రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ****** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ****** శైలజ గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పల్లా నరేంద్ర గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** అశ్వత్థ నారాయణ మూర్తి గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. ఎన్ని పద్యాలైనా వ్రాయవచ్చు. పరిమితి లేదు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, మీ ఉత్పలమాలిక బాగున్నది. అభినందనలు. ***** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** లక్ష్మీదేవి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మర్మమదేమొ గాని తను మానవ రూపము దాల్చి యిద్ధరన్ ధర్మము సుస్థిరమ్మగు విధానమునంతయు గూర్చి దెల్పి స త్కర్మ విధానముల్ మరియు జ్ఞాన నిధానము బంచినట్టి ని ష్కర్మునకంజలించెద ప్రశాంత మనస్కునికార్త రక్షకున్.
దేవకి వసుదేవుల నట
రిప్లయితొలగించండిబ్రోవగ జన్మించె నతడు భూతల మందున్
సేవల నందుచు యాదవ
దైవమ్ముగ నిలచె నంట దామోదరుడై
దేవకి కడుపున బుట్టెను
రిప్లయితొలగించండిదేవతలకు పరమ పూజ్య దేవుండితడే
దేవుళ్ళాడిన దొరకడ
దే ! వచ్చెను భువికి శిష్ట దీనుల బ్రోవన్.
పుట్టె వసుదేవు నింటను ముద్దులొలుకు
రిప్లయితొలగించండిబాలకునిగానుపేంద్రుడు లీలగాను
నల్లనయ్యను కనుగొని యుల్ల మలర
దేవకీ వసుదేవులు తృప్తి పడిరి
దుష్టుల నణచగ దేవకి
రిప్లయితొలగించండియష్టమ గర్భముగ బుట్టి హరిమేధుండే
సృష్టిని గావగ చెరవిడి
యిష్టముగ యశోద యొడిన యిమ్ముగ బెరిగెన్!!!
పుట్టిన బిడ్డను జూచుచు
రిప్లయితొలగించండినెట్టులొ మది దిట్టబరచి నిశిలో పతితో
బిట్టుగ పంపెను దేవకి
గుట్టుగ చెరసాలనుండి గోపాలుడినే!!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
******
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
******
శైలజ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
దైవమె జనించె శిశువై
రిప్లయితొలగించండిదేవకి గర్భమ్మునందు, దీనుల బ్రోవన్
కావగ బాలుని నిజపతి
దేవకిపంపె చెఱనుండి తేకువతోడన్
ధరణిన ధర్మమ్ము నెపుడు
రిప్లయితొలగించండిచెరబట్టగ యెంచినంత చెడు తలపులతో
అరుదెంతురుగద ఇలపై
చిర కారణ జన్ములొకరు చింతల బాపన్
మీరు పద్యములు అన్నందున
రిప్లయితొలగించండిమూడు పద్యాలు వ్రాయడం జరిగింది
కం. చెరసాల బుట్టిన శిశువుఁ
కరముల గోముగ నిడుకొని గారములాడెన్
వెరపున యంతనె దేవకి
పరిపరి విధముల నొరలుచు (వగచుచు) పాపని జూచున్
ఆ.వె. కనుల నీరు నింపు కమలాక్షి దేవేరి
వంక జూడ లేక వగచి వగచి
భామ తోడ నపుడు వసుదేవు డిట్లనె
వీడు శిశువు గాడు విష్ణు డనుచు
ఉ. బాలుడు గాడు వీడమిత పావను డాగమ వందితుండు లో
కాలకు పోషకుండు శుభ కారకు డాశ్రిత రక్షకుండు నీ
వేల విషాద మూర్తివగుదేల విచారము, కంసభంజనా
శీలుడు వీడు యూరటను జెందుము కాలము నీపరంబికన్.
అనుచు నూరడించె
అష్టమి రోహిణి పొద్దున
రిప్లయితొలగించండిన ష్టమ గర్భుడు గ పుట్టె కృ ష్ణుడు మహిలో
న్ని ష్టముగ పూ జ చేసిన
కష్టము లిక మనకు తొల గు కన్నని దయచేన్
అష్టమి నాడు పుట్టితివి యష్టమి గర్భమునందు బాలుడా!
రిప్లయితొలగించండియిష్టము లేదు మా శిశువు లించుక యైనను మామ కయ్యయో!
కష్టము నీకిటన్ బ్రతికి కట్టుట బట్టను చిన్ని బిడ్డ!, యే
శిష్టుల యింటనో మనిన శ్రీకర మయ్యెడి బుల్లి నాన్న! యీ
దుష్టుని కన్నులం బడని త్రోవను వేగమె పొమ్ము బాబు! నీ
యిష్టము వచ్చు చోటునకు నీ చెడు తల్లిని వీడి బుజ్జులూ!
నష్టము నాకు సంతతిని నల్వ లిఖించెను రాయినైతిరా!
సుష్టుగ బాలనైన నిడి చూచెడు భాగ్యము లేదు బుల్లి నీ
యోష్టము బుగ్గలున్ కనుల నూరక జూచుచు నుండిపోయినన్
క్లిష్టమగున్ దొరా! బయటి కేగుట నీకిక పొమ్ము బంగరూ!
పుష్టిగ నెవ్వరో యొకతె పుణ్యము జేసిన దొడ్డ తల్లి సం-
తుష్టిగ నిన్ను సాకెడిని ద్రోహుల మమ్ము క్షమింపు పాపడూ!
ఆగమనుతు జన్మంబున
రిప్లయితొలగించండిబీగము లూడ ననురాగ వేదన పొంగెన్!
వేగముగ వాసుదేవుని
చేగొని నందుని గృహమున జేర్చెడు వేళన్!
నిన్నునా యొడి జేర్చు పుణ్యము నేనదెన్నడు జేస్తినో
రిప్లయితొలగించండికన్నులియ్యవి యెన్నడైనను గట్టిపాపము జేసెనో
నిన్ను జూడక యుండనొపను నీలవర్ణపు ముత్యమా!
కన్నతల్లిని నాయనా, నను జ్ఞాపకమ్మున నిల్పుమా!
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పల్లా నరేంద్ర గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
ఎన్ని పద్యాలైనా వ్రాయవచ్చు. పరిమితి లేదు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ ఉత్పలమాలిక బాగున్నది. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
అమ్మచేతుల యందు ఆకాశ మున్నట్లు
రిప్లయితొలగించండి--------------బాల కృష్ణ్డుని బంధజాలమాయె
అమ్మ మనసు యందు ఆరాటమమతలు
-------------నవ వసంతశోభ భువికిరాగ|
ముద్దుమోమునుజూడ హద్దులు మీరెడి
------------పుత్ర వాత్చల్యంబు పుట్టుకొచ్చె
దేవకీ వసుదేవ భావన భాగ్యమై
-------------చెరసాల యందున వరములాగ|
కృష్ణ జన్మయె భక్తుల తృష్ణదీర్చ
మామ కంసుని భయపెట్ట మాయజేర
నెమలిపించముశిరసుననెగడ?సొగసు
కొడుకు సంతస మన్నది విడచు టగున?
అష్టమ సుతుడై భువిలో
రిప్లయితొలగించండిశిష్టుల కావగ జనించె శ్రీకృష్ణుండై
దుష్టుల దునిమెద తండ్రీ
కష్టములిక తొలగునంచు కమ్మగ పలికెన్.
బల్లూరి ఉమాదేవి.
20/4/15
అష్టమ సుతుడై భువిలో
రిప్లయితొలగించండిశిష్టుల కావగ జనించె శ్రీకృష్ణుండై
దుష్టుల దునిమెద తండ్రీ
కష్టములిక తొలగునంచు కమ్మగ పలికెన్.
బల్లూరి ఉమాదేవి.
20/4/15
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
దేవకి వసుదేవ సుతా
రిప్లయితొలగించండిభావనలో జేరి మాకు భగవంతుదిలా
జీవన సారంబందగ?
దీవింపుము కృష్ణ మమ్ము దీనుల నెపుడున్
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
పుట్టిన కృష్ణ|మామపరిపూర్ణత నొందగ జేయ నెం చియే
రిప్లయితొలగించండికట్టడులున్న లెక్కిడక కంసునిమానసమందు జేరియున్
అట్టుడికించ నెంచి తగునల్లుడగాక?యమాత్మగానిలన్
పట్టము గట్ట నెంచి పసివాడిగ అమ్మకు,నాన్నకుకానుపించుటా?
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.
మర్మమదేమొ గాని తను మానవ రూపము దాల్చి యిద్ధరన్
రిప్లయితొలగించండిధర్మము సుస్థిరమ్మగు విధానమునంతయు గూర్చి దెల్పి స
త్కర్మ విధానముల్ మరియు జ్ఞాన నిధానము బంచినట్టి ని
ష్కర్మునకంజలించెద ప్రశాంత మనస్కునికార్త రక్షకున్.