1, ఏప్రిల్ 2015, బుధవారం

సమస్యా పూరణము - 1637 (కరటక దమనకుల కంటె కలరే సుజనుల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కరటక దమనకుల కంటె కలరే సుజనుల్.

18 కామెంట్‌లు:

 1. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నాము. సమయం ఉంటే పానకాల నరసింహస్వామి దర్శనం కూడా చేసికొని ఏ రాత్రికో ఇల్లు చేరతాము. రోజంతా బ్లాగుకు అందుబాటులో ఉండను. దయచేసి ఈరోజు పూరణల, పద్యాల పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
  అన్నట్టు... విజయవాడ మిత్రు లెవరైనా ఉన్నారా మన బ్లాగులో?

  రిప్లయితొలగించండి
 2. కరటము పిలువగ నెంచిన
  వరటము నకుచేరు వైన వైవిధ్య మటన్
  పరికించ మైత్రి లేదన
  కరటక దమనుల కంటె కలరే సుజనుల్

  రిప్లయితొలగించండి
 3. పరిపరి విధముల జెప్పిరి
  నరులందున దుష్టు లెట్లు నటియించుదురో
  సరళముగా మన మంచికి
  కరటక దమనకుల కంటె కలరే సుజనుల్.

  రిప్లయితొలగించండి
 4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 5. ఇరువురి నడుమన దగవులు
  మురిపెముగా పెట్టి దిరుగు పురుషోత్తములన్
  ధరనందురు నెగతాళిగ
  కరటక దమనకుల కంటె కలరే సుజనుల్ !!!

  రిప్లయితొలగించండి
 6. కరటక దమనకు బేరన
  సరళ ము గానీ తినుడివె సకలజ నులకున్
  పరికించగ మన మదిలో
  కరటక దమనకుల కంటె కలరే సుజనుల్

  రిప్లయితొలగించండి
 7. కరటకదమనకులనగా?
  కరవాలము లేక దునుము కల్పితమతులే
  వరలెడినేటిసమాజము
  కరటక దమనకులకంటె కలరే సుజనుల్?|

  రిప్లయితొలగించండి
 8. ధరలోపలనేరీతుల
  నరులొకరికొకరు మెలగుటొ నయముగ కథగా
  నరయగ వివరించిన యా
  కరటక దమనకుల కంటె కలరే సుజనుల్

  రిప్లయితొలగించండి
 9. పద్యరచన 865
  స్వామీ నీ మోముఁ దలచుచు నిస్సారమౌ జీవనమ్మా
  రామమ్మందెట్లు గడపితినో, రమ్ము రారమ్మికన్ , నీ
  కేమో కోపంబు తెలుపుమ , నాదేమి నేరమ్మొకో? మా
  రామేలోయీ! వడివడిగ రారాదొ, నన్నేల రాదో!

  రాముఁడార్తరక్షాగుణ రక్తి గలిగి
  మెలగువాడు, ధీరుడతడు, మీననయనఁ
  గావ రవిసుతుఁ జేరె, పగఁ గొని సమర
  భీముడింద్రకుమారుఁ జంపెను రణమున.

  రిప్లయితొలగించండి
 10. చిరుపొట్టనింపుకొనుటకె
  పరిపరి విధకుట్రలెన్నొ పన్నునె గానీ
  తరతరము లెంచ నేరని
  కరటక దమనకుల కంటె కలరే సుజనుల్?

  రిప్లయితొలగించండి
 11. కరువాయెను మంచితనము
  మెరసెను హింసా ప్రవృత్తి మిగులన్ మనలో
  అరయగ నేటికి భువిలో
  కరటక దమనకుల కంటె కలరే సుజనుల్

  రిప్లయితొలగించండి
 12. ధరపైఁబుట్టిన మనుజులు
  కరమగు స్వార్థంబు తోడ కాంక్షలతోడన్
  దురితములఁజేయుట కనన్
  కరటకదమనకులకంటె కలరే సుజనుల్

  రిప్లయితొలగించండి
 13. వరమను ప్రేమను బెంచుచు
  కరుణయులేకుండ నడుగు కట్న పిశాచుల్
  మరుగున నెందరునిలలో
  కరటకదమనకుల కంటెకలరేసుజనుల్?
  కురువంశంబే సమయగ
  అరుదెంచిన శకునిలాగ నన్యోన్యతచే
  చిరునవ్వునుచిందించెడి
  కరటక దమనకుల కంటె-కల-రేసుజనుల్?

  రిప్లయితొలగించండి
 14. శ్రీకెంబాయితిమ్మాజీరావుగారిపూరణం
  --------------
  చెరపగ మిత్రులస్నేహము
  కరటకదమనకుల కంటెకలరే|సుజనుల్
  విరసములో రిపులను తా
  మెరుగుచుశోదింప వలయు హితమునుగూర్చన్|

  రిప్లయితొలగించండి
 15. కవిమిత్రులకు నమస్కృతులు.
  విజయవాడలో అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి సౌహార్దంతో, వారి బంధువు సహకారంతో అమ్మవారి దర్శనం దివ్యంగా జరిగింది. వారిద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా కార్యక్రమం ప్రకారం అక్కడినుండి మంగళగిరి వెళ్ళాల్సింది. కాని అక్కడినుండి అమరావతికి వచ్చి అమరేశ్వరుని దర్శనం చేసుకున్నాము. ఈ రాత్రికి ఇక్కడే. రేపు ఉదయం మంగళగిరి వెళ్ళి అక్కడినుండి తిరిగి ఇంటికి ప్రయాణం.
  ఈ నాటి సమస్యకు చక్కని పూరణల నందించిన మిత్రులకు అభినందనలు, ధన్యవాదాలు.
  ముఖ్యంగా మిత్రుల పద్యాల గుణదోషాలను ప్రస్తావించిన పిరాట్ల ప్రసాద్ గారికి ధన్యవాదాలు.
  నా సమీక్షలు వీలైతే రేపు.

  రిప్లయితొలగించండి
 16. తిరమగు మిత్రుల మధ్యన
  పరగగ భేదము కలుగగ,ఫలితముగను నీ
  గరువపు నేతలగనుగొన
  కరటక దమనకులకంటె గలరే సుజనుల్

  గరపుచు జీవనమును వే
  పరులను పీడించు నేటి,వంచన నేతల్
  చిరము నసత్యములాడగ
  కరటక దమనకులకంటె కలరే సుజనుల్

  దొరకడ చెలగెడి నీచులు
  కరటక దమనకులకంటె కలరే?-సుజనుల్
  వరపుగ మేలును కోరరె?
  యిరవుగ నేతకు,ప్రజకును నేర్పున నిలలో

  కరటక దమనక నక్కలు
  నరయగ,తమలాభము కయి మలగుట సాజం
  బు రయము దొరకా గోరరు
  కరటక దమనకుల కంటెకలరే సుజనుల్

  రిప్లయితొలగించండి
 17. పరువులు పెట్టుచు త్వరపడి
  మరియాదను వీడి రాజు మంత్రుల కొరకున్
  వరలుచు వెదుకగ నాంధ్రను
  కరటక దమనకుల కంటె కలరే సుజనుల్

  రిప్లయితొలగించండి