రాజేశ్వరి అక్కయ్యా, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ***** మిస్సన్న గారూ, గత సంవత్సరం మా అబ్బాయి ఇంట్లో జారి పడగా ఎడమ మోచేయి, మణికట్టు విరిగి ఆపరేషన్ జరిగి స్క్రూలు ఎక్కించారు. మొన్న ఆపరేషన్ చేసి ఆ స్క్రూలు తొలగించారు. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ధన్యవాదాలు.
తారల నడుమను చంద్రుడు
రిప్లయితొలగించండిమారుని వలెవెలుగు చుండె మక్కువ తోడన్
కోరుచు ముదముగ కలువలు
చేరగ తమప్రియుని చెంత చేడియ లంచున్
పున్నమి చంద్రుని జూడుము
రిప్లయితొలగించండిమిన్నున వెలుగొందు చుండె మెఱు పుల కాంతిన్
వన్నెలు గలిగిన తారలు
పన్నుగ నడయాడు చుండ పడమర కేగెన్
నింగి నున్న చందమామ నేలకు దిగి రాడుగా
రిప్లయితొలగించండిచెంగు మనుచు గంతు లేయు చెల్లి తోడ నాడగా
తొంగలించు చుక్కలార తొగల ఱేని పంపరే!
సంగడీల మనుచు దెల్పి సంతసముగ నుర్వికిన్ !!!
గురువుగారూ మీ అబ్బాయి సమస్య ఏమిటి? ఇప్పుడెలా ఉంది?
రిప్లయితొలగించండిరాజేశ్వరి అక్కయ్యా,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
గత సంవత్సరం మా అబ్బాయి ఇంట్లో జారి పడగా ఎడమ మోచేయి, మణికట్టు విరిగి ఆపరేషన్ జరిగి స్క్రూలు ఎక్కించారు. మొన్న ఆపరేషన్ చేసి ఆ స్క్రూలు తొలగించారు. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ధన్యవాదాలు.
పండు వెన్నెల దినమున పరవశించి
రిప్లయితొలగించండిపులక రించగ మానసము మరునిహతి
ప్రేమజంటలు చేరిరి విధుని గాంచ
సుందరమగు దృశ్యము కడు సొంపు గూర్చె
వెన్నెలవానలున్గురియ?వేడి-ప్రపంచముమార్పుజెందు|సం
రిప్లయితొలగించండిపన్నులపంటనింట బడ?పండుగెకార్తికపౌర్ణమౌనుగా|
ఎన్నగమానసాకృతులు-నేపుగపండును-వెండివెల్గులో
కన్నమువేసి దోచుగద?కన్యమనస్సునుకాంతి-బ్రాంతిలో
వెన్నెలకాంతులున్నిడగ?విందును-గ్రోలుజకోరపక్షులున్
పున్నమికాంతిమంత్రమును-పూర్తిగబంచగ?కామ-కాంక్షలున్
కన్నమువేసి వెన్నెలలుకామితసిద్ధినిదోచిపెట్టు|సం
పన్నులకొక్కటియనక పంచును లోకపు నిండుజాబిలై|
పువ్వులనవ్వులెక్కడివి?పున్నమిలేకనునవ్వగల్గునా?
రిప్లయితొలగించండిగువ్వలుగుడ్లుబెట్టుటకు-గూళ్ళనుగూర్చెడిమార్గమేదియో
దివ్వెగరాత్రిచీకటినితీరికచేతనుసాగనంపుచున్
దవ్వుననాకసాన?మనదగ్గర?నుండెడిచందమామయే|
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
చుక్కల చంద్రుడు యువతకు
రిప్లయితొలగించండిమక్కువగాకానుపించి మనసునుదోచే
టక్కరి నేర్పుట తగునా?
చిక్కులతోసిగ్గు దుడుపు-సిరివెన్నెలవై|.
Balluri Umadevi గారి పద్యం.....
రిప్లయితొలగించండిచుక్కల నడుమన చంద్రుడు
మక్కువ తోడను గనుచును మదిలో కలువన్
మిక్కుటముగ దలపోయుచు
నెక్కడ దాగెనొ యనుచును నివ్వెర బోయెన్.
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*****
బళ్ళూరి ఉమాదేవి గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
చక్కని చుక్కయె కౌగిట
రిప్లయితొలగించండిచిక్కగ నా చిన్నవాని సేవము జూడన్
చుక్కల్లో చందురుడే
నిక్కుచుఁ దా తెల్లబోయె నేలకు వెలుగై!
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
రంగులుపలు కలబోసిన
రిప్లయితొలగించండిఅంగారక గ్రహమె మెరియు తారకలవియే
బంగరు తరువిదె రంగా
చంగలువల రేడు జూడు చల్లనిధరణే !!!!
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
రెండవపాదంలో యతి తప్పింది. ‘ధరణి+ఏ’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండి‘చెంగలువ’ను ‘చంగలువ’ అన్నారు.
సవరించినపద్యం
రిప్లయితొలగించండిరంగులుపలు కలబోసిన
అంగారక గ్రహమె మెరియునవితారకలే !!!
బంగరు తరువిదె రంగా
చెంగలువల నేస్తమిచట చెలువపు ధరయే !!!