3, ఏప్రిల్ 2015, శుక్రవారం

సమస్యా పూరణము - 1638 (ద్యూత మద్యపాన రతులు నీతిపరులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
ద్యూత మద్యపాన రతులు నీతిపరులు.

24 కామెంట్‌లు:


  1. నైతికత్వమును మరచినారు జనులు
    మంచి చెడులకునర్ధంబు మారిపోయె
    శీలవంతులు కనరాని కాలమయ్యె
    ద్యూత మద్యపాన రతులు నీతిపరులు.

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    పార్వతి కరువైన దేవదాసులు
    డబ్బులు కరువైన దేవీదాసులు
    నీతిపరులు కారంటే యెట్లా ?

    (మద్యపానరతులు గాని మహారాజు లుండరనే భావనతో)

    01)
    ______________________________

    ఆలిని దమ్ముల - నక్షము నందోడు
    ధర్మసుతుడు గాడె - ధర్మపరుడు ?

    ఆకలి గొను నాలి - నడవిని వీడిన
    నలుని గాదందుమా - న్యాయ శీలి ?

    ఆలుబిడ్డల నమ్ము - నాహరిశ్చంద్రుని
    నవినీతి పరుడని - యనగ వశమె ?

    అంతరాపత్యను - నడవికి బంపిన
    రాముని యననౌనె - రాక్షసుడని ?

    ముల్లె లేకున్న సంసార - మెల్ల మునుగు !
    దుడ్డు కోసమె జనులదే - ద్యూత మాడు !
    ప్రేమ కరువైన ప్రజలె గా - ప్రియము ద్రావు !
    ద్యూత మద్యపాన రతులు - నీతిపరులు !
    ______________________________

    రిప్లయితొలగించండి
  3. నిన్నటి నిషిద్ధాక్షరి కి నాపూరణ...

    సంధి జేయగ సభ జేరి శౌరి నుడివె
    సగము నీయుడు రాజ్యమ్ము సాగదనిన
    నూళ్ళనైదుగ నీయుమా యుద్ధమేల
    మామ వినుమిది మనసున మాయ వదలి.

    రిప్లయితొలగించండి
  4. ఒక్క తల్లికి పుట్టిన చక్కనైన
    సుతులు బుద్ధిని కారుగా చూడ నొకటి
    అవగ వచ్చును వారలు నటుగ నిటుగ
    ద్యూత మద్యపాన రతులు, నీతిపరులు.

    రిప్లయితొలగించండి
  5. ద్యూత మదియన్న సీతకు దూత గాగ
    పాన మదియన్న మధువగు భక్తి గాగ
    పొసగు రతియన్న అనురాగ పుష్ప మవగ
    ద్యూత మద్యపాన రతులు నీతి పరులు
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు03/04/15

    రిప్లయితొలగించండి
  6. మూడు పూ టలు ద్రాగుచు, మూ లుగుదురు
    ద్యూత మద్య పాన రతులు, నీతి పరులు
    న్యాయ మెన్నడు విడనాడ రార్య ! వారు
    మఱియు కాపాడు నీతియే మనల నెపుడు

    రిప్లయితొలగించండి
  7. సతిని పీడింత్రు ధనముకై సంతతమ్ము
    ద్యూత మద్య పాన రతులు, నీతిపరులు
    వ్యసనముల పాల బడకుండ వ్యవహరింత్రు
    దైవమును భజియించుచు తనియు చుంద్రు

    రిప్లయితొలగించండి
  8. జూద మాడిన చివరకు శోక మగును
    మత్తు పానీయముల ననామయము చెడును
    కాన కీడెంచి యెన్నడున్ కానియెడల
    ద్యూత మద్యపాన రతులు, నీతిపరులు.

    రిప్లయితొలగించండి
  9. రాచరికపు జిత్తులన్ రణతంత్రపు
    టెత్తులన్ మునిగెడు నేలికలట
    నిష్ట సఖుల తోడ నింగిత పూర్వక
    ద్యూత మద్యపాన రతులు నీతిపరులు

    రిప్లయితొలగించండి
  10. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వసంత కిశోర్ గారూ,
    మీ సుదీర్ఘపూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నిన్నటి నిషిద్ధాక్షరికి, ఈనాటి సమస్యకు మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కొరుప్రోలు రాధాకృష్ణా రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మంచి భావంతో పూరణ చేశారు, కాని సమస్య తేటగీతి అయితే పై మూడు పాదాలు ఆటవెలది అయ్యాయి. సవరించండి.

    రిప్లయితొలగించండి
  11. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. ద్యూత మన్నది హితమగునీతినిలుపు|
    మద్యపానరతులు|మరిమరిబెరుగగ?
    నీతిపరులు| నిలచుటకే నెలవులేని
    ద్యూతమద్యపానరతులు నీతిపరులు
    ----------------------
    మొదటిపాదానద్యూత
    రెండవపాదానమద్యపానరతులు
    మూడవపాదాననీతిపరులుగాపూరించడమైనది

    రిప్లయితొలగించండి
  13. గురువుగారూ ద్యూతము అంటే జూదము కాకుండా మరో అర్థం కూడా ఉన్నదా?

    రిప్లయితొలగించండి
  14. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ ప్రయోగం ప్రశంసనీయం. పూరణ బాగుంది. అభినందనలు.
    మొదటి పాదమే అర్థం కాలేదు.
    *****
    మిస్సన్న గారూ,
    మరో అర్థం ఏదీ లేదు. ఎందుకైనా మంచిదని ‘ఆంధ్రభారతి’ని పరిశీలించాను.

    రిప్లయితొలగించండి
  15. స్వార్థమందున మెలిగెడి వ్యర్థపరులు
    ద్యూతమద్యపాన రతులు"నీతిపరులు
    చెప్పబోకనె జేసెడి గొప్పవారు
    మానవత్వము నింపెడి జ్ఞానదనులు".

    రిప్లయితొలగించండి
  16. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :

    రాచకార్యమ్ముల, రణతంత్రముల తోడ
    నెత్తులన్ బన్నెడు పుడమి నేలికలట
    నిష్ట సఖులు మెచ్చు వరుస నింగితముగ
    ద్యూత, మద్యపానరతులు నీతిపరులు!

    రిప్లయితొలగించండి
  17. నేటిరోజుల మద్యంబు నింపునయ్యె
    క్లబ్బు లందున జూదంబు గౌరవంబు
    నవియనేర్వనట్టి మనుజుడజ్ఞుడండ్రు
    ద్యూతమద్యపాన రతులు నీతిపరులు

    చలనచిత్రములందున సాధువనుచు
    ద్యూతపానరతులనెన్నయోధ,వీరు
    లనగ చూపగా,మానవులందు ప్రబలె
    ద్యూతమద్యపాన రతులు నీతిపరులు

    కలియె నేలునేడుజగతి,కాంచగాను
    తప్పులొప్పులయ్యె పరగెనొప్పుతప్పు
    గౌరవించుచు నుండిరి కలుషయుతుల
    ద్యూతమద్యపానరతులు నీతిపరులు

    రిప్లయితొలగించండి
  18. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణలోని దోషం నా దృష్టికి రాలేదు. మీ సవరణ బాగుంది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారి పద్యం లోని మొదటి పాదంలో ద్యూతం అనె పదానికి అన్వయం బోధ పడ లేదు నాకు.

    రిప్లయితొలగించండి
  20. ద్యూతమాడ ధర్మజుడు త నీతిపరుద?
    సోమపానముజేసిన సోమయాజి
    నీతి పరులుగా బరగిరి-నేడుగూడ
    ద్యూతమద్యపానరతులు నీతిపరులు|
    -------------------------
    ఈపూరణశ్రీకేంబాయితిమ్మాజీరావుగారిది

    రిప్లయితొలగించండి