24, ఏప్రిల్ 2015, శుక్రవారం

దత్తపది - 74 (జలుబు-దగ్గు-నొప్పి-నలత)

కవిమిత్రులారా!
జలుబు - దగ్గు - నొప్పి - నలత
పైపదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
నా పూరణ.....

ప్రజలు బుజ్జగించి రమ్మన్న రాముండు
తండ్రి కీర్తి యెల్లఁ దగ్గు ననుచు
నొప్పిన పలు కాడి యొప్పించి పంపెను
వెడలె కానల తరు లిడగ నీడ.


39 కామెంట్‌లు:

 1. అవును గురువు గారు మీ పద్యం చదివాక మాకు వ్రాయాలన్న ఉత్సాహం కలుగుతుంది మార్గ దర్సక మౌతుంది కుడాను . చాలా బాగుంది

  రిప్లయితొలగించు
 2. లక్ష్మణూడు రామునితో :
  ప్రజలు బుద్ధి లేక వాగినంతటనీవు
  వదలనొప్పిదమ్మె భార్యనిటుల
  కానలతననంపి కలతచెందవె నీవు
  తగదు వదిన నంప దగ్గు మన్న

  రిప్లయితొలగించు
 3. లాజలు బుద్ధిగ తినిన లతను బోలు
  మొగ్గు జూపెడి యందము దగ్గు నేమొ
  మేని సౌందర్య మెంతేని మెరుగు పడగ
  గొప్పగా నుండు కోరిక నొప్పి దమున

  రిప్లయితొలగించు
 4. ఆ.వె. కానలతనతోవ కావనీవొచ్చిన
  రక్షదగ్గుననుచు రాముకోర
  బుద్ధి కల్గి ప్రజలు బురమును రక్షింప
  నప్పుగించె సుతుని నొప్పిలేక

  రిప్లయితొలగించు
 5. ప్రజలు బుద్ధి గలిగి నిజమునే పలుకుచున్
  దగ్గు హెచ్చు లేక దనరుచుండ
  వనలత వలె నల్లె వారి సౌహార్దము
  ఒప్పె రాము డటుల నొప్పిరి ప్రజ

  రిప్లయితొలగించు
 6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  ధన్యవాదాలు.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  ధన్యవాదాలు.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘లాజలు బుద్ధిగ’ అన్నచోట గణదోషం. ‘లాజలు బుడబుడ పడిన లతను బోలు’ అందామా?
  *****
  పిరాట్ల ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది.అభినందనలు.
  టైపాట్లున్నాయి.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 7. మాస్టరు గారూ ! జలుబు, దగ్గు, నలత కనబడకుండా చక్కగా నొప్పిన మీ పూరణ అద్భుతం....

  రిప్లయితొలగించు

 8. ప్రజలు బుద్ధి లేక పరుషమ్ము లాడిన
  సుంతదగ్గునయ్య నింతి మహిమ
  ప్రీతి తోడ నొప్పి సీతను విడువకు
  కానల తరుమకుము కఠిన రామ !

  రిప్లయితొలగించు
 9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ధన్యవాదాలు. నిజానికి వారం రోజులుగా జలుబు, దగ్గు, ఒంటి నొప్పులతో నలతగా ఉంది. నిన్న దత్తపది ఇద్దామని ఏ పదాలివ్వాలా అని ఆలోచిస్తుంటే విపరీతంగా దగ్గు వచ్చింది. వెంటనే దత్తపది సిద్ధమయింది.

  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 10. మీ పూరణ చాలా బాగుంది అన్నయ్యగారు.మాకు మార్గదర్శకంగా వుంది

  రిప్లయితొలగించు
 11. ఆ.వె:ప్రజలుబులకరింప భవుని విల్లు విరిచె
  దగ్గు మనెడి పరశుధారి నణచి
  నువిదతోడ తల్లి నొప్పించి తాజనె
  వనలతల గనుచును వసుధ పతియు/వసుమతీశు

  రిప్లయితొలగించు
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 13. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  ధన్యవాదాలు.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘అణచి+ఉవిద’ అన్నప్పుడు నుగాగమం రాదు. మీ పూరణకు నా సవరణలు...
  ప్రజలు బులకరింప భవుని విల్లు విరిచెఁ
  దగ్గు మనెడి పరశుధారి నణచె
  నువిద యనుజు తోడ నొప్పి కానకుఁ జనె
  వనలతలఁ గనుచును వసుధపతియు.

  రిప్లయితొలగించు
 14. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  ప్రజలు ,బుధజనులనిరట భరతు తోడ
  సీత ,రాముల నొప్పిన రీతి గొలిచి
  కానల తరుల వీడిన గలుగు శాంతి
  వేదనలు దగ్గు మాకని వేడ మనుచు

  రిప్లయితొలగించు
 15. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 16. కానల తనభర్తనుగూడి గడుపుచు సతి
  సీతపూజలఁబూని తా ప్రీతి కదుర
  నొప్పిదముగ నుండెను కడు నోర్పుతోడ
  కరము దగ్గుత్తికవ కని భరతు గళము
  రాము ప్రార్థించె రమ్మని రాజ్యమునకు

  రిప్లయితొలగించు
 17. ప్రజలు బుద్ధి హీను లగుట బరితె గించి
  పలుక దగ్గునే ? భూమిజ పరువు ధరను
  నొప్పిద మగురీ తినపుడు నుతులు సేయ
  కాన లతరులు, గ్రహియించె కాంత నపుడు

  రిప్లయితొలగించు
 18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 19. ప్రజలు బుద్ధిమాలి ప్రల్లదమాడగా
  ధరణిసుతకు గరిమ దగ్గు నయ్య?
  నొప్పిదముగ నీవు కప్పురగంధిని
  కానలతరలింప మాను రామ !!!


  ప్రజలు బుధులు వచ్చి ప్రార్ధింప గాదని
  దగ్గుమొగ్గు లేక తమ్ముడికను
  నొప్పిదముగ ధరను నోముకొనుననుచు
  కానల తరలెనుగ కపిరథుండు!!!

  రిప్లయితొలగించు
 20. నమస్సులు...
  మిత్రులు శ్రీకంది శంకరయ్యగారూ, మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు! కవిమిత్రులందఱి పూరణములును బాగున్నవి. అభినందనలు.


  నా పూరణము:
  (విభీషణుఁడు రావణునకు హితము బోధించి, బోధించి, వినకపోవుటచేఁ జివఱకు నిటుల భాషించిన సందర్భము)

  ఉత్పలమాల:
  "పూజలు బుగ్గికాఁగఁ బరపూరుషు భార్యఁ జెఱన్ గదింతువే?
  నీ జపహోమముల్ దొలఁగె నీ విధిఁ, దగ్గుము, గర్వమేల? నేఁ
  డా జనకాత్మజాపతియె యంబుజగర్భుని మాడ్కి నొప్పి, వి
  భ్రాజిత దేహియైన లతవంటి యయోనిజఁ గొంచుఁబోయెడిన్!"

  రిప్లయితొలగించు
 21. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  నా పూరణ నచ్చినందుకు ధన్యవాదాలు.
  మీ పూరణ వైవిధ్యంగా, అద్భుతంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 22. కానల తప్పిన సీతను
  గానగ హనుమంతునొప్పి గౌరవమీయన్
  యానకఁ దగ్గునె? లంకను
  దానంజలు బుగ్గిజేయ దనరుచు గదిపెన్!

  రిప్లయితొలగించు
 23. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘యానక, దానంజలు’...?

  రిప్లయితొలగించు
 24. శీలసందేహమునుఁదగ్గు లీల నజగు
  డనౌలతప్తయౌ మైథిలి నినకులేశు
  రాము నొప్పించి యామె శీలవతియన ది
  విజులు లాజలు బుక్కపూలజడి కురిసె

  రిప్లయితొలగించు
 25. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘అనల’ టైపాటు వల్ల ‘అనౌల’ అయింది.

  రిప్లయితొలగించు
 26. కాంతి పుం"జలుబు"ట్ట నా కదన భూమి
  "నొప్పి","దగ్గు"నా రావణు నోజ మనగ,
  సే"నలత"లవి,చిక్కులు చెందునట్లు
  రాముడరి సేన గొట్టెను రాజసమున

  రిప్లయితొలగించు

 27. కె యస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
  పరువమున నొప్పివచ్చె శూర్పణఖ యపుడు
  మోహమను ఘనలత చేత మురియ జేయ
  దాశరథిని,లక్ష్మణు డికన్ దగ్గు మనుచు
  జేసె దాని మదము ముక్కు చెవులగోసి
  ప్రజలు బుధులును వారిని ప్రస్తుతింప

  రిప్లయితొలగించు
 28. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ఒప్పి+తగ్గు’ అన్నచోట ద్రుతకార్యం కాని, సరళాదేశం కాని జరుగవు. కనుక అక్కడ ‘దగ్గు’ అనడం దోషమే.
  *****
  కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 29. మాష్టారు మీ పద్యం మరియు గుండు మధుసూధన్ గారి పద్యం అద్భుతౌ. చదివిన వెంటనే, "అబ్బ ఎంత బాగున్నాయో" అనిపించింది.

  రిప్లయితొలగించు
 30. గురుదేవులకు ధన్యవాదములు.
  ఆనక = అటుపిమ్మట
  తాను + అంజలు = తా నంజలు = తన పాదములు

  రిప్లయితొలగించు