16, ఏప్రిల్ 2015, గురువారం

సమస్యా పూరణము - 1649 (కృపణునితోడ దానమున గెల్వఁగ నెవ్వఁడు గల్గు నిద్ధరన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కృపణునితోడ దానమున గెల్వఁగ నెవ్వఁడు గల్గు నిద్ధరన్.
(‘ఆంధ్రామృతము’ బ్లాగునుండి శ్రీ చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో)

33 కామెంట్‌లు:

  1. (24-7-2009 నాడు ‘ఆంధ్రామృతం’ బ్లాగులో నా పూరణలు)
    (1)
    చం. ఎపుడయినన్ దయామతుల కెవ్వనితోడను స్నేహమొప్పదో?
    కృప గల సూర్యసంభవుఁడు కీర్తి వహించిన దెట్టి కార్యమౌ?
    నెపము గణింపకన్ మిగుల నిక్కెడి మూర్ఖుని రీతి యెట్టిదో?
    కృపణునితోడ; దానమున; గెల్వఁగ నెవ్వఁడు గల్గు నిద్ధరన్.
    (2)
    కృపకు సముద్రుఁడై విమల కీర్తికిఁ బాత్రతఁ బొందుచున్ సతం
    బుపకృతు లెన్నొ చేసెడి మహోన్నతుఁ డాతఁడు కర్ణుఁడే; జనం
    బెపుడును మెచ్చ నింద్రునకు నేనియు దాతగ నిల్చు నిర్దయా
    కృపణుని తోడ దానమున గెల్వఁగ నెవ్వఁడు గల్గు నిద్ధరన్.

    రిప్లయితొలగించండి
  2. గురువుగారు మీరు చెప్పినట్టు కర్ణుడు మహాదాత ఏమి కాదు.భారతం రీత్యా కుడా కర్ణుడు స్వార్ధపరుడు.ఇంద్రుడు దానం అడిగినపుడు కుడా అతడు కోరిన వెంటనే దానం చేయటానికి నిరాకరిస్తాడు.ప్రతిఫలం గా శక్తి ఇస్తే కాని తన కవచకుండలాలు ఇవ్వలేదు.ఇది వాస్తవ గాధ.

    రిప్లయితొలగించండి
  3. కపటపు బుద్ధి లేక దయ గల్గియు నెయ్యము జేయకుండ యే
    కృపణునితోడ - దానమున గెల్వగ నెవ్వడు గల్గు నిద్ధరన్
    విపుల జనాంతరంగముల - విత్తము వానికి గోటితో సమం
    బపరకుబేరుడైన తన కన్నను పేదయె ప్రేమయందునన్

    రిప్లయితొలగించండి
  4. గురువుగారు మీ రెండవ పద్యం లో 2 మరియు 3 వ పాదం లో యతి భంగం అయిందని పిస్తుంది

    రిప్లయితొలగించండి
  5. కపటముతో నమానవుల గారడిజేయుచు సంతసంబునన్
    నెపములనెంచి జూపుచునునీతుల జెప్పుటగొప్ప భోగముల్
    చెపలపుచిత్తమున్ గలిగిజీవిత మందున శాంతిలేనియా
    కృపణుని తోడదానమున గెల్వఁగనెవ్వఁడు గల్గునిద్ధరిన్

    రిప్లయితొలగించండి
  6. చం.నెపములనేంచకుండతగునెయ్యముతోటితనంతతానుగా
    విపులమనస్కుడైప్రజలవీలనునిత్యముతెల్సుకొంటుతా
    నెపుడునుజేయు ద్రోహములనెప్పుడుజేయకమారిపోవునీ
    కృపణునితోడ : దానమున గెల్వఁగనెవ్వఁడు గల్గునిద్ధరిన్

    note : ఇక్కడ క్రుపణునితోడ = ఇటువంటి వాడిని తోడితే (సంస్కరిస్తే అన్న అర్ధం లో ) అటువంటి వాడితో దానం లో ఎవరు నిలవగలరు అని భావన.

    రిప్లయితొలగించండి
  7. గురువుగారూ మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి.

    ప్రసాద్ గారూ గురువుగారి పద్యాల్లో దోషములు ఉండవు. పదాల్లోని అచ్చులతో యతి మైత్రి చక్కగా కుదిరింది.

    రిప్లయితొలగించండి
  8. గురువుగారి రెండవ పద్యంలో రెండవ పాదం "సతంబు+ ఉపకృతు లెన్నొ- మహ+ఉన్నత"
    మూడవ పాదం
    జనంబు+ ఎపుడున్ - ఇంద్రునకున్+ ఏనియు
    Prasad Piratla గారూ
    తిమ్మకవి సులక్షణ సారం ఒక సారి చదవటం మంచిది మన బోటి వారికి.నేను కూడా ఒక కాపీ కొనుక్కుంటున్నాను.గురువుగారు కూడా ఛందస్సు గురించి కుడివైపున యిచ్చారు. గమనించండి.

    రిప్లయితొలగించండి
  9. పిరాట్ల ప్రసాద్ గారూ,
    నాకు తెలిసినంతవరకు సూర్యుడు కర్ణునికి కనిపించి ఇంద్రుడు కవచకుండలాలకోసం వస్తున్నాడని, ఇవ్వవద్దని సలహా ఇస్తాడు. కర్ణుడు తాను దానవ్రతుడననీ, ఎవరేది అడిగినా కాదకుండా ఇవ్వడమే తన నియమమనీ చెప్తాడు. అప్పుడు సూర్యుడు ఇంద్రు డేదైనా వరమిస్తానంటే అతనిదగ్గరి శక్తి అనే అస్త్రాన్ని కోరుకోమని చెప్పి వెళ్తాడు. బ్రాహ్మణవేషంలో వచ్చిన ఇంద్రుని గుర్తించికూడ కర్ణుడు అతడడిగిన వెంటనే సంకోచించకుండా తన సహజకవచాన్ని దానం చేస్తాడు. ఇంద్రుడాతని దానశీలాన్ని ప్రశంసించి వరం కోరుకొమ్మన్న తరువాతే శక్తిని కోరుకున్నాడు. కర్ణుని దాతృత్వం నిష్కళంకం, లోకప్రసిద్ధం.
    ఇక యతుల గురించి మీరింకా నేర్చుకొనవలసింది ఉంది. ఈ లింకును చూడండి...యతిభేదాలు-1

    రిప్లయితొలగించండి
  10. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది.అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    కాని సమస్య పరిష్కరింపబడినట్లు లేదు.
    *****
    పిరాట్ల ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తోటి, తెల్సుకొంటు’ అని వ్యావహారికాలను ప్రయోగించారు. ‘నెయ్యముతోడ, ....నిత్యమెఱుంగుకొంచు తా’ అనండి.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి, మిస్సన్న గారికి, అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. ఉపసదనమ్ముచేయుచు మహోన్నత భక్తిని పెద్దవారికిన్
    జపములఁజేయుచున్ సతము జానకిరాముని ముక్తి కోసమై
    కపటములేక నిత్యము బికారు లఁబ్రోచు మహాత్ముడైన ని
    ర్కృపణుని తోడ దానమున గెల్వగ నెవ్వడు గల్గు నిద్ధరన్

    రిప్లయితొలగించండి
  12. చం.నెపములనేంచకుండతగునెయ్యముతోడతనంతతానుగా
    విపులమనస్కుడైప్రజలవీలనునిత్యమెఱుంగుకొంచుతా
    నెపుడునుజేయు ద్రోహములనెప్పుడుజేయకమారిపోవునీ
    కృపణునితోడ : దానమున గెల్వఁగనెవ్వఁడు గల్గునిద్ధరిన్

    గురువుగారు మీరు చెప్పిన సవరణలతో పద్యం post చేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  13. గురువుగారు యతి విషయం లో పొరబడ్డాను క్షమించండి.మిమ్ములని తప్పుపట్టే అంతటివాడిని కాదు.నేను ఎవరిని ఏది అడిగినా అది నా జ్ఞానం పెంపొందించుకునే ప్రయత్నమే గాని అన్యదా భావించకండి.

    ఇకపోతే భారతంగురించి మీరు చెప్పిన కథ కొంతవరకు నిజాము కాని వచ్చినవాడు ఇంద్రుడని తెలిసుకొన్న పిదప అతడు చాల సేపు ఇంద్రుని పరి పరి విధాలు ప్రలోభ పెడతాడు.మణులని ,మాణిక్యాలని etc తొ కాలయాపన చేస్తాడు కారణం తనకున్న ఆ ఒక్క ఆధారం పోగొట్టుకోవడానికి మనస్కరించక .అడిగిన తడవున దానం చేయడం నియమం పెట్టుకున్నవాడు ఇన్ని విధాలు ప్రయత్నం చేయడుకడా .చివరకి ఇంద్రుడు సరే దీనికి బదులు నీకు శక్తి ప్రసాదిస్తాను అన్నప్పుడు దానికి ప్రలోభ పడి తన నియమం తప్పుతాడు. అందుకే లోక ప్రసిద్ది చెందినా సిబి చక్రవర్తి ,ఇత్యాది వారి సరసన కర్ణుని పేరు ప్రస్తావనకు రాదు .కాబట్టే అతనిని దుష్టులతో ఒకడిగా పోల్చి దుష్టచతుష్టయం అన్నారు. ఇది నా వివరణ కాదు పెద్ద పెద్ద ప్రవచకులు చెప్పిన విషయము . నాకు తెలిసిన విషయం చెప్పినందుకు మన్నించండి .

    రిప్లయితొలగించండి
  14. కపటము లేనివాడు తన కాంతకు పుత్రులకేని యీయకన్
    నెపమును జూపబోక తుది నీటిని సైతము దాన మిచ్చె నో
    తపసికి వోలె త్యాగి యయి తప్పగు పోల్చను రంతిదేవునిన్
    కృపణునితోడ, దానమున గెల్వఁగ నెవ్వఁడు గల్గు నిద్ధరన్.

    రిప్లయితొలగించండి
  15. కృపగల-కర్ణుడయ్యును,కీడునుగూర్చెనుయుద్ధభూమిలో
    నెపములు జెప్పకే సలుపు|నెంతటివాడన?దానమిచ్చెడా
    తపమునగొప్పవాడనిన?"తాత్వికచింతన లందుజూడగా?
    కృపణునితోడ దానమున గెల్వగ నెవ్వడు గల్గునిద్దరిన్|

    రిప్లయితొలగించండి
  16. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నిష్కృపణునితోడ’ అనాలనుకుంటాను. ‘జానకీరాముని’ అని సమాసం చేయవలసి ఉంటుంది.
    *****
    మిస్సన్న గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. ‘...కర్ణు డయ్యు కడు కీడును...’ అనండి.

    రిప్లయితొలగించండి
  17. గురువు గారి సవరణలకు ధన్యవాదములు.
    జానకీ పతి, జానకీ వల్లభుడు అనే చోట కీకి దీర్ఘము ఉన్నది.
    జానకి రామయ్య అనిచాలామంది పేర్లు కూడా పెట్టు కున్నారు. జానకి రామయ్య అనే సినిమాకూడా ఉన్నది. అందువలన ఆ పదం వాడాను. వేరే పదమునకు ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ శంకరయ్య గారూ , జానకిని, రాముడిని శుద్ధ సంస్కృత పదాలుగా కాకుండా , తత్సమాలుగా మార్చినప్పుడు, జానకి రాముడనవచ్చును . జానకీ శబ్దం తత్సమమైనప్పుడు జానకి అని హ్రస్వాంతమౌతుంది కనుక ఆ వెసులుబాటు కలుగుతుంది .అదప్పుడు సంస్కృత సమాసం కాక , తత్సమాలతో కూడిన శుద్ధాంధ్ర సమాసమవుతుంది. ఈ సూత్రం అన్నిచోట్లా ఉపయోగించదనుకోండి అది వేరే విషయం కాని విషయ పరిఙ్ఞానానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వివరించాను. ఆ రాముడెవడు ? జానకి యొక్క రాముడు - జానకి రాముడు అని . ( జానక్యాః రామః ఇతి షష్ఠీ తత్పురుషః ) గమనించగోరుతున్నాను .

    రిప్లయితొలగించండి
  19. తడిశనగలంద లేద
    ప్పుడు కృపణుని తోడ,దానమున గెల్వఁగ నె
    వ్వఁడు గల్గు నిద్ధరననుచు
    కడసారియు దానమంది కర్ణుని జూపెన్!

    రిప్లయితొలగించండి
  20. కృపగల రంతిదేవుడటు కేవల నీరము తప్ప లేకయున్
    కృపణుడు నయ్యె,నయ్యెడను కీడ్పడ దప్పికచేత నొక్కడున్
    కృపతను కావవేడగను,కీడది తొల్గగ నీరువోసెగా!
    కృపణుని తోడ దానమున గెల్వగ నెవ్వడు గల్గునిద్ధరన్

    కృపణుడు తాను పొందకయ,కేవలమంతయు దాచుచుండుగా
    కృపనటు పొందడాతడుగ,గేహము నందున శూన్యముండుగా,
    నపగతుడౌను పుణ్యమున,నాతడు దాతయునౌట వింత-యే
    కృపణునితోడ దానమున గెల్వగ నెవ్వడుగల్గు నిద్ధరన్

    కృపణుడనంగ బీదయగు,కేవల లోభియు నౌను గా,తగన్
    కృపణత నిద్ధరేవిధిని కేవల దానము చేయలేరుగా
    కృపగల పేద దానమిడు,కేవలమున్నది కొంచమైన,నా
    కృపణుని తోడ దానమున గెల్వగ నెవ్వడుగల్గు నిద్ధరన్

    రిప్లయితొలగించండి
  21. చపలతఁ గల్గియుండి యొక సాధన నెంచిన వాడు, స్వార్థియై
    నెపముల ధర్మమవ్వలకు నెట్టిన యట్టి మహాపరాధియు,
    న్నిపుణుడు, దుష్టబుద్ధి గల నేర్పరి, ధర్మవిరోధచర్యనా
    కృపణునితోడ దానమున గెల్వఁగ నెవ్వఁడు గల్గు నిద్ధరన్

    రిప్లయితొలగించండి
  22. కపటపు మాటలాడుచును గ్రమ్మున సంపద బొంద గోరియున్
    సుపరిచితుండుగా జనుల సొమ్మును దోచిన నొక్క లోభిలో
    నప యశమన్న భావనము నందగ దాతగ మారినట్టి యా
    కృపణునితోడ దానమున గెల్వగ నెవ్వడు గల్గు నిద్ధరిన్
    !

    రిప్లయితొలగించండి
  23. కపటపు బుద్ధితో జనుల కాసులు దోచిన నేత లెందరో
    యపరములైన సొమ్ములను హాయిగ దాచిరి స్విస్సుబ్యాంకులో
    నపయశమంచు నందున నొకాయన మారుచు దాత యయ్యె నా
    కృపణునితోడ దానమున గెల్వగ నెవ్వడు గల్గునిద్ధరిన్

    రిప్లయితొలగించండి
  24. డా. విష్ణునందన్ గారూ,
    ధన్యవాదాలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    కందంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘కృపణుడు’ శబ్దానికి లోభి, కుత్సితుడు అని తప్ప పేదవాడు అనే అర్థం లేదే!
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. చంపక మాలిక
    కృపణుని తోడ దానమున గెల్వగ నెవ్వడు గల్గు నిద్దరన్
    ఇపుడిట నీసమస్యను జయింపగ జూచెదనీవిధంబుగన్
    విపుల మరీచికన్ జలము బీల్చు నభోకుసుమంబు చేనిడున్
    తపను కడన్ హిమంబుపగతంబొనరించు గలట్టి వీరుడే
    కృపణుని తోడ దానమున గెల్వగ నర్హత నొందు నిద్ధరన్

    రిప్లయితొలగించండి
  26. చంపక మాలిక
    కృపణుని తోడ దానమున గెల్వగ నెవ్వడు గల్గు నిద్దరన్
    ఇపుడిట నీసమస్యను జయింపగ జూచెదనీవిధంబుగన్
    విపుల మరీచికన్ జలము బీల్చు నభోకుసుమంబు చేనిడున్
    తపను కడన్ హిమంబుపగతంబొనరించు గలట్టి వీరుడే
    కృపణుని తోడ దానమున గెల్వగ నర్హత నొందు నిద్ధరన్

    రిప్లయితొలగించండి
  27. కృపణునితోడ దానమున గెల్వఁగ నెవ్వఁడు గల్గు నిద్ధరన్?
    జపమును జేసి రాహులుడు చక్కని గెల్పును కోరి భ్రష్టుడై
    నెపముల నెన్నకుండ తన నెత్తిన నున్న మహాకిరీటమున్
    తపమును జేయగా నిడెను దానమటంచు కుమారసామికిన్ :)

    రిప్లయితొలగించండి
  28. కృపణుడు దుడ్డు కూర్చుచును గిన్నెల కుండల మూసిపెట్టుచున్
    నెపములు చెప్పి దీనులకు నెప్పుడు నప్పులనీక ప్రాణముల్
    రెపరెపలాడి చావగను రెక్కలు కొట్టుచు పక్షులీడ్చగా
    కృపణునితోడ దానమున గెల్వఁగ నెవ్వఁడు గల్గు నిద్ధరన్

    రిప్లయితొలగించండి