17, ఏప్రిల్ 2015, శుక్రవారం

పద్య రచన - 882

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23 కామెంట్‌లు:

 1. నడుములు వంగిన వారికి
  పడుకొననీ పడక కుర్చి బాగుగ నుండున్
  కడు సౌకర్యంబగునిది
  మడచుట సాధ్యంబగు గృహమందుండదగున్

  రిప్లయితొలగించండి
 2. కవులకు వీలుగ నుండును
  పవళించగ వెనుకకు వ్రాలి పడక కుర్చీ
  పవనుని చల్లని వీవన
  కవనము లల్లగను మెండు కదిలించ మదిన్

  రిప్లయితొలగించండి
 3. కూర్చొన్నపళమున కునుకు తీయగ వచ్చు - తీరికగా సేద తీర వచ్చు
  కాళ్ళు సాపగ వచ్చు కాళ్ళ నూపగ వచ్చు – నుయ్యాల కతమున నూగ వచ్చు
  కొంత నిటారుగా కూర్చొనగా వచ్చు – కాదేని అటునిటు కదల వచ్చు
  పడక మంచంబట్లు పవళింపగా వచ్చు – బంగారు కలలను పడయ వచ్చు
  సుఖము కలుగజేయు సుకరోప కరణమ్ము
  శాంతి నిచ్చు మఱియు శ్రాంతి నిచ్చు
  ప్రక్క చేతులుండి పట్టింత నిచ్చును
  పట్టు కుర్చి మేటి పడక కుర్చి

  రిప్లయితొలగించండి
 4. మేను వాల్చ మీకు మేలుగా నుందును
  దారి కడ్డు రాను దాపు నుంచ
  కునుకు దీయ వచ్చు కదురుగా నాయందు
  కొనుడు వేగ నన్ను మనుజులార!!!

  రిప్లయితొలగించండి
 5. పడక కుర్చి యిదియె పరమసౌఖ్యకరము
  వూసు లెన్నొ జెప్పు నూర డించు
  విసుగు చెంద నీక విశ్రాంతి కలిగించు
  అలసిన తనువునకు హాయి నొసగు.
  బల్లూరి ఉమాదేవి.

  రిప్లయితొలగించండి
 6. పడక కుర్చీని జూడుము బావ ! యచట
  యందు కూర్చుని పేపరు హాయి గాను
  చదువు కొనుమయ్య ! పూర్తిగ శ్రద్ధ తోడ
  తూగు టు య్యెల మాదిరి యూగు చుండి

  రిప్లయితొలగించండి
 7. వాకిటిలోనున్న వాలుకుర్చీ లోన
  .......జానకిరామయ్య చదువుచుండె
  నా నాడు వచ్చిన యాంధ్ర పత్రిక తాను
  .......పోస్టని కేక చెవుల బడంగ
  లేచి కుర్చీ లోంచి చూచె గుమ్మము నొద్ద
  .......పడియున్న కవరును పైకి తీసె
  ఎవరినుంచా యాని యిటునటు చూడగా
  .......పార్వతి యని పేరు పలకరించె.......

  నాదు బాల్యము నందున నాటి వార
  పత్రికల లోని కథ లిట్లు పడక కుర్చి
  తోను మొదలయి కడదాక తోప నీక
  చదువ జేసిన జ్ఞాపకాల్ పదిలమె సుమ.

  రిప్లయితొలగించండి
 8. ఆహా కుమార్ గారూ పడక కుర్చీని అద్భుతమైన సీసంలో బంధించిన మీ ప్రతిభకు జోహార్లు.

  రిప్లయితొలగించండి
 9. బుడతలుపవ్వలించుటకు పూర్తిగసాయములందజేయుచున్
  గడుసుకు గౌరవంబోసగు}కాళ్ళకుపట్టును,కట్టుబాట్లతో
  నడుముకునవ్యశోభనిడు నాగరికంబగుజీవితాలకే
  పడకగ-కుర్చిగా|వయసుబండినవారికితల్ప మాయెగా|

  రిప్లయితొలగించండి
 10. ఒక్కటయినను-రెండుగా చక్కదిద్దు|
  మూడుకాళ్ళున్న?ముసలికి ముచ్చటగును|
  నాల్గు చేతులుగా మార్చు|నవ్య రీతి
  ఇదు పదులున్న వారికి పాదుగూర్చు|
  ఆరు విధములలాభాలు నంచునుంచి
  ఏడుపున్నచో?పిల్లలునెక్కగానె?
  అష్ట కష్టాలు నలుపుకు నిష్టమాన్పి
  నవ వసంతము నిలిపిన భవిత వోలె|
  పదిల బరచు పడక-కుర్చి వదలరెవరు|

  రిప్లయితొలగించండి
 11. లాలించెద రమ్మనుచున్
  వాలిన కుర్చీని గాంచ బాల్యము నందున్
  లీలగ మాయమ్మయొడిని
  తూలిన మధురానుభూతి తోచెను మదిలో!

  రిప్లయితొలగించండి
 12. ఎవరి కవనంబు నందు రహించు వాణి
  వారె నను మెచ్చ నింకేమి వలయు నాకు
  ధన్యవాదముల్ సుకవితా తల్లజునకు
  సరస హృదయాభి సారి మిస్సన్న కవికి

  ఇంత అర్హత లేదని ఎఱిగి కూడ
  మందునై నేను సంతస మందినాడ
  చేతమీరీతి తమమున చిక్కెనెట్లు
  చంచలమ్మిది మనము నిశ్చయము సుమ్ము

  రిప్లయితొలగించండి
 13. పడక కుర్చిలోన పడుకొన తొందర
  పడక, ముందు చూచి పట్ట కర్ర
  దూర్చి యుందొ లేదొ మర్చిపోకను జూచి
  క్రింద పడక, లేద క్రింద పడక.

  రిప్లయితొలగించండి
 14. పడకకుర్చి చాల వసతిగా నుండును
  ముసలి వయసులోన మెసలు కొరకు
  పల్లె టూర్లలోన ప్రతియింటిలోనను
  కాంచ వచ్చు నిద్ది కచ్చితముగ

  రిప్లయితొలగించండి
 15. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  రెండవపాదంలో గణదోషం. సవరించండి.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  కుమార్ గారూ,
  పడకకుర్చీ ప్రయోజనాల గురించిన సమగ్ర సమాచారం చక్కగా సీసపద్యంలో పొదిగి అందించారు. పద్యం చాలా బాగున్నది. అభినందనలు.
  మిస్సన్న గారికి ధన్యవాదాలు తెలిపిన పద్యాలు కూడా బాగున్నవి. సంతోషం!
  *****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మమ్మల్ని ఏ ఊహాలోకంలోకో తీసుకువెళ్ళారు. ఇంతకీ ఆ పార్వతి, జానకిరామయ్యల కథ ఒకటున్నదా? చాలా మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ******
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. నమస్కారములు
  సవరించిన పద్యము
  కవులకు వీలుగ నుండును
  పవళించగ కనులు మూసి వ్రాలగ ప్రీతిన్
  పవనుని చల్లని వీవన
  కవనము లల్లగను మెండు కదలించ మదిన్

  రిప్లయితొలగించండి
 17. వినయ సంపద కల్గిన విబుధు రసన
  నాట్యమాడును వాణి యనారతమ్ము
  గురుని యాశిష మందున గురు బలమ్ము
  నట్టి కలిమి కుమార మీ యందు కలదు.

  రిప్లయితొలగించండి
 18. వాలు కురిచి లోన వాలి హాయిగనుండ
  పెద్ద వారు నగవు పెదవి నాడ
  వీలు చెయిరు వాడ విధి యది రాకుండ
  శేష జీవితమున సేద తీర

  రిప్లయితొలగించండి
 19. పల్ల నరేంద్ర గారూ,
  శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. సీస పద్యము
  ****
  తీరిక లేకుండ తిర్గితిర్గియు వచ్చి
  మా నాన్న యొరిగెడి మడతకుర్చి!
  వంటజేసియు మాకు వడ్డించి వడ్డించి
  మాతల్లిశ్రమదీర్చు మడతకుర్చి!
  చుట్టాలు, మిత్రులు సుఖముగా కూర్చుండి
  మత్తుగా నిదరోవ మడతకుర్చి!
  పిల్లలు, పెద్దలు పేపర్లు చదువుచున్
  మాటలాడుకొనగ మడతకుర్చి!
  ......
  తే. గీ.
  ఒరిగి యొరిగించుకొనను తొనొంటినిండ!
  చేయిలను చేయిలానించ సేదదీర్చు!
  హాయి హాయిగా పద్యాలనల్లవచ్చు
  ఊహలందుననుయ్యాలలూగవచ్చు !!

  రిప్లయితొలగించండి
 21. ఉత్పలమాల
  ఆసనమై వెలింగినది యాదరమొందుచు నిల్చియుండితాన్
  భాసుర కీర్తిమంతముగ భాసిలు చుండి సుఖంబునిచ్చుచున్
  వాసిగ నిల్చి యుండెడిది పాతతరంబుకు రాజ చిహ్నమై
  త్రోసిరి దీని నింక కడు దూరముగాప్రజ లెల్ల విస్మృతిన్

  రిప్లయితొలగించండి