, మీ దూరవాణి ( చరవాణీ- ఫోన్ నంబరు), తపాలా చిరునామా - పేస్ బుక్ ఐడి- వృత్తి, వృత్తి తమ సంక్షిప్త వివరాలను ఏప్రిల్ 5 వతేదీ లోగా sahitheeseva@yahoo.com ఐడీకి పంపవలసినదిగా కోరుతున్నాము. like emoticon ఈ 'కవితా వసంతం'లో గానం చేసిన కవితలను పుస్తక రూపంలో.. కవితా సంపుటి తీసుకు రావాలనే ప్రయత్నం జరుగుతోంది!..కవులు/ కవయిత్రులు/ ఔత్సాహికులు గానం చేసే తమ కవితలను ముందుగా ఆహ్వానిస్తున్నాం. 'కవితా వసంతోత్సవం' కార్యక్రమం పూర్తి వివరాలతో ప్రత్యేక టపాగా ప్రకటించబడును. shark emoticon తెలుగు సాహిత్యం కావాలి!.. రావాలి!.. చదవాలి!.. చదివించాలి!!.. ఆహ్వానంతో, సదా సేవలో, కార్య నిర్వాహక కమిటీ, 'సాహితీసేవ' సమూహము. * ఇతర వివరాలకు : 09492666660 like emoticon జయహో తెలుగు సాహిత్యం ...
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘భాష రాక యెగ్గగురీతిన్’ అనండి. ***** రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగుంది. కాకుంటే అన్వయలోపం ఉంది. మీ పద్యానికి నా సవరణ.... గద్యమె వ్రాయు టెరుంగక పద్యములను వ్రాయ నెంచి పరిపరి విధముల్ విద్యను పెడత్రోవ నడుపు పద్యములను వ్రాయుకవులు వ్యర్ధులు సుమతీ! ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మంచి సమాచారం అందించారు. ధన్యవాదాలు. (కాని ఆ సమ్మేళనంలో కేవలం వచన కవితలకే అవకాశం ఉన్నట్టుంది. పద్యకవితలకు స్థానం ఉందా? ఈ విషయాన్ని నిర్వాహకులను అడిగాను కూడా. కాని వారినుండి స్పందన లేదు).
సత్యనారాయణరెడ్డి గారు "మన భాగ్యనగరం..." అని మొదలపెట్టారు. కానీ ఇటీవలి రాజకీయ నాయకుల ధోరణిచూస్తుంటే ఒక భాగ్యనగరమే కాదు, తెలుగు మరియు తెలుగు ప్రాచీన కవులను కూడా రెండుగా చూస్తున్నారు, చీల్చి వేస్తున్నారు. ఇది చాలా శోచనీయం, అవమానకరం. మీరు ఆ ప్రదేశాల్లో ఉండటం వల్ల తెలియటం లేదోమో కానీ, తమిళ, కర్నాటక, బెంగాలీ సోదరుల దృష్టిలో మనం చాలా పల్చనవుతున్నాము, "తెలుగువారు" అనే గౌరవం కోల్పోతున్నాము. భాష విషయంలోనూ "ఏ తెలుగండీ? తెలంగాణా తెలుగా, ఆంధ్రా తెలుగా అని వెక్కిరింపుకూడా వినిపిస్తోంది. కాలోహి దురతిక్రమ:
శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పిరాట్ల ప్రసాద్ గారూ, అక్కడ యతిదోషం లేదు. ‘యతిభేదాలు’లో ‘ఋత్వసంబంధయతి’ని చూడండి. అక్కడ ‘హృ-ఎ’లకు యతిమైత్రి పాటించబడింది.
నిరవధిక "కవితా వసంతం" పేరిట 'కవి సమ్మేళనం' జరుగబోవటం ముదావహం. విజయవంతం అవుతుందనీ అశిద్దాం.
కాలక్రమేణా నాకు రాముడిపై తప్ప లౌకికవిషయాలపై వ్రాయటం పట్ల ఆసక్తి పోతున్నది. అందుచేత నేను పాల్గొనటం కష్టం.
కవితా వస్తువు సాంఘీకమైనా రామపరంగా వ్రాయకూడదని కాదు కాని ఈ రోజున రాముడి పేరెత్తితేనే ముఖం చిట్లించుకునే వారి సంఖ్యయే హెచ్చుగా ఉన్న పరిస్థితులు కాబట్టి నాబోటివారు దూరంగా ఉండకతప్పదేమో కూడా.
కేవలం వచనం తొ వ్రాసినదానిని కుడా కవిత్వం అనుకోవడం కడు శోచనీయము. కవిత్వం అంటే పద్యం రాయడమే మిగితావి కవిత్వాలు కావు. మీరు ఆహ్వానిచ్చే వచనం ఎవరైనా రాయొచ్చు దానికి ప్రత్యెక అర్హత ఏమి అక్కరలేదని నా ఉద్దేశం. కవితా వసంతం అని కవిత్వానికి ,కవులకి ఆదరణ లేకపోవడం మిక్కిలి హాస్యాస్పదం
మద్యమ్మును సేవించుచు
రిప్లయితొలగించండిహృద్యమ్మగు భాషరాక నెగ్గగురీతిన్
విద్యకు ద్రోహము చేసెడి
పద్యములను వ్రాయు కవులు వ్యర్థులు సుమతీ!
గద్యములు వ్రాయు టెరుగని
రిప్లయితొలగించండిపద్యములను వ్రాయ నెంచి వఱలెడు కవులన్
విద్యను పెడత్రోవ నడుపు
పద్యములను వ్రాయుకవులు వ్యర్ధులు సుమతీ
మన భాగ్యనగరం - హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో
రిప్లయితొలగించండిఏప్రిల్ 12వ తేదీ 2015 ఆదివారం నాడు ఉదయం 10-00 గంటల నుండి రాత్రి వరకు పన్నెండు గంటల పాటు నిరవధిక "కవితా వసంతం" పేరిట 'కవి సమ్మేళనం' జరుపుతోంది!.
మునుపెన్నడూ జరగని విధంగా ఈ 'కవితా వసంతోత్సవం' జరపాలని 'సాహితీసేవ' సంకల్పించింది.
ఎంతోమంది కవులు ఒకే సభా వేదికపై కవితా గానం చేయడం....వారి కవితలను విశ్లేషించడం జరుగుతుంది!. కవితా ప్రియులంతా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగోరుతున్నాము.
ఈ 'కవి సమ్మేళనం - కవితా వసంతం' కార్యక్రమంలో పాల్గొనే కవులు, కవయిత్రులు, ఔత్సాహికులు ఆ వేదికపై కవితా గానం చేసే తమ కవితలను sahitheeseva@yahoo.com మెయిల్ ఐడీకి పంపవలసినదిగా కోరుతున్నాము.
* మీ కవితలు వచనమై ... కవితా వస్తువు సాంఘీకమై, మనకు స్పూర్తిదాయకంగా, సామాజకంగా, హృదయ స్పందనగా, ఆలోచన రేకెత్తించేలా కవితాత్మకతకు పట్టం కట్టేలా వుండేలా ఏ అంశానికి చెందినా పర్వాలేదు.
* గరిష్టంగా 30 -35 వరుసలకు మించకుండా ఉండాలి.
* మీ కవితలు ఇంతవరకు ఎక్కడా ప్రచురించబడి ఉండరాదు.
smile emoticon మీ కవితతో పాటు మీ ఫొటోస్ రెండు రకాలు, మీ దూరవాణి ( చరవాణీ- ఫోన్ నంబరు), తపాలా చిరునామా - పేస్ బుక్ ఐడి- వృత్తి, వృత్తి తమ సంక్షిప్త వివరాలను ఏప్రిల్ 5 వతేదీ లోగా sahitheeseva@yahoo.com ఐడీకి పంపవలసినదిగా కోరుతున్నాము.
like emoticon ఈ 'కవితా వసంతం'లో గానం చేసిన కవితలను పుస్తక రూపంలో.. కవితా సంపుటి తీసుకు రావాలనే ప్రయత్నం జరుగుతోంది!..కవులు/ కవయిత్రులు/ ఔత్సాహికులు గానం చేసే తమ కవితలను ముందుగా ఆహ్వానిస్తున్నాం.
'కవితా వసంతోత్సవం' కార్యక్రమం పూర్తి వివరాలతో ప్రత్యేక టపాగా ప్రకటించబడును.
shark emoticon తెలుగు సాహిత్యం కావాలి!.. రావాలి!.. చదవాలి!.. చదివించాలి!!..
ఆహ్వానంతో,
సదా సేవలో,
కార్య నిర్వాహక కమిటీ,
'సాహితీసేవ' సమూహము.
* ఇతర వివరాలకు : 09492666660
like emoticon జయహో తెలుగు సాహిత్యం ...
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘భాష రాక యెగ్గగురీతిన్’ అనండి.
*****
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. కాకుంటే అన్వయలోపం ఉంది. మీ పద్యానికి నా సవరణ....
గద్యమె వ్రాయు టెరుంగక
పద్యములను వ్రాయ నెంచి పరిపరి విధముల్
విద్యను పెడత్రోవ నడుపు
పద్యములను వ్రాయుకవులు వ్యర్ధులు సుమతీ!
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మంచి సమాచారం అందించారు. ధన్యవాదాలు.
(కాని ఆ సమ్మేళనంలో కేవలం వచన కవితలకే అవకాశం ఉన్నట్టుంది. పద్యకవితలకు స్థానం ఉందా? ఈ విషయాన్ని నిర్వాహకులను అడిగాను కూడా. కాని వారినుండి స్పందన లేదు).
సత్యనారాయణరెడ్డి గారు "మన భాగ్యనగరం..." అని మొదలపెట్టారు. కానీ ఇటీవలి రాజకీయ నాయకుల ధోరణిచూస్తుంటే ఒక భాగ్యనగరమే కాదు, తెలుగు మరియు తెలుగు ప్రాచీన కవులను కూడా రెండుగా చూస్తున్నారు, చీల్చి వేస్తున్నారు. ఇది చాలా శోచనీయం, అవమానకరం. మీరు ఆ ప్రదేశాల్లో ఉండటం వల్ల తెలియటం లేదోమో కానీ, తమిళ, కర్నాటక, బెంగాలీ సోదరుల దృష్టిలో మనం చాలా పల్చనవుతున్నాము, "తెలుగువారు" అనే గౌరవం కోల్పోతున్నాము. భాష విషయంలోనూ "ఏ తెలుగండీ? తెలంగాణా తెలుగా, ఆంధ్రా తెలుగా అని వెక్కిరింపుకూడా వినిపిస్తోంది. కాలోహి దురతిక్రమ:
రిప్లయితొలగించండిహృద్యంబగు ఛందమ్మున
రిప్లయితొలగించండిపద్యము వ్రాయుట దెలియక భావము లేకన్
విద్యల తల్లిని గొలువక
పద్యములను వ్రాయు కవులు వ్యర్ధులు సుమతీ!!!
పద్యము దేవుండెరుగును
రిప్లయితొలగించండిగద్యమ్మే వ్రాయ లేడు గణములు ఛందం-
బాద్యంతమ్ములు దెలియక
పద్యములను వ్రాయు కవులు ? వ్యర్ధులు సుమతీ!!!
పద్యములు వ్రాయదలచిన
రిప్లయితొలగించండిహృద్యముగా వ్రాయ వలెను హేమా !యెపుడున్
గద్యముల వోలె నుండెడు
పద్యములను వ్రాయు కవులు వ్యర్ధులు సుమతీ !
హృద్యపు పదముల మధురపు
రిప్లయితొలగించండిపద్యముల సతతము వ్రాసి వరలు జగతిలో
మద్యమును త్రాగి మత్తు న
పద్యములను వ్రాయుకవులు వ్యర్థులు సుమతీ!
చంద్రమౌళి గారు మీ పద్యం లో 2 పాదం లో యతి భంగం అయ్యి నట్టుంది ఒకసారి చూడండి. హృ కి నె నప్పదు
రిప్లయితొలగించండిశైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పిరాట్ల ప్రసాద్ గారూ,
అక్కడ యతిదోషం లేదు. ‘యతిభేదాలు’లో ‘ఋత్వసంబంధయతి’ని చూడండి. అక్కడ ‘హృ-ఎ’లకు యతిమైత్రి పాటించబడింది.
పద్యపుభావ సుగంధం
రిప్లయితొలగించండిఅద్యయనము జేయువారి కందకయున్నన్?
పద్యపు ఛందస్సుండిన
పద్యములను వ్రాయుకవులు వ్యర్థులు సుమతీ
గద్యము కంటెను పద్యము
విద్యకు-విజ్ఞతనునింపు వివరణవోలెన్
మధ్యమ మందున వ్రాసెడి
పద్యములను వ్రాయుకవులు వ్యర్థలు సుమతీ
పద్యము వ్రాయగ రాకను
రిప్లయితొలగించండి"పద్యములను వ్రాయు కవులువ్యర్ధులు సుమతీ"
విద్యది యెరుగక,నాడరె
పద్యములను గూర్చియిటుల పామరులగుచున్
పద్యమునకు వేయేండ్లయి
హృద్యముగను వయసు గడిచె,నింపును గూర్చే
పద్యకవులె ఘనులుర,యే
పద్యములను వ్రాయుకవులు వ్యర్ధులు?సుమతీ!
పద్యము ఛందోబద్ధము
గద్యమునందున కవితయు కలకాలముగా
హృద్యము నిలువమి,వారను
"పద్యమును వ్రాయుకవులు వ్యర్ధులు సుమతీ!"
పద్యపు శతకము లయ్యవి
హృద్యంబై నిలుచు రసన హీనాక్షరునే
నద్యతనుకైన,"నవినయ
పద్యములను వ్రాయుకవులు వ్యర్ధులు సుమతీ!"
పద్యము వ్రాసెడి వారిన
వద్యము గాగను తెగడుట ఫ్యాషను యయెగా!
మద్యము తాగినయట,నెదు
"పద్యములను వ్రాయుకవులు వ్యర్ధులు సుమతీ!
పద్యము వ్రాయుట వ్యర్ధమ?
మద్యము గొనియును పలికితె,మౌడ్యముమీఱన్
హృద్యత నెరుగమి వదరకు
పద్యములను వ్రాయుకవులు వ్యర్ధులు సుమతీ!
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండినిరవధిక "కవితా వసంతం" పేరిట 'కవి సమ్మేళనం' జరుగబోవటం ముదావహం. విజయవంతం అవుతుందనీ అశిద్దాం.
కాలక్రమేణా నాకు రాముడిపై తప్ప లౌకికవిషయాలపై వ్రాయటం పట్ల ఆసక్తి పోతున్నది. అందుచేత నేను పాల్గొనటం కష్టం.
కవితా వస్తువు సాంఘీకమైనా రామపరంగా వ్రాయకూడదని కాదు కాని ఈ రోజున రాముడి పేరెత్తితేనే ముఖం చిట్లించుకునే వారి సంఖ్యయే హెచ్చుగా ఉన్న పరిస్థితులు కాబట్టి నాబోటివారు దూరంగా ఉండకతప్పదేమో కూడా.
శంకరాభరణం మిత్రులు ఇతోధికంగా పాల్గొంటారని ఆశిస్తున్నాను.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ ఆరు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘ఫ్యాషను+అయెగా’ అన్నప్పుడు యడాగామం రాదు. ‘ఫ్యాష నిపు డయెన్’ అనండి.
*****
శ్యామలీయం గారూ,
ఆ సమ్మేళనంలో వచన కవితలే చదవాలన్నారు. పద్యకవితలకు స్థానం లేనట్టుంది.
ఒకే గురువుగారు నా comment ని వెనకకి తీసుకుంటాను.
రిప్లయితొలగించండికేవలం వచనం తొ వ్రాసినదానిని కుడా కవిత్వం అనుకోవడం కడు శోచనీయము. కవిత్వం అంటే పద్యం రాయడమే మిగితావి కవిత్వాలు కావు. మీరు ఆహ్వానిచ్చే వచనం ఎవరైనా రాయొచ్చు దానికి ప్రత్యెక అర్హత ఏమి అక్కరలేదని నా ఉద్దేశం. కవితా వసంతం అని కవిత్వానికి ,కవులకి ఆదరణ లేకపోవడం మిక్కిలి హాస్యాస్పదం
రిప్లయితొలగించండి"బాల రసాల సాల"
రిప్లయితొలగించండిసేద్యము జేయగ లేకయె
విద్యల తల్లియును నమ్మి వివశత్వమునన్
ఖాద్యపు ఖర్చుల కొరకై
పద్యములను వ్రాయు కవులు వ్యర్థులు సుమతీ!
విద్యల నరయుచు తడబడి
రిప్లయితొలగించండిహృద్యమ్మగు నాంగ్లమునను హీనపు రీతిన్
గద్యము వ్రాయను జాలక
పద్యములను వ్రాయు కవులు వ్యర్థులు సుమతీ!